آیت :
1
لَمۡ يَكُنِ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ وَٱلۡمُشۡرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأۡتِيَهُمُ ٱلۡبَيِّنَةُ
ఎంతవరకైతే స్పష్టమైన నిదర్శనం రాదో! అంత వరకు సత్యతిరస్కారులైన పూర్వగ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు (తమ సత్యతిరస్కారాన్ని) మానుకునేవారు కారు!(a)
آیت :
2
رَسُولٞ مِّنَ ٱللَّهِ يَتۡلُواْ صُحُفٗا مُّطَهَّرَةٗ
అల్లాహ్ తరఫు నుండి వచ్చిన సందేశహరుడు(a), వారికి పవిత్ర గ్రంథ పుటలను వినిపిస్తున్నాడు(b).
آیت :
3
فِيهَا كُتُبٞ قَيِّمَةٞ
అందులో సమంజసమైన వ్రాతలు (సత్యోపదేశాలు) ఉన్నాయి.(a)
آیت :
4
وَمَا تَفَرَّقَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَةُ
మరియు స్పష్టమైన సూచన వచ్చిన తర్వాతనే గ్రంథ ప్రజలు భేదాభిప్రాయలలో పడ్డారు.(a)
آیت :
5
وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُواْ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُواْ ٱلزَّكَوٰةَۚ وَذَٰلِكَ دِينُ ٱلۡقَيِّمَةِ
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో(a) తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము."
آیت :
6
إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ وَٱلۡمُشۡرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَآۚ أُوْلَٰٓئِكَ هُمۡ شَرُّ ٱلۡبَرِيَّةِ
నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.(a)
آیت :
7
إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ أُوْلَٰٓئِكَ هُمۡ خَيۡرُ ٱلۡبَرِيَّةِ
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు.