د قرآن کریم د معناګانو ژباړه

تلغویي ژباړه - عبد الرحیم بن محمد

Scan the qr code to link to this page

سورة القارعة - సూరహ్ అల్-ఖారిఅహ్

د مخ نمبر

آیت

د آیت د متن ښودل
د حاشيې ښودل

آیت : 1
ٱلۡقَارِعَةُ
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం!(a)
(a) అల్-'ఖారిఅతు: అంటే హృదయాలను అదరగొట్టేది, పునరుత్థాన దినపు పేర్లలో ఒకటి. చూడండి, 14:48, 20:105-107. దాని ఇతర పేర్లు (1) అల్-'హాఖ్ఖతు, (2) అత్తామ్మతు, (3) అస్సాఖ్ఖతు, (4) అల్-'గాషియతు, (5) అస్సా'అతు (6) అల్-వాఖి'అతు; (7) అల్-ఖారి'అతు.
آیت : 2
مَا ٱلۡقَارِعَةُ
ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?
آیت : 3
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?
آیت : 4
يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.(a)
(a) అల్-ఫరాషు: Moath, Lepidoptira రాత్రులలో తిరిగే చిన్న పురుగు, చిమ్మెట, దీపపు పురుగు.
آیت : 5
وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.(a)
(a) చూఅల్-'ఇహ్ నున్: రంగురంగుల అల్-మన్ ఫూష్: ఏకిన దూది.
آیت : 6
فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!(a)
(a) చూడండి, 7:8, 18:105, 21:47 సత్కార్యాల త్రాసు పళ్ళెం బరువైనదిగా ఉంటుంది.
آیت : 7
فَهُوَ فِي عِيشَةٖ رَّاضِيَةٖ
అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.
آیت : 8
وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!(a)
(a) ఎవరి సత్కార్యాల పళ్ళెం తేలికగా మరియు పాపాల పళ్ళెం బరువుగా ఉంటుందో!.
آیت : 9
فَأُمُّهُۥ هَاوِيَةٞ
అతని నివాసం అధః పాతాళమే.(a)
(a) అల్-హావియహ్: నరకపు ఒక పేరు. ఉమ్మున్: తల్లి, శరణమిచ్చేది.
آیت : 10
وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ
మరియు అది ఏమిటో నీకేం తెలుసు?
آیت : 11
نَارٌ حَامِيَةُۢ
అదొక భగభగమండే అగ్ని (గుండం).(a)
(a) 'హామియతున్: 'నరకాగ్ని. మానవులు రగిల్చే అగ్ని కంటే నరకాగ్ని డెబ్భై రెట్లు అధికంగా మండుతూ ఉంటుంది, ('స. బు'ఖారీ, 'స. ముస్లిం).
په کامیابۍ سره ولیږل شو