పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం

Telugu translation - Abder-Rahim ibn Muhammad

Scan the qr code to link to this page

سورة قريش - సూరహ్ ఖురైష్

పేజీ నెంబరు

వచనం

ఖుర్ఆన్ వచనం చూపండి
పాదసూచిక చూపండి

వచనం : 1
لِإِيلَٰفِ قُرَيۡشٍ
(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటు పడ్డారు.
వచనం : 2
إِۦلَٰفِهِمۡ رِحۡلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيۡفِ
(అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు. (a)
(a) ఈలాఫున్: ఖురైషుల ముఖ్య వృత్తి వ్యాపారం వారు సీతాకాలంలో యమన్ కు మరియు వేసవి కాలంలో సిరియాకు వ్యాపారానికి పోయేవారు. వారు కా'బా నిర్వాహకులు కావటం వల్ల వారి వాణిజ్య బృందాలు ఎలాంటి ఆటంకం, అపాయం లేకుండా ప్రయాణం చేయగలిగేవి.
వచనం : 3
فَلۡيَعۡبُدُواْ رَبَّ هَٰذَا ٱلۡبَيۡتِ
కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి!(a)
(a) చూచూడండి, 2:125. అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడు అయిన అల్లాహ్ (సు.తా.) వారిని సురక్షితంగా వ్యాపారం చేయనిచ్చినందుకు వారు ఆయనను మాత్రమే ఆరాధించాలి. బహుదైవారాధనను త్యజించాలి.
వచనం : 4
ٱلَّذِيٓ أَطۡعَمَهُم مِّن جُوعٖ وَءَامَنَهُم مِّنۡ خَوۡفِۭ
వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. (a)
(a) వారిని ప్రమాదం నుండి కాపాడేవాడు మరియు వారిని పోషించేవాడు కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే కానీ - వారు పూజించే నిస్సహాయులైన - విగ్రహాలు గానీ, ఇతర కల్పిత దైవాలు గానీ కావు. గనుక వారు వాటి ఆరాధనను మానుకోవాలి. ఇంకా చూడండి, 2:126.
విజయవంతంగా పంపబడింది