పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం

Telugu translation - Abder-Rahim ibn Muhammad

Scan the qr code to link to this page

سورة العصر - సూరహ్ అల్-అస్ర్

పేజీ నెంబరు

వచనం

ఖుర్ఆన్ వచనం చూపండి
పాదసూచిక చూపండి

వచనం : 1
وَٱلۡعَصۡرِ
కాలం సాక్షిగా!(a)
(a) అల్లాహ్ (సు.తా.) తాను కోరిన దాని సాక్ష్యం తీసుకుంటాడు. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరి సాక్ష్యం తీసుకోరాదు.
వచనం : 2
إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ
నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు!(a)
(a) ఆ మానవుడు ఎవడైతే విశ్వసించడో మరియు సత్కార్యాలు చేయడో తన కాలాన్ని వృథా కాలక్షేపంలో, నిషేధించిన పనులు చేయటంలో పేరాసతో గడుపుతాడో! అలాంటి వాడు పరలోకంలో నరకాగ్నికి ఇంధనం అవుతాడు.
వచనం : 3
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప!(a)
(a) ఇలాంటి నష్టం నుండి తప్పించుకోగల వారు ఎవరంటే: ఒకే ఒక్క ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను పాటించేవారు, అల్లాహ్ (సు.తా.) నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండేవారు, కష్టకాలంలో సహనం వహించి, సత్య ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవారు.
విజయవంతంగా పంపబడింది