వచనం :
62
وَقَالُواْ مَا لَنَا لَا نَرَىٰ رِجَالٗا كُنَّا نَعُدُّهُم مِّنَ ٱلۡأَشۡرَارِ
ఇంకా వారు ఇలా అంటారు: "మాకేమయింది? మనం చెడ్డవారిగా ఎంచిన వారు ఇక్కడ మనకు కనబడటం లేదేమిటి?
వచనం :
63
أَتَّخَذۡنَٰهُمۡ سِخۡرِيًّا أَمۡ زَاغَتۡ عَنۡهُمُ ٱلۡأَبۡصَٰرُ
మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా? లేదా వారు మనకు కనుమరుగయ్యారా?"
వచనం :
64
إِنَّ ذَٰلِكَ لَحَقّٞ تَخَاصُمُ أَهۡلِ ٱلنَّارِ
నిశ్చయంగా, ఇదే నిజం! నరకవాసులు ఇలాగే వాదులాడుకుంటారు.
వచనం :
65
قُلۡ إِنَّمَآ أَنَا۠ مُنذِرٞۖ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّا ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టి మీద సంపూర్ణ అధికారం గలవాడు."(a)
వచనం :
66
رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا ٱلۡعَزِيزُ ٱلۡغَفَّٰرُ
ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు."
వచనం :
67
قُلۡ هُوَ نَبَؤٌاْ عَظِيمٌ
వారితో అను: "ఇది (ఈ ఖుర్ఆన్) ఒక గొప్ప సందేశం.
వచనం :
68
أَنتُمۡ عَنۡهُ مُعۡرِضُونَ
దాని నుండి మీరు విముఖులవు తున్నారు!"
వచనం :
69
مَا كَانَ لِيَ مِنۡ عِلۡمِۭ بِٱلۡمَلَإِ ٱلۡأَعۡلَىٰٓ إِذۡ يَخۡتَصِمُونَ
(ఓ ముహమ్మద్! ఇలా అను): "ఉన్నత స్థానాలలో ఉన్న ముఖ్యుల (దేవదూతల) మధ్య (ఆదమ్ సృష్టి గురించి) ఒకప్పుడు జరిగిన వివాదం గురించి నాకు తెలియదు.(a)
వచనం :
70
إِن يُوحَىٰٓ إِلَيَّ إِلَّآ أَنَّمَآ أَنَا۠ نَذِيرٞ مُّبِينٌ
కాని అది నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారానే తెలుపబడింది. వాస్తవానికి, నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే!"
వచనం :
71
إِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَٰٓئِكَةِ إِنِّي خَٰلِقُۢ بَشَرٗا مِّن طِينٖ
నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న మాటను (జ్ఞాపకం చేసుకో): "నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను.(a)
వచనం :
72
فَإِذَا سَوَّيۡتُهُۥ وَنَفَخۡتُ فِيهِ مِن رُّوحِي فَقَعُواْ لَهُۥ سَٰجِدِينَ
ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, (a) మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపోండి.(b)
వచనం :
73
فَسَجَدَ ٱلۡمَلَٰٓئِكَةُ كُلُّهُمۡ أَجۡمَعُونَ
అప్పుడు దేవదూతలందరూ కలసి అతనికి సజ్దా చేశారు.(a)
వచనం :
74
إِلَّآ إِبۡلِيسَ ٱسۡتَكۡبَرَ وَكَانَ مِنَ ٱلۡكَٰفِرِينَ
ఒక్క ఇబ్లీస్ (a) తప్ప! అతడు గర్వితుడయ్యాడు మరియు సత్యతిరస్కారులలో కలిసి పోయాడు.
వచనం :
75
قَالَ يَٰٓإِبۡلِيسُ مَا مَنَعَكَ أَن تَسۡجُدَ لِمَا خَلَقۡتُ بِيَدَيَّۖ أَسۡتَكۡبَرۡتَ أَمۡ كُنتَ مِنَ ٱلۡعَالِينَ
(అల్లాహ్) ఇలా అన్నాడు: "ఓ ఇబ్లీస్! నేను నా రెండు చేతులతో సృష్టించిన వానికి సాష్టాంగం (సజ్దా) చేయకుండా నిన్ను ఆపింది ఏమిటీ? నీవు గర్వితుడవై పోయావా! లేదా నిన్ను, నీవు ఉన్నత శ్రేణికి చెందిన వాడవనుకున్నావా?"
వచనం :
76
قَالَ أَنَا۠ خَيۡرٞ مِّنۡهُ خَلَقۡتَنِي مِن نَّارٖ وَخَلَقۡتَهُۥ مِن طِينٖ
(ఇబ్లీస్) అన్నాడు: "నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని మట్టితో సృష్టించావు."
వచనం :
77
قَالَ فَٱخۡرُجۡ مِنۡهَا فَإِنَّكَ رَجِيمٞ
(అల్లాహ్) అన్నాడు: "ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో! నిశ్చయంగా నీవు భ్రష్టుడవు.
వచనం :
78
وَإِنَّ عَلَيۡكَ لَعۡنَتِيٓ إِلَىٰ يَوۡمِ ٱلدِّينِ
మరియు నిశ్చయంగా, తీర్పుదినం వరకు నీపై నా శాపం (బహిష్కారం) ఉంటుంది."
వచనం :
79
قَالَ رَبِّ فَأَنظِرۡنِيٓ إِلَىٰ يَوۡمِ يُبۡعَثُونَ
(అప్పుడు ఇబ్లీస్) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! మృతులు తిరిగి లేపబడే దినం వరకు నాకు వ్యవధినివ్వు!"
వచనం :
80
قَالَ فَإِنَّكَ مِنَ ٱلۡمُنظَرِينَ
(అల్లాహ్) సెలవిచ్చాడు: "సరే! నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!
వచనం :
81
إِلَىٰ يَوۡمِ ٱلۡوَقۡتِ ٱلۡمَعۡلُومِ
ఆ నియమిత దినపు ఆ గడువు వచ్చే వరకు."
వచనం :
82
قَالَ فَبِعِزَّتِكَ لَأُغۡوِيَنَّهُمۡ أَجۡمَعِينَ
(ఇబ్లీస్) అన్నాడు: "నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను;
వచనం :
83
إِلَّا عِبَادَكَ مِنۡهُمُ ٱلۡمُخۡلَصِينَ
వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప!"