段 :
1
وَٱلنَّجۡمِ إِذَا هَوَىٰ
అస్తమించే నక్షత్రం సాక్షిగా!(a)
段 :
2
مَا ضَلَّ صَاحِبُكُمۡ وَمَا غَوَىٰ
మీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.(a)
段 :
3
وَمَا يَنطِقُ عَنِ ٱلۡهَوَىٰٓ
మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
段 :
4
إِنۡ هُوَ إِلَّا وَحۡيٞ يُوحَىٰ
అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.
段 :
5
عَلَّمَهُۥ شَدِيدُ ٱلۡقُوَىٰ
అది అతనికి మహా బలవంతుడు (జిబ్రీల్) నేర్పాడు.
段 :
6
ذُو مِرَّةٖ فَٱسۡتَوَىٰ
అతను శక్తిసామర్ధ్యాలు గలవాడు,(a) తన వాస్తవరూపంలో ప్రత్యక్షమయినప్పుడు;
段 :
7
وَهُوَ بِٱلۡأُفُقِ ٱلۡأَعۡلَىٰ
అతను ఎత్తైన దిజ్ఞ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు. (a)
段 :
8
ثُمَّ دَنَا فَتَدَلَّىٰ
తరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు.
段 :
9
فَكَانَ قَابَ قَوۡسَيۡنِ أَوۡ أَدۡنَىٰ
అప్పుడు అతను రెండు ధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు.
段 :
10
فَأَوۡحَىٰٓ إِلَىٰ عَبۡدِهِۦ مَآ أَوۡحَىٰ
అప్పుడు అతను (జిబ్రీల్), ఆయన (అల్లాహ్) దాసునిపై అవతరింప జేయవలసిన, దానిని (వహీని) అవతరింపజేశాడు.
段 :
11
مَا كَذَبَ ٱلۡفُؤَادُ مَا رَأَىٰٓ
అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు.
段 :
12
أَفَتُمَٰرُونَهُۥ عَلَىٰ مَا يَرَىٰ
అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?
段 :
13
وَلَقَدۡ رَءَاهُ نَزۡلَةً أُخۡرَىٰ
మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు.
段 :
14
عِندَ سِدۡرَةِ ٱلۡمُنتَهَىٰ
(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.(a)
段 :
15
عِندَهَا جَنَّةُ ٱلۡمَأۡوَىٰٓ
అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.(a)
段 :
16
إِذۡ يَغۡشَى ٱلسِّدۡرَةَ مَا يَغۡشَىٰ
అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు!(a)
段 :
17
مَا زَاغَ ٱلۡبَصَرُ وَمَا طَغَىٰ
అతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దుదాటి కూడా పోలేదు.
段 :
18
لَقَدۡ رَأَىٰ مِنۡ ءَايَٰتِ رَبِّهِ ٱلۡكُبۡرَىٰٓ
వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు.(a)
段 :
19
أَفَرَءَيۡتُمُ ٱللَّٰتَ وَٱلۡعُزَّىٰ
మీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా?(a)
段 :
20
وَمَنَوٰةَ ٱلثَّالِثَةَ ٱلۡأُخۡرَىٰٓ
మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)?(a)
段 :
21
أَلَكُمُ ٱلذَّكَرُ وَلَهُ ٱلۡأُنثَىٰ
మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా?(a)
段 :
22
تِلۡكَ إِذٗا قِسۡمَةٞ ضِيزَىٰٓ
ఇది అన్యాయమైన విభజన కాదా!
段 :
23
إِنۡ هِيَ إِلَّآ أَسۡمَآءٞ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٍۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهۡوَى ٱلۡأَنفُسُۖ وَلَقَدۡ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلۡهُدَىٰٓ
ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు.(a) వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది!
段 :
24
أَمۡ لِلۡإِنسَٰنِ مَا تَمَنَّىٰ
ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా?
段 :
25
فَلِلَّهِ ٱلۡأٓخِرَةُ وَٱلۡأُولَىٰ
వాస్తవానికి, అంతిమ (పరలోకం) మరియు ప్రథమం (ఇహలోకం) అన్నీ అల్లాహ్ కే చెందినవి.
段 :
26
۞ وَكَم مِّن مَّلَكٖ فِي ٱلسَّمَٰوَٰتِ لَا تُغۡنِي شَفَٰعَتُهُمۡ شَيۡـًٔا إِلَّا مِنۢ بَعۡدِ أَن يَأۡذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرۡضَىٰٓ
మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప!(a)