段 :
20
كَلَّا بَلۡ تُحِبُّونَ ٱلۡعَاجِلَةَ
అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు;
段 :
21
وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ
మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు!(a)
段 :
22
وُجُوهٞ يَوۡمَئِذٖ نَّاضِرَةٌ
ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;
段 :
23
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٞ
తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి(a);
段 :
24
وَوُجُوهٞ يَوۡمَئِذِۭ بَاسِرَةٞ
మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి(a);
段 :
25
تَظُنُّ أَن يُفۡعَلَ بِهَا فَاقِرَةٞ
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి(a).
段 :
26
كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِيَ
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు(a);
段 :
27
وَقِيلَ مَنۡۜ رَاقٖ
మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది(a).
段 :
28
وَظَنَّ أَنَّهُ ٱلۡفِرَاقُ
మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు;
段 :
29
وَٱلۡتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ
మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది(a).
段 :
30
إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمَسَاقُ
ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది!
段 :
31
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ
కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు(a)!
段 :
32
وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ
మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు!
段 :
33
ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهۡلِهِۦ يَتَمَطَّىٰٓ
ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు!
段 :
34
أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰ
(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది!
段 :
35
ثُمَّ أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰٓ
అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది!
段 :
36
أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَن يُتۡرَكَ سُدًى
ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా?
段 :
37
أَلَمۡ يَكُ نُطۡفَةٗ مِّن مَّنِيّٖ يُمۡنَىٰ
ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా?
段 :
38
ثُمَّ كَانَ عَلَقَةٗ فَخَلَقَ فَسَوَّىٰ
తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు(a).
段 :
39
فَجَعَلَ مِنۡهُ ٱلزَّوۡجَيۡنِ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ
ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు.
段 :
40
أَلَيۡسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحۡـِۧيَ ٱلۡمَوۡتَىٰ
అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?