節 :
1
وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰ
క్రమ్ముకునే రాత్రి సాక్షిగా!
節 :
2
وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ
ప్రకాశించే పగటి సాక్షిగా!
節 :
3
وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ
మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
節 :
4
إِنَّ سَعۡيَكُمۡ لَشَتَّىٰ
వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;(a)
節 :
5
فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!
節 :
6
وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ
మరియు మంచిని నమ్ముతాడో!(a)
節 :
7
فَسَنُيَسِّرُهُۥ لِلۡيُسۡرَىٰ
అతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము.(a)
節 :
8
وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسۡتَغۡنَىٰ
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో!(a)
節 :
9
وَكَذَّبَ بِٱلۡحُسۡنَىٰ
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!
節 :
10
فَسَنُيَسِّرُهُۥ لِلۡعُسۡرَىٰ
అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.
節 :
11
وَمَا يُغۡنِي عَنۡهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?
節 :
12
إِنَّ عَلَيۡنَا لَلۡهُدَىٰ
నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని!
節 :
13
وَإِنَّ لَنَا لَلۡأٓخِرَةَ وَٱلۡأُولَىٰ
మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.
節 :
14
فَأَنذَرۡتُكُمۡ نَارٗا تَلَظَّىٰ
కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.