వచనం :
163
۞ إِنَّآ أَوۡحَيۡنَآ إِلَيۡكَ كَمَآ أَوۡحَيۡنَآ إِلَىٰ نُوحٖ وَٱلنَّبِيِّـۧنَ مِنۢ بَعۡدِهِۦۚ وَأَوۡحَيۡنَآ إِلَىٰٓ إِبۡرَٰهِيمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَٰرُونَ وَسُلَيۡمَٰنَۚ وَءَاتَيۡنَا دَاوُۥدَ زَبُورٗا
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము.(a) మరియు మేము దావూద్ కు జబూర్ (b) గ్రంథాన్ని ప్రసాదించాము.
వచనం :
164
وَرُسُلٗا قَدۡ قَصَصۡنَٰهُمۡ عَلَيۡكَ مِن قَبۡلُ وَرُسُلٗا لَّمۡ نَقۡصُصۡهُمۡ عَلَيۡكَۚ وَكَلَّمَ ٱللَّهُ مُوسَىٰ تَكۡلِيمٗا
మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు.(a) మరియు అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు.
వచనం :
165
رُّسُلٗا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةُۢ بَعۡدَ ٱلرُّسُلِۚ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمٗا
(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము.(a) ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని!(b) మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
వచనం :
166
لَّٰكِنِ ٱللَّهُ يَشۡهَدُ بِمَآ أَنزَلَ إِلَيۡكَۖ أَنزَلَهُۥ بِعِلۡمِهِۦۖ وَٱلۡمَلَٰٓئِكَةُ يَشۡهَدُونَۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًا
కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి (ఖుర్ఆన్ కు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహ్ యే చాలు.
వచనం :
167
إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ قَدۡ ضَلُّواْ ضَلَٰلَۢا بَعِيدًا
నిశ్చయంగా, ఎవరైతే సత్య తిరస్కారులై, ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు మార్గభ్రష్టులై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు!
వచనం :
168
إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَظَلَمُواْ لَمۡ يَكُنِ ٱللَّهُ لِيَغۡفِرَ لَهُمۡ وَلَا لِيَهۡدِيَهُمۡ طَرِيقًا
నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు.
వచనం :
169
إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٗا
వారికి కేవలం నరక మార్గం మాత్రమే చూపుతాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.
వచనం :
170
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدۡ جَآءَكُمُ ٱلرَّسُولُ بِٱلۡحَقِّ مِن رَّبِّكُمۡ فَـَٔامِنُواْ خَيۡرٗا لَّكُمۡۚ وَإِن تَكۡفُرُواْ فَإِنَّ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمٗا
ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి, సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చి వున్నాడు, కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి, ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే! నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందినదని తెలుసుకోండి.(a) మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు.