クルアーンの対訳

テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

Scan the qr code to link to this page

سورة التوبة - సూరహ్ అత్-తౌబహ్

ページ番号

節(アーヤ)を表示
脚注を表示

節 : 1
بَرَآءَةٞ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلۡمُشۡرِكِينَ
అల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి (ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) ఎలాంటి సంబంధం లేదు, అని ప్రకటించబడుతోంది.(a)
(a) బరా'తున్: అంటే ఎట్టి సంబంధం లేదనటం. ఈ ఆయత్ లు అంవతరింపజేయబడినప్పుడు దైవప్రవక్త ('స'అస) 'అలీ ('ర.ది.అ.ను) 9వ హిజ్రీ 'హజ్ జనసమూహంలో ఈ విషయాలను ప్రకటించమని పంపారు: 1) ప్రజలు క'అబహ్ (బైతుల్లాహ్) చుట్టూ దిగంబరులై ప్రదక్షిణ ('తవాఫ్) చేయకూడదు. 2) ఈ సంవత్సరం (9 హిజ్రీ) తరువాత ఏ ముష్రిక్ కూడా బైతుల్లాహ్ ('హజ్)కు రాకూడదు. 3) ఏ అవిశ్వాసులతోనైతే ఒడంబడిక ఉందో, వారి యెడల గడువు పూర్తి అయ్యేవరకు విశ్వాసపాత్రంతో వ్యవహరించడం జరుగుతుంది. ('స. బు'ఖారీ మరియు 'స. ముస్లిం). ఆ 9వ హిజ్రీ 'హజ్ కు అబూ బక్ర్ 'సిద్ధీఖ్ (ర.'ది.అ.) అమీర్ గా ఉన్నారు.
節 : 2
فَسِيحُواْ فِي ٱلۡأَرۡضِ أَرۡبَعَةَ أَشۡهُرٖ وَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ غَيۡرُ مُعۡجِزِي ٱللَّهِ وَأَنَّ ٱللَّهَ مُخۡزِي ٱلۡكَٰفِرِينَ
కావున (ఓ ముష్రికులారా!) మీరు నాలుగు నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి(a). కాని మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్! సత్యతిరస్కారులను అవమానం పాలు చేస్తాడు.
(a) చూడండి, 8:58. ఈ ఆయత్, ముస్లింలతో చేసిన ఒడంబడికను, త్రెంపిన ముష్రికులను ఉద్దేశించి ఉంది.
節 : 3
وَأَذَٰنٞ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلنَّاسِ يَوۡمَ ٱلۡحَجِّ ٱلۡأَكۡبَرِ أَنَّ ٱللَّهَ بَرِيٓءٞ مِّنَ ٱلۡمُشۡرِكِينَ وَرَسُولُهُۥۚ فَإِن تُبۡتُمۡ فَهُوَ خَيۡرٞ لَّكُمۡۖ وَإِن تَوَلَّيۡتُمۡ فَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ غَيۡرُ مُعۡجِزِي ٱللَّهِۗ وَبَشِّرِ ٱلَّذِينَ كَفَرُواْ بِعَذَابٍ أَلِيمٍ
మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి పెద్ద హజ్జ్(a) రోజున సర్వమానవ జాతికి ప్రకటన చేయబడుతోంది: "నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు, బహుదైవారాధకులతో, ఎలాంటి సంబంధం లేదు. కావున మీరు (ఓ ముష్రికులారా!) పశ్చాత్తాపపడితే, అది మీ మేలుకే. కాని మీరు విముఖులైతే, మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి." మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష (విధించబడ) నున్నదనే వార్తను వినిపించు.
a) యౌమల్ 'హజ్జిల్-అక్బర్: అంటే 10వ జు'ల్-'హజ్ దినమని 'స'హీ'హ్ 'హదీసుల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు 'హాజీలకు చాలా మనాసిక్ లను పూర్తి చేయవలసి ఉంటుంది. అది 'హజ్జె 'అస్గర్ కు భిన్నపదం. అరేబియా వాసులు, 'ఉమ్ రాను చిన్న హజ్ ('హజ్ 'అస్గర్) అనేవారు. దీనికి భిన్నంగా జు'ల్-'హజ్ మాసంలో జరిగేది పెద్ద హజ్ (హ'జ్ అక్బర్). 9వ జు'ల్-'హజ్ శుక్రవారం రోజు వస్తే 'హజ్జె అక్బర్ అనే దానికి ఎలాంటి ఆధారం లేదు. ('స.బు'ఖారీ, నం4655, 'స. ముస్లిం, నం. 982 మరియు తిర్మిజీ', నం. 957).
節 : 4
إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلۡمُشۡرِكِينَ ثُمَّ لَمۡ يَنقُصُوكُمۡ شَيۡـٔٗا وَلَمۡ يُظَٰهِرُواْ عَلَيۡكُمۡ أَحَدٗا فَأَتِمُّوٓاْ إِلَيۡهِمۡ عَهۡدَهُمۡ إِلَىٰ مُدَّتِهِمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ
కాని ఏ బహుదైవాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపం చేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే! వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చెయ్యండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.
節 : 5
فَإِذَا ٱنسَلَخَ ٱلۡأَشۡهُرُ ٱلۡحُرُمُ فَٱقۡتُلُواْ ٱلۡمُشۡرِكِينَ حَيۡثُ وَجَدتُّمُوهُمۡ وَخُذُوهُمۡ وَٱحۡصُرُوهُمۡ وَٱقۡعُدُواْ لَهُمۡ كُلَّ مَرۡصَدٖۚ فَإِن تَابُواْ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَءَاتَوُاْ ٱلزَّكَوٰةَ فَخَلُّواْ سَبِيلَهُمۡۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ
ఇక నిషిద్ధమాసాలు(a) గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి.(b) మరియు వారిని పట్టుకోండి(c) మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి. కాని వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే, వారిని వారి మార్గాన వదలి పెట్టండి.(d) నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
a) హిజ్రీ శకంలోని రజబ్, జు'ల్-ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ నెలలు నిషిద్ధమాసాలు. ఈ మాసాలలో యుద్ధం నిషిద్ధం. ఇది 'అరబ్బులలో ఇస్లాంకు ముందు నుండి వస్తూ ఉన్న ఆచారం. చూడండి, 2:194, 217. ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) ఇక్కడ (ఈ ఆయత్ లో) నిషిద్ధమాసాలు అంటే ఈ ప్రకటన తరువాత నాలుగు నెలలు అంటే 10వ జు'ల్-'హిజ్జహ్ నుండి 10వ రబీ'అ-అత్తాని వరకు, అని అన్నారు. (b) 'హరమ్ సరిహద్దులలో కేవలం వారితోనే పోరాడాలి, ఎవరైతే మీపై దాడి చేస్తారో! చూడండి,2:190-194, (ఇబ్నె-కసీ'ర్). మీతో యుద్ధం చేసే వారితోఅల్లాహ్ (సు.తా.) మార్గంలో పోరాడండి. ఎవరైతే మీతో విరోధాలు చేయరో, వారితో పోరాడవద్దు. జిహాద్ అంటే, మీరు ముస్లింలు అయి ఉండి. ఇతరులకు శాంతియుతంగా ఏక దైవసిద్ధాంతాం, సత్యధర్మం అయిన ఇస్లాంను బోధిస్తూ ఉంటే, మీ మార్గంలో ఆటంకాలు పెడుతూ, మీ ధన, మాన, ప్రాణాలకు హాని గలిగించగోరే వారితో, వారు మానుకునే వరకు లేదా నిర్మూలించబడే వరకు చేసే ధర్మయుద్ధం. చూడండి, 4:91. అంటే ఆత్మ సంరక్షణ కొరకు చేసే పోరాటం జిహాద్. చూడండి, 60:8-9. (c) ఖైదీలుగా చేసుకొనండి. (d) వారి రాకపోకడలపై కాపలా పెట్టండి. మీ అనుమతి లేనిదే వారిని కదలనివ్వకండి. వారి నివాస స్థలాలను కాపెట్టుకొని ఉండండి. (e) చూడండి, 2:256. 'ధర్మ విషయంలో బలవంతం లేదు.' అంటే ఎవ్వరినీ కూడా ఇస్లాం స్వీకరించటానికి బలవంతం చేయకూడదు.
節 : 6
وَإِنۡ أَحَدٞ مِّنَ ٱلۡمُشۡرِكِينَ ٱسۡتَجَارَكَ فَأَجِرۡهُ حَتَّىٰ يَسۡمَعَ كَلَٰمَ ٱللَّهِ ثُمَّ أَبۡلِغۡهُ مَأۡمَنَهُۥۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَعۡلَمُونَ
మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి - అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు. (a)
(a) పై ఆయత్ మీతో యుద్ధం చేస్తున్న సత్యతిరస్కారుల విషయంలో అవతరింపజేయబడింది. ఈ విరోధులైన సత్యతిరస్కారులలో ఎవడైనా మీ శరణు కోరితే అతనికి శరణు ఇవ్వండి. అతడు మీతో ఉండి మీ మంచితనాన్ని మరియు ఇస్లాంను దగ్గరనుండి చూసి ఖుర్ఆన్ విని ముస్లిం కావచ్చు. అతడు ఖుర్ఆన్ ను విన్న తరువాత కూడా ఇస్లాం స్వీకరించకుంటే అతనిని, అతనికి భద్రతనిచ్చే స్థలానికి పంపండి. అతడు ముస్లిం కాకున్నా సరే. మీరిచ్చిన శరణపు ప్రతిజ్ఞను పూర్తి చేసుకోండి. అతడు తన భద్రతాస్థలానికి చేరేంత వరకు వాని ప్రాణ రక్షణ మీ బాధ్యత.

節 : 7
كَيۡفَ يَكُونُ لِلۡمُشۡرِكِينَ عَهۡدٌ عِندَ ٱللَّهِ وَعِندَ رَسُولِهِۦٓ إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّمۡ عِندَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۖ فَمَا ٱسۡتَقَٰمُواْ لَكُمۡ فَٱسۡتَقِيمُواْ لَهُمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ
బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరామ్ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.
節 : 8
كَيۡفَ وَإِن يَظۡهَرُواْ عَلَيۡكُمۡ لَا يَرۡقُبُواْ فِيكُمۡ إِلّٗا وَلَا ذِمَّةٗۚ يُرۡضُونَكُم بِأَفۡوَٰهِهِمۡ وَتَأۡبَىٰ قُلُوبُهُمۡ وَأَكۡثَرُهُمۡ فَٰسِقُونَ
(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు.
節 : 9
ٱشۡتَرَوۡاْ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلٗا فَصَدُّواْ عَن سَبِيلِهِۦٓۚ إِنَّهُمۡ سَآءَ مَا كَانُواْ يَعۡمَلُونَ
వారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి!
節 : 10
لَا يَرۡقُبُونَ فِي مُؤۡمِنٍ إِلّٗا وَلَا ذِمَّةٗۚ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُعۡتَدُونَ
వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దును అతిక్రమించినవారు.
節 : 11
فَإِن تَابُواْ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَءَاتَوُاْ ٱلزَّكَوٰةَ فَإِخۡوَٰنُكُمۡ فِي ٱلدِّينِۗ وَنُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡلَمُونَ
కావున వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగల వారికి, మేము మా సూచనలను, ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము.
節 : 12
وَإِن نَّكَثُوٓاْ أَيۡمَٰنَهُم مِّنۢ بَعۡدِ عَهۡدِهِمۡ وَطَعَنُواْ فِي دِينِكُمۡ فَقَٰتِلُوٓاْ أَئِمَّةَ ٱلۡكُفۡرِ إِنَّهُمۡ لَآ أَيۡمَٰنَ لَهُمۡ لَعَلَّهُمۡ يَنتَهُونَ
మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత, మళ్ళీ తమ ప్రమాణాలను భంగం చేస్తే! మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే, అలాంటి సత్యతిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా, వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు!(a)
(a) ఎవరైతే ఒడంబడిక చేసిన తరువాత తమ ఒండబడికలను భంగం చేస్తారో మరియు మీ ధర్మాన్ని అవమానపరుస్తారో, అలాంటి సత్యతిరస్కారులతో యుద్ధం చేయండి.
節 : 13
أَلَا تُقَٰتِلُونَ قَوۡمٗا نَّكَثُوٓاْ أَيۡمَٰنَهُمۡ وَهَمُّواْ بِإِخۡرَاجِ ٱلرَّسُولِ وَهُم بَدَءُوكُمۡ أَوَّلَ مَرَّةٍۚ أَتَخۡشَوۡنَهُمۡۚ فَٱللَّهُ أَحَقُّ أَن تَخۡشَوۡهُ إِن كُنتُم مُّؤۡمِنِينَ
ఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కా నుండి) వెడల గొట్టాలని నిర్ణయించారో! మరియు మొదట వారే, మీతో తగవు ఆరంభించారో,(a) అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమీ? మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే, కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం.
(a) బహుశా ఇక్కడ ఖురైషులు తమ ఒడంబడికకు విరుద్ధంగా బనీ-'ఖు'జా'అ వారిని చంపటానికి, బనీ-బక్ర్ వారికి తోడ్పడిన విషయం పేర్కొనబడింది. బనీ-'ఖు'జా'అ - ముస్లింల హలీఫ్ లు, మరియు బనీ-బక్ర్ - ఖురైషుల హలీఫ్ లు. దైవప్రవక్త ('స'అస) మరియు మక్కా ముష్రిక్ ఖురైషుల మధ్య: 'పది సంవత్సరాల వరకు - వారి మధ్య మరియు వారి హలీఫ్ లతో కూడా - యుద్ధం చేయకూడదు మరియు వారితో పోరాడే వారికి సహాయం కూడా చేయరాదు.' అనే, ఒడంబడిక ఉండెను. ఇది 6వ హిజ్రీలో హుదైబియాలో జరిగిన ఒడంబడిక.

