آیت :
1
ٱقۡرَأۡ بِٱسۡمِ رَبِّكَ ٱلَّذِي خَلَقَ
చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!(a)
آیت :
2
خَلَقَ ٱلۡإِنسَٰنَ مِنۡ عَلَقٍ
ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.(a)
آیت :
3
ٱقۡرَأۡ وَرَبُّكَ ٱلۡأَكۡرَمُ
చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.
آیت :
4
ٱلَّذِي عَلَّمَ بِٱلۡقَلَمِ
ఆయన కలం ద్వారా నేర్పాడు.(a)
آیت :
5
عَلَّمَ ٱلۡإِنسَٰنَ مَا لَمۡ يَعۡلَمۡ
మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.
آیت :
6
كَلَّآ إِنَّ ٱلۡإِنسَٰنَ لَيَطۡغَىٰٓ
అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.
آیت :
7
أَن رَّءَاهُ ٱسۡتَغۡنَىٰٓ
ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.
آیت :
8
إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجۡعَىٰٓ
నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.
آیت :
9
أَرَءَيۡتَ ٱلَّذِي يَنۡهَىٰ
నీవు నిరోధించే వ్యక్తిని చూశావా?(a)
آیت :
10
عَبۡدًا إِذَا صَلَّىٰٓ
నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి?(a)
آیت :
11
أَرَءَيۡتَ إِن كَانَ عَلَى ٱلۡهُدَىٰٓ
ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?
آیت :
12
أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ
ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?(a)
آیت :
13
أَرَءَيۡتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ
ఒకవేళ (ఆ నిరోధించే)(a) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?
آیت :
14
أَلَمۡ يَعۡلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ
వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?
آیت :
15
كَلَّا لَئِن لَّمۡ يَنتَهِ لَنَسۡفَعَۢا بِٱلنَّاصِيَةِ
అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము.(a)
آیت :
16
نَاصِيَةٖ كَٰذِبَةٍ خَاطِئَةٖ
అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు!
آیت :
17
فَلۡيَدۡعُ نَادِيَهُۥ
అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!
آیت :
18
سَنَدۡعُ ٱلزَّبَانِيَةَ
మేము కూడా నరక దూతలను పిలుస్తాము!
آیت :
19
كَلَّا لَا تُطِعۡهُ وَٱسۡجُدۡۤ وَٱقۡتَرِب۩
అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు!