పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం

Telugu translation - Abder-Rahim ibn Muhammad

Scan the qr code to link to this page

سورة الحج - సూరహ్ అల్-హజ్

పేజీ నెంబరు

వచనం

ఖుర్ఆన్ వచనం చూపండి
పాదసూచిక చూపండి

వచనం : 1
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمۡۚ إِنَّ زَلۡزَلَةَ ٱلسَّاعَةِ شَيۡءٌ عَظِيمٞ
ఓ మానవులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి! నిశ్చయంగా, ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది.
వచనం : 2
يَوۡمَ تَرَوۡنَهَا تَذۡهَلُ كُلُّ مُرۡضِعَةٍ عَمَّآ أَرۡضَعَتۡ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمۡلٍ حَمۡلَهَا وَتَرَى ٱلنَّاسَ سُكَٰرَىٰ وَمَا هُم بِسُكَٰرَىٰ وَلَٰكِنَّ عَذَابَ ٱللَّهِ شَدِيدٞ
ఆ రోజు ఆవరించినప్పుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ, తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు. కానీ (వాస్తవానికి) వారు త్రాగి (మత్తులో) ఉండరు. కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.
వచనం : 3
وَمِنَ ٱلنَّاسِ مَن يُجَٰدِلُ فِي ٱللَّهِ بِغَيۡرِ عِلۡمٖ وَيَتَّبِعُ كُلَّ شَيۡطَٰنٖ مَّرِيدٖ
మరియు ప్రజలలో ఒకడుంటాడు, జ్ఞానం లేనిదే, అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ ను అనుసరించేవాడు.
వచనం : 4
كُتِبَ عَلَيۡهِ أَنَّهُۥ مَن تَوَلَّاهُ فَأَنَّهُۥ يُضِلُّهُۥ وَيَهۡدِيهِ إِلَىٰ عَذَابِ ٱلسَّعِيرِ
అతడిని (షైతాన్ ను) గురించి వ్రాయబడిందేమిటంటే, వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టుడిగా చేస్తాడు మరియు వాడికి మండే నరకాగ్ని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
వచనం : 5
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِن كُنتُمۡ فِي رَيۡبٖ مِّنَ ٱلۡبَعۡثِ فَإِنَّا خَلَقۡنَٰكُم مِّن تُرَابٖ ثُمَّ مِن نُّطۡفَةٖ ثُمَّ مِنۡ عَلَقَةٖ ثُمَّ مِن مُّضۡغَةٖ مُّخَلَّقَةٖ وَغَيۡرِ مُخَلَّقَةٖ لِّنُبَيِّنَ لَكُمۡۚ وَنُقِرُّ فِي ٱلۡأَرۡحَامِ مَا نَشَآءُ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى ثُمَّ نُخۡرِجُكُمۡ طِفۡلٗا ثُمَّ لِتَبۡلُغُوٓاْ أَشُدَّكُمۡۖ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰٓ أَرۡذَلِ ٱلۡعُمُرِ لِكَيۡلَا يَعۡلَمَ مِنۢ بَعۡدِ عِلۡمٖ شَيۡـٔٗاۚ وَتَرَى ٱلۡأَرۡضَ هَامِدَةٗ فَإِذَآ أَنزَلۡنَا عَلَيۡهَا ٱلۡمَآءَ ٱهۡتَزَّتۡ وَرَبَتۡ وَأَنۢبَتَتۡ مِن كُلِّ زَوۡجِۭ بَهِيجٖ
ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, (a) తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు;(b) అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.
(a) 'మట్టితో సృష్టించాము.' ఇటువంటి ఇతర ఆయతులకు చూడండి, 3:59, 11:61, 18:37, 30:20, 23:12. (b) చూడండి, 16:70.

వచనం : 6
ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّهُۥ يُحۡيِ ٱلۡمَوۡتَىٰ وَأَنَّهُۥ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
వచనం : 7
وَأَنَّ ٱلسَّاعَةَ ءَاتِيَةٞ لَّا رَيۡبَ فِيهَا وَأَنَّ ٱللَّهَ يَبۡعَثُ مَن فِي ٱلۡقُبُورِ
మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది. అందులో ఎలాంటి సందేహం లేదు మరియు నిశ్చయంగా, అల్లాహ్ గోరీలలో నున్న వారిని మరల బ్రతికించి లేపుతాడు.
వచనం : 8
وَمِنَ ٱلنَّاسِ مَن يُجَٰدِلُ فِي ٱللَّهِ بِغَيۡرِ عِلۡمٖ وَلَا هُدٗى وَلَا كِتَٰبٖ مُّنِيرٖ
అయినా మానవులలో - జ్ఞానం లేనిదే మరియు మార్గదర్శకత్వం లేనిదే మరియు ప్రకాశవంతమైన గ్రంథం లేనిదే - అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు ఉన్నాడు.
వచనం : 9
ثَانِيَ عِطۡفِهِۦ لِيُضِلَّ عَن سَبِيلِ ٱللَّهِۖ لَهُۥ فِي ٱلدُّنۡيَا خِزۡيٞۖ وَنُذِيقُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عَذَابَ ٱلۡحَرِيقِ
(అలాంటి వాడు) గర్వంతో తన మెడను త్రిప్పుకుంటాడు. ఇతరులను అల్లాహ్ మార్గం నుండి తప్పింప జూస్తాడు.(a) వానికి ఈ లోకంలో అవమానముంటుంది. మరియు పునరుత్థాన దినమున అతనికి మేము దహించే అగ్ని శిక్షను రుచి చూపుతాము.
(a) ఇక్కడ ఆ వ్యక్తిని గురించి చెప్పబడింది. ఎవనికైతే అల్లాహ్ (సు.తా.)ను గురించి ఎలాంటి జ్ఞానం లేదో! ఈ విధమైన వివరాలకు చూడండి, 31:7, 63:5 మరియు 17:83.
వచనం : 10
ذَٰلِكَ بِمَا قَدَّمَتۡ يَدَاكَ وَأَنَّ ٱللَّهَ لَيۡسَ بِظَلَّٰمٖ لِّلۡعَبِيدِ
(అతనితో): "ఇది నీవు నీ చేతులారా చేసి పంపిన దాని (ఫలితం) మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు!" (అని అనబడుతుంది).
వచనం : 11
وَمِنَ ٱلنَّاسِ مَن يَعۡبُدُ ٱللَّهَ عَلَىٰ حَرۡفٖۖ فَإِنۡ أَصَابَهُۥ خَيۡرٌ ٱطۡمَأَنَّ بِهِۦۖ وَإِنۡ أَصَابَتۡهُ فِتۡنَةٌ ٱنقَلَبَ عَلَىٰ وَجۡهِهِۦ خَسِرَ ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةَۚ ذَٰلِكَ هُوَ ٱلۡخُسۡرَانُ ٱلۡمُبِينُ
మరియు ప్రజలలో కొందరు అంచున(a) నిలచి (సందేహంతో) అల్లాహ్ ను ఆరాధించే వారున్నారు. (అలాంటివాడు) తనకు లాభం కలిగితే, ఎంతో తృప్తి పొందుతాడు. కాని ఆపదకు గురి అయితే ముఖం త్రిప్పుకొని, ఇహమును మరియు పరమును కూడా కోల్పోతాడు. స్పష్టమైన నష్టమంటే ఇదే!
(a) 'హర్ ఫున్: అంచున నిలబడినవాడు. అంటే హృదయపూర్వకంగా పూర్తిగా ఇస్లాంలో చేరనివాడు. ఇస్లాం స్వీకరించిన తరువాత లాభం కనిపిస్తే మంచి ధర్మం అంటాడు, లేకుంటే మంచిది కాదు అంటాడు. కొందరు ఎడారి వాసులు ( బద్దూలు) మొదట ఇస్లాం స్వీకరించినప్పుడు ఈ విధంగానే వ్యవహరించారు.
వచనం : 12
يَدۡعُواْ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَضُرُّهُۥ وَمَا لَا يَنفَعُهُۥۚ ذَٰلِكَ هُوَ ٱلضَّلَٰلُ ٱلۡبَعِيدُ
అతడు అల్లాహ్ ను వదలి తనకు నష్టం గానీ, లాభం గానీ చేకూర్చలేని వారిని ప్రార్థిస్తున్నాడు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం.(a)
(a) చూడండి, 14:18.
వచనం : 13
يَدۡعُواْ لَمَن ضَرُّهُۥٓ أَقۡرَبُ مِن نَّفۡعِهِۦۚ لَبِئۡسَ ٱلۡمَوۡلَىٰ وَلَبِئۡسَ ٱلۡعَشِيرُ
ఎవరి వల్ల లాభం కంటే, నష్టమే ఎక్కువ రానున్నదో వారినే అతడు ప్రార్థిస్తున్నాడు. ఎంత నికృష్టుడైన సంరక్షకుడు మరియు ఎంత నికృష్టుడైన అనుచరుడు (అషీరు).
వచనం : 14
إِنَّ ٱللَّهَ يُدۡخِلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ إِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يُرِيدُ
విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది చేస్తాడు.
వచనం : 15
مَن كَانَ يَظُنُّ أَن لَّن يَنصُرَهُ ٱللَّهُ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ فَلۡيَمۡدُدۡ بِسَبَبٍ إِلَى ٱلسَّمَآءِ ثُمَّ لۡيَقۡطَعۡ فَلۡيَنظُرۡ هَلۡ يُذۡهِبَنَّ كَيۡدُهُۥ مَا يَغِيظُ
ఎవడైతే - ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా - అల్లాహ్, అతనికి (ప్రవక్తకు) సహాయపడడని భావిస్తాడో! (వాడికి సాధ్యమైతే) వాడిని ఒక త్రాడు సహాయంతో ఆకాశంపైకి పోయి, తరువాత వాటిని (అంటే ప్రవక్తపై అవతరింప జేయబడే వహీ మరియు ఇతర సహాయాలను) త్రెంపి చూడమను, అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో!(a)
(a) పైది ఇమామ్ అష్-షౌకాని (ర'హ్మ) గారి తాత్పర్యం. ఇమామ్ ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) గారి తాత్పర్యం ఇలా ఉంది: 'ఎవడైతే ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా అల్లాహ్, దైవప్రవక్తకు సహాయపడడని భావిస్తాడో! వాడిని (తన ఇంటి) కప్పుకు ఒక త్రాడు వేసి దానితో ఉరి వేసుకొని చూడమను. అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో!'

వచనం : 16
وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ ءَايَٰتِۭ بَيِّنَٰتٖ وَأَنَّ ٱللَّهَ يَهۡدِي مَن يُرِيدُ
మరియు ఈ విధంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) స్పష్టమైన సందేశాలతో అవతరింపజేశాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు.(a)
(a) చూడండి, 14:4.
వచనం : 17
إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَٱلَّذِينَ هَادُواْ وَٱلصَّٰبِـِٔينَ وَٱلنَّصَٰرَىٰ وَٱلۡمَجُوسَ وَٱلَّذِينَ أَشۡرَكُوٓاْ إِنَّ ٱللَّهَ يَفۡصِلُ بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ
నిశ్చయంగా, (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించిన వారి మరియు యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు(a) మరియు బహుదైవారాధకులు అయిన వారి మధ్య పునరుత్థాన దినమున అల్లాహ్ తప్పక తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షిగా ఉంటాడు.
(a) అల్-మజూసు: (Magians / Zoroastrians) అంటే మజూసీలు. వారు Zerdusht అనే ఈరాన్ ప్రవక్తను అనుసరిస్తారు. వారి గ్రంథం పేరు, Zend-Avesta, వీరు రెండు ఆరాధ్య దైవాలున్నాయి అంటారు. ఒకటి చీకటి, రెండోది వెలుగు. వీరు ఈరాన్ లో మరియు ఇండియా పాకిస్తాన్ లలో ఉన్న పార్సీలు. వీరు అగ్నిని పూజిస్తారు. కాని అల్ల్హాహ్ (సు.తా.) సర్వసృష్టికి మూలాధారుడు అని కూడా విశ్వాసిస్తారు.
వచనం : 18
أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يَسۡجُدُۤ لَهُۥۤ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ وَٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ وَٱلنُّجُومُ وَٱلۡجِبَالُ وَٱلشَّجَرُ وَٱلدَّوَآبُّ وَكَثِيرٞ مِّنَ ٱلنَّاسِۖ وَكَثِيرٌ حَقَّ عَلَيۡهِ ٱلۡعَذَابُۗ وَمَن يُهِنِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن مُّكۡرِمٍۚ إِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يَشَآءُ۩
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వవృక్షరాశి, సర్వ జీవరాశి మరియు ప్రజలలో చాలా మంది, అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారని?(a) మరియు చాలా మంది శిక్షకు కూడా గురి అవుతారు. మరియు అల్లాహ్ ఎవడినైతే అవమానం పాలు చేస్తాడో, అతడికి గౌరవమిప్పించ గలవాడు ఎవ్వడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు.
(a) చూడండి, 13:15 16:48-49.
వచనం : 19
۞ هَٰذَانِ خَصۡمَانِ ٱخۡتَصَمُواْ فِي رَبِّهِمۡۖ فَٱلَّذِينَ كَفَرُواْ قُطِّعَتۡ لَهُمۡ ثِيَابٞ مِّن نَّارٖ يُصَبُّ مِن فَوۡقِ رُءُوسِهِمُ ٱلۡحَمِيمُ
ఆ రెండు విపక్ష తెగల వారు తమ ప్రభువును గురించి వాదులాడారు, కావున వారిలో సత్యతిరస్కారులకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి (కుట్టించబడి) ఉంటాయి, వారి తలల మీద సలసలకాగే నీరు పోయబడు తుంది.(a)
(a) కొందరు వ్యాఖ్యాతలు వీరిని, విశ్వాసులు మరియు సత్యతిరస్కారులతో పోల్చారు. ఇతరులు బద్ర్ యుద్ధంలో పోరాడిన విశ్వాసులు మరియు ముష్రికులైన మక్కా ఖురైషులతో పోల్చారు. ఇబ్నె-కస'ర్ (ర'హ్మ) ఈ రెండు వ్యాఖ్యానాలు సరైనవే అంటారు.
వచనం : 20
يُصۡهَرُ بِهِۦ مَا فِي بُطُونِهِمۡ وَٱلۡجُلُودُ
దానితో వారి కడుపులలో ఉన్నది మరియు వారి చర్మాలు కరిగి పోతాయి.
వచనం : 21
وَلَهُم مَّقَٰمِعُ مِنۡ حَدِيدٖ
మరియు వారిని (శిక్షించటానికి) ఇనుప గదలు ఉంటాయి.
వచనం : 22
كُلَّمَآ أَرَادُوٓاْ أَن يَخۡرُجُواْ مِنۡهَا مِنۡ غَمٍّ أُعِيدُواْ فِيهَا وَذُوقُواْ عَذَابَ ٱلۡحَرِيقِ
ప్రతిసారి వారు దాని (ఆ నరకం) నుండి దాని బాధ నుండి బయట పడటానికి ప్రయత్నించి నప్పుడల్లా తిరిగి అందులోకే నెట్టబడతారు. మరియు వారితో : "నరకాగ్నిని చవి చూడండి!" (అని అనబడుతుంది).
వచనం : 23
إِنَّ ٱللَّهَ يُدۡخِلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ يُحَلَّوۡنَ فِيهَا مِنۡ أَسَاوِرَ مِن ذَهَبٖ وَلُؤۡلُؤٗاۖ وَلِبَاسُهُمۡ فِيهَا حَرِيرٞ
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని అల్లాహ్ క్రింద సెలయేళ్ళు ప్రవహంచే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారికి బంగారం మరియు ముత్యాలతో చేయబడిన కంకణాలు తొడిగింప బడతాయి. అక్కడ వారి కొరకు పట్టు వస్త్రాలు ఉంటాయి.(a)
(a) ఈ ఆటంకపరచే వారు, మక్కా ముష్రికులు. వీరు 6వ హిజ్రీలో దైవప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరులను (ర'ది.'అన్హుమ్) మక్కాలో ప్రవేశించకుండా ఆపారు. మరియు వారు హుదైబియా నుండి మరలిపోయారు.

వచనం : 24
وَهُدُوٓاْ إِلَى ٱلطَّيِّبِ مِنَ ٱلۡقَوۡلِ وَهُدُوٓاْ إِلَىٰ صِرَٰطِ ٱلۡحَمِيدِ
ఎందుకంటే వారికి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చూపబడింది. మరియు వారు సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) యొక్క మార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందారు.
వచనం : 25
إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ ٱلَّذِي جَعَلۡنَٰهُ لِلنَّاسِ سَوَآءً ٱلۡعَٰكِفُ فِيهِ وَٱلۡبَادِۚ وَمَن يُرِدۡ فِيهِ بِإِلۡحَادِۭ بِظُلۡمٖ نُّذِقۡهُ مِنۡ عَذَابٍ أَلِيمٖ
నిశ్చయంగా, ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తూ (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి, మస్జిద్ అల్ హరామ్ నుండి ఆటంకపరుస్తారో - దేనికైతే మేము అందరి కొరకు సమానంగా చేసి ఉన్నామో - వారు అక్కడ నివసించేవారైనా సరే, లేదా బయట నుండి వచ్చిన వారైనా సరే.(a) మరియు ఎవరైనా దులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము.
(a) దీనిని ఈ విధంగా చాలా మంది వ్యాఖ్యాతలు వివరించారు: మస్జిద్ అల్ - 'హరామ్ మీద అక్కడ నివసించే వారికి మరియు బయట నుండి వచ్చే వారికి సరిసమానమైన హక్కులున్నాయి. అంటే ఏ ముస్లింకు అయినా ఏ సమయంలో గానీ రాత్రింబవళ్ళు, మస్జిద్ అల్ - 'హరాంలో ప్రవేశించి 'తవాఫ్, నమా'జ్, 'ఉమ్రా మొదలైనవి చేసే హక్కు ఉంది. అతనిని ఎవ్వరూ, తన ప్రార్థనల నుండి ఆపరాదు. ఇక 'హరమ్ హద్దులలో ఉన్న భూమిలో ఇండ్లు కట్టుకున్న వారు తమ ఇండ్ల యజమానులు. కాని మినా, ము'జ్ దలిఫా, 'అరఫాత్ ('హజ్ ప్రాంతారాలు) మాత్రం సర్వముస్లింల కొరకు ఉన్నాయి. వాటిపై ఎవ్వరీ యజమాన్యం లేదు. ఈ విషయంపై ధర్మవేత్తలందరూ ఏకీభవిస్తున్నారు. చూ. 2:125.
వచనం : 26
وَإِذۡ بَوَّأۡنَا لِإِبۡرَٰهِيمَ مَكَانَ ٱلۡبَيۡتِ أَن لَّا تُشۡرِكۡ بِي شَيۡـٔٗا وَطَهِّرۡ بَيۡتِيَ لِلطَّآئِفِينَ وَٱلۡقَآئِمِينَ وَٱلرُّكَّعِ ٱلسُّجُودِ
మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ)(a) అతనితో: "ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు"(b) అని అన్నాము.
(a) నూ'హ్ ('అ.స.) 'తుఫాన్ తరువాత, క'అబహ్ గృహాన్ని నిర్మించిన వారు ఇబ్రాహీమ్ ('అ.స.) మరియు అతని కుమారుడు ఇస్మా'యీల్ ('అ.స.). ఆ తరువాత 40 సంవత్సరాల పిదప మస్జిద్ అల్ - అ'ఖ్సా నిర్మించబడింది. (ముస్నద్ అ'హ్మద్ 5/150, 166, 167 మరియు ముస్లిం, కితాబుల్ మసాజిద్). (b) 'తవాఫ్ మరియు నమా'జ్ కేవలం ఈ కాబాకే ప్రత్యేకించబడ్డాయి. కావున అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ ప్రకారం కేవలం క'అబహ్ కు మాత్రమే 'తవాఫ్ చేయాలి మరియు కేవలం ఈ క'అబహ్ వైపునకే ముఖం చేసి నమా'జ్ చేయాలి. ఈ క'అబహ్ ను విడిచి ఏ ఇతర దానికి 'తవాఫ్ చేయటం లేక దాని పైవునకు ముఖం చేసి నమా'జ్ చేయటం సత్యతిరస్కారం (కుఫ్ర్) అవుతుంది.
వచనం : 27
وَأَذِّن فِي ٱلنَّاسِ بِٱلۡحَجِّ يَأۡتُوكَ رِجَالٗا وَعَلَىٰ كُلِّ ضَامِرٖ يَأۡتِينَ مِن كُلِّ فَجٍّ عَمِيقٖ
మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు:(a) "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు.
(a) 'హజ్ వివరాలకు చూడండి, 2:196-203.
వచనం : 28
لِّيَشۡهَدُواْ مَنَٰفِعَ لَهُمۡ وَيَذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ فِيٓ أَيَّامٖ مَّعۡلُومَٰتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّنۢ بَهِيمَةِ ٱلۡأَنۡعَٰمِۖ فَكُلُواْ مِنۡهَا وَأَطۡعِمُواْ ٱلۡبَآئِسَ ٱلۡفَقِيرَ
వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి.(a)
(a) అయ్యామిమ్ మ'లూమాత్: అంటే జి''బహ్ చేసే దినాలు, అంటే 10వ తేదీ మరియు దాని తరువాత మూడు దినాలు, అంటే 11, 12, 13 జు'ల్-'హజ్ తేదీలు. దాని మూడోవంతు మాంసాన్ని నిరుపేదలకు పంచటం విధి. ఈ 'జిబహ్ ఇస్మాయీల్ ('అ.స.) ను, అంతని తండ్రి ఇబ్రాహీమ్ ('అ.స.) - అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో - జి''బహ్ చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవటానికే. అంటే అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను శిరసావహించటమే ప్రతి ముస్లిం విధి. చూడండి, 37:102-107.
వచనం : 29
ثُمَّ لۡيَقۡضُواْ تَفَثَهُمۡ وَلۡيُوفُواْ نُذُورَهُمۡ وَلۡيَطَّوَّفُواْ بِٱلۡبَيۡتِ ٱلۡعَتِيقِ
తరువాత వారు హజ్జ్ ఆచారాలు(a) (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి.(b)
(a) అంటే 10వ జు'ల్-'హజ్ న చివరి షై'తైన్ (జమరతుల్ 'అఖబహ్)కు - ఏదైతే మక్కా వైపు ఉందో - ఏడు రవ్వలు రువ్వి, ఖుర్బానీ చేసి, తలవెంట్రుకలను కత్తిరించుకుంటే, అది త'హ్లీలె అవ్వల్ లేక చిన్న 'హలాల్ అవుతుంది. అంటే ఇ'బ్రాహీమ్ నిషేధాలన్నీ ముగిసిపోతాయి. కాని 'తవాఫ్ ఇఫాదా ('జ్యారహ్) చేసే వరకు భార్యతో సంభోగం చేయడం నిషిద్ధం. (b) 'తవాఫె 'జ్యారహ్ : ఇది విధి, తప్పక చేయవలసింది. ఇది 'అరఫాత్ నుండి బయలు దేరి 9-10 తేదీల మధ్య రాత్రి ము'జ్ దలిఫాలో గడిపి 10వ తేదీ ఉదయం చివరి షై'తాన్ (జమరతుల్ 'అఖబహ్) కు ఏడు రవ్వలు రువ్వి, 'ఖుర్బానీ ఇచ్చి తలవెంట్రుకలు కత్తిరించుకొని, ఇ'హ్రామ్ విడిచిన తరువాత మక్కాకు పోయి క'అబహ్ గృహం చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయటం. ఇది 10,11,12 జు'ల్-'హజ్ తేదీలలో పూర్తి చేయాలి. దీని తరువాత భార్యతో సంభోగం చేయవచ్చు. ఇది చివరి 'హలాల్. వివరాలకు చూడండి, 2:196-197.
వచనం : 30
ذَٰلِكَۖ وَمَن يُعَظِّمۡ حُرُمَٰتِ ٱللَّهِ فَهُوَ خَيۡرٞ لَّهُۥ عِندَ رَبِّهِۦۗ وَأُحِلَّتۡ لَكُمُ ٱلۡأَنۡعَٰمُ إِلَّا مَا يُتۡلَىٰ عَلَيۡكُمۡۖ فَٱجۡتَنِبُواْ ٱلرِّجۡسَ مِنَ ٱلۡأَوۡثَٰنِ وَٱجۡتَنِبُواْ قَوۡلَ ٱلزُّورِ
ఇదే (హజ్జ్)! మరియు ఎవడైతే అల్లాహ్ విధించిన నిషేధాలను (పవిత్ర నియమానలను) ఆదరిస్తాడో, అది అతని కొరకు, అతని ప్రభువు వద్ద ఎంతో మేలైనది. మరియు మీ కొరకు ఇది వరకు మీకు (నిషిద్ధమని) చెప్ప బడినవి తప్ప,(a) ఇతర పశువులన్నీ ధర్మ సమ్మతం చేయబడ్డాయి. ఇక మీరు విగ్రహారాధన వంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి మరియు అబద్ధపు (బూటకపు) మాటల నుండి కూడా దూరంగా ఉండండి.
(a) చూడండి, 5:3.

వచనం : 31
حُنَفَآءَ لِلَّهِ غَيۡرَ مُشۡرِكِينَ بِهِۦۚ وَمَن يُشۡرِكۡ بِٱللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ ٱلسَّمَآءِ فَتَخۡطَفُهُ ٱلطَّيۡرُ أَوۡ تَهۡوِي بِهِ ٱلرِّيحُ فِي مَكَانٖ سَحِيقٖ
ఏకాగ్రచిత్తంతో (ఏకదైవ సిద్ధాంతంతో)(a) అల్లాహ్ వైపునకే మరలండి. ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. అల్లాహ్ కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగుర గొట్టుకు పోవచ్చు!
(a) హునఫా': అంటే ఒకే వైపుకు మొగ్గటం. అంటే ఏకదైవ సిద్ధాంతాన్ని పాటించటం. ఆరాధనలను కేవలం ఆ ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకోవటం. ఇంకా చూడండి, 2:135.
వచనం : 32
ذَٰلِكَۖ وَمَن يُعَظِّمۡ شَعَٰٓئِرَ ٱللَّهِ فَإِنَّهَا مِن تَقۡوَى ٱلۡقُلُوبِ
ఇదే! మరియు ఎవడైతే, అల్లాహ్ నియమించిన చిహ్నాలను(a) గౌరవిస్తాడో, అది నిశ్చయంగా, హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే!
(a) ష'ఆఇరల్లాహ్: అల్లాహ్ నియమించిన చిహ్నాలు అంటే 'సఫా-మర్వాలు మరియు ఖుర్బానీ పశువులు మొదలైనవి. ఇంకా చూడండి, 5:2.
వచనం : 33
لَكُمۡ فِيهَا مَنَٰفِعُ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى ثُمَّ مَحِلُّهَآ إِلَى ٱلۡبَيۡتِ ٱلۡعَتِيقِ
ఒక నిర్ణీత కాలం వరకు మీకు వాటిలో (ఈ పశువులలో) లాభాలున్నాయి.(a) ఆ తరువాత వాటి గమ్యస్థానం ప్రాచీన గృహమే (కఅబహ్ యే)!
(a) అంటే ఖుర్బానీ పశువులను, జి''బహ్ చేయనంతవరకు వాటిని వినియోగించుకోవటం ధర్మసమ్మతమే! అంటే ఒకవేళ అది ఒంటె ఉంటే దానిపై ఎక్కి'హజ్ కు పోవచ్చు. ('స'హీ'హ్ బు'ఖారీ).
వచనం : 34
وَلِكُلِّ أُمَّةٖ جَعَلۡنَا مَنسَكٗا لِّيَذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّنۢ بَهِيمَةِ ٱلۡأَنۡعَٰمِۗ فَإِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞ فَلَهُۥٓ أَسۡلِمُواْۗ وَبَشِّرِ ٱلۡمُخۡبِتِينَ
మరియు ప్రతి సమాజానికి మేము ధర్మ ఆచారాలు (ఖుర్బానీ పద్ధతి)(a) నియమించి ఉన్నాము. మేము వారి జీవనోపాధి కొరకు ప్రసాదించిన పశువులను, వారు(వధించేటప్పుడు) అల్లాహ్ పేరును ఉచ్ఛరించాలి. ఎందుకంటే మీరందరి ఆరాధ్య దైవం ఆ ఏకైక దేవుడు (అల్లాహ్)! కావున మీరు ఆయనకు మాత్రమే విధేయులై (ముస్లింలై) ఉండండి. మరియు వినయ విధేయతలు గలవారికి శుభవార్తనివ్వు.
(a) అల్-మనాసికు: అంటే, విధేయత లేక ఆరాధన అంటే అల్లాహ్ (సు.తా.) సాన్నిధ్యం పొందటానికి, అల్లాహ్ (సు.తా.) ప్రీతి కొరకు అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞాపించిన ఆచారాలను పూర్తి చేయటం. అల్లాయేతరుల పేరుతో ఖుర్బానీ చేయటం నిషిద్ధం ('హరాం). 'హజ్ ఆచారాలు కూడా మనాసిక్ అనబడతాయి. దీని ఏకవచనం నుసుకున్.
వచనం : 35
ٱلَّذِينَ إِذَا ذُكِرَ ٱللَّهُ وَجِلَتۡ قُلُوبُهُمۡ وَٱلصَّٰبِرِينَ عَلَىٰ مَآ أَصَابَهُمۡ وَٱلۡمُقِيمِي ٱلصَّلَوٰةِ وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ
(వారికి) ఎవరి హృదయాలైతే, అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడినప్పుడు భయంతో వణికి పోతాయో మరియు ఆపదలలో సహనం వహిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో మరియు వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చు చేస్తారో!
వచనం : 36
وَٱلۡبُدۡنَ جَعَلۡنَٰهَا لَكُم مِّن شَعَٰٓئِرِ ٱللَّهِ لَكُمۡ فِيهَا خَيۡرٞۖ فَٱذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ عَلَيۡهَا صَوَآفَّۖ فَإِذَا وَجَبَتۡ جُنُوبُهَا فَكُلُواْ مِنۡهَا وَأَطۡعِمُواْ ٱلۡقَانِعَ وَٱلۡمُعۡتَرَّۚ كَذَٰلِكَ سَخَّرۡنَٰهَا لَكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ
ఖుర్బానీ పశువులను,(a) మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలుగా చేశాము; మీకు వాటిలో మేలున్నది. కావున వాటిని (ఖుర్బానీ కొరకు) నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అవి (ప్రాణం విడిచి) ప్రక్కల మీద పడిపోయిన తరువాత మీరు వాటిని తినండి.(b) మరియు యాచించని పేదలకు మరియు యాచించే పేదలకు కూడా తినిపించండి. ఈ విధంగా మేము వాటిని మీకు ఉపయుక్తంగా చేశాము, బహుశా మీరు కృతజ్ఞులవు తారేమోనని.
(a) బుద్ నున్, బదనతున్ యొక్క బహువచనం. అంటే బాగా బలసిన పశువు. సాధారణంగా ఈ శబ్దం ఒంటెలకే వాడబడుతుంది. కానీ 'హదీస్'ల ప్రకారం, ఖుర్బానీ కొరకు తేబడిన ఆవులు ఎడ్లు మొదలైన వాటిని సూచిస్తుంది. (b) అంటే వాటి రక్తం పూర్తిగా పారిన తరువాత అవి పూర్తిగా కదలకుండా పడిపోయిన తరువాత వాటిని తినండి. ఎందుకంటే సజీవిగా ఉన్న పశువు మాంసం తినటం నిషిద్ధం, (అబూ దావూద్, తిర్మిజీ'). 'ఖుర్బానీ పశువు మాంసం స్వయంగా తినటం కొందరు ధర్మవేత్తలు వాజిబ్ గా మరికొందరు ముస్తహబ్ గా ఖరారు చేశారు. 'ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలు చేయాలి. ఒక భాగం స్వంతం మరియు తన కుటుంబం వారికి రెండోది బంధుమిత్రులకు మరియు మూడోది పేదవారి కొరకు, (ముస్లిం, బు'ఖారీ). 'ఖుర్బానీ, 'హజ్ సమయంలోనే గాక, జు'ల్-'హజ్ పండుగ కొరకు కూడా చేయాలి 108:2, అంటే ఎవరు 'హజ్ యాత్రకు పోరో, వారు తమ ఇండ్లలో 10-12వ జు'ల్ 'హజ్ రోజులలో ఖుర్బానీ చేయాలి. ఇది 'ఈద్ నమాజ్ తరువాత చేయాలి, (స'హీహ్ బు'ఖారీ).
వచనం : 37
لَن يَنَالَ ٱللَّهَ لُحُومُهَا وَلَا دِمَآؤُهَا وَلَٰكِن يَنَالُهُ ٱلتَّقۡوَىٰ مِنكُمۡۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمۡ لِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡۗ وَبَشِّرِ ٱلۡمُحۡسِنِينَ
వాటి మాంసం గానీ, వాటి రక్తం గానీ అల్లాహ్ కు చేరవు! కానీ మీ భయభక్తులే ఆయనకు చేరుతాయి. మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ ఘనతను కొనియాడటానికి, ఈ విధంగా ఆయన వాటిని మీకు వశపరిచాడు. సజ్జనులకు శుభవార్తను వినిపించు!
వచనం : 38
۞ إِنَّ ٱللَّهَ يُدَٰفِعُ عَنِ ٱلَّذِينَ ءَامَنُوٓاْۗ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ كُلَّ خَوَّانٖ كَفُورٍ
నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏ విశ్వాస ఘాతకుణ్ణి మరియు కృతఘ్నుణ్ణి ప్రేమించడు.

వచనం : 39
أُذِنَ لِلَّذِينَ يُقَٰتَلُونَ بِأَنَّهُمۡ ظُلِمُواْۚ وَإِنَّ ٱللَّهَ عَلَىٰ نَصۡرِهِمۡ لَقَدِيرٌ
తమపై దాడి చేసిన వారితో యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడుతోంది.(a) ఎందుకంటే, వారు అన్యాయానికి గురి చేయ బడ్డారు. నిశ్చయంగా, అల్లాహ్ వారికి సహాయం చేయగల సమర్ధుడు.
(a) ఈ ఆయత్ లో, ఖుర్ఆన్ అవతరణలో, మొదటిసారి ఆత్మరక్షణ కొరకు యుద్ధపరిమితి ఇవ్వబడింది. అబ్దుల్లాహ్ ఇబ్నె 'అబ్బాస్ (ర'ది.'అ.) కథనం ప్రకారం ఈ ఆయత్ దైవప్రవక్త (సఅస) మక్కా నుండి మదీనా వలస పోయిన వెంటనే అవతరింపజేయబడింది. మొదటి హిజ్రీ మొదట్లో, దీని తరువాత రెండవ హిజ్రీలో ఆయత్ లు 2:190-193 అవతరింపజేయబడ్డాయి. ఆ తరువాత 2:216, 224 అవతరింపజేయబడ్డాయి.
వచనం : 40
ٱلَّذِينَ أُخۡرِجُواْ مِن دِيَٰرِهِم بِغَيۡرِ حَقٍّ إِلَّآ أَن يَقُولُواْ رَبُّنَا ٱللَّهُۗ وَلَوۡلَا دَفۡعُ ٱللَّهِ ٱلنَّاسَ بَعۡضَهُم بِبَعۡضٖ لَّهُدِّمَتۡ صَوَٰمِعُ وَبِيَعٞ وَصَلَوَٰتٞ وَمَسَٰجِدُ يُذۡكَرُ فِيهَا ٱسۡمُ ٱللَّهِ كَثِيرٗاۗ وَلَيَنصُرَنَّ ٱللَّهُ مَن يَنصُرُهُۥٓۚ إِنَّ ٱللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
వారికి ఎవరైతే కేవలం: "మా ప్రభువు అల్లాహ్!" అని అన్నందుకు మాత్రమే, అన్యాయంగా తమ ఇండ్ల నుండి తరిమి వేయబడ్డారో! ఒకవేళ అల్లాహ్ ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే(a) క్రైస్తవ సన్యాసుల మఠాలు, చర్చులు, యూదుల ప్రార్థనాలయాలు(b) మరియు మస్జిదులు, ఎక్కడైతే అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడుతుందో, అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవి.(c) నిశ్చయంగా తనకు తాను సహాయం చేసుకునే వానికి అల్లాహ్ తప్పకుండా సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు.
(a) ఇటువంటి వాక్యానికి చూడండి, 2:251 (b) యూదుల మాతాచారు (అ'హ్ బార్) లు తమ మత ధర్మాలను ఉపేదేశించే స్థలాలు, లేక యూదుల ప్రార్థనాలయాలు (సైనగోజెస్ / Synagogues) అనబడతాయి. (c ) ధర్మస్వాతంత్ర్యం కొరకు ఆయుధాలు ఎత్తుకోవడం అత్యవసరమైన పని. చూడండి, 2:193.
వచనం : 41
ٱلَّذِينَ إِن مَّكَّنَّٰهُمۡ فِي ٱلۡأَرۡضِ أَقَامُواْ ٱلصَّلَوٰةَ وَءَاتَوُاْ ٱلزَّكَوٰةَ وَأَمَرُواْ بِٱلۡمَعۡرُوفِ وَنَهَوۡاْ عَنِ ٱلۡمُنكَرِۗ وَلِلَّهِ عَٰقِبَةُ ٱلۡأُمُورِ
వారే! ఒకవేళ మేము వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే, వారు నమాజ్ స్థాపిస్తారు, విధిదానం (జకాత్) ఇస్తారు మరియు ధర్మమును (మంచిని) ఆదేశిస్తారు మరియు అధర్మము (చెడు) నుండి నిషేధిస్తారు.(a) సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లాహ్ చేతిలోనే వుంది.
(a) ఈ ఆయత్ లో ఇస్లామీయ రాజ్యం యొక్క మూలసూత్రాలు పేర్కొనబడ్డాయి. 1) నమా'జ్, 2) 'జకాత్, 3) మంచిని ఆదేశించడం లేక ప్రోత్సహించడం, 4) చెడును నిరోధించడం లేక నివారించడం మరియు 5) షరీయత్ ప్రకారం శిక్ష విధించడం మొదలైనవి. ఇటువంటి సూత్రాలు ఇప్పుడు స'ఊదీ 'అరేబియాలోనే అత్యధికంగా పాటించబడుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేని శాంతిభద్రతలు ఉన్నాయి. అల్లాహ్ (సు.తా.) దానిని భద్రపరచు గాక!
వచనం : 42
وَإِن يُكَذِّبُوكَ فَقَدۡ كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ وَعَادٞ وَثَمُودُ
మరియు (ఓ ముహమ్మద్!) వారు (సత్యతిరస్కారులు) ఒకవేళ నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే (ఆశ్చర్యపడకు); వాస్తవానికి, వారికి పూర్వం నూహ్, ఆద్ మరియు సమూద్ జాతుల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు;
వచనం : 43
وَقَوۡمُ إِبۡرَٰهِيمَ وَقَوۡمُ لُوطٖ
మరియు ఇబ్రాహీమ్ జాతివారు మరియు లూత్ జాతివారు;
వచనం : 44
وَأَصۡحَٰبُ مَدۡيَنَۖ وَكُذِّبَ مُوسَىٰۖ فَأَمۡلَيۡتُ لِلۡكَٰفِرِينَ ثُمَّ أَخَذۡتُهُمۡۖ فَكَيۡفَ كَانَ نَكِيرِ
మరియు మద్ యన్ వాసులు కూడాను! అంతేకాదు మూసా కూడా అసత్యవాదుడవని తిరస్కరించబడ్డాడు. కావున నేను సత్యతిరస్కారులకు (మొదట) కొంత వ్యవధినిచ్చి, తరువాత పట్టుకుంటాను. (చూశారా!) నన్ను తిరస్కరించడం వారి కొరకు ఎంత ఘోరమైనదిగా ఉండెనో!
వచనం : 45
فَكَأَيِّن مِّن قَرۡيَةٍ أَهۡلَكۡنَٰهَا وَهِيَ ظَالِمَةٞ فَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَبِئۡرٖ مُّعَطَّلَةٖ وَقَصۡرٖ مَّشِيدٍ
(ఈ విధంగా), మేము ఎన్నో పురాలను నాశనం చేశాము. ఎందుకంటే, వాటి (ప్రజలు) దుర్మార్గులై ఉండిరి. (ఈనాడు) అవి నాశనమై, తమ కప్పుల మీద తలక్రిందులై పడి వున్నాయి. వారి బావులు మరియు వారి దృఢమైన కోటలు కూడా పాడుపడి ఉన్నాయి!
వచనం : 46
أَفَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَتَكُونَ لَهُمۡ قُلُوبٞ يَعۡقِلُونَ بِهَآ أَوۡ ءَاذَانٞ يَسۡمَعُونَ بِهَاۖ فَإِنَّهَا لَا تَعۡمَى ٱلۡأَبۡصَٰرُ وَلَٰكِن تَعۡمَى ٱلۡقُلُوبُ ٱلَّتِي فِي ٱلصُّدُورِ
ఏమీ? వారు భూమిలో ప్రయాణం చేయరా? దానిని, వారి హృదయాలు (మనస్సులు) అర్థం చేసుకోగలగటానికి మరియు వారి చెవులు దానిని వినటానికి? వాస్తవమేమిటంటే వారి కన్నులైతే గ్రుడ్డివి కావు, కాని ఎదలలో ఉన్న హృదయాలే గ్రుడ్డివయి పోయాయి.

వచనం : 47
وَيَسۡتَعۡجِلُونَكَ بِٱلۡعَذَابِ وَلَن يُخۡلِفَ ٱللَّهُ وَعۡدَهُۥۚ وَإِنَّ يَوۡمًا عِندَ رَبِّكَ كَأَلۡفِ سَنَةٖ مِّمَّا تَعُدُّونَ
మరియు (ఓ ముహమ్మద్!) వారు నిన్ను శిక్ష కొరకు తొందర పెడుతున్నారు.(a) కాని అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్కల ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది.(b)
(a) చూడండి, 6:57, 8:32 మరియు 13:6. (b) మానవుల 'కాలగణనం' భూమి, సూర్యచంద్రుల సంచారంతో బంధింపబడివుంది. అల్లాహ్ (సు.తా.) కాలానికి పరిమితుడైనవాడు కాడు. ఆయన అంతర్యామి. ఆయనకు మొదలు, ముగింపు అనేవి లేవు. ఏవైతే కాలానికి సంబంధించినవో! ఇంకా చూడండి, 70:4. అక్కడ ఒక దినం ఏబది వేల సంవత్సరాలతో సమానమనబడింది. దీనిని సమర్థించటానికి ఎన్నో 'స'హీ'హ్ హదీస్'లున్నాయి. అల్లాహ్ (సు.తా.) అన్నాడు: 'నేనే కాలాన్ని (అద్దహ్ర్).'
వచనం : 48
وَكَأَيِّن مِّن قَرۡيَةٍ أَمۡلَيۡتُ لَهَا وَهِيَ ظَالِمَةٞ ثُمَّ أَخَذۡتُهَا وَإِلَيَّ ٱلۡمَصِيرُ
మరియు దుర్మార్గంలో మునిగివున్న ఎన్నో నగరాలకు నేను వ్యవధినిచ్చాను! తరువాత వాటిని (శిక్షించటానికి) పట్టుకున్నాను. (వారి) గమ్యస్థానం నా వైపునకే కదా!"
వచనం : 49
قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنَّمَآ أَنَا۠ لَكُمۡ نَذِيرٞ مُّبِينٞ
(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఓ మానవులారా! నేను కేవలం మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
వచనం : 50
فَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُم مَّغۡفِرَةٞ وَرِزۡقٞ كَرِيمٞ
కావున ఎవరైతే, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి. (a)
(a) చూడండి, 8:4.
వచనం : 51
وَٱلَّذِينَ سَعَوۡاْ فِيٓ ءَايَٰتِنَا مُعَٰجِزِينَ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡجَحِيمِ
కాని ఎవరైతే మా సూచనలను కించపరచటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్నివాసులవుతారు.
వచనం : 52
وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رَّسُولٖ وَلَا نَبِيٍّ إِلَّآ إِذَا تَمَنَّىٰٓ أَلۡقَى ٱلشَّيۡطَٰنُ فِيٓ أُمۡنِيَّتِهِۦ فَيَنسَخُ ٱللَّهُ مَا يُلۡقِي ٱلشَّيۡطَٰنُ ثُمَّ يُحۡكِمُ ٱللَّهُ ءَايَٰتِهِۦۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ
మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పంపిన ఏ సందేశహరుడు గానీ, లేదా ప్రవక్త గానీ (నా సందేశాన్ని ప్రజలకు) అందించగోరినపుడు, షైతాన్ అతని కోరికలను ఆటంక పరచకుండా ఉండలేదు.(a) కాని షైతాన్ కల్పించిన ఆటంకాలను అల్లాహ్ నిర్మూలించాడు. ఆ తరువాత అల్లాహ్ తన ఆయత్ లను స్థిరపరచాడు.(b) మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
(a) చూడండి, 6:112. (a) చూడండి, 11:1.
వచనం : 53
لِّيَجۡعَلَ مَا يُلۡقِي ٱلشَّيۡطَٰنُ فِتۡنَةٗ لِّلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡقَاسِيَةِ قُلُوبُهُمۡۗ وَإِنَّ ٱلظَّٰلِمِينَ لَفِي شِقَاقِۭ بَعِيدٖ
ఎవరి హృదయాలలో రోగముందో!(a) మరియు ఎవరి హృదయాలు కఠినమైనవో, వారికి షైతాన్ కల్పించేవి (సందేహాలు) ఒక పరీక్షగా చేయబడటానికి. మరియు నిశ్చయంగా ఈ దుర్మార్గులు విరోధంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
(a) చూడండి, 2:10
వచనం : 54
وَلِيَعۡلَمَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ أَنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّكَ فَيُؤۡمِنُواْ بِهِۦ فَتُخۡبِتَ لَهُۥ قُلُوبُهُمۡۗ وَإِنَّ ٱللَّهَ لَهَادِ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ
మరియు జ్ఞానమొసంగ బడినవారు ఇది (ఈ ఖుర్ఆన్) నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని తెలుసుకొని దానిని విశ్వసించటానికి, వారి హృదయాలు దానికి అంకితం అవటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించే వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శత్వం(a) చేస్తాడు.
(a) అల్-హాది: సేకరించబడిన పదం. Guide, Leader. మార్గదర్శకుడు, సన్మార్గం చూపువాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
వచనం : 55
وَلَا يَزَالُ ٱلَّذِينَ كَفَرُواْ فِي مِرۡيَةٖ مِّنۡهُ حَتَّىٰ تَأۡتِيَهُمُ ٱلسَّاعَةُ بَغۡتَةً أَوۡ يَأۡتِيَهُمۡ عَذَابُ يَوۡمٍ عَقِيمٍ
మరియు సత్యతిరస్కారులు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి - అకస్మాత్తుగా అంతిమ ఘడియ వచ్చేవరకు లేదా ఆ ఏకైక దినపు శిక్ష అవతరించే వరకు - సందేహంలో పడి ఉంటారు.(a)
(a) యౌమిన్ 'అ'ఖీమ్: అంటే గొడ్డుదినం. అంటే మళ్ళీ రాని ఏకైక దినం, పునరుత్థానం. చూ. 51:41.

వచనం : 56
ٱلۡمُلۡكُ يَوۡمَئِذٖ لِّلَّهِ يَحۡكُمُ بَيۡنَهُمۡۚ فَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ
ఆ రోజు సర్వాధిపత్యం అల్లాహ్ దే.(a) ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. కావున విశ్వసించి సత్కార్యాలు చేసేవారు పరమానందకరమైన స్వర్గవనాలలో ఉంటారు.
(a) చూడండి, 25:26 మరియు 40:16.
వచనం : 57
وَٱلَّذِينَ كَفَرُواْ وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَا فَأُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٞ مُّهِينٞ
కాని, ఎవరైతే సత్యతిరస్కారులై, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించారో, వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.
వచనం : 58
وَٱلَّذِينَ هَاجَرُواْ فِي سَبِيلِ ٱللَّهِ ثُمَّ قُتِلُوٓاْ أَوۡ مَاتُواْ لَيَرۡزُقَنَّهُمُ ٱللَّهُ رِزۡقًا حَسَنٗاۚ وَإِنَّ ٱللَّهَ لَهُوَ خَيۡرُ ٱلرَّٰزِقِينَ
ఎవరు అల్లాహ్ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా మరణిస్తారో వారికి అల్లాహ్ (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధిని ప్రసాదిస్తాడు.(a) నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే ఉత్తమ ఉపాధి ప్రదాత.
(a) ఎవరైతే అల్లాహ్ (సు.తా.) మార్గంలో వలసపోయి అక్కడ చంపబడతారో వారికి స్వర్గసుఖాలు లభిస్తాయి. ఇంకా చూడండి, 2:218 మరియు 4:95-96.
వచనం : 59
لَيُدۡخِلَنَّهُم مُّدۡخَلٗا يَرۡضَوۡنَهُۥۚ وَإِنَّ ٱللَّهَ لَعَلِيمٌ حَلِيمٞ
ఆయన వారిని వారు తృప్తిపడే స్థలంలో ప్రవేశింపజేస్తాడు.(a) మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు.
(a) స్వర్గసుఖాలు ఎలాంటి వంటే వాటిని ఇంత వరకు ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు మరియు ఏ మానవుడు కూడా ఊహించలేడు.
వచనం : 60
۞ ذَٰلِكَۖ وَمَنۡ عَاقَبَ بِمِثۡلِ مَا عُوقِبَ بِهِۦ ثُمَّ بُغِيَ عَلَيۡهِ لَيَنصُرَنَّهُ ٱللَّهُۚ إِنَّ ٱللَّهَ لَعَفُوٌّ غَفُورٞ
ఇదే (వారి పరిణామం!)(a) ఇక ఎవడైతే తనకు కలిగిన బాధకు సమానంగా మాత్రమే ప్రతీకారం తీసుకున్న(b) తరువాత అతనిపై మరల దౌర్జన్యం జరిగితే! నిశ్చయంగా అల్లాహ్ అతనికి సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మన్నించేవాడు, క్షమించేవాడు.(c)
(a) ఏ విశ్వాసులైతే వలసపోయి మరణిస్తారో! (b) చూడండి, 16:126 శత్రువు నుండి బాధ కలిగిన వానికి తనకు జరిగిన బాధకు సమానంగా ప్రతీకారం తీసుకునే హక్కు ఉంది. ఇలాంటి న్యాయ ప్రతీకారంలో అల్లాహ్ (సు.తా.) కూడా చాలా క్షమించేవాడు. (c) చూడండి, 2:190-193, ఒకవేళ క్షమిస్తే! అల్లాహ్ (సు.తా.) కూడా చాలా క్షమించేవాడు.
వచనం : 61
ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ يُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِ وَأَنَّ ٱللَّهَ سَمِيعُۢ بَصِيرٞ
ఇలాగే జరుగుతుంది! నిశ్చయంగా, అల్లాహ్ యే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేసే వాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేసేవాడు మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు.(a)
(a) చూడండి, 3:26-27 కాని అల్లాహ్ (సు.తా.) కోరితే దుర్మార్గులకు ప్రతీకారం కూడా చేయగలడు. అల్లాహ్ (సు.తా.) ప్రతిదీ చేయగల సమర్థుడు.
వచనం : 62
ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ
ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం!(a) మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).
(a) ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) ధర్మమే సత్యధర్మం, ఆయన ఆరాధనయే సత్య ఆరాధన, ఆయన వాగ్దనమే సత్యవాగ్దానం. ఆయన, తన స్నేహితులకు వారి శత్రువులకు విరుద్ధంగా సహాయపడటం కూడా సత్యమే! అల్లాహ్ (సు.తా.) తన ఉనికిలో తన కార్యసాధనలో, తన యోగ్యతలో సత్యవంతుడు.
వచనం : 63
أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَتُصۡبِحُ ٱلۡأَرۡضُ مُخۡضَرَّةًۚ إِنَّ ٱللَّهَ لَطِيفٌ خَبِيرٞ
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించి, దానితో భూమిని పచ్చగా చేస్తాడని? నిశ్చయంగా, అల్లాహ్ సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.
వచనం : 64
لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ وَإِنَّ ٱللَّهَ لَهُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ
ఆకాశాలలో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అంతా ఆయనకు చెందినదే. మరియు నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే స్వయం సమృద్ధుడు, ప్రశంసనీయుడు.

వచనం : 65
أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي ٱلۡأَرۡضِ وَٱلۡفُلۡكَ تَجۡرِي فِي ٱلۡبَحۡرِ بِأَمۡرِهِۦ وَيُمۡسِكُ ٱلسَّمَآءَ أَن تَقَعَ عَلَى ٱلۡأَرۡضِ إِلَّا بِإِذۡنِهِۦٓۚ إِنَّ ٱللَّهَ بِٱلنَّاسِ لَرَءُوفٞ رَّحِيمٞ
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ భూమిలో ఉన్న సమస్తాన్ని మీకు వశపరచాడు. మరియు సముద్రంలో పడవ ఆయన అనుమతితోనే నడుస్తుంది మరియు ఆయనే! తాను అనుమతించే వరకు ఆకాశాన్ని భూమి మీద పడకుండా నిలిపి ఉంచాడు.(a) నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత.
(a) అంటే నక్షత్రాలు మరియు గ్రహాలు పడిపోకుండా మరియు ఒక దానితో ఒకటి ఢీకొనకుండా ఉన్న గురుత్వాకర్షణ శక్తి (Gravitational Force) అల్లాహ్ (సు.తా.) ప్రసాదించినదే.
వచనం : 66
وَهُوَ ٱلَّذِيٓ أَحۡيَاكُمۡ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يُحۡيِيكُمۡۗ إِنَّ ٱلۡإِنسَٰنَ لَكَفُورٞ
మరియు ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు, తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. నిశ్చయంగా మానవుడు ఎంతో కృతఘ్నుడు!
వచనం : 67
لِّكُلِّ أُمَّةٖ جَعَلۡنَا مَنسَكًا هُمۡ نَاسِكُوهُۖ فَلَا يُنَٰزِعُنَّكَ فِي ٱلۡأَمۡرِۚ وَٱدۡعُ إِلَىٰ رَبِّكَۖ إِنَّكَ لَعَلَىٰ هُدٗى مُّسۡتَقِيمٖ
మేము ప్రతి సమాజం వారికి ఒక ఆరాధనా రీతిని నియమించాము.(a) వారు దానినే అనుసరిస్తారు. కావున వారిని ఈ విషయంలో నీతో వాదులాడనివ్వకు. మరియు వారిని నీ ప్రభువు వైపుకు ఆహ్వానించు. నిశ్చయంగా నీవు సరైన మార్గదర్శకత్వంలో ఉన్నావు.
(a) చూడండి, 5:48.
వచనం : 68
وَإِن جَٰدَلُوكَ فَقُلِ ٱللَّهُ أَعۡلَمُ بِمَا تَعۡمَلُونَ
ఒకవేళ వారు నీతో వాదులాటకు దిగితే, వారితో అను: "మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.(a)
(a) చూడండి, 10:41.
వచనం : 69
ٱللَّهُ يَحۡكُمُ بَيۡنَكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ
అల్లాహ్ పునరుత్థాన దినమున, మీరు పరస్పరం కలిగి ఉన్న అభిప్రాయ భేదాల గురించి తీర్పు చేస్తాడు."
వచనం : 70
أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.(a)
(a) ప్రతివాడు ఏమి కాబోతున్నాడు అనేది అల్లాహ్ కు తెలుసు కాబట్టి ఆయన సంభవించబోయేదంతా ఒక గ్రంథంలో వ్రాసి పెట్టాడు. ఇదే విధివ్రాత (ఖద్ర్). అంటే అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా మంచి లేక చెడు మార్గాలను అవలంబించటానికి బలవంతం చేయడు. 'స'హీ'హ్ ముస్లింలో ఉంది: 'అల్లాహ్ భూమ్యాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాలకు ముందు తన సృష్టి యొక్క విధి వ్రాసి పెట్టాడు. అప్పుడు ఆయన విశ్వసామ్రాజ్యాధిపత్య పీఠం ('అర్ష్) నీటిపై ఉండెను.'
వచనం : 71
وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ سُلۡطَٰنٗا وَمَا لَيۡسَ لَهُم بِهِۦ عِلۡمٞۗ وَمَا لِلظَّٰلِمِينَ مِن نَّصِيرٖ
మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తున్నారు. దాని కొరకు ఆయన ఎలాంటి నిదర్శనాన్ని అవతరింపజేయలేదు మరియు వారికి (సత్యతిరస్కారులకు) దానిని గురించి ఎలాంటి జ్ఞానం లేదు. మరియు దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు.(a)
(a) అంటే అల్లాహ్ (సు.తా.) ను విడిచి ఇతరులను ఆరాధించాలని, ఎలాంటి దివ్యజ్ఞానం గానీ, - వివేచనా బుద్ధితో ఆలోచిస్తే అర్థమయ్యే - నిదర్శనం గానీ ఈ సత్యతిరస్కారుల దగ్గర ఏదీ లేదు.
వచనం : 72
وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ تَعۡرِفُ فِي وُجُوهِ ٱلَّذِينَ كَفَرُواْ ٱلۡمُنكَرَۖ يَكَادُونَ يَسۡطُونَ بِٱلَّذِينَ يَتۡلُونَ عَلَيۡهِمۡ ءَايَٰتِنَاۗ قُلۡ أَفَأُنَبِّئُكُم بِشَرّٖ مِّن ذَٰلِكُمُۚ ٱلنَّارُ وَعَدَهَا ٱللَّهُ ٱلَّذِينَ كَفَرُواْۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ
మరియు మా స్పష్టమైన సూచనలు వారికి వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాల మీద తిరస్కారాన్ని నీవు గమనిస్తావు. ఇంకా వారు మా సూచనలను వినిపించే వారిపై దాదాపు విరుచుకు పడబోయే వారు. వారితో అను: "ఏమీ? నేను దీని కంటే ఘోరమైన విషయాన్ని గురించి మీకు తెలుపనా? అది నరకాగ్ని! అల్లాహ్ దానిని సత్యతిరస్కారులకు వాగ్దానం చేసి ఉన్నాడు. మరియు అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం."

