段 :
6
لَقَدۡ كَانَ لَكُمۡ فِيهِمۡ أُسۡوَةٌ حَسَنَةٞ لِّمَن كَانَ يَرۡجُواْ ٱللَّهَ وَٱلۡيَوۡمَ ٱلۡأٓخِرَۚ وَمَن يَتَوَلَّ فَإِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ
వాస్తవాంగా! మీకు - అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని అపేక్షించేవారికి(a) - వారిలో ఒక మంచి ఆదర్శం ఉంది. మరియు ఎవడైనా దీని నుండి మరలిపోతే! నిశ్చయంగా, అల్లాహ్ నిరపేక్షాపరుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు (అని తెలుసుకోవాలి).
段 :
7
۞ عَسَى ٱللَّهُ أَن يَجۡعَلَ بَيۡنَكُمۡ وَبَيۡنَ ٱلَّذِينَ عَادَيۡتُم مِّنۡهُم مَّوَدَّةٗۚ وَٱللَّهُ قَدِيرٞۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ
బహుశా, అల్లాహ్ మీ మధ్య మరియు మీకు విరోధులైన వారి మధ్య ప్రేమ కలిగించవచ్చు. మరియు అల్లాహ్ (ప్రతిదీ చేయగల) సమర్ధుడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
段 :
8
لَّا يَنۡهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ لَمۡ يُقَٰتِلُوكُمۡ فِي ٱلدِّينِ وَلَمۡ يُخۡرِجُوكُم مِّن دِيَٰرِكُمۡ أَن تَبَرُّوهُمۡ وَتُقۡسِطُوٓاْ إِلَيۡهِمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُقۡسِطِينَ
ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. (a) నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు(b).
段 :
9
إِنَّمَا يَنۡهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ قَٰتَلُوكُمۡ فِي ٱلدِّينِ وَأَخۡرَجُوكُم مِّن دِيَٰرِكُمۡ وَظَٰهَرُواْ عَلَىٰٓ إِخۡرَاجِكُمۡ أَن تَوَلَّوۡهُمۡۚ وَمَن يَتَوَلَّهُمۡ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ
కాని, వాస్తవానికి ఎవరైతే, ధర్మ విషయంలో మీతో యుద్ధం చేస్తారో మరియు మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడ్తారో మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటంలో పరస్పరం సహకరించుకుంటారో; వారితో స్నేహం చేయటాన్ని అల్లాహ్ మీ కొరకు నిషేధిస్తున్నాడు. మరియు ఎవరైతే వారితో స్నేహం చేస్తారో, అలాంటి వారు, వారే! దుర్మార్గులు.(a)
段 :
10
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا جَآءَكُمُ ٱلۡمُؤۡمِنَٰتُ مُهَٰجِرَٰتٖ فَٱمۡتَحِنُوهُنَّۖ ٱللَّهُ أَعۡلَمُ بِإِيمَٰنِهِنَّۖ فَإِنۡ عَلِمۡتُمُوهُنَّ مُؤۡمِنَٰتٖ فَلَا تَرۡجِعُوهُنَّ إِلَى ٱلۡكُفَّارِۖ لَا هُنَّ حِلّٞ لَّهُمۡ وَلَا هُمۡ يَحِلُّونَ لَهُنَّۖ وَءَاتُوهُم مَّآ أَنفَقُواْۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ أَن تَنكِحُوهُنَّ إِذَآ ءَاتَيۡتُمُوهُنَّ أُجُورَهُنَّۚ وَلَا تُمۡسِكُواْ بِعِصَمِ ٱلۡكَوَافِرِ وَسۡـَٔلُواْ مَآ أَنفَقۡتُمۡ وَلۡيَسۡـَٔلُواْ مَآ أَنفَقُواْۚ ذَٰلِكُمۡ حُكۡمُ ٱللَّهِ يَحۡكُمُ بَيۡنَكُمۡۖ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి.(a) అల్లాహ్ కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్యతిరస్కారులు), వారికిచ్చిన (మహ్ర్) మీరు వారికి చెల్లించండి మరియు వారికి వారి మహ్ర్ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషం లేదు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. (అవిశ్వాసులుగా ఉండి పోదలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహర్ అడిగి తీసుకోండి.(b) (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్ అడిగి తీసుకోనివ్వండి.(c) ఇది అల్లాహ్ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
段 :
11
وَإِن فَاتَكُمۡ شَيۡءٞ مِّنۡ أَزۡوَٰجِكُمۡ إِلَى ٱلۡكُفَّارِ فَعَاقَبۡتُمۡ فَـَٔاتُواْ ٱلَّذِينَ ذَهَبَتۡ أَزۡوَٰجُهُم مِّثۡلَ مَآ أَنفَقُواْۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ أَنتُم بِهِۦ مُؤۡمِنُونَ
మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్యతిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ సత్యతిరస్కారులు, మీరు ఆ స్త్రీలకు చెల్లించిన మహ్ర్ మీకు వాపసు ఇవ్వడానికి నిరాకరిస్తే)! ఆ తరువాత మీకు వారితో ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికితే (మీరు వారిపై యుద్ధం చేసి విజయం పొందితే)(a)! దాని (విజయ ధనం) నుండి, ఎవరి భార్యలైతే సత్యతిరస్కారుల వద్దకు పోయారో వారికి - వారు (తమ భార్యలకు) ఇచ్చిన దానికి (మహ్ర్ కు) సమానంగా - చెల్లించండి. మరియు మీరు విశ్వసించిన అల్లాహ్ యందు, భయభక్తులు కలిగి ఉండండి.