《古兰经》译解

泰卢固语翻译 - 阿布杜·拉赫曼·本·穆罕默德。

Scan the qr code to link to this page

سورة الهمزة - సూరహ్ అల్-హుమజహ్

页码

显示经文内容
显示脚注

段 : 1
وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ
అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.(a)
(a) హుమ'జహ్ మరియు లుమ'హజ్: కొందరి అభిప్రాయంలో ఒకే అర్థం గలవి. మరి కొందరు వాటి మధ్య భేదం చూపుతారు. హుమ'జహ్ - అంటే ముఖం మీద అపనిందలు చేసేవారు. లుమ'జహ్ - అంటే వీపు వెనుక చాడీలు చెప్పేవారు. మరికొందరు హుమ'జహ్ - అంటే కండ్ల సైగలతో, చేతి సైగలతో దూషించటం మరియు లుమ'జహ్ - అంటే నోటి మాటలతో దూషించటం, అని అంటారు.
段 : 2
ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ
ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!(a)
(a) అంటే 'జకాతు మరియు 'సదఖాత్ ఇవ్వకుండా ఉంటాడో!
段 : 3
يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ
తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!(a)
(a) అ'ఖ్ లదహ్: అంటే అది అతనిని మరణించకుండా చేస్తుందని భావిస్తాడు.
段 : 4
كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ
ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.(a)
(a) చూఅల్-'హు'తమతు: నరకాగ్ని పేర్లలో ఒకటి. చూడండి, 15:43-44. ముక్కలు ముక్కలుగా చేసేది.
段 : 5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ
ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?(a)
(a) ఆ అగ్ని ఎంతో భయంకరమైనది. దాని తీవ్రతను బట్టి మీ బుద్ధి అర్థం చేసుకోజాలదు.
段 : 6
نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ
అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;
段 : 7
ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ
అది గుండెల దాకా చేరుకుంటుంది.
段 : 8
إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ
నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.(a)
(a) ముఅ''సదతున్: క్రమ్ముకొను. ఆ నరకపు ద్వారాలు మూయబడి ఉంటాయి. ఎవ్వరూ దాని నుండి బయట పడలేరు.
段 : 9
فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ
పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!
信息发送成功