పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం

Telugu translation - Abder-Rahim ibn Muhammad

Scan the qr code to link to this page

سورة البلد - సూరహ్ అల్-బలద్

పేజీ నెంబరు

వచనం

ఖుర్ఆన్ వచనం చూపండి
పాదసూచిక చూపండి

వచనం : 1
لَآ أُقۡسِمُ بِهَٰذَا ٱلۡبَلَدِ
కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!
వచనం : 2
وَأَنتَ حِلُّۢ بِهَٰذَا ٱلۡبَلَدِ
మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.(a)
(a) కొందరు: "తండ్రి (మూలపురుషుడు) అంటే ఆదమ్ ('అ.స.) మరియు అతని సంతానం అంటే మానవజాతి." అన్నారు.
వచనం : 3
وَوَالِدٖ وَمَا وَلَدَ
మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!
వచనం : 4
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِي كَبَدٍ
వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.
వచనం : 5
أَيَحۡسَبُ أَن لَّن يَقۡدِرَ عَلَيۡهِ أَحَدٞ
ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?
వచనం : 6
يَقُولُ أَهۡلَكۡتُ مَالٗا لُّبَدًا
అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.(a)
(a) లుబదన్: కసీ'ర్, చాలా
వచనం : 7
أَيَحۡسَبُ أَن لَّمۡ يَرَهُۥٓ أَحَدٌ
ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?(a)
(a) అంటే అతడు చేసే వృథా ఖర్చును ఎవ్వరూ చూడటం లేదని భావిస్తున్నాడా? అల్లాహ్ (సు.తా.) అంతా చూస్తున్నాడు.
వచనం : 8
أَلَمۡ نَجۡعَل لَّهُۥ عَيۡنَيۡنِ
ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?
వచనం : 9
وَلِسَانٗا وَشَفَتَيۡنِ
మరియు నాలుకను మరియు రెండు పెదవులను.
వచనం : 10
وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.(a)
(a) చూడండి, 76:3 అన్-నజ్ దు: అంటే ఎత్తైన స్థలం. అన్-నజ్ దైన్: అంటే రెండు మార్గాలు.
వచనం : 11
فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ
కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు!(a)
(a) చూఅల్-'అఖబహ్: కొండ శిఖరం (పైకి ఎక్కడం) కొందరు దీనికి కనుమ అనే అర్థం ఇచ్చారు. అంటే రెండు కొండల నడిమి త్రోవ, సందు. కఠినమైన కనుమ అంటే ఒక బానిసను బంధం నుండి విముక్తి చేయించడం, లేక తాను ఆకలితో ఉండి కూడా ఒక అనాథకి అన్నం పెట్టడం.
వచనం : 12
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡعَقَبَةُ
మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?
వచనం : 13
فَكُّ رَقَبَةٍ
అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.(a)
(a) చూడండి, 2:177.
వచనం : 14
أَوۡ إِطۡعَٰمٞ فِي يَوۡمٖ ذِي مَسۡغَبَةٖ
లేదా! (స్వయంగా) ఆకలి గొని(a) ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.
(a) మస్'గతున్: ఆకలి.
వచనం : 15
يَتِيمٗا ذَا مَقۡرَبَةٍ
సమీప అనాథునికి గానీ;
వచనం : 16
أَوۡ مِسۡكِينٗا ذَا مَتۡرَبَةٖ
లేక, దిక్కులేని నిరుపేదకు గానీ!(a)
(a) జా-'మత్ రబతున్: మట్టిపై పడి ఉండే పేదవాడు. ఎవడికైతే ఇల్లు ఉండదో!
వచనం : 17
ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ
మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.
వచనం : 18
أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ
ఇలాంటి వారే కుడిపక్షం వారు.(a)
(a) అతడు విశ్వాసి అయిఉంటేనే, చేసిన పుణ్యాల ఫలితం దొరుకుతుంది లేకపోతే పరలోకంలో అవి వృథా అయిపోతాయి.
వచనం : 19
وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا هُمۡ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ
ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.
వచనం : 20
عَلَيۡهِمۡ نَارٞ مُّؤۡصَدَةُۢ
వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.(a)
(a) ము'అసదతన్': ము'గ్ లఖతున్, అంటే చుట్టుకుంటుంది. చూడండి, 104:6-8.
విజయవంతంగా పంపబడింది