వచనం :
1
يَٰٓأَيُّهَا ٱلۡمُزَّمِّلُ
ఓ దుప్పటి కప్పుకున్నవాడా(a)!
వచనం :
2
قُمِ ٱلَّيۡلَ إِلَّا قَلِيلٗا
రాత్రంతా (నమాజ్ లో) నిలబడు, కొంత భాగాన్ని విడిచి;
వచనం :
3
نِّصۡفَهُۥٓ أَوِ ٱنقُصۡ مِنۡهُ قَلِيلًا
దాని సగభాగంలో, లేదా దాని కంటే కొంత తక్కువ;
వచనం :
4
أَوۡ زِدۡ عَلَيۡهِ وَرَتِّلِ ٱلۡقُرۡءَانَ تَرۡتِيلًا
లేదా దాని కంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్ఆన్ ను ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు.
వచనం :
5
إِنَّا سَنُلۡقِي عَلَيۡكَ قَوۡلٗا ثَقِيلًا
నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింప జేయబోతున్నాము.
వచనం :
6
إِنَّ نَاشِئَةَ ٱلَّيۡلِ هِيَ أَشَدُّ وَطۡـٔٗا وَأَقۡوَمُ قِيلًا
నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగణమైనది.
వచనం :
7
إِنَّ لَكَ فِي ٱلنَّهَارِ سَبۡحٗا طَوِيلٗا
వాస్తవానికి, పగటివేళ నీకు చాలా పనులుంటాయి.
వచనం :
8
وَٱذۡكُرِ ٱسۡمَ رَبِّكَ وَتَبَتَّلۡ إِلَيۡهِ تَبۡتِيلٗا
మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రద్థతో ఆయన వైపుకు మరలుతూ ఉండు.
వచనం :
9
رَّبُّ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ لَآ إِلَٰهَ إِلَّا هُوَ فَٱتَّخِذۡهُ وَكِيلٗا
ఆయనే తూర్పూ పడమరల స్వామి, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, కావున నీవు ఆయననే కార్యకర్తగా చేసుకో.
వచనం :
10
وَٱصۡبِرۡ عَلَىٰ مَا يَقُولُونَ وَٱهۡجُرۡهُمۡ هَجۡرٗا جَمِيلٗا
మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో.
వచనం :
11
وَذَرۡنِي وَٱلۡمُكَذِّبِينَ أُوْلِي ٱلنَّعۡمَةِ وَمَهِّلۡهُمۡ قَلِيلًا
మరియు అసత్యవాదులైన ఈ సంపన్నులను, నాకు వదలిపెట్టు(a). మరియు వారికి కొంత వ్యవధినివ్వు.
వచనం :
12
إِنَّ لَدَيۡنَآ أَنكَالٗا وَجَحِيمٗا
నిశ్చయంగా, మా వద్ద వారి కొరకు సంకెళ్ళు మరియు భగభగమండే నరకాగ్ని ఉన్నాయి.
వచనం :
13
وَطَعَامٗا ذَا غُصَّةٖ وَعَذَابًا أَلِيمٗا
మరియు గొంతులో ఇరుక్కుపోయే ఆహారం మరియు బాధాకరమైన శిక్ష (ఉన్నాయి).
వచనం :
14
يَوۡمَ تَرۡجُفُ ٱلۡأَرۡضُ وَٱلۡجِبَالُ وَكَانَتِ ٱلۡجِبَالُ كَثِيبٗا مَّهِيلًا
ఆ రోజు భూమి మరియు పర్వతాలు కంపించి పోతాయి. మరియు పర్వతాలు ప్రవహించే ఇసుక దిబ్బలుగా మారిపోతాయి(a).
వచనం :
15
إِنَّآ أَرۡسَلۡنَآ إِلَيۡكُمۡ رَسُولٗا شَٰهِدًا عَلَيۡكُمۡ كَمَآ أَرۡسَلۡنَآ إِلَىٰ فِرۡعَوۡنَ رَسُولٗا
మేము ఫిర్ఔన్ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకు సాక్షిగా ఉండటానికి పంపాము.
వచనం :
16
فَعَصَىٰ فِرۡعَوۡنُ ٱلرَّسُولَ فَأَخَذۡنَٰهُ أَخۡذٗا وَبِيلٗا
కాని ఫిర్ఔన్ ఆ సందేశహరునికి అవిధేయత చూపాడు. కావున మేము అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేశాము.
వచనం :
17
فَكَيۡفَ تَتَّقُونَ إِن كَفَرۡتُمۡ يَوۡمٗا يَجۡعَلُ ٱلۡوِلۡدَٰنَ شِيبًا
ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, బాలురను ముసలివారిగా చేసేటటు వంటి ఆ దినపు శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు(a)?
వచనం :
18
ٱلسَّمَآءُ مُنفَطِرُۢ بِهِۦۚ كَانَ وَعۡدُهُۥ مَفۡعُولًا
అప్పుడు ఆకాశం బ్రద్దలై పోతుంది. ఆయన యొక్క వాగ్దానం తప్పక నెరవేరి తీరుతుంది.
వచనం :
19
إِنَّ هَٰذِهِۦ تَذۡكِرَةٞۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلًا
నిశ్చయంగా, ఇదొక ఉపదేశం కావున ఇష్టమైన వాడు తన ప్రభువు వద్దకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు!