آیت :
20
أَلَمۡ تَرَوۡاْ أَنَّ ٱللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ وَأَسۡبَغَ عَلَيۡكُمۡ نِعَمَهُۥ ظَٰهِرَةٗ وَبَاطِنَةٗۗ وَمِنَ ٱلنَّاسِ مَن يُجَٰدِلُ فِي ٱللَّهِ بِغَيۡرِ عِلۡمٖ وَلَا هُدٗى وَلَا كِتَٰبٖ مُّنِيرٖ
ఏమీ? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడనీ(a) మరియు ఆయన బహిరంగంగానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను, మీకు ప్రసాదించాడనీ, మీకు తెలియదా? మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లాహ్ ను గురించి వాదులాడే వారున్నారు!
آیت :
21
وَإِذَا قِيلَ لَهُمُ ٱتَّبِعُواْ مَآ أَنزَلَ ٱللَّهُ قَالُواْ بَلۡ نَتَّبِعُ مَا وَجَدۡنَا عَلَيۡهِ ءَابَآءَنَآۚ أَوَلَوۡ كَانَ ٱلشَّيۡطَٰنُ يَدۡعُوهُمۡ إِلَىٰ عَذَابِ ٱلسَّعِيرِ
మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన దానిని అనుసరించండి!" అని అన్నప్పుడు, వారు: "కాదు మా తండ్రితాతలు నడిచిన మార్గాన్నే మేము అనుసరిస్తాము." అని అంటారు. ఏమీ? షైతాన్ వారిని భగభగమండే అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నప్పటికీ, (వారు అలాంటి మార్గాన్నే అనుసరిస్తారా)?(a)
آیت :
22
۞ وَمَن يُسۡلِمۡ وَجۡهَهُۥٓ إِلَى ٱللَّهِ وَهُوَ مُحۡسِنٞ فَقَدِ ٱسۡتَمۡسَكَ بِٱلۡعُرۡوَةِ ٱلۡوُثۡقَىٰۗ وَإِلَى ٱللَّهِ عَٰقِبَةُ ٱلۡأُمُورِ
ఎవడైతే, తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని(a) సజ్జనుడై ఉంటాడో, అలాంటి వాడు నిస్సందేహంగా దృఢమైన ఆధారాన్ని పట్టుకున్నవాడే! మరియు సకల వ్యవహారాల ముగింపు (తీర్పు) అల్లాహ్ వద్దనే ఉంది.
آیت :
23
وَمَن كَفَرَ فَلَا يَحۡزُنكَ كُفۡرُهُۥٓۚ إِلَيۡنَا مَرۡجِعُهُمۡ فَنُنَبِّئُهُم بِمَا عَمِلُوٓاْۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ
మరియు సత్యాన్ని తిరస్కరించేవాని, తిరస్కారం నిన్ను దుఃఖానికి గురి చేయకూడదు. వారందరి మరలింపు మా వైపునకే ఉంది; అప్పుడు మేము వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాము. నిశ్చయంగా, అల్లాహ్ కు హృదయాలలో ఉన్న విషయాలు సైతం బాగా తెలుసు.
آیت :
24
نُمَتِّعُهُمۡ قَلِيلٗا ثُمَّ نَضۡطَرُّهُمۡ إِلَىٰ عَذَابٍ غَلِيظٖ
మేము వారిని కొంత కాలం సుఖాలను అనుభవించనిస్తాము. ఆ తరువాత మేము వారిని కఠినమైన శిక్ష వైపుకు త్రోస్తాము.
آیت :
25
وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ ٱللَّهُۚ قُلِ ٱلۡحَمۡدُ لِلَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ
ఒకవేళ మీరు వారిని: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించింది ఎవరు?" అని అడిగితే! వారు నిస్సంకోచంగా అంటారు: "అల్లాహ్!" అని. వారితో అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే!" కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు.
آیت :
26
لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ
ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ కే చెందుతుంది. నిశ్చయంగా, అల్లాహ్! కేవలం ఆయనే సర్వసంపన్నుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.
آیت :
27
وَلَوۡ أَنَّمَا فِي ٱلۡأَرۡضِ مِن شَجَرَةٍ أَقۡلَٰمٞ وَٱلۡبَحۡرُ يَمُدُّهُۥ مِنۢ بَعۡدِهِۦ سَبۡعَةُ أَبۡحُرٖ مَّا نَفِدَتۡ كَلِمَٰتُ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ
ఒకవేళ వాస్తవానికి, భూమిలో ఉన్న వృక్షాలన్నీ కలములై ఈ సముద్రం మరియు దానితో పాటు అటువంటి ఏడు సముద్రాల (నీళ్ళంతా) సిరాగా ఉన్నా, అల్లాహ్ మాటలు (సూచనలు వ్రాయటానికి) పూర్తి కావు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.(a)
آیت :
28
مَّا خَلۡقُكُمۡ وَلَا بَعۡثُكُمۡ إِلَّا كَنَفۡسٖ وَٰحِدَةٍۚ إِنَّ ٱللَّهَ سَمِيعُۢ بَصِيرٌ
మీ అందరినీ సృష్టించటం మరియు తిరిగి (సజీవులుగా) లేపటం ఆయనకు ఒక మానవుణ్ణి (సృష్టించి, తిరిగి లేపడం వంటిదే). నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వ చూసేవాడు.