د قرآن کریم د معناګانو ژباړه

تلغویي ژباړه - عبد الرحیم بن محمد

Scan the qr code to link to this page

سورة التكاثر - సూరహ్ అత్-తకాథుర్

د مخ نمبر

آیت

د آیت د متن ښودل
د حاشيې ښودل

آیت : 1
أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ
(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;(a)
(a) అల్ హా (యుల్ హీ): ఏమరుపాటులో వేసింది. తకాసు'రున్: ఎక్కువ పొందాలనే పేరాస అంటే ధనధాన్యాల కొరకు, పిల్లల కొరకు, బలం, ప్రభుత్వం, పేరు ప్రతిష్టల కొరకు చేసే పేరాస.
آیت : 2
حَتَّىٰ زُرۡتُمُ ٱلۡمَقَابِرَ
మీరు గోరీలలోకి చేరే వరకు.(a)
(a) ఆ పేరాస కోసం ప్రయత్నిస్తూనే మీరు గోరీలలోకి చేరి పోతారు.
آیت : 3
كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ
అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.
آیت : 4
ثُمَّ كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ
మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.(a)
(a) ఈ పేరాస మంచిది కాదని.
آیت : 5
كَلَّا لَوۡ تَعۡلَمُونَ عِلۡمَ ٱلۡيَقِينِ
ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).
آیت : 6
لَتَرَوُنَّ ٱلۡجَحِيمَ
నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు!
آیت : 7
ثُمَّ لَتَرَوُنَّهَا عَيۡنَ ٱلۡيَقِينِ
మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!
آیت : 8
ثُمَّ لَتُسۡـَٔلُنَّ يَوۡمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ
అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!(a)
(a) అప్పుడు అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాలను ధనసంపత్తులను మంచి కొరకు ఉపయోగించిన వారు స్వర్గవాసులవుతారు. వాటిని దుష్టప్రయోజనాలకు వినియోగించిన వారు నరకాగ్ని పాలవుతారు.
په کامیابۍ سره ولیږل شو