آیت :
1
يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ لِمَ تُحَرِّمُ مَآ أَحَلَّ ٱللَّهُ لَكَۖ تَبۡتَغِي مَرۡضَاتَ أَزۡوَٰجِكَۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ
ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు?(a) నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
آیت :
2
قَدۡ فَرَضَ ٱللَّهُ لَكُمۡ تَحِلَّةَ أَيۡمَٰنِكُمۡۚ وَٱللَّهُ مَوۡلَىٰكُمۡۖ وَهُوَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ
వాస్తవానికి అల్లాహ్ మీ ప్రమాణాల పరిహార పద్ధతి మీకు నిర్దేశించాడు(a). మరియు అల్లాహ్ యే మీ యజమాని. మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
آیت :
3
وَإِذۡ أَسَرَّ ٱلنَّبِيُّ إِلَىٰ بَعۡضِ أَزۡوَٰجِهِۦ حَدِيثٗا فَلَمَّا نَبَّأَتۡ بِهِۦ وَأَظۡهَرَهُ ٱللَّهُ عَلَيۡهِ عَرَّفَ بَعۡضَهُۥ وَأَعۡرَضَ عَنۢ بَعۡضٖۖ فَلَمَّا نَبَّأَهَا بِهِۦ قَالَتۡ مَنۡ أَنۢبَأَكَ هَٰذَاۖ قَالَ نَبَّأَنِيَ ٱلۡعَلِيمُ ٱلۡخَبِيرُ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు(a) రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు(b) చెప్పింది. మరియు అల్లాహ్ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి, మరికొంత తెలుపలేదు. ఇక అతను (ప్రవక్త, మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయట పడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలా అడిగింది: "ఇది నీకు ఎవరు తెలిపారు?" అతను జవాబిచ్చాడు: "నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు(c)."
آیت :
4
إِن تَتُوبَآ إِلَى ٱللَّهِ فَقَدۡ صَغَتۡ قُلُوبُكُمَاۖ وَإِن تَظَٰهَرَا عَلَيۡهِ فَإِنَّ ٱللَّهَ هُوَ مَوۡلَىٰهُ وَجِبۡرِيلُ وَصَٰلِحُ ٱلۡمُؤۡمِنِينَۖ وَٱلۡمَلَٰٓئِكَةُ بَعۡدَ ذَٰلِكَ ظَهِيرٌ
(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): "ఒకవేళ మీరిద్దరూ అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే) వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగిపోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగా పోతే! నిశ్చయంగా, అల్లాహ్ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి)."
آیت :
5
عَسَىٰ رَبُّهُۥٓ إِن طَلَّقَكُنَّ أَن يُبۡدِلَهُۥٓ أَزۡوَٰجًا خَيۡرٗا مِّنكُنَّ مُسۡلِمَٰتٖ مُّؤۡمِنَٰتٖ قَٰنِتَٰتٖ تَٰٓئِبَٰتٍ عَٰبِدَٰتٖ سَٰٓئِحَٰتٖ ثَيِّبَٰتٖ وَأَبۡكَارٗا
ఒకవేళ అతను (ముహమ్మద్!) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్, మీకు బదులుగా, మీకంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించగలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తిపరులు, పశ్చాత్తాప పడేవారు, (అల్లాహ్ ను) ఆరాధించేవారు, వలస పోయే (ఉపవాసాలు చేసే)(a) వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు!(b)
آیت :
6
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ قُوٓاْ أَنفُسَكُمۡ وَأَهۡلِيكُمۡ نَارٗا وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُ عَلَيۡهَا مَلَٰٓئِكَةٌ غِلَاظٞ شِدَادٞ لَّا يَعۡصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمۡ وَيَفۡعَلُونَ مَا يُؤۡمَرُونَ
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి(a)! దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దేవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.
آیت :
7
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ كَفَرُواْ لَا تَعۡتَذِرُواْ ٱلۡيَوۡمَۖ إِنَّمَا تُجۡزَوۡنَ مَا كُنتُمۡ تَعۡمَلُونَ
ఓ సత్యతిరస్కారులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. నిశ్చయంగా, మీరు చేస్తూ ఉండిన కర్మలకు, తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది.