段 :
60
وَمَآ أُوتِيتُم مِّن شَيۡءٖ فَمَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَزِينَتُهَاۚ وَمَا عِندَ ٱللَّهِ خَيۡرٞ وَأَبۡقَىٰٓۚ أَفَلَا تَعۡقِلُونَ
మరియు మీకు ఇవ్వబడిన వన్నీ ఈ ప్రాపంచిక జీవితపు సుఖసంతోషాల సామాగ్రి మరియు దాని అలంకరణలు మాత్రమే! కాని అల్లాహ్ వద్ద ఉన్నది దీని కంటే ఎంతో ఉత్తమమైనది మరియు నిత్యమైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?(a)
段 :
61
أَفَمَن وَعَدۡنَٰهُ وَعۡدًا حَسَنٗا فَهُوَ لَٰقِيهِ كَمَن مَّتَّعۡنَٰهُ مَتَٰعَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا ثُمَّ هُوَ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ مِنَ ٱلۡمُحۡضَرِينَ
ఏమీ? మేము చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందేవాడు,(a) మేము ఒసంగిన ఈ ప్రాపంచిక సుఖసంతోషాలు పొంది, పునరుత్థాన దినమున మా ముందు (శిక్షకై) హాజరు చేయబడే వాడితో సమానుడు కాగలడా?
段 :
62
وَيَوۡمَ يُنَادِيهِمۡ فَيَقُولُ أَيۡنَ شُرَكَآءِيَ ٱلَّذِينَ كُنتُمۡ تَزۡعُمُونَ
మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజు ఆయన (అల్లాహ్) వారిని పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నా భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు?"(a)
段 :
63
قَالَ ٱلَّذِينَ حَقَّ عَلَيۡهِمُ ٱلۡقَوۡلُ رَبَّنَا هَٰٓؤُلَآءِ ٱلَّذِينَ أَغۡوَيۡنَآ أَغۡوَيۡنَٰهُمۡ كَمَا غَوَيۡنَاۖ تَبَرَّأۡنَآ إِلَيۡكَۖ مَا كَانُوٓاْ إِيَّانَا يَعۡبُدُونَ
ఎవరైతే ఆ మాట (శిక్ష) వర్తిస్తుందో, వారిలా విన్నవించుకుంటారు: "ఓ మా ప్రభూ! మేము దారి తప్పించిన వారు వీరే! మేము దారి తప్పిన విధంగానే వీరిని కూడా దారి తప్పించాము. వీరితో మాకెలాంటి సంబంధం లేదని నీ ముందు ప్రకటిస్తున్నాము. అసలు వీరు మమ్మల్ని ఆరాధించనేలేదు."(a)
段 :
64
وَقِيلَ ٱدۡعُواْ شُرَكَآءَكُمۡ فَدَعَوۡهُمۡ فَلَمۡ يَسۡتَجِيبُواْ لَهُمۡ وَرَأَوُاْ ٱلۡعَذَابَۚ لَوۡ أَنَّهُمۡ كَانُواْ يَهۡتَدُونَ
మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు సాటి కల్పించిన మీ భాగస్వాములను పిలువండి!" అప్పుడు వారు, వారిని (భాగస్వాములను) పిలుస్తారు, కాని వారు, వారికి సమాధానమివ్వరు. మరియు వారు శిక్షను చూసి (అనుకుంటారు): "ఒకవేళ వాస్తవానికి తాము సన్మార్గాన్ని అవలంబించి వుంటే ఎంత బాగుండేది!" (a) అని.
段 :
65
وَيَوۡمَ يُنَادِيهِمۡ فَيَقُولُ مَاذَآ أَجَبۡتُمُ ٱلۡمُرۡسَلِينَ
మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆయన (అల్లాహ్) వారిని పిలిచిన రోజు ఇలా ప్రశ్నిస్తాడు: "మేము పంపిన సందేశహరులకు మీరు ఏ విధంగా సమాధానమిచ్చారు?"
段 :
66
فَعَمِيَتۡ عَلَيۡهِمُ ٱلۡأَنۢبَآءُ يَوۡمَئِذٖ فَهُمۡ لَا يَتَسَآءَلُونَ
ఆ రోజు వారి సమాధానాలన్నీ (కారణాలన్నీ) అస్పష్టమై పోతాయి మరియు వారు ఒకరితో నొకరు సంప్రదించుకోనూ లేరు.
段 :
67
فَأَمَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا فَعَسَىٰٓ أَن يَكُونَ مِنَ ٱلۡمُفۡلِحِينَ
కాని ఎవడైతే పశ్చాత్తాప పడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో! అతడు సాఫల్యం పొందే వారిలో చేరగలడని ఆశించవచ్చు!
段 :
68
وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ مَا كَانَ لَهُمُ ٱلۡخِيَرَةُۚ سُبۡحَٰنَ ٱللَّهِ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ
మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు. మరియు ఎన్నుకునే హక్కు వారికి ఏ మాత్రం లేదు. అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు, వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే మహోన్నతుడు.
段 :
69
وَرَبُّكَ يَعۡلَمُ مَا تُكِنُّ صُدُورُهُمۡ وَمَا يُعۡلِنُونَ
మరియు వారు తమ హృదయాలలో దాచుకున్నది మరియు బహిర్గతం చేసేది అంతా నీ ప్రభువుకు తెలుసు.
段 :
70
وَهُوَ ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ لَهُ ٱلۡحَمۡدُ فِي ٱلۡأُولَىٰ وَٱلۡأٓخِرَةِۖ وَلَهُ ٱلۡحُكۡمُ وَإِلَيۡهِ تُرۡجَعُونَ
మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.