د قرآن کریم د معناګانو ژباړه

تلغویي ژباړه - عبد الرحیم بن محمد

Scan the qr code to link to this page

سورة المطففين - సూరహ్ అల్-ముతఫ్ఫిఫీన్

د مخ نمبر

آیت

د آیت د متن ښودل
د حاشيې ښودل

آیت : 1
وَيۡلٞ لِّلۡمُطَفِّفِينَ
కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.
آیت : 2
ٱلَّذِينَ إِذَا ٱكۡتَالُواْ عَلَى ٱلنَّاسِ يَسۡتَوۡفُونَ
వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.
آیت : 3
وَإِذَا كَالُوهُمۡ أَو وَّزَنُوهُمۡ يُخۡسِرُونَ
మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.(a)
(a) ఒక 'హదీస్'లో ఇలా ఉంది: "ఏ సమాజం వారైతే కొలతలలో మరియు తూనికలలో తగ్గిస్తారో! వారిపై కరువు మరియు పరిపాలకుల ఆగడాలు విరుచుకు పడతాయి." (ఇబ్నె - మాజా - అల్బానీ దీనిని 'స'హీ'హ్ గా ప్రమాణీకరించారు) ఈ మూడు ఆయతులు అన్ని రకాల మోసాలను ఖండిస్తున్నాయి.
آیت : 4
أَلَا يَظُنُّ أُوْلَٰٓئِكَ أَنَّهُم مَّبۡعُوثُونَ
ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?
آیت : 5
لِيَوۡمٍ عَظِيمٖ
ఒక గొప్ప దినమున!
آیت : 6
يَوۡمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ
సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు.(a)
(a) ఇది వారే చేస్తారు, ఎవరైతే పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) ముందు నిలబడవలసి ఉందని నమ్మరో! వారికి అల్లాహ్ (సు.తా.) భయం లేదు, ('స'హీ'హ్ బు'ఖారీ).

آیت : 7
كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلۡفُجَّارِ لَفِي سِجِّينٖ
అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది.
آیت : 8
وَمَآ أَدۡرَىٰكَ مَا سِجِّينٞ
ఆ సిజ్జీన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?
آیت : 9
كِتَٰبٞ مَّرۡقُومٞ
వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం.(a)
(a) చూసిజ్జీన్, అంటే కారాగారం. ఇక్కడ చెరిగిపోకుండా నష్టం కాకుండా వ్రాసి పెట్టబడిన గ్రంథమని అర్థం.
آیت : 10
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది.
آیت : 11
ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوۡمِ ٱلدِّينِ
వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో!
آیت : 12
وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعۡتَدٍ أَثِيمٍ
మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు.
آیت : 13
إِذَا تُتۡلَىٰ عَلَيۡهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ
మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.
آیت : 14
كَلَّاۖ بَلۡۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُواْ يَكۡسِبُونَ
అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది.(a)
(a) రానా: అంటే పాపాల వల్ల హృదయం మీద ఏర్పడే మచ్చ. 'హదీస్'లో ఇలా ఉంది: "మానవుడు పాపం చేసినపుడు అతని హృదయం మీద ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఒకవేళ అతడు పశ్చాత్తాప పడి ఆ పాపం మరల చేయకుంటే అది దూరమై పోతుంది. ఒకవేళ అతడు పాపం మీద పాపం చేస్తూ ఉంటే ఆ నల్లమచ్చ పెరుగుతుంది. చివరకు అది అతని హృదయం మీద పూర్తిగా క్రమ్ముకొంటుంది. అదే 'రానా' అని పేర్కొనబడినది." (తిర్మిజీ', ఇబ్నె-మాజా, ముస్నద్ అ'హ్మద్).
آیت : 15
كَلَّآ إِنَّهُمۡ عَن رَّبِّهِمۡ يَوۡمَئِذٖ لَّمَحۡجُوبُونَ
అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింప బడతారు.
آیت : 16
ثُمَّ إِنَّهُمۡ لَصَالُواْ ٱلۡجَحِيمِ
తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు.
آیت : 17
ثُمَّ يُقَالُ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
అప్పుడు వారితో: "దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది.
آیت : 18
كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلۡأَبۡرَارِ لَفِي عِلِّيِّينَ
అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది.(a)
(a) 'ఇల్లియ్యూన్, 'ఉలువ్వున్: ఎత్తైన స్థలం. ఇది సిజ్జీన్ కు విరుద్ధ పదం. ఇది ఆకాశాలలో, స్వర్గంలో సిద్ రతుల్ మున్ తహా, లేక 'అర్ష్ దగ్గర ఉన్నచోటు. అక్కడ పుణ్యాత్ముల కరపత్రాలు భద్రపరచబడి ఉంటాయి.
آیت : 19
وَمَآ أَدۡرَىٰكَ مَا عِلِّيُّونَ
మరి ఆ ఇల్లియ్యూన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?
آیت : 20
كِتَٰبٞ مَّرۡقُومٞ
అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం.
آیت : 21
يَشۡهَدُهُ ٱلۡمُقَرَّبُونَ
దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు.(a)
(a) యష్ హదు: అంటే ఇక్కడ పర్యవేక్షిస్తుంటారు. అనే అర్థం కూడా వస్తుంది.
آیت : 22
إِنَّ ٱلۡأَبۡرَارَ لَفِي نَعِيمٍ
నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు.
آیت : 23
عَلَى ٱلۡأَرَآئِكِ يَنظُرُونَ
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ.(a)
(a) చూడండి, 75:23.
آیت : 24
تَعۡرِفُ فِي وُجُوهِهِمۡ نَضۡرَةَ ٱلنَّعِيمِ
వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు.
آیت : 25
يُسۡقَوۡنَ مِن رَّحِيقٖ مَّخۡتُومٍ
సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది.(a)
(a) ర'హీఖున్: స్వచ్ఛమైన, తేటైన, ఉత్తమమైన, మధురమైన పానీయం, అందులో ఎట్టి కల్తీ ఉండదు. మ'ఖ్తూమున్: సీలు చేయబడినది. దాని స్వచ్ఛతకు హామీగా. కొందరు 'ఖితామున్ - అంటే సువాసన అంటారు. దాని సువాసన కస్తూరి వలే ఉంటుంది. (ఇబ్నె-కసీ'ర్). 'హదీస్'లో ఉంది: "ఏ విశ్వాసుడైతే, దప్పికగొన్న విశ్వాసునికి నీరు త్రాపుతాడో పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) అతనికి ర'హీఖ్ అల్-మ'ఖ్తూమ్ త్రాపుతాడు మరియు అన్నం పెట్టిన వాడికి స్వర్గపు ఫలాలు తినిపిస్తాడు. మరియు వస్త్రాలు ఇచ్చే వానికి స్వర్గపు వస్త్రాలు ప్రసాదిస్తాడు." (ముస్నద్ అ'హ్మద్, 3/13-14)
آیت : 26
خِتَٰمُهُۥ مِسۡكٞۚ وَفِي ذَٰلِكَ فَلۡيَتَنَافَسِ ٱلۡمُتَنَٰفِسُونَ
దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి.
آیت : 27
وَمِزَاجُهُۥ مِن تَسۡنِيمٍ
మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది.(a)
(a) తస్నీమున్: ఎత్తైన స్థలం, ఆ పానీయం స్వర్గపు ఎత్తైన ప్రదేశం నుండి చెలమల ద్వారా వస్తుంది.
آیت : 28
عَيۡنٗا يَشۡرَبُ بِهَا ٱلۡمُقَرَّبُونَ
అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు.(a)
(a) చూడండి, 76:5-6.
آیت : 29
إِنَّ ٱلَّذِينَ أَجۡرَمُواْ كَانُواْ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ يَضۡحَكُونَ
వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.
آیت : 30
وَإِذَا مَرُّواْ بِهِمۡ يَتَغَامَزُونَ
మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు.
آیت : 31
وَإِذَا ٱنقَلَبُوٓاْ إِلَىٰٓ أَهۡلِهِمُ ٱنقَلَبُواْ فَكِهِينَ
మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.
آیت : 32
وَإِذَا رَأَوۡهُمۡ قَالُوٓاْ إِنَّ هَٰٓؤُلَآءِ لَضَآلُّونَ
మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు.
آیت : 33
وَمَآ أُرۡسِلُواْ عَلَيۡهِمۡ حَٰفِظِينَ
మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు!
آیت : 34
فَٱلۡيَوۡمَ ٱلَّذِينَ ءَامَنُواْ مِنَ ٱلۡكُفَّارِ يَضۡحَكُونَ
కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు.

آیت : 35
عَلَى ٱلۡأَرَآئِكِ يَنظُرُونَ
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు):
آیت : 36
هَلۡ ثُوِّبَ ٱلۡكُفَّارُ مَا كَانُواْ يَفۡعَلُونَ
"ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?"
په کامیابۍ سره ولیږل شو