వచనం : 73
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ضُرِبَ مَثَلٞ فَٱسۡتَمِعُواْ لَهُۥٓۚ إِنَّ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَن يَخۡلُقُواْ ذُبَابٗا وَلَوِ ٱجۡتَمَعُواْ لَهُۥۖ وَإِن يَسۡلُبۡهُمُ ٱلذُّبَابُ شَيۡـٔٗا لَّا يَسۡتَنقِذُوهُ مِنۡهُۚ ضَعُفَ ٱلطَّالِبُ وَٱلۡمَطۡلُوبُ
ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు.(a) ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు.
(a) ఇక్కడ మానవులు అల్లాహ్ (సు.తా.)ను వదలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అంటే, మూర్తులు, దర్గాలు, సన్యాసులు, దైవ అవతారులుగా భావించబడే వారు, అల్లాహ్ కుమారులుగా భావించబడేవారు, దైవదూతలు, ప్రవక్తలు మొదలైన వారంతా అని అర్థము.
వచనం : 74
مَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦٓۚ إِنَّ ٱللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
అల్లాహ్ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.
వచనం : 75
ٱللَّهُ يَصۡطَفِي مِنَ ٱلۡمَلَٰٓئِكَةِ رُسُلٗا وَمِنَ ٱلنَّاسِۚ إِنَّ ٱللَّهَ سَمِيعُۢ بَصِيرٞ
అల్లాహ్ దేవదూతల నుండి మానవుల నుండి తన సందేశహరులను ఎన్నుకుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు.
వచనం : 76
يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡۚ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ
ఆయనకు, వారికి ప్రత్యక్షంగా ఉన్నది మరియు వారికి పరోక్షంగా ఉన్నది అంతా తెలుసు. మరియు అన్ని వ్యవహారాలు (పరిష్కారానికి) అల్లాహ్ వైపునకే మరలింప బడతాయి.
వచనం : 77
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱرۡكَعُواْ وَٱسۡجُدُواْۤ وَٱعۡبُدُواْ رَبَّكُمۡ وَٱفۡعَلُواْ ٱلۡخَيۡرَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ۩
ఓ విశ్వాసులారా! (మీ ప్రభువు సన్నిధిలో) వంగండి (రుకూఉ చేయండి), సాష్టాంగం (సజ్దా) చేయండి మరియు మీ ప్రభువునే ఆరాధించండి మరియు మంచి పనులు చేయండి, అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు.
వచనం : 78
وَجَٰهِدُواْ فِي ٱللَّهِ حَقَّ جِهَادِهِۦۚ هُوَ ٱجۡتَبَىٰكُمۡ وَمَا جَعَلَ عَلَيۡكُمۡ فِي ٱلدِّينِ مِنۡ حَرَجٖۚ مِّلَّةَ أَبِيكُمۡ إِبۡرَٰهِيمَۚ هُوَ سَمَّىٰكُمُ ٱلۡمُسۡلِمِينَ مِن قَبۡلُ وَفِي هَٰذَا لِيَكُونَ ٱلرَّسُولُ شَهِيدًا عَلَيۡكُمۡ وَتَكُونُواْ شُهَدَآءَ عَلَى ٱلنَّاسِۚ فَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَٱعۡتَصِمُواْ بِٱللَّهِ هُوَ مَوۡلَىٰكُمۡۖ فَنِعۡمَ ٱلۡمَوۡلَىٰ وَنِعۡمَ ٱلنَّصِيرُ
మరియు అల్లాహ్ మార్గంలో పోరాడవలసిన విధంగా ధర్మపోరాటం చేయండి.(a) ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మరియు ఆయన ధర్మం విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇది మీ తండ్రి ఇబ్రాహీమ్ మతమే.(b) ఆయన మొదటి నుండి మీకు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అని పేరు పెట్టాడు. దీనికై మీ సందేశహరుడు మీకు సాక్షిగా ఉండటానికి మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండటానికి.(c) కావున నమాజ్ స్థాపించండి, విధి దానం (జకాత్) ఇవ్వండి. మరియు అల్లాహ్ తో గట్టి సంబంధం కలిగి ఉండండి, ఆయనే మీ సంరక్షకుడు, ఎంత శ్రేష్ఠమైన సంరక్షకుడు మరియు ఎంత ఉత్తమ సహాయకుడు!
(a) అల్-జిహాదు: ధర్మపోరాటం అంటే: 1) అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను పాలించటానికి, తన ఆత్మతో, 2) ష'తాన్ రేకెత్తించే ప్రేరణలతో, 3) ఆత్మరక్షణకు మరియు తన ధర్మాన్ని స్వేచ్ఛగా పాటిస్తూ, శాంతితో, దానిని ఇతరులకు బోధిస్తూ ఉంటే, ఆటంక పరిచే వారితో, చేసే ధర్మపోరాటం. (b) తండ్రి ఇబ్రాహీమ్, అంటే అతను దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) పూర్వికుడే కాక, ఏక దైవసిద్ధాంతాన్ని అనుసరించే వారందరి తండ్రి కూడాను. (c) ఈ సాక్ష్యాలు తీర్పుదినమున జరుగుతాయి. చూడండి, 2:143.
విజయవంతంగా పంపబడింది