د قرآن کریم د معناګانو ژباړه

تلغویي ژباړه - عبد الرحیم بن محمد

Scan the qr code to link to this page

سورة طه - సూరహ్ తహా

د مخ نمبر

آیت

د آیت د متن ښودل
د حاشيې ښودل

آیت : 1
طه
తాహా!
آیت : 2
مَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡقُرۡءَانَ لِتَشۡقَىٰٓ
మేము ఈ ఖుర్ఆన్ ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి కాదు.(a)
(a) చూడండి, 18:6.
آیت : 3
إِلَّا تَذۡكِرَةٗ لِّمَن يَخۡشَىٰ
కేవలం (అల్లాహ్ కు) భయపడే వారికి హితబోధ చేయటానికే!
آیت : 4
تَنزِيلٗا مِّمَّنۡ خَلَقَ ٱلۡأَرۡضَ وَٱلسَّمَٰوَٰتِ ٱلۡعُلَى
ఇది (ఈ ఖుర్ఆన్) భూమినీ మరియు అత్యున్నతమైన ఆకాశాలనూ సృష్టించిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి క్రమక్రమంగా అవతరింపజేయబడింది.
آیت : 5
ٱلرَّحۡمَٰنُ عَلَى ٱلۡعَرۡشِ ٱسۡتَوَىٰ
ఆ కరుణామయుడు, సింహాసనం (అర్ష్)పై ఆసీనుడై ఉన్నాడు.(a)
(a) తన గొప్పతనానికి అనుగుణంగా అల్లాహ్ (సు.తా.) 'అర్ష్ (విశ్వసామ్రాజ్యాధిపత్య పీఠం)పై అధిష్ఠుడై ఉన్నాడు. కాని ఎట్లు, ఏ విధంగా ఎవ్వరికీ తెలియదు.
آیت : 6
لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا وَمَا تَحۡتَ ٱلثَّرَىٰ
ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ మరియు ఆ రెండింటి మధ్యనూ, ఇంకా నేల క్రిందనూ ఉన్న,(a) సమస్తమూ ఆయనకు చెందినదే.
(a) అస్-స'రా: అంటే భూమిలోని లోతైన భాగంలో, అంటే సర్వం ఆయనకు చెందిందే!
آیت : 7
وَإِن تَجۡهَرۡ بِٱلۡقَوۡلِ فَإِنَّهُۥ يَعۡلَمُ ٱلسِّرَّ وَأَخۡفَى
మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే (ఆయన విననే వింటాడు); వాస్తవానికి, ఆయనకు రహస్యంగా (చెప్పుకునే మాటలే గాక) అతి గోప్యమైన మాటలు కూడా, తెలుస్తాయి.(a)
(a) అల్లాహ్ (సు.తా.) ను పెద్ద స్వరంతో అర్థించే అవసరం లేదు. ఎందుకంటే ఆయన అతి రహస్య విషయాలను కూడా తెలుసుకుంటాడు. ఆయనకు మానవుల భవిష్యత్తు కూడా తెలుసు. అది ఆయన దగ్గర వ్రాయబడి ఉంది! ఆయనకు జరిగిపోయిందే గాక, జరుగుతున్నది మరియు ముందు జరగబోయేది అన్నీ తెలుసు. అంటే పునరుత్థాన దినం వరకు మరియు ఆ తరువాత కూడా ఎల్లప్పుడూ జరుగబోయే అన్ని విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ (సు.తా.) కే ఉంది మరియు ఇతరులకు ఎవ్వరికీ లేదు. అంటే దైవప్రవక్తలు, దైవదూత ('అలైహిమ్.స.)లకు మరియు జిన్నాతులకు కూడా లేదు.
آیت : 8
ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ لَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అత్యుత్తమమైన పేర్లు ఉన్నాయి.(a)
(a) "అల్లాహ్ (సు.తా.) యొక్క అత్యుత్తమ పేర్లు" (అల్-అస్మాఉ'ల్-'హుస్నా). ఈ శబ్దం ఖుర్ఆన్ లో నాల్గుసార్లు వచ్చింది. 7:180, 17:110, 59:24 మరియు ఇక్కడ.
آیت : 9
وَهَلۡ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ
ఇక మూసా వృత్తాంతం నీకు అందిందా? (a)
(a) మూసా (అ.స.) వృత్తాంతం, 7, 17, 18 మరియు 28 సూరాహ్ లలో వచ్చింది. ఈ సూరహ్ లో 9-98 ఆయత్ లలో కొన్ని వివరాలున్నాయి.
آیت : 10
إِذۡ رَءَا نَارٗا فَقَالَ لِأَهۡلِهِ ٱمۡكُثُوٓاْ إِنِّيٓ ءَانَسۡتُ نَارٗا لَّعَلِّيٓ ءَاتِيكُم مِّنۡهَا بِقَبَسٍ أَوۡ أَجِدُ عَلَى ٱلنَّارِ هُدٗى
అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు:(a) "ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొని వస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు!"
(a) మూసా ('అ.స.) కొన్ని సంవత్సరాలు ఆయ్ కహ్ లో గడిపిన తరువాత - తన భార్యా పిల్లలతో సహా - తన తల్లి, సోదరుడు హారూన్ ('అ.స.) మరియు తన జాతి వారి వద్దకు వెళ్ళటానికి బయలుదేరుతారు. సినాయి ద్వీపకల్పం దక్షిణ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విషయం సంభవిస్తుంది. ఇంకా చూడండి, 27:78 మరియు 28:29.
آیت : 11
فَلَمَّآ أَتَىٰهَا نُودِيَ يَٰمُوسَىٰٓ
అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు:(a) "ఓ మూసా!
(a) మూసా ('అ.స.) అక్కడికి చేరుకున్న తరువాత ఒక వృక్షం వెలుగుతో నిండి ఉంటుంది. దాని నుండి ఈ విధంగా పిలువబడతారు. చూడండి, 28:30.
آیت : 12
إِنِّيٓ أَنَا۠ رَبُّكَ فَٱخۡلَعۡ نَعۡلَيۡكَ إِنَّكَ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوٗى
నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా(a) లోయలో ఉన్నావు.
(a) 'తువా - ఆ లోయ పేరు.

آیت : 13
وَأَنَا ٱخۡتَرۡتُكَ فَٱسۡتَمِعۡ لِمَا يُوحَىٰٓ
మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను.
آیت : 14
إِنَّنِيٓ أَنَا ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدۡنِي وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكۡرِيٓ
నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు.
آیت : 15
إِنَّ ٱلسَّاعَةَ ءَاتِيَةٌ أَكَادُ أُخۡفِيهَا لِتُجۡزَىٰ كُلُّ نَفۡسِۭ بِمَا تَسۡعَىٰ
నిశ్చయంగా, తీర్పు ఘడియ రానున్నది, ప్రతి వ్యక్తీ తాను చేసిన కర్మల ప్రకారం ప్రతిఫలం పొందటానికి; నేను దానిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించాను.(a)
(a) చూడండి, 53:39.
آیت : 16
فَلَا يَصُدَّنَّكَ عَنۡهَا مَن لَّا يُؤۡمِنُ بِهَا وَٱتَّبَعَ هَوَىٰهُ فَتَرۡدَىٰ
కావున దానిని విశ్వసించకుండా, తన మనోవాంఛలను అనుసరించేవాడు, నిన్ను దాని (ఆ ఘడియ చింత) నుండి మరలింపనివ్వరాదు; అలా అయితే నీవు నాశనానికి గురి కాగలవు.
آیت : 17
وَمَا تِلۡكَ بِيَمِينِكَ يَٰمُوسَىٰ
మరియు ఓ మూసా! నీ కుడిచేతిలో ఉన్నది ఏమిటి?"
آیت : 18
قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّؤُاْ عَلَيۡهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَـَٔارِبُ أُخۡرَىٰ
(మూసా) అన్నాడు: "ఇది నా చేతికర్ర, దీనిని ఆనుకొని నిలబడతాను మరియు దీనితో నా మేకల కొరకు ఆకులు రాల్చుతాను. మరియు దీని నుండి నాకు ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి."
آیت : 19
قَالَ أَلۡقِهَا يَٰمُوسَىٰ
(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా! దానిని భూమి మీద పడవేయి."
آیت : 20
فَأَلۡقَىٰهَا فَإِذَا هِيَ حَيَّةٞ تَسۡعَىٰ
అప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా(a) మారిపోయి చురుకుగా చలించసాగింది.
(a) ఇక్కడ (20:20లో) 'హయ్యతున్ అని, 27:10, 28:31లలో జాన్నున్ అని, 7:107లో సు''అబానున్ అని ఉంది. సందర్భాన్ని బట్టి దానిని మార్చబడింది.
آیت : 21
قَالَ خُذۡهَا وَلَا تَخَفۡۖ سَنُعِيدُهَا سِيرَتَهَا ٱلۡأُولَىٰ
(అల్లాహ్) ఆజ్ఞాపించాడు: "దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వస్థితిలోకి మార్చుతాము.
آیت : 22
وَٱضۡمُمۡ يَدَكَ إِلَىٰ جَنَاحِكَ تَخۡرُجۡ بَيۡضَآءَ مِنۡ غَيۡرِ سُوٓءٍ ءَايَةً أُخۡرَىٰ
మరియు నీ చేతిని చంకలో పెట్టి తీయి, దాని కెలాంటి బాధ కలుగకుండా, అది తెల్లగా మెరుస్తూ బయటికి వస్తుంది,(a) ఇది రెండవ అద్భుత సూచన!
(a) చూడండి, 7:108, 28:32.
آیت : 23
لِنُرِيَكَ مِنۡ ءَايَٰتِنَا ٱلۡكُبۡرَى
ఇదంతా మేము నీకు మా గొప్ప సూచనలను చూపటానికి!
آیت : 24
ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ
నీవు ఫిర్ఔన్ వద్దకు పో! నిశ్చయంగా అతడు మితిమీరి పోయాడు."(a)
(a) ఫిర్'ఔన్ తనను తాను ఆరాధ్యదైవంగా చేసుకున్నాడు. చూడండి, 28:38 మరియు 79:24, 'నేనే మీ ప్రభువును' అని అనేవాడు.
آیت : 25
قَالَ رَبِّ ٱشۡرَحۡ لِي صَدۡرِي
(మూసా) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! నా హృదయాన్ని వికసింపజేయి.
آیت : 26
وَيَسِّرۡ لِيٓ أَمۡرِي
మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి.
آیت : 27
وَٱحۡلُلۡ عُقۡدَةٗ مِّن لِّسَانِي
నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు.
آیت : 28
يَفۡقَهُواْ قَوۡلِي
(దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి.
آیت : 29
وَٱجۡعَل لِّي وَزِيرٗا مِّنۡ أَهۡلِي
మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు.(a)
(a) వ'జీరున్: భారం మోసేవాడు, మంత్రి, రాజు యొక్క రాజకీయ భారాన్ని పంచుకునేవాడు.
آیت : 30
هَٰرُونَ أَخِي
నా సోదరుడైన హారూన్ ను.
آیت : 31
ٱشۡدُدۡ بِهِۦٓ أَزۡرِي
అతని ద్వారా నా బలాన్ని దృఢపరచు.
آیت : 32
وَأَشۡرِكۡهُ فِيٓ أَمۡرِي
మరియు అతనిని నా వ్యవహారంలో సహాయకారిగా (భాగస్వామిగా) చేయి.
آیت : 33
كَيۡ نُسَبِّحَكَ كَثِيرٗا
మేము నీ పవిత్రతను బాగా కొనియాడటానికి;
آیت : 34
وَنَذۡكُرَكَ كَثِيرًا
మరియు నిన్ను అత్యధికంగా స్మరించటానికి;
آیت : 35
إِنَّكَ كُنتَ بِنَا بَصِيرٗا
నిశ్చయంగా, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కని పెట్టుకునే ఉంటావు!"
آیت : 36
قَالَ قَدۡ أُوتِيتَ سُؤۡلَكَ يَٰمُوسَىٰ
(అల్లాహ్) సెలవిచ్చాడు: "ఓ మూసా! వాస్తవంగా, నీవు కోరినదంతా నీకు ఇవ్వబడింది.
آیت : 37
وَلَقَدۡ مَنَنَّا عَلَيۡكَ مَرَّةً أُخۡرَىٰٓ
మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము.(a)
(a) ఈ వివరాలకు చూడండి, 28:3-21.

آیت : 38
إِذۡ أَوۡحَيۡنَآ إِلَىٰٓ أُمِّكَ مَا يُوحَىٰٓ
అప్పుడు మేము నీ తల్లికి ఇవ్వవలసిన ఆ సూచనను ఈ విధంగా సూచించాము:
آیت : 39
أَنِ ٱقۡذِفِيهِ فِي ٱلتَّابُوتِ فَٱقۡذِفِيهِ فِي ٱلۡيَمِّ فَلۡيُلۡقِهِ ٱلۡيَمُّ بِٱلسَّاحِلِ يَأۡخُذۡهُ عَدُوّٞ لِّي وَعَدُوّٞ لَّهُۥۚ وَأَلۡقَيۡتُ عَلَيۡكَ مَحَبَّةٗ مِّنِّي وَلِتُصۡنَعَ عَلَىٰ عَيۡنِيٓ
ఇతనిని (ఈ బాలుణ్ణి) ఒక పెట్టెలో పెట్టి దానిని (ఆ పెట్టెను) నదిలో విడువు. నది దానిని ఒక ఒడ్డుకు చేర్చుతుంది; దానిని నాకు మరియు ఇతనికి శత్రువు అయిన వాడు తీసుకుంటాడు.; మరియు నేను నా తరఫు నుండి నీ మీద ప్రేమను కురిపించాను మరియు నిన్ను నా కంటి మందు పోషింపబడేటట్లు చేశాను.(a)
(a) చూడండి, 79:24 మరియు 28:9.
آیت : 40
إِذۡ تَمۡشِيٓ أُخۡتُكَ فَتَقُولُ هَلۡ أَدُلُّكُمۡ عَلَىٰ مَن يَكۡفُلُهُۥۖ فَرَجَعۡنَٰكَ إِلَىٰٓ أُمِّكَ كَيۡ تَقَرَّ عَيۡنُهَا وَلَا تَحۡزَنَۚ وَقَتَلۡتَ نَفۡسٗا فَنَجَّيۡنَٰكَ مِنَ ٱلۡغَمِّ وَفَتَنَّٰكَ فُتُونٗاۚ فَلَبِثۡتَ سِنِينَ فِيٓ أَهۡلِ مَدۡيَنَ ثُمَّ جِئۡتَ عَلَىٰ قَدَرٖ يَٰمُوسَىٰ
అప్పుడు నీ సోదరి (నిన్ను) అనుసరిస్తూ పోయి, వారితో ఇలా అన్నది: 'ఇతనిని పెంచి పోషించగల ఒకామెను నేను మీకు చూపనా?'(a) ఈ విధంగా మేము నిన్ను మళ్ళీ నీ తల్లి దగ్గరకు చేర్చాము, ఆమె కళ్ళకు చల్లదనమివ్వటానికి, ఆమెను దుఃఖపడకుండా ఉంచటానికి.(b) మరియు నీవొక వ్యక్తిని చంపావు,(c) మేము ఆ ఆపద నుండి నీకు విముక్తి కలిగించాము. మేము నిన్ను అనేక విధాలుగా పరీక్షించాము.(d) ఆ తరువాత నీవు ఎన్నో సంవత్సరాలు మద్ యన్ వారితో ఉంటివి.(e) ఓ మూసా! ఇప్పుడు నీవు (మా) నిర్ణయానుసారంగా (ఇక్కడికి) వచ్చావు.
(a) వివరాలకు చూడండి, 28:12. (b) చూడండి, 28:12-13. (c) చూడండి, 28:14. (d) చూడండి, 28:15-21. (e) చూడండి, 28:22-28.
آیت : 41
وَٱصۡطَنَعۡتُكَ لِنَفۡسِي
మరియు నేను నిన్ను నా (సేవ) కొరకు ఎన్నుకున్నాను.
آیت : 42
ٱذۡهَبۡ أَنتَ وَأَخُوكَ بِـَٔايَٰتِي وَلَا تَنِيَا فِي ذِكۡرِي
నీవు మరియు నీ సోదరుడు నా సూచనలతో వెళ్ళండి. నన్ను స్మరించటంలో అశ్రద్ధ వహించకండి.(a)
(a) ఇక్కడ అల్లాహ్ (సు.తా.) వైపుకు ఆహ్వానించే దా'ఈలకు ఎల్లప్పుడూ అల్లాహ్ (సు.తా.)ను స్మరిస్తూ ఉండాలనే సూచన ఉంది.
آیت : 43
ٱذۡهَبَآ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ
మీరిద్దరు ఫిర్ఔన్ దగ్గరకు వెళ్ళండి. అతడు మితమీరి ప్రవర్తిస్తున్నాడు.
آیت : 44
فَقُولَا لَهُۥ قَوۡلٗا لَّيِّنٗا لَّعَلَّهُۥ يَتَذَكَّرُ أَوۡ يَخۡشَىٰ
కాని అతనితో మృదువుగా మాట్లాడండి. బహుశా అతడు హితబోధ స్వీకరిస్తాడేమో, లేదా భయపడతాడేమో!"(a)
(a) అల్లాహ్ (సు.తా.)కు తెలుసు అతడు హితబోధ స్వీకరించడని, కాని మూసా (అ.స.)కు ఏమీ తెలియదు. ఎందుకంటే ప్రవక్తలు కూడా మానవులే. వారికి అల్లాహ్ (సు.తా.) తెలిపేది తప్ప ఇతర అగోచర విషయాల జ్ఞానం ఉండదు. ఇదే అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛ. దీని వల్ల ప్రవక్త ప్రతి వానిని: 'అల్లాహ్ (సు.తా.) మార్గం వైపునకు, సత్యమార్గం వైపునకు, మోక్షం పొందటానికి రండి.' అని ఆహ్వానిస్తుంటాడు. అదే ప్రవక్త బాధ్యత. ఇందులో దా'ఈలు మృదువుగా వ్యవహరించాలనే సూచన కూడా ఉంది.
آیت : 45
قَالَا رَبَّنَآ إِنَّنَا نَخَافُ أَن يَفۡرُطَ عَلَيۡنَآ أَوۡ أَن يَطۡغَىٰ
(మూసా మరియు హారూన్) ఇద్దరూ ఇలా అన్నారు: "ఓ మా ప్రభూ! వాస్తవానికి, అతడు మమ్మల్ని శిక్షిస్తాడేమోనని, లేదా తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడేమోనని మేము భయపడుతున్నాను!"
آیت : 46
قَالَ لَا تَخَافَآۖ إِنَّنِي مَعَكُمَآ أَسۡمَعُ وَأَرَىٰ
(అల్లాహ్) సెలవిచ్చాడు: "మీరిద్దరు భయపడకండి, నిశ్చయంగా, మీరిద్దరితో పాటు నేనూ ఉన్నాను. నేను అంతా వింటూ ఉంటాను మరియు అంతా చూస్తూ ఉంటాను.
آیت : 47
فَأۡتِيَاهُ فَقُولَآ إِنَّا رَسُولَا رَبِّكَ فَأَرۡسِلۡ مَعَنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ وَلَا تُعَذِّبۡهُمۡۖ قَدۡ جِئۡنَٰكَ بِـَٔايَةٖ مِّن رَّبِّكَۖ وَٱلسَّلَٰمُ عَلَىٰ مَنِ ٱتَّبَعَ ٱلۡهُدَىٰٓ
కావున మీరిద్దరూ అతని వద్దకు పోయి ఇలా అనండి: "నిశ్చయంగా, మేమిద్దరం నీ ప్రభువు యొక్క సందేశహరులము. కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు.(a) మరియు వారిని బాధ పెట్టకు. వాస్తవానికి మేము నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుండి సూచనలు తీసుకొని వచ్చాము. మరియు సన్మార్గాన్ని అనుసరించే వానిపై (అల్లాహ్ తరపు నుండి) శాంతి వర్ధిల్లుతుంది!(b)
(a) వివరాలకు చూడండి, 2:49, 7:141, 14:6. (b) వస్సలాము 'అలా మనిత్తబ'ల్ హుదా! దైవప్రవక్త ('స'అస) రోమన్ చక్రవర్తికి వ్రాసిన ఉత్తరాన్ని ఈ పై వాక్యంతో ప్రారంభించారు, (ఇబ్నె-కసీ'ర్). దీనితో స్పష్టమయ్యేది ఏమిటంటే ముస్లిమేతరుల సభలో లేక ఉత్తరం ద్వారా సంభాషణ ప్రారంభించునప్పుడు ఈ శభ్దాలను వాడాలి.
آیت : 48
إِنَّا قَدۡ أُوحِيَ إِلَيۡنَآ أَنَّ ٱلۡعَذَابَ عَلَىٰ مَن كَذَّبَ وَتَوَلَّىٰ
" 'నిశ్చయంగా, ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగి పోతాడో, అతనికి కఠినశిక్ష తప్పక ఉంటుంది' అని వాస్తవానికి మాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపబడింది."
آیت : 49
قَالَ فَمَن رَّبُّكُمَا يَٰمُوسَىٰ
(ఫిర్ఔన్) అన్నాడు: "ఓ మూసా! మీ ఇరువురి ప్రభువు ఎవరు?"
آیت : 50
قَالَ رَبُّنَا ٱلَّذِيٓ أَعۡطَىٰ كُلَّ شَيۡءٍ خَلۡقَهُۥ ثُمَّ هَدَىٰ
(మూసా) జవాబిచ్చాడు: "ప్రతి దానికి దాని రూపాన్నిచ్చి, తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు."
آیت : 51
قَالَ فَمَا بَالُ ٱلۡقُرُونِ ٱلۡأُولَىٰ
(ఫిర్ఔన్) అన్నాడు: "అయితే పూర్వం గతించిన తరాల వారి సంగతి ఏమిటి?"

آیت : 52
قَالَ عِلۡمُهَا عِندَ رَبِّي فِي كِتَٰبٖۖ لَّا يَضِلُّ رَبِّي وَلَا يَنسَى
(మూసా) జవాబిచ్చాడు: "వాటి జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో (వ్రాయబడి) వుంది. నా ప్రభువు పొరపాటు చేయడు మరియు మరువడు కూడాను."
آیت : 53
ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ مَهۡدٗا وَسَلَكَ لَكُمۡ فِيهَا سُبُلٗا وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجۡنَا بِهِۦٓ أَزۡوَٰجٗا مِّن نَّبَاتٖ شَتَّىٰ
ఆయనే మీ కొరకు భూమిని చదునుగా (పరువుగా) జేసి, అందులో మీకు (నడవటానికి) త్రోవలను ఏర్పరిచాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించాడు. మేము దాని ద్వారా రకరకాల వృక్షకోటిని పుట్టించాము.(a)
(a) అ'జ్వాజున్: ఇక్కడ దీని అర్థం వివిధ రకాలు. ఇదే అర్థం 13:3లో కూడా ఉంది.
آیت : 54
كُلُواْ وَٱرۡعَوۡاْ أَنۡعَٰمَكُمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّأُوْلِي ٱلنُّهَىٰ
మీరు వాటిని తినండి మరియు మీ పశువులకు మేపండి. నిశ్చయంగా, అర్థం చేసుకోగలవారికి ఇందులో అనేక సూచనలున్నాయి.
آیت : 55
۞ مِنۡهَا خَلَقۡنَٰكُمۡ وَفِيهَا نُعِيدُكُمۡ وَمِنۡهَا نُخۡرِجُكُمۡ تَارَةً أُخۡرَىٰ
దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము.(a)
(a) మానవుణ్ణి మట్టి నుండి సృష్టించాము. వివరాలకు చూడండి, 3:59లో తురాబ్ మరియు 15:26లో 'స'ల్సాలిన్ 'హమఇన్ మన్నూన్. ఇబ్నె మాజా ఉల్లేఖనం: ఒక మృతుణ్ణి సమాధిలో పెట్టిన తరువాత రెండు చేతులతో మూడు సార్లు మట్టి పోయడం అభిలషణీయం (ముస్త'హబ్).
آیت : 56
وَلَقَدۡ أَرَيۡنَٰهُ ءَايَٰتِنَا كُلَّهَا فَكَذَّبَ وَأَبَىٰ
మరియు వాస్తవానికి, మేము అతనికి (ఫిర్ఔన్ కు) మా సూచనలన్నీ చూపాము, కాని అతడు వాటిని అబద్దాలన్నాడు మరియు తిరస్కరించాడు.
آیت : 57
قَالَ أَجِئۡتَنَا لِتُخۡرِجَنَا مِنۡ أَرۡضِنَا بِسِحۡرِكَ يَٰمُوسَىٰ
(ఫిర్ఔన్) ఇలా అన్నాడు: "ఓ మూసా! నీవు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా దేశం నుండి వెడల గొట్టటానికి మా వద్దకు వచ్చావా?(a)
(a) చూడండి, 7:110.
آیت : 58
فَلَنَأۡتِيَنَّكَ بِسِحۡرٖ مِّثۡلِهِۦ فَٱجۡعَلۡ بَيۡنَنَا وَبَيۡنَكَ مَوۡعِدٗا لَّا نُخۡلِفُهُۥ نَحۡنُ وَلَآ أَنتَ مَكَانٗا سُوٗى
సరే! మేము కూడా దాని వంటి మంత్రజాలాన్ని నీకు పోటీగా తెస్తాము; కావున మా మధ్య నీ మధ్య (సమావేశానికి) ఒక సమయం మరియు స్థలాన్ని నిర్ణయించు. దాని నుండి మేము కానీ నీవు కానీ వెనుకాడ కూడదు. మరియు అదొక యుక్తమైన స్థలమై ఉండాలి."
آیت : 59
قَالَ مَوۡعِدُكُمۡ يَوۡمُ ٱلزِّينَةِ وَأَن يُحۡشَرَ ٱلنَّاسُ ضُحٗى
(మూసా) అన్నాడు: "మీతో సమావేశం ఉత్సవ దినమున నియమించుకుందాము. ప్రొద్దెక్కే వరకు ప్రజలందరూ సమావేశమై ఉండాలి."
آیت : 60
فَتَوَلَّىٰ فِرۡعَوۡنُ فَجَمَعَ كَيۡدَهُۥ ثُمَّ أَتَىٰ
ఆ పిదప ఫిర్ఔన్ వెళ్ళిపోయి తన తంత్ర సామగ్రిని సమీకరించుకొని తిరిగి వచ్చాడు.(a)
(a) చూడండి, 7:111-114.
آیت : 61
قَالَ لَهُم مُّوسَىٰ وَيۡلَكُمۡ لَا تَفۡتَرُواْ عَلَى ٱللَّهِ كَذِبٗا فَيُسۡحِتَكُم بِعَذَابٖۖ وَقَدۡ خَابَ مَنِ ٱفۡتَرَىٰ
మూసా వారితో అన్నాడు: "మీరు నాశనమవుగాక! అల్లాహ్ పై అబద్ధాలు కల్పించకండి! అలా చేస్తే ఆయన కఠినశిక్షతో మిమ్మల్ని నిర్మూలించవచ్చు! (అల్లాహ్ పై) అబద్ధాలు కల్పించేవాడు తప్పక విఫలుడవుతాడు."
آیت : 62
فَتَنَٰزَعُوٓاْ أَمۡرَهُم بَيۡنَهُمۡ وَأَسَرُّواْ ٱلنَّجۡوَىٰ
(ఇది విన్న) తరువాత వారు ఆ విషయాన్ని గురించి తర్కించుకున్నారు, కాని తమ చర్చను రహస్యంగానే సాగించారు.
آیت : 63
قَالُوٓاْ إِنۡ هَٰذَٰنِ لَسَٰحِرَٰنِ يُرِيدَانِ أَن يُخۡرِجَاكُم مِّنۡ أَرۡضِكُم بِسِحۡرِهِمَا وَيَذۡهَبَا بِطَرِيقَتِكُمُ ٱلۡمُثۡلَىٰ
(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడుకున్నారు: "వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడల గొట్టి, మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించ గోరుతున్నారు.(a)
(a) ఏ విధంగానైతే ఈ రోజు కూడా అసత్య మార్గం మీద, షిర్కులో మునిగి ఉన్నవారు కూడా తామే సరైన మార్గం మీద ఉన్నామని గర్విస్తారో అదే విధంగా వారూ గర్వించారు. చూడండి, 30:32.
آیت : 64
فَأَجۡمِعُواْ كَيۡدَكُمۡ ثُمَّ ٱئۡتُواْ صَفّٗاۚ وَقَدۡ أَفۡلَحَ ٱلۡيَوۡمَ مَنِ ٱسۡتَعۡلَىٰ
కావున మీరు మీ యుక్తులను సమీకరించుకొని సమైక్యంగా (రంగంలోకి) దిగండి. ఈనాడు ప్రాబల్యం పొందిన వాడే, వాస్తవానికి సాఫల్యం (గెలుపు) పొందిన వాడు."(a)
(a) చూడండి, 7:113-114.

آیت : 65
قَالُواْ يَٰمُوسَىٰٓ إِمَّآ أَن تُلۡقِيَ وَإِمَّآ أَن نَّكُونَ أَوَّلَ مَنۡ أَلۡقَىٰ
వారు (మాంత్రికులు) ఇలా అన్నారు: "ఓ మూసా! నీవు విసురుతావా, లేదా మేము మొదట విసరాలా?"
آیت : 66
قَالَ بَلۡ أَلۡقُواْۖ فَإِذَا حِبَالُهُمۡ وَعِصِيُّهُمۡ يُخَيَّلُ إِلَيۡهِ مِن سِحۡرِهِمۡ أَنَّهَا تَسۡعَىٰ
(మూసా) అన్నాడు: "లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ - వారి మంత్రజాలం వల్ల - అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి.(a)
(a) ఇక్కడ: 'వారి త్రాళ్ళు మంత్రజాలం వల్ల చలిస్తున్నట్లు,' అని ఉంది. అంటే అవి పాములుగా కనిపించాయే, గానీ వాస్తవానికి పాములుగా మారలేదు. దీనితో విశదమయ్యేది ఏమిటంటే మంత్రజాలం (మిస్మరిస్మ్), మంత్ర ప్రభావం వల్ల తాత్కాలికంగా ప్రజలకు అలా కనిపిస్తుందే కానీ నిజానికి ఏ మార్పూ రాదు.
آیت : 67
فَأَوۡجَسَ فِي نَفۡسِهِۦ خِيفَةٗ مُّوسَىٰ
దానితో మూసాకు, తన మసనస్సులో కొంత భయం కలిగింది.(a)
(a) చూడండి, 7;116.
آیت : 68
قُلۡنَا لَا تَخَفۡ إِنَّكَ أَنتَ ٱلۡأَعۡلَىٰ
మేము (అల్లాహ్) అన్నాము: "భయపడకు! నిశ్చయంగా నీవే ప్రాబల్యం పొందుతావు.(a)
(a) మూసా ('అ.స.) భయపడటానికి కారణం అతను కూడా ఒక మానవుడే. ప్రవక్త ('అలైహిమ్. స.) లు అందరూ మానవులే కాని వారిపై దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడుతుంది. అల్లాహ్ (సు.తా.) తెలిపినది తప్ప, వేరే అగోచర జ్ఞానం గానీ, భవిష్యత్తులో జరుగబోయే వాటి జ్ఞానం గానీ వారికి ఉండదు. అల్లాహ్ (సు.తా.): 'భయపడకు నీవే ఆధిక్యత వహిస్తావు.' అని అన్నప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. అంటే అద్భుత సూచనలు చూపటం కూడా అల్లాహ్ (సు.తా.) చేతిలోనే ఉంది. ప్రవక్తలు ఏదైనా అద్భుత విషయం జరిగే వరకు, అది జరుగనున్నదని ఎరగరు. అంటే వారికెలాంటి అగోచర జ్ఞానం ఉండదు.
آیت : 69
وَأَلۡقِ مَا فِي يَمِينِكَ تَلۡقَفۡ مَا صَنَعُوٓاْۖ إِنَّمَا صَنَعُواْ كَيۡدُ سَٰحِرٖۖ وَلَا يُفۡلِحُ ٱلسَّاحِرُ حَيۡثُ أَتَىٰ
నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మాంత్రికుని తంత్రమే! మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!"
آیت : 70
فَأُلۡقِيَ ٱلسَّحَرَةُ سُجَّدٗا قَالُوٓاْ ءَامَنَّا بِرَبِّ هَٰرُونَ وَمُوسَىٰ
అప్పుడు ఆ మాంత్రికులు సాష్టాంగం (సజ్దా)లో పడుతూ అన్నారు: "మేము హారూన్ మరియు మూసాల ప్రభువును విశ్వసించాము."(a)
(a) చూడండి, 7:117-120.
آیت : 71
قَالَ ءَامَنتُمۡ لَهُۥ قَبۡلَ أَنۡ ءَاذَنَ لَكُمۡۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِي عَلَّمَكُمُ ٱلسِّحۡرَۖ فَلَأُقَطِّعَنَّ أَيۡدِيَكُمۡ وَأَرۡجُلَكُم مِّنۡ خِلَٰفٖ وَلَأُصَلِّبَنَّكُمۡ فِي جُذُوعِ ٱلنَّخۡلِ وَلَتَعۡلَمُنَّ أَيُّنَآ أَشَدُّ عَذَابٗا وَأَبۡقَىٰ
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను అనుమతించక ముందే, మీరు ఇతనిని విశ్వసించారా?(a) నిశ్చయంగా, ఇతనే మీకు మంత్రజాలం నేర్పిన గురువు! కావున ఇప్పుడు నేను మీ అందరి చేతులను మరియు కాళ్ళను వ్యతిరేక పక్షల నుండి నరికిస్తాను(b) మరియు మిమ్మల్ని అందరినీ, ఖర్జూరపు దూలాల మీద సిలువ (శూలారోహణ) చేయిస్తాను. అప్పుడు మా ఇద్దరిలో ఎవరి శిక్ష ఎక్కువ కఠినమైనదో మరియు దీర్ఘకాలికమైనదో మీకు తప్పక తెలియగలదు."
(a) చూడండి, 71:23. (b) అంటే కుడిచేయి ఎడమకాలు.
آیت : 72
قَالُواْ لَن نُّؤۡثِرَكَ عَلَىٰ مَا جَآءَنَا مِنَ ٱلۡبَيِّنَٰتِ وَٱلَّذِي فَطَرَنَاۖ فَٱقۡضِ مَآ أَنتَ قَاضٍۖ إِنَّمَا تَقۡضِي هَٰذِهِ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَآ
వారు (మాంత్రికులు) అన్నారు: "మా వద్దకు వచ్చిన స్పష్టమైన సూచనలను మరియు మమ్మల్ని సృజించిన ప్రభువు (అల్లాహ్)ను వదలి, మేము నీకు ప్రాధాన్యతనివ్వము. నీవు చేయ దలచు కున్నది చేసుకో! నీవు కేవలం ఐహిక జీవితాన్ని మాత్రమే అంతమొందించ గలవు. (a)
(a) ఇక్కడ మాంత్రికులు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఫిర్'ఔన్ ను సంతోషపరచటంలో నిమగ్నులై ఉండిరి. ప్రాపంచిక వ్యామోహంలో పడి ఉండిరి, కాబట్టి: 'మేము గెలిస్తే మాకు బహుమానం దొరుకుతుంది కదా?' అని అడిగారు. కాని వారికి మార్గదర్శకత్వం దొరికి మూసా ('అ.స.) ఆరాధించే ప్రభువే నిజమైన ప్రభువు అని తెలిసినప్పుడు, వారు అల్లాహ్ (సు.తా.) సాన్నిధ్యాన్ని పొందటానికి ఇహలోక భోగభాగ్యాలనే కాదు, తమ జీవితాలను కూడా కోల్పోవటానికి సిద్ధపడ్డారు. ఎంత గొప్ప దైవభితిని (తఖ్వా) కనబరచారో చూడండి.
آیت : 73
إِنَّآ ءَامَنَّا بِرَبِّنَا لِيَغۡفِرَ لَنَا خَطَٰيَٰنَا وَمَآ أَكۡرَهۡتَنَا عَلَيۡهِ مِنَ ٱلسِّحۡرِۗ وَٱللَّهُ خَيۡرٞ وَأَبۡقَىٰٓ
నిశ్చయంగా, మేము మా ప్రభువునందే విశ్వాసముంచాము, ఆయన (అల్లాహ్) యే మా తప్పులను మరియు నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలను క్షమించేవాడు. (ప్రతి ఫలమివ్వటంలో) అల్లాహ్ యే సర్వశ్రేష్ఠుడు మరియు శాశ్వతంగా ఉండేవాడు (నిత్యుడు)."(a)
(a) అబ్'ఖా, అల్-బా'ఖి: The Ever-Lasting. He whose existence will have no end. నిత్యుడు, శాశ్వితుడు, చిరస్థాయిగా ఉండేవాడు. చూడండి, 55:26-27, (సేకరించబడిన పదం). ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
آیت : 74
إِنَّهُۥ مَن يَأۡتِ رَبَّهُۥ مُجۡرِمٗا فَإِنَّ لَهُۥ جَهَنَّمَ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحۡيَىٰ
నిశ్చయంగా, తన ప్రభువు ముందు పాపాత్ముడిగా హాజరయ్యే వాడికి తప్పక నరకం గలదు. అందులో వాడు చావనూ లేడు, బ్రతకనూ లేడు!
آیت : 75
وَمَن يَأۡتِهِۦ مُؤۡمِنٗا قَدۡ عَمِلَ ٱلصَّٰلِحَٰتِ فَأُوْلَٰٓئِكَ لَهُمُ ٱلدَّرَجَٰتُ ٱلۡعُلَىٰ
ఎవడైతే విశ్వాసిగా హాజరవుతాడో మరియు సత్కార్యాలు చేసి ఉంటాడో,(a) అలాంటి వారికి ఉన్నత స్థానాలుంటాయి -
(a) సత్కార్యాలు చేయకుండా కేవలం విశ్వసించటం మాత్రమే పునరుత్థాన దినమున ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. చూడండి, 6:158.
آیت : 76
جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ وَذَٰلِكَ جَزَآءُ مَن تَزَكَّىٰ
శాశ్వతమైన స్వర్గవనాలు! వాటి క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే పుణ్యవంతులకు దొరికే ప్రతిఫలం.

آیت : 77
وَلَقَدۡ أَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنۡ أَسۡرِ بِعِبَادِي فَٱضۡرِبۡ لَهُمۡ طَرِيقٗا فِي ٱلۡبَحۡرِ يَبَسٗا لَّا تَخَٰفُ دَرَكٗا وَلَا تَخۡشَىٰ
మరియు వాస్తవానికి, మేము మూసాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలిపాము:(a) "నా దాసులను రాత్రివేళ తీసుకొని బయలుదేరు మరియు వారి కొరకు సముద్రం నుండి తడిలేని మార్గాన్ని ఏర్పరచు; వెంబడించి పట్టుబడతావేమోనని భయపడకు, (సముద్రంలో మునిగి పోతావేమోనని కూడా) భీతి చెందకు."(b)
(a) చూడండి, 7:130 (b) చూడండి, 26:63-66.
آیت : 78
فَأَتۡبَعَهُمۡ فِرۡعَوۡنُ بِجُنُودِهِۦ فَغَشِيَهُم مِّنَ ٱلۡيَمِّ مَا غَشِيَهُمۡ
ఆ పిదప ఫిర్ఔన్ తన సేనలతో వారిని వెంబడించి (అక్కడికి) చేరగానే, సముద్రం వారిని హఠాత్తుగా అలుముకొని క్రమ్ముకున్నది.
آیت : 79
وَأَضَلَّ فِرۡعَوۡنُ قَوۡمَهُۥ وَمَا هَدَىٰ
మరియు ఫిర్ఔన్ తన జాతి ప్రజలను మార్గభ్రష్టులుగా చేశాడు మరియు వారికి సన్మార్గం చూపలేదు.
آیت : 80
يَٰبَنِيٓ إِسۡرَٰٓءِيلَ قَدۡ أَنجَيۡنَٰكُم مِّنۡ عَدُوِّكُمۡ وَوَٰعَدۡنَٰكُمۡ جَانِبَ ٱلطُّورِ ٱلۡأَيۡمَنَ وَنَزَّلۡنَا عَلَيۡكُمُ ٱلۡمَنَّ وَٱلسَّلۡوَىٰ
ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! వాస్తవానికి మేము, మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి, తూర్ పర్వతపు కుడివైపున మీతో వాగ్దానం చేసి, మీపై మన్న మరియు సల్వాలను అవతరింపజేశాము.(a)
(a) చూడండి, 19:52 మరియు 2:63.
آیت : 81
كُلُواْ مِن طَيِّبَٰتِ مَا رَزَقۡنَٰكُمۡ وَلَا تَطۡغَوۡاْ فِيهِ فَيَحِلَّ عَلَيۡكُمۡ غَضَبِيۖ وَمَن يَحۡلِلۡ عَلَيۡهِ غَضَبِي فَقَدۡ هَوَىٰ
(ఇంకా ఇలా అన్నాము): "మేము మీకు ప్రసాదించిన మంచి ఆహారపదార్థాలను తినండి,(a) అందు తలబిరుసుతనం చేయకండి, అలా చేస్తే నా ఆగ్రహానికి గురి కాగలరు. నా ఆగ్రహానికి గురి అయినవాడు తప్పక నాశనమవుతాడు.
(a) మన్న మరియు సల్వాలను గురించి చూడండి, 2:57, 7:160. మన్న ఒక తియ్యని ఆహారపదార్థం. సల్వా ఒక రకమైన పక్షి (బుర్రపిట్ట, పూరెడు పిట్ట, కోలంకి పిట్ట లాంటిది).
آیت : 82
وَإِنِّي لَغَفَّارٞ لِّمَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا ثُمَّ ٱهۡتَدَىٰ
అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో ఉంటాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను."(a)
(a) అల్-గఫ్ఫారు': Oft-Forgiving, Most Forgiving. క్షమించేవాడు, పాపాలను క్షమించేవాటడు, ఎక్కువగా క్షమించేవాడు. ఇంకా చూడండి, అల్-గాఫిర్: క్షమాగుణ పరిపూర్ణుడు, 40:3. అల్-'గఫూరు: క్షమాశీలుడు, 2:173, అల్-'గఫ్ఫారు మరియు అల్-'గఫూరు అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
آیت : 83
۞ وَمَآ أَعۡجَلَكَ عَن قَوۡمِكَ يَٰمُوسَىٰ
మరియు (మూసా తూర్ పర్వతం మీద ఉన్నప్పుడు(a) అల్లాహ్ అన్నాడు): "ఓ మూసా! నీవు నీ జాతి వారిని విడిచి శీఘ్రంగా (ఇక్కడికి) వచ్చిన కారణమేమిటి?"
(a) చూడండి, 2:51 మరియు 7:142.
آیت : 84
قَالَ هُمۡ أُوْلَآءِ عَلَىٰٓ أَثَرِي وَعَجِلۡتُ إِلَيۡكَ رَبِّ لِتَرۡضَىٰ
(మూసా) జవాబిచ్చాడు: "అదిగో! వారు నా వెనుక నా అడుగు జాడలలో వస్తూనే ఉన్నారు; నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని, ఓ నా ప్రభూ! నేను త్వరత్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను."(a)
(a) ఇక్కడ స్పష్టమయ్యేది ఏమిటంటే ఒక జాతి చాలా కాలం వరకు దాస్యంలో ఉండి అకస్మాత్తుగా దానికి స్వాతంత్ర్యం దొరికితే, అది తన భూత కాలపు క్రమశిక్షణలేని స్వభావాన్ని మార్చుకోలేదు. కాబట్టి ముందు తెలుపబడినట్లు, మూసా ('అ.స.) వెళ్ళిపోగానే అతన జాతివారు, ఆవుదూడను ఆరాధ్యదైవంగా చేసుకున్నారు. ఎందుకంటే, అంతకు ముందు వారు ఈజిప్టులో విగ్రహారాధనకు అలవాటు పడి ఉండిరి.
آیت : 85
قَالَ فَإِنَّا قَدۡ فَتَنَّا قَوۡمَكَ مِنۢ بَعۡدِكَ وَأَضَلَّهُمُ ٱلسَّامِرِيُّ
(అల్లాహ్) అన్నాడు "వాస్తవానికి! నీ వెనుక మేము, నీ జాతి వారిని పరీక్షకు గురి చేశాము మరియు సామిరి వారిని మార్గభ్రష్టులుగా చేశాడు."
آیت : 86
فَرَجَعَ مُوسَىٰٓ إِلَىٰ قَوۡمِهِۦ غَضۡبَٰنَ أَسِفٗاۚ قَالَ يَٰقَوۡمِ أَلَمۡ يَعِدۡكُمۡ رَبُّكُمۡ وَعۡدًا حَسَنًاۚ أَفَطَالَ عَلَيۡكُمُ ٱلۡعَهۡدُ أَمۡ أَرَدتُّمۡ أَن يَحِلَّ عَلَيۡكُمۡ غَضَبٞ مِّن رَّبِّكُمۡ فَأَخۡلَفۡتُم مَّوۡعِدِي
ఆ తరువాత మూసా కోపంతోనూ, విచారంతోనూ, తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఏమీ? ఒడంబడిక పూర్తి కావటంలో ఏమైనా ఆలస్య మయ్యిందా? లేదా! మీ ప్రభువు యొక్క ఆగ్రహం మీపై విరుచుకు పడాలని కోరుతున్నారా? అందుకేనా మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగ పరచారు?"
آیت : 87
قَالُواْ مَآ أَخۡلَفۡنَا مَوۡعِدَكَ بِمَلۡكِنَا وَلَٰكِنَّا حُمِّلۡنَآ أَوۡزَارٗا مِّن زِينَةِ ٱلۡقَوۡمِ فَقَذَفۡنَٰهَا فَكَذَٰلِكَ أَلۡقَى ٱلسَّامِرِيُّ
వారు అన్నారు: "మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. కాని మాపై ప్రజల ఆభరణాల భారం మోపబడి ఉండెను, దానిని (అగ్నిలోకి) విసిరాము, ఇదే విధంగా సామిరి కూడా వేశాడు."

آیت : 88
فَأَخۡرَجَ لَهُمۡ عِجۡلٗا جَسَدٗا لَّهُۥ خُوَارٞ فَقَالُواْ هَٰذَآ إِلَٰهُكُمۡ وَإِلَٰهُ مُوسَىٰ فَنَسِيَ
తరువాత అతడు (సామిరి) వారికొక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేశాడు. దాని నుండి ఆవుదూడ అరుపు వంటి శబ్దం వచ్చేది.(a) పిదప వారన్నారు: "ఇదే మీ ఆరాధ్య దైవం మరియు మూసా యొక్క ఆరాధ్య దైవం కూడాను, కాని అతను దానిని మరచిపోయాడు."
(a) చూడండి, 7:148.
آیت : 89
أَفَلَا يَرَوۡنَ أَلَّا يَرۡجِعُ إِلَيۡهِمۡ قَوۡلٗا وَلَا يَمۡلِكُ لَهُمۡ ضَرّٗا وَلَا نَفۡعٗا
ఏమీ? అది వారికెలాంటి సమాధానమివ్వజాలదనీ మరియు వారికెలాంటి కీడు గానీ, మేలు గానీ చేయజాలదనీ వారు చూడటం లేదా?"(a)
(a) అల్లాహ్ (సు.తా.) వారి బుద్ధిహీనతను స్పష్టం చేస్తున్నాడు. ఆ ఆవుదూడ వారి ప్రశ్నకు సమాధాన మివ్వజాలదూ మరియు వారికెలాంటి లాభం గానీ నష్టం గానీ చేయజాలదూ, అని తెలిసి కూడా వారు దానిని ఆరాధించడం, బుద్ధిహీనత కాక మరేమిటి? ఆరాధ్య దేవుడు అల్లాహ్ (సు.తా.) మాత్రమే, ఆయనే తన దాసుల మొర వింటాడు మరియు వారికి లాభాం గానీ, నష్టం గానీ చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు.
آیت : 90
وَلَقَدۡ قَالَ لَهُمۡ هَٰرُونُ مِن قَبۡلُ يَٰقَوۡمِ إِنَّمَا فُتِنتُم بِهِۦۖ وَإِنَّ رَبَّكُمُ ٱلرَّحۡمَٰنُ فَٱتَّبِعُونِي وَأَطِيعُوٓاْ أَمۡرِي
మరియు వాస్తవానికి హారూన్ ఇంతకు ముందు వారితో చెప్పి ఉన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! దీని (విగ్రహం)తో మీరు పరీక్షింప బడుతున్నారు. మరియు నిశ్చయంగా, ఆ అనంత కరుణామయుడే మీ ప్రభువు! కావున మీరు నన్నే అనుసరించండి మరియు నా ఆజ్ఞనే పాలించండి."
آیت : 91
قَالُواْ لَن نَّبۡرَحَ عَلَيۡهِ عَٰكِفِينَ حَتَّىٰ يَرۡجِعَ إِلَيۡنَا مُوسَىٰ
వారన్నారు: "మూసా తిరిగి మా వద్దకు వచ్చే వరకు, మేము దీనిని ఆరాధించకుండా ఉండలేము."
آیت : 92
قَالَ يَٰهَٰرُونُ مَا مَنَعَكَ إِذۡ رَأَيۡتَهُمۡ ضَلُّوٓاْ
(మూసా, హారూన్ తో) అన్నాడు: "ఓ హారూన్! నీవు వారిని మార్గభ్రష్టత్వంలో పడటం చూసినప్పుడు (వారిని వారించకుండా) నిన్ను ఎవరు ఆపారు?
آیت : 93
أَلَّا تَتَّبِعَنِۖ أَفَعَصَيۡتَ أَمۡرِي
నీవెందుకు నన్ను అనుసరించలేదు? నీవు కూడా నా ఆజ్ఞను ఉల్లంఘించావా?"(a)
(a) చూడండి, 7:142.
آیت : 94
قَالَ يَبۡنَؤُمَّ لَا تَأۡخُذۡ بِلِحۡيَتِي وَلَا بِرَأۡسِيٓۖ إِنِّي خَشِيتُ أَن تَقُولَ فَرَّقۡتَ بَيۡنَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ وَلَمۡ تَرۡقُبۡ قَوۡلِي
(హారూన్) అన్నాడు: "నా తల్లి కుమారుడా (సోదరుడా)! నా గడ్డాన్ని గానీ, నా తలవెంట్రుకలను గానీ పట్టి లాగకు: 'వాస్తవానికి ఇస్రాయీల్ సంతతి వారిలో విభేదాలు కల్పించావు, నీవు నా మాటను లక్ష్యపెట్టలేదు.' అని, నీవు అంటావేమోనని నేను భయపడ్డాను."(a)
(a) దీని వివరాలకు చూడండి, 7:150.
آیت : 95
قَالَ فَمَا خَطۡبُكَ يَٰسَٰمِرِيُّ
(మూసా) అన్నాడు: "ఓ సామిరీ! ఇక నీ సంగతేమిటి?"
آیت : 96
قَالَ بَصُرۡتُ بِمَا لَمۡ يَبۡصُرُواْ بِهِۦ فَقَبَضۡتُ قَبۡضَةٗ مِّنۡ أَثَرِ ٱلرَّسُولِ فَنَبَذۡتُهَا وَكَذَٰلِكَ سَوَّلَتۡ لِي نَفۡسِي
(సామిరీ) అన్నాడు: "వారు చూడని దానిని నేను చూశాను. ఆ తరువాత నేను సందేశహరుని (జిబ్రీల్)(a) పాదగుర్తుల నుండి ఒక పిడికెడు (మట్టి) తీసుకొని దాని (ఆవుదూడ విగ్రహం) మీద వేశాను మరియు నా ఆత్మ నన్ను ఈ విధంగా ప్రేరేపించింది."
(a) చాలామంది వ్యాఖ్యాతలు రసూల్ అంటే ఇక్కడ జిబ్రీల్ ('అ.స.) అనే వ్యాఖ్యానించారు.
آیت : 97
قَالَ فَٱذۡهَبۡ فَإِنَّ لَكَ فِي ٱلۡحَيَوٰةِ أَن تَقُولَ لَا مِسَاسَۖ وَإِنَّ لَكَ مَوۡعِدٗا لَّن تُخۡلَفَهُۥۖ وَٱنظُرۡ إِلَىٰٓ إِلَٰهِكَ ٱلَّذِي ظَلۡتَ عَلَيۡهِ عَاكِفٗاۖ لَّنُحَرِّقَنَّهُۥ ثُمَّ لَنَنسِفَنَّهُۥ فِي ٱلۡيَمِّ نَسۡفًا
(మూసా) అన్నాడు: "సరే వెళ్ళిపో! నిశ్చయంగా, నీ శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం 'నన్ను ముట్టవద్దు' (లా మిసాస) అని, అంటూ ఉంటావు. మరియు నిశ్చయంగా, నీకు (వచ్చే జీవితంలో శిక్ష) నిర్ణయించబడి ఉంది, దాని నుండి నీవు తప్పించుకోలేవు. ఇక నీవు, భక్తుడవైన నీ ఆరాధ్యదైవాన్ని చూడు! మేము దానిని నిశ్చయంగా, కాల్చుతాము తరువాత దానిని భస్మం చేసి సముద్రంలో విసిరి వేస్తాము."(a)
(a) దీనితో విశదమయ్యేదేమిటంటే, షిర్క్ వైపుకు మరల్చే ప్రతిదానిని నాశనం చేయాలి. అది జిబ్రీల్ ('అ.స.) పాద గుర్తుల మట్టి అయినా సరే! దానిని ప్రసాదంగా భావించి ఆరాధిస్తే, అది కూడా షిర్కే.
آیت : 98
إِنَّمَآ إِلَٰهُكُمُ ٱللَّهُ ٱلَّذِي لَآ إِلَٰهَ إِلَّا هُوَۚ وَسِعَ كُلَّ شَيۡءٍ عِلۡمٗا
నిశ్చయంగా, మీ ఆరాధ్యదైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం ప్రతి దానిని ఆవరించి ఉంది.

آیت : 99
كَذَٰلِكَ نَقُصُّ عَلَيۡكَ مِنۡ أَنۢبَآءِ مَا قَدۡ سَبَقَۚ وَقَدۡ ءَاتَيۡنَٰكَ مِن لَّدُنَّا ذِكۡرٗا
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవంగా మేము, మా తరఫు నుండి నీకు హితోపదేశాన్ని (ఈ ఖుర్ఆన్ ను) ప్రసాదించాము.
آیت : 100
مَّنۡ أَعۡرَضَ عَنۡهُ فَإِنَّهُۥ يَحۡمِلُ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وِزۡرًا
దీని నుండి ముఖం త్రిప్పుకునే వాడు పునరుత్థాన దినమున (గొప్ప పాప) భారాన్ని భరిస్తాడు.
آیت : 101
خَٰلِدِينَ فِيهِۖ وَسَآءَ لَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ حِمۡلٗا
అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. పునరుత్థాన దినమున వారికా భారం ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది.
آیت : 102
يَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِۚ وَنَحۡشُرُ ٱلۡمُجۡرِمِينَ يَوۡمَئِذٖ زُرۡقٗا
ఆ దినమున బాకా (సూర్) ఊదబడుతుంది.(a) మరియు మేము అపరాధులను ఒకచోట జమ చేస్తాము. ఆ రోజు వారి కళ్ళు (భయంతో) నీలమై పోతాయి.
(a) 'సూర్: అంటే ఖర్న్, బాకా. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో ఇస్రాఫీల్ ('అ.స.) దానిని ఊదుతారు. అప్పుడు పునరుత్థానం ఆవరిస్తుంది. (ముస్నద్ అ'హ్మద్, 2/191) దాదాపు ఇలాంటి 'హదీసే 'తిర్మిజీ'లో కూడా ఉంది. మొదటి శబ్దంతో అందరూ మరణిస్తారు. రెండవసారి బాకా ఊదగానే అందరూ తిరిగి సజీవులుగా లేచి వస్తారు.
آیت : 103
يَتَخَٰفَتُونَ بَيۡنَهُمۡ إِن لَّبِثۡتُمۡ إِلَّا عَشۡرٗا
వారు ఒకరితో నొకరు ఇలా గుసగుసలాడుకుంటారు: "మీరు (భూమిలో) పది (రోజుల) కంటే ఎక్కువ ఉండలేదు."(a)
(a) ఈ విధమైన ఆయత్ ల కొరకు చూడండి, 2:259, 17:52, 18:19, 23:112-113, 30:55, 79:46.
آیت : 104
نَّحۡنُ أَعۡلَمُ بِمَا يَقُولُونَ إِذۡ يَقُولُ أَمۡثَلُهُمۡ طَرِيقَةً إِن لَّبِثۡتُمۡ إِلَّا يَوۡمٗا
వారు ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో మంచి తెలివి గలవారు: "మీరు కేవలం ఒక్క దినం మాత్రమే ఉన్నారు!" అని అంటారు.
آیت : 105
وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡجِبَالِ فَقُلۡ يَنسِفُهَا رَبِّي نَسۡفٗا
మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: "నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు.
آیت : 106
فَيَذَرُهَا قَاعٗا صَفۡصَفٗا
ఆ తరువాత దానిని (భూమిని) చదునైన మైదానంగా చేసి వేస్తాడు.
آیت : 107
لَّا تَرَىٰ فِيهَا عِوَجٗا وَلَآ أَمۡتٗا
నీవు దానిలో ఎలాంటి పల్లం గానీ, మిట్టగానీ చూడలేవు."(a)
(a) చూడండి, 14:48.
آیت : 108
يَوۡمَئِذٖ يَتَّبِعُونَ ٱلدَّاعِيَ لَا عِوَجَ لَهُۥۖ وَخَشَعَتِ ٱلۡأَصۡوَاتُ لِلرَّحۡمَٰنِ فَلَا تَسۡمَعُ إِلَّا هَمۡسٗا
ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు.(a) అనంత కరణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు.
(a) ఆ పిలిచే వాని నుండి తప్పించుకొని అటూ ఇటూ పోకుండా అతని వెంటబడే పోతారు.
آیت : 109
يَوۡمَئِذٖ لَّا تَنفَعُ ٱلشَّفَٰعَةُ إِلَّا مَنۡ أَذِنَ لَهُ ٱلرَّحۡمَٰنُ وَرَضِيَ لَهُۥ قَوۡلٗا
ఆ రోజు సిఫారసు ఏ మాత్రం పనికిరాదు. కానీ! అనంత కరుణామయుడు ఎవరికైనా అనుమతినిచ్చి, అతని మాట ఆయనకు సమ్మతమైనదైతేనే తప్ప! (a)
(a) ఈ విధమైన ఆయత్ ఖుర్ఆన్ లో ఎన్నో సార్లు వచ్చింది. చూడండి, 53:26, 21:28, 34:23, 10:3, 78:38, 2:255, 19:87 మొదలైనవి.
آیت : 110
يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡ وَلَا يُحِيطُونَ بِهِۦ عِلۡمٗا
(ఎందుకంటే!) ఆయనకు - వారికి ప్రత్యక్షంగా నున్నది మరియు పరోక్షంగా నున్నది - అంతా తెలుసు, కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు.(a)
(a) అల్లాహ్ (సు.తా.)కు ప్రతి ఒక్కరి విషయం తెలుసు, కాబట్టి ఎవరు ఎక్కువ సత్పురుషులో ఆయనకు బాగా తెలుసు. అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరూ అది ఎరుగరు. కావున సిఫారసు చేసే అర్హత గల వానిని ఆయనే ఎన్నుకుంటాడు.
آیت : 111
۞ وَعَنَتِ ٱلۡوُجُوهُ لِلۡحَيِّ ٱلۡقَيُّومِۖ وَقَدۡ خَابَ مَنۡ حَمَلَ ظُلۡمٗا
మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు (శాశ్వితుడు) అయిన ఆయన (అల్లాహ్) ముందు అందరి ముఖాలు నమ్రతతో వంగి ఉంటాయి. మరియు దుర్మార్గాన్ని అవలంబించినవాడు, నిశ్చయంగా, విఫలుడవుతాడు.(a)
(a) దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ప్రతివానికి అతని హక్కు చెల్లించండి. లేకుంటే పునరుత్థాన దినమున ఇవ్వవలసి ఉంటుంది.' మరొక 'హదీస్'లో ఉంది: 'దుర్మార్గం నుండి దూరంగా ఉండండి, షిర్క్ మహా దుర్మార్గం (''జుల్మె అ''జీమ్), అది క్షమించబడదు.' ('స. ముస్లిం).
آیت : 112
وَمَن يَعۡمَلۡ مِنَ ٱلصَّٰلِحَٰتِ وَهُوَ مُؤۡمِنٞ فَلَا يَخَافُ ظُلۡمٗا وَلَا هَضۡمٗا
మరియు సత్కార్యాలు చేస్తూ, విశ్వాసి అయి ఉన్న వానికి ఎలాంటి అన్యాయం గానీ, నష్టం గానీ జరుగునేమోనని భయపడే అవసరం ఉండదు.(a)
(a) చూడండి, 16:96-97.
آیت : 113
وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ قُرۡءَانًا عَرَبِيّٗا وَصَرَّفۡنَا فِيهِ مِنَ ٱلۡوَعِيدِ لَعَلَّهُمۡ يَتَّقُونَ أَوۡ يُحۡدِثُ لَهُمۡ ذِكۡرٗا
మరియు ఈ విధంగా మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము. మరియు ఇందులో పలురకాల హెచ్చరికలు చేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారేమోనని; లేదా! వారు ఉపదేశం గ్రహిస్తారేమోనని.(a)
(a) చూడండి, 12:2, 13:37, 14:4, 19:97.

آیت : 114
فَتَعَٰلَى ٱللَّهُ ٱلۡمَلِكُ ٱلۡحَقُّۗ وَلَا تَعۡجَلۡ بِٱلۡقُرۡءَانِ مِن قَبۡلِ أَن يُقۡضَىٰٓ إِلَيۡكَ وَحۡيُهُۥۖ وَقُل رَّبِّ زِدۡنِي عِلۡمٗا
అల్లాహ్ అత్యున్నతుడు, సార్వభౌముడు,(a) పరమ సత్యుడు (ఓ ముహమ్మద్!) నీకు ఖుర్ఆన్ సందేశం (వహీ) పూర్తిగా అవతరింప జేయబడే వరకు దానిని గురించి తొందరపడకు. మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి పరచు!"(b)
(a) అల్-మలికు: చూడండి, 23:116, 59:23, 62:1, Soveriegn, సార్వభౌముడు, విశ్వాధిపతి. అల్-మలీక్: Mighty Emperor, చక్రవర్తి, సర్వాధికారి, 54:55. మాలికు: Master, Owner, 1:4 : Sovereign, of the Universe, విశ్వసామ్రాట్టు, విశ్వసామ్రాజ్యాధిపతి, చూడండి, 3:26. (b) ఖుర్ఆన్ అవతరణకు చూడండి, 75:16-19 మరియు 25:32.
آیت : 115
وَلَقَدۡ عَهِدۡنَآ إِلَىٰٓ ءَادَمَ مِن قَبۡلُ فَنَسِيَ وَلَمۡ نَجِدۡ لَهُۥ عَزۡمٗا
మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఆదమ్ తో ఒక వాగ్దానం చేయించి ఉన్నాము, కాని అతడు దానిని మరచి పోయాడు మరియు మేము అతనిలో స్థిరత్వాన్ని చూడలేదు.(a)
(a) ఆ వాగ్దానం ఏమిటంటే ఒక ప్రత్యేక వృక్షపు దరిదాపులకు పోగూడదని, అంటే ఆ వృక్షపు ఫలాలు తినకూడదని. కాని షైతాన్ అతనిని ('అ.స.) మరియు అతని ('అ.స.) భార్యను తన వలలోకి తీసుకొని: 'ఆ వృక్షపు ఫలాలను తినటం వల్ల మీరు చిరంజీవులవుతారు.' అని చెప్పి, వారి చేత ఆ ఫలాన్ని తినిపించి, అల్లాహ్ (సు.తా.) తో చేసిన వాగ్దానాన్ని భంగం చేయించాడు.
آیت : 116
وَإِذۡ قُلۡنَا لِلۡمَلَٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ أَبَىٰ
మరియు మేము దేవదూతలతో: "ఆదమ్(a) కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆజ్ఞాపించినపుడు ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు. అతడు నిరాకరించాడు.
(a) ఆదమ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 2:30-34, 15:28-34.
آیت : 117
فَقُلۡنَا يَٰٓـَٔادَمُ إِنَّ هَٰذَا عَدُوّٞ لَّكَ وَلِزَوۡجِكَ فَلَا يُخۡرِجَنَّكُمَا مِنَ ٱلۡجَنَّةِ فَتَشۡقَىٰٓ
అప్పుడు అన్నాము: "ఓ ఆదమ్! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని, మీ ఇద్దరిని స్వర్గం నుండి వెడల గొట్టనివ్వకండి అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు.(a)
(a) తష్ఖా: అంటే ప్రయాస, కష్టం, కఠినం. ఏమిటంటే, స్వర్గంలో మానవుని అత్యవసర వసతులు అంటే ఆహారపానీయాలు, వస్త్రాలు మరియు నివాసం అన్నీ కోరిన వెంటనే లభిస్తాయి. వాటి కొరకు కష్టపడే అవసరం వుండదు. కాని, ఇహలోకంలో వాటి కొరకు మానవుడు ప్రయాస పడుతూ వుంటాడు. అదే దీని అర్థం.
آیت : 118
إِنَّ لَكَ أَلَّا تَجُوعَ فِيهَا وَلَا تَعۡرَىٰ
నిశ్చయంగా, ఇక్కడ నీవు ఆకలి గొనవూ మరియు వస్త్రహీనుడవూ (దిగంబరుడవూ) కావు.(a)
(a) చూడండి, 7:20-22.
آیت : 119
وَأَنَّكَ لَا تَظۡمَؤُاْ فِيهَا وَلَا تَضۡحَىٰ
మరియు నిశ్చయంగా, ఇందులో నీకు దాహమూ కలుగదు మరియు ఎండ కూడా తగలదు."
آیت : 120
فَوَسۡوَسَ إِلَيۡهِ ٱلشَّيۡطَٰنُ قَالَ يَٰٓـَٔادَمُ هَلۡ أَدُلُّكَ عَلَىٰ شَجَرَةِ ٱلۡخُلۡدِ وَمُلۡكٖ لَّا يَبۡلَىٰ
అప్పుడు షైతాన్ అతని మనస్సులో కలతలు రేకెత్తిస్తూ అన్నాడు: "ఓ ఆదమ్! శాశ్వత జీవితాన్ని మరియు అంతం కాని సామ్రాజ్యాన్ని, ఇచ్చే వృక్షాన్ని నీకు చూపనా?"
آیت : 121
فَأَكَلَا مِنۡهَا فَبَدَتۡ لَهُمَا سَوۡءَٰتُهُمَا وَطَفِقَا يَخۡصِفَانِ عَلَيۡهِمَا مِن وَرَقِ ٱلۡجَنَّةِۚ وَعَصَىٰٓ ءَادَمُ رَبَّهُۥ فَغَوَىٰ
ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తినగానే వారిద్దరికి, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది.(a) మరియు వారిద్దరు స్వర్గపు ఆకులను తమ మీద కప్పుకోసాగారు. (ఈ విధంగా) ఆదమ్ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పి పోయాడు.
(a) వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది. చూడండి, 7:26-27.
آیت : 122
ثُمَّ ٱجۡتَبَٰهُ رَبُّهُۥ فَتَابَ عَلَيۡهِ وَهَدَىٰ
ఆ తరువాత అతని ప్రభువు, అతనిని (తన కారుణ్యానికి) ఎన్నుకొని, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతనికి మార్గదర్శకత్వం చేశాడు.
آیت : 123
قَالَ ٱهۡبِطَا مِنۡهَا جَمِيعَۢاۖ بَعۡضُكُمۡ لِبَعۡضٍ عَدُوّٞۖ فَإِمَّا يَأۡتِيَنَّكُم مِّنِّي هُدٗى فَمَنِ ٱتَّبَعَ هُدَايَ فَلَا يَضِلُّ وَلَا يَشۡقَىٰ
(అల్లాహ్) అన్నాడు: "మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరి కొకరు శత్రువులై(a) ఉంటారు. కాని నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది, కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు.
(a) అంటే మానవుడు మరియు షై'తాను చూడండి, 7:24 మరియు 2:36.
آیت : 124
وَمَنۡ أَعۡرَضَ عَن ذِكۡرِي فَإِنَّ لَهُۥ مَعِيشَةٗ ضَنكٗا وَنَحۡشُرُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ أَعۡمَىٰ
మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము."
آیت : 125
قَالَ رَبِّ لِمَ حَشَرۡتَنِيٓ أَعۡمَىٰ وَقَدۡ كُنتُ بَصِيرٗا
అప్పుడతను అంటాడు: "ఓ నా ప్రభూ! నన్నెందుకు గ్రుడ్డివానిగా లేపావు, వాస్తవానికి నేను (ప్రపంచంలో) చూడగలిగే వాణ్ణి కదా?"

آیت : 126
قَالَ كَذَٰلِكَ أَتَتۡكَ ءَايَٰتُنَا فَنَسِيتَهَاۖ وَكَذَٰلِكَ ٱلۡيَوۡمَ تُنسَىٰ
అప్పుడు (అల్లాహ్) అంటాడు: "మా సూచనలు నీ వద్దకు వచ్చినపుడు, నీవు వాటిని విస్మరించావు. మరియు అదే విధంగా ఈ రోజు నీవు విస్మరించబడుతున్నావు."
آیت : 127
وَكَذَٰلِكَ نَجۡزِي مَنۡ أَسۡرَفَ وَلَمۡ يُؤۡمِنۢ بِـَٔايَٰتِ رَبِّهِۦۚ وَلَعَذَابُ ٱلۡأٓخِرَةِ أَشَدُّ وَأَبۡقَىٰٓ
మరియు ఈ విధంగా, మేము మితిమీరి ప్రవర్తిస్తూ, తన ప్రభువు సూచనలను విశ్వసించని వానికి ప్రతీకారం చేస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో కఠినమైనది మరియు శాశ్వతమైనది.
آیت : 128
أَفَلَمۡ يَهۡدِ لَهُمۡ كَمۡ أَهۡلَكۡنَا قَبۡلَهُم مِّنَ ٱلۡقُرُونِ يَمۡشُونَ فِي مَسَٰكِنِهِمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّأُوْلِي ٱلنُّهَىٰ
వీరికి పూర్వం గడిచిన ఎన్నో తరాలను మేము నాశనం చేసి ఉన్నాము. వీరు వారి నివాస స్థలాలలో తిరుగుతున్నారు. ఏమీ? దీని వలన కూడా వీరికి మార్గదర్శకత్వం లభించలేదా? నిశ్చయంగా, ఇందులో అర్థం చేసుకునే వారికి ఎన్నో సూచనలున్నాయి.
آیت : 129
وَلَوۡلَا كَلِمَةٞ سَبَقَتۡ مِن رَّبِّكَ لَكَانَ لِزَامٗا وَأَجَلٞ مُّسَمّٗى
మరియు నీ ప్రభువు నుండి మొదట్లోనే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉండక పోతే, వీరికి ఈ పాటికే (శిక్ష) తప్పక విధించబడి ఉండేది. కాని (వీరి) గడువు కాలం నిర్ణయించబడి ఉంది.(a)
(a) అల్లాహ్ (సు.తా.) పాపం చేసేవారిని వెనువెంటనే శిక్షిస్తే ప్రపంచంలో ఒక్కడు కూడా శిక్షింపబడకుండా ఉండడు. ఇది అల్లాహ్ (సు.తా.) కు తెలుసు, కాబట్టి ఆయన (సు.తా.) ప్రతి ఒక్కరికి పశ్చాత్తాప పడటానికి గడువు ఇస్తాడు. ఇదే అల్లాహ్ (సు.తా.) విధానం (సాంప్రదాయం). ఇక ఆ సమయం వచ్చిన తరువాత ఆయన శిక్ష నుండి తప్పించేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే నీవు సత్యతిరస్కారులను భోగభాగ్యాలతో విర్రవీగుతూ ఉండటాన్ని చూస్తున్నావు. చూడండి, 10:11, 16:61, 18:58.
آیت : 130
فَٱصۡبِرۡ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ قَبۡلَ طُلُوعِ ٱلشَّمۡسِ وَقَبۡلَ غُرُوبِهَاۖ وَمِنۡ ءَانَآيِٕ ٱلَّيۡلِ فَسَبِّحۡ وَأَطۡرَافَ ٱلنَّهَارِ لَعَلَّكَ تَرۡضَىٰ
కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు నీవు ఓర్పు వహించు. సూర్యుడు ఉదయించక ముందు మరియు అస్తమించక ముందు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చెయ్యి. మరియు రాత్రి సమయాలలో మరియు పగటి వేళలలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు.(a) అప్పుడు నీపు సంతుష్టుడవవు తావు!
(a) చూడండి, 11:114.
آیت : 131
وَلَا تَمُدَّنَّ عَيۡنَيۡكَ إِلَىٰ مَا مَتَّعۡنَا بِهِۦٓ أَزۡوَٰجٗا مِّنۡهُمۡ زَهۡرَةَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا لِنَفۡتِنَهُمۡ فِيهِۚ وَرِزۡقُ رَبِّكَ خَيۡرٞ وَأَبۡقَىٰ
మేము వారిలో చాలా మందికి - వాటితో వారిని పరీక్షించటానికి - వారు అనుభవించటానికి, ఇచ్చిన ఇహలోక జీవిత శోభను నీవు కళ్ళెత్తి చూడకు.(a) నీ ప్రభువు ఇచ్చే జీవనోపాధియే అత్యుత్తమమైనది మరియు చిరకాలముండేది.(b)
(a) ఇలాంటి సందేశానికి చూడండి, 3:196-197, 15:88 18:7 (b) ఒకసారి 'ఉమర్ (ర'ది.'అ.) దైవప్రవక్త ('స'అ) దగ్గరికి వచ్చారు. అతన ఒక చాప మీద పండుకొని ఉన్నది చూసి ఏడ్వసాగారు. అతని ఇంట్లో రెండు చర్మాల కంటే ఎక్కువ ఏమీ లేవు. దైవప్రవక్త ('స'అస) అతని ఏడ్పుకు కారణమడగగా, 'ఉమర్ (ర'ది.'అ) ఇలా జవాబిచ్చారు: 'ఖైసర్ మరియు కిస్రాలు ఎన్నో భోగభాగ్యాలలో మునిగి ఉన్నారు. మీరేమో అత్యుత్తమ సృష్టి అయి కూడా ఈ స్థితిలో ఉన్నారు.' దానికి దైవప్రవక్త ('స'అస) అన్నారు: " 'ఉమర్ (ర'ది.'అ) నీకు ఇంకా సందేహముందా? ఎవరికైతే కేవలం ఇహలోకంలోనే భోగభాగ్యాలు ఇవ్వబడ్డాయో వారే వీరు. వీరికి పరలోకంలో ఏమీ మిగలదు." ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).
آیت : 132
وَأۡمُرۡ أَهۡلَكَ بِٱلصَّلَوٰةِ وَٱصۡطَبِرۡ عَلَيۡهَاۖ لَا نَسۡـَٔلُكَ رِزۡقٗاۖ نَّحۡنُ نَرۡزُقُكَۗ وَٱلۡعَٰقِبَةُ لِلتَّقۡوَىٰ
మరియు నీ కుటుంబం వారిని నమాజ్ చేయమని ఆజ్ఞాపించు; మరియు స్వయంగా నీవు కూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము. మేమే నీకు జీవనోపాధిని ఇచ్చే వారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు.
آیت : 133
وَقَالُواْ لَوۡلَا يَأۡتِينَا بِـَٔايَةٖ مِّن رَّبِّهِۦٓۚ أَوَلَمۡ تَأۡتِهِم بَيِّنَةُ مَا فِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ
మరియు వారంటారు: "ఇతను (ఈ ప్రవక్త) తన ప్రభువు నుండి ఏదైనా ఒక అద్భుత సూచన (మహిమ) ఎందుకు తీసుకురాడు?" ఏమీ? పూర్వపు గ్రంథాలలో పేర్కొనబడిన స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు రాలేదా?(a)
(a) ఇంకా చూడండి, 2:42 మరియు 61:6.
آیت : 134
وَلَوۡ أَنَّآ أَهۡلَكۡنَٰهُم بِعَذَابٖ مِّن قَبۡلِهِۦ لَقَالُواْ رَبَّنَا لَوۡلَآ أَرۡسَلۡتَ إِلَيۡنَا رَسُولٗا فَنَتَّبِعَ ءَايَٰتِكَ مِن قَبۡلِ أَن نَّذِلَّ وَنَخۡزَىٰ
ఒకవేళ మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను / ముహమ్మద్ ను) పంపక ముందే వారిని శిక్షించి ఉంటే! వారు అనేవారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు? (అలా చేస్తే) నిశ్ఛయంగా, మేము - అవమానం పొంది, అగౌరవం పాలుకాక ముందే - నీ సూచనలను పాటించేవారం కదా?"(a)
(a) అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా అజ్ఞానంతో చేసే తప్పుల కొరకు - వారికి మార్గదర్శకత్వం చూపనంతవరకు - శిక్షించడు. అంటే సన్మార్గాన్ని చూసిన తరువాత కూడా దాన్ని తిరస్కరించి మార్గభ్రష్టులైన వారిని శిక్షిస్తాడు. ఇంకా చూడండి, 6:131, 15:4 మరియు 26:208-209.
آیت : 135
قُلۡ كُلّٞ مُّتَرَبِّصٞ فَتَرَبَّصُواْۖ فَسَتَعۡلَمُونَ مَنۡ أَصۡحَٰبُ ٱلصِّرَٰطِ ٱلسَّوِيِّ وَمَنِ ٱهۡتَدَىٰ
వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు (తన అంతిమ ఫలితం కొరకు వేచి ఉన్నాడు. కావున మీరు కూడా వేచి ఉండండి. సరైన మార్గంలో ఉన్న వారెవరో మరియు మార్గదర్శకత్వం పొందిన వారెవరో మీరు త్వరలోనే తెలుసుకుంటారు."
په کامیابۍ سره ولیږل شو