వచనం :
1
وَٱلشَّمۡسِ وَضُحَىٰهَا
సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా!(a)
వచనం :
2
وَٱلۡقَمَرِ إِذَا تَلَىٰهَا
దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా!
వచనం :
3
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا
ప్రకాశించే పగటి సాక్షిగా!
వచనం :
4
وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰهَا
దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా!
వచనం :
5
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا
ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
వచనం :
6
وَٱلۡأَرۡضِ وَمَا طَحَىٰهَا
భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!
వచనం :
7
وَنَفۡسٖ وَمَا سَوَّىٰهَا
మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా!(a)
వచనం :
8
فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا
ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.(a)
వచనం :
9
قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا
వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు.
వచనం :
10
وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا
మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.(a)
వచనం :
11
كَذَّبَتۡ ثَمُودُ بِطَغۡوَىٰهَآ
సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది;(a)
వచనం :
12
إِذِ ٱنۢبَعَثَ أَشۡقَىٰهَا
తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు;
వచనం :
13
فَقَالَ لَهُمۡ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقۡيَٰهَا
అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు.
వచనం :
14
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمۡدَمَ عَلَيۡهِمۡ رَبُّهُم بِذَنۢبِهِمۡ فَسَوَّىٰهَا
అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు.(a) కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు.
వచనం :
15
وَلَا يَخَافُ عُقۡبَٰهَا
మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు!(a)