వచనం :
1
وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ
అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.(a)
వచనం :
2
ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ
ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!(a)
వచనం :
3
يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ
తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!(a)
వచనం :
4
كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ
ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.(a)
వచనం :
5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ
ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?(a)
వచనం :
6
نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ
అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;
వచనం :
7
ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ
అది గుండెల దాకా చేరుకుంటుంది.
వచనం :
8
إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ
నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.(a)
వచనం :
9
فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ
పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!