《古兰经》译解

泰卢固语翻译 - 阿布杜·拉赫曼·本·穆罕默德。

Scan the qr code to link to this page

سورة البينة - సూరహ్ అల్-బయ్యినహ్

页码

显示经文内容
显示脚注

段 : 1
لَمۡ يَكُنِ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ وَٱلۡمُشۡرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأۡتِيَهُمُ ٱلۡبَيِّنَةُ
ఎంతవరకైతే స్పష్టమైన నిదర్శనం రాదో! అంత వరకు సత్యతిరస్కారులైన పూర్వగ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు (తమ సత్యతిరస్కారాన్ని) మానుకునేవారు కారు!(a)
(a) అంటే అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి ఒక సందేశహరుడు వచ్చి సరయిన, సమంజసమైన విషయాలు వ్రాయబడిన పరిశుద్ధ పుటలు చదివి విన్పించనంత వరకు వారు మానుకోరు.
段 : 2
رَسُولٞ مِّنَ ٱللَّهِ يَتۡلُواْ صُحُفٗا مُّطَهَّرَةٗ
అల్లాహ్ తరఫు నుండి వచ్చిన సందేశహరుడు(a), వారికి పవిత్ర గ్రంథ పుటలను వినిపిస్తున్నాడు(b).
(a) చూము'హమ్మద్ ('స'అస). (b) ఖుర్ఆన్.
段 : 3
فِيهَا كُتُبٞ قَيِّمَةٞ
అందులో సమంజసమైన వ్రాతలు (సత్యోపదేశాలు) ఉన్నాయి.(a)
(a) ధర్మశాసనాలు.
段 : 4
وَمَا تَفَرَّقَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَةُ
మరియు స్పష్టమైన సూచన వచ్చిన తర్వాతనే గ్రంథ ప్రజలు భేదాభిప్రాయలలో పడ్డారు.(a)
(a) దైవప్రవక్త ('స'అస) రానున్నాడని వారి గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఆ ప్రవక్త ('స'అస) అరబ్బులలో వచ్చాడని గ్రంథప్రజలు అసూయ పడి అతనిని తిరస్కరించారు. చూడండి, 3:19.
段 : 5
وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُواْ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُواْ ٱلزَّكَوٰةَۚ وَذَٰلِكَ دِينُ ٱلۡقَيِّمَةِ
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో(a) తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము."
(a) 'హనీఫన్: వాలు, వంగు, మొగ్గు, ఒక వైపునకు మొగ్గటం ఏకాగ్రచిత్తం, ఏకదైవ సిద్ధాంతం. అంటే షిర్క్ నుండి తౌ'హీద్ కు, బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపునకు మరలటం. ఉదా: ఇబ్రాహీమ్ ('అ.స.) చేసినట్లు ఏకదైవారాధన మరియు సత్యధర్మాన్ని అనుసరించటం.
段 : 6
إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ وَٱلۡمُشۡرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَآۚ أُوْلَٰٓئِكَ هُمۡ شَرُّ ٱلۡبَرِيَّةِ
నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.(a)
(a) ఇది అల్లాహ్ (సు.తా.) ప్రవక్త ('అలైహిమ్ స.)లను మరియు ఆయన గ్రంథాలను తిరస్కరించే వారి గతి. వారు అతి అధమమైన జీవులుగా పేర్కొనబడ్డారు.
段 : 7
إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ أُوْلَٰٓئِكَ هُمۡ خَيۡرُ ٱلۡبَرِيَّةِ
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు.

段 : 8
جَزَآؤُهُمۡ عِندَ رَبِّهِمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ ذَٰلِكَ لِمَنۡ خَشِيَ رَبَّهُۥ
వారికి తమ ప్రభువు నుండి లభించే ప్రతిఫలం శాశ్వతమైన స్వర్గవనాలు. వాటిలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు, వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుతాడు(a) మరియు వారు ఆయనతో సంతుష్టులవుతారు. ఇదే తన ప్రభువుకు భయపడే వ్యక్తికి లభించే ప్రతిఫలం.
(a) చూడండి, 9:72.
信息发送成功