節 : 14
قَٰتِلُوهُمۡ يُعَذِّبۡهُمُ ٱللَّهُ بِأَيۡدِيكُمۡ وَيُخۡزِهِمۡ وَيَنصُرۡكُمۡ عَلَيۡهِمۡ وَيَشۡفِ صُدُورَ قَوۡمٖ مُّؤۡمِنِينَ
వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు. మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు;
節 : 15
وَيُذۡهِبۡ غَيۡظَ قُلُوبِهِمۡۗ وَيَتُوبُ ٱللَّهُ عَلَىٰ مَن يَشَآءُۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ
మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు. మరియు అల్లాహ్! తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
節 : 16
أَمۡ حَسِبۡتُمۡ أَن تُتۡرَكُواْ وَلَمَّا يَعۡلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَٰهَدُواْ مِنكُمۡ وَلَمۡ يَتَّخِذُواْ مِن دُونِ ٱللَّهِ وَلَا رَسُولِهِۦ وَلَا ٱلۡمُؤۡمِنِينَ وَلِيجَةٗۚ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ
ఏమీ? అల్లాహ్ మీలో నుండి (తన మార్గంలో) పోరాడేవారెవరో మరియు - అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప - ఇతరుల నెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో, తెలుసుకోనిదే మిమ్మల్ని వదలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును.
節 : 17
مَا كَانَ لِلۡمُشۡرِكِينَ أَن يَعۡمُرُواْ مَسَٰجِدَ ٱللَّهِ شَٰهِدِينَ عَلَىٰٓ أَنفُسِهِم بِٱلۡكُفۡرِۚ أُوْلَٰٓئِكَ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ وَفِي ٱلنَّارِ هُمۡ خَٰلِدُونَ
బహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయటానికి) అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు.
節 : 18
إِنَّمَا يَعۡمُرُ مَسَٰجِدَ ٱللَّهِ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمۡ يَخۡشَ إِلَّا ٱللَّهَۖ فَعَسَىٰٓ أُوْلَٰٓئِكَ أَن يَكُونُواْ مِنَ ٱلۡمُهۡتَدِينَ
నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు!(a)
(a) దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఒకవేళ మీరు ఒక వ్యక్తిని సక్రమంగా మస్జిద్ కు వస్తూ ఉండేది చూస్తే, అతని విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వండి.' (తిర్మిజీ', తఫ్సీర్ 'సూ. అత్-తౌబహ్). ఖుర్ఆన్ లో ఇక్కడ కూడా అల్లాహ్ (సు.తా.)ను అంతిమదినాన్ని విశ్వసించిన తరువాత చేయవలసిన పనులలో నమా'జ్, దాని తరువాత 'జకాత్ అని పేర్కొనబడ్డాయి. మరొక 'హదీస్' ముత్తఫిఖ్ అలైహి ఉంది. అబూ-బక్ర్ 'సిద్ధీఖ్ (ర'ది.'అ) అన్నారు: 'అల్లాహ్ తోడు, నేను అలాంటి వారితో తప్పక పోరాడుతాను, ఎవరైతే నమా'జ్ మరియు 'జకాత్ ల మధ్య భేదం చూపుతారో!' అంటే నమా'జ్ చేస్తారు కాని 'జకాత్ ఇవ్వడానికి వెనుకంజవేస్తారో! (చూడండి, 9:5).
節 : 19
۞ أَجَعَلۡتُمۡ سِقَايَةَ ٱلۡحَآجِّ وَعِمَارَةَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ كَمَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَجَٰهَدَ فِي سَبِيلِ ٱللَّهِۚ لَا يَسۡتَوُۥنَ عِندَ ٱللَّهِۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ
ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు.(a) మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు.
(a) ఈ ఆయత్ అవతరింపజేయబడిన సందర్భాన్ని గురించి, 'స'హాబా ('ర.ది.'అన్హుమ్)ల మధ్య మస్జిదె నబవీలో శుక్రవారం మింబర్ దగ్గర జరిగిన ఈ సంభాషణ కారణం అంటారు. ఒక 'సహాబీ (ర'ది.'అ) అంటారు: "నేను ఇస్లాం స్వీకరించిన తరువాత నా దృష్టిలో అన్నిటి కంటే ఉత్తమమైన కార్యం 'హాజీలకు 'జమ్'జమ్ త్రావపడం." రెండో అతను అంటాడు: "నా దగ్గర మస్జిద్ అల్-'హరాం సేవ చేయడం." మూడవ అతను అంటారు: "అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ చేయడం." ఈ 'హదీస్' కథకుడు నూమూన్ బిన్-బషీర్ (ర.'ది.'అ.) నేను ఆరోజు జుమ'