آیت :
154
مَا لَكُمۡ كَيۡفَ تَحۡكُمُونَ
మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?
آیت :
155
أَفَلَا تَذَكَّرُونَ
ఏమీ? మీరు గ్రహించలేరా?
آیت :
156
أَمۡ لَكُمۡ سُلۡطَٰنٞ مُّبِينٞ
లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా?
آیت :
157
فَأۡتُواْ بِكِتَٰبِكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ
మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి!
آیت :
158
وَجَعَلُواْ بَيۡنَهُۥ وَبَيۡنَ ٱلۡجِنَّةِ نَسَبٗاۚ وَلَقَدۡ عَلِمَتِ ٱلۡجِنَّةُ إِنَّهُمۡ لَمُحۡضَرُونَ
మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు.(a) కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని!
آیت :
159
سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ
వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)!(a)
آیت :
160
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلۡمُخۡلَصِينَ
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
آیت :
161
فَإِنَّكُمۡ وَمَا تَعۡبُدُونَ
ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి);
آیت :
162
مَآ أَنتُمۡ عَلَيۡهِ بِفَٰتِنِينَ
ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు;
آیت :
163
إِلَّا مَنۡ هُوَ صَالِ ٱلۡجَحِيمِ
భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప!
آیت :
164
وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٞ مَّعۡلُومٞ
(దైవదూతలు ఇలా అంటారు): "మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు.
آیت :
165
وَإِنَّا لَنَحۡنُ ٱلصَّآفُّونَ
మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము.
آیت :
166
وَإِنَّا لَنَحۡنُ ٱلۡمُسَبِّحُونَ
మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే!(a)
آیت :
167
وَإِن كَانُواْ لَيَقُولُونَ
మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు:
آیت :
168
لَوۡ أَنَّ عِندَنَا ذِكۡرٗا مِّنَ ٱلۡأَوَّلِينَ
"ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే!"
آیت :
169
لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلۡمُخۡلَصِينَ
"మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము!"
آیت :
170
فَكَفَرُواْ بِهِۦۖ فَسَوۡفَ يَعۡلَمُونَ
కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు!
آیت :
171
وَلَقَدۡ سَبَقَتۡ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلۡمُرۡسَلِينَ
మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది;
آیت :
172
إِنَّهُمۡ لَهُمُ ٱلۡمَنصُورُونَ
నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని!
آیت :
173
وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلۡغَٰلِبُونَ
మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని!(a)
آیت :
174
فَتَوَلَّ عَنۡهُمۡ حَتَّىٰ حِينٖ
కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు.
آیت :
175
وَأَبۡصِرۡهُمۡ فَسَوۡفَ يُبۡصِرُونَ
మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
آیت :
176
أَفَبِعَذَابِنَا يَسۡتَعۡجِلُونَ
ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా?
آیت :
177
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمۡ فَسَآءَ صَبَاحُ ٱلۡمُنذَرِينَ
కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు!
آیت :
178
وَتَوَلَّ عَنۡهُمۡ حَتَّىٰ حِينٖ
కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు;
آیت :
179
وَأَبۡصِرۡ فَسَوۡفَ يُبۡصِرُونَ
మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
آیت :
180
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ
నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు.
آیت :
181
وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ
మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)!
آیت :
182
وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ
మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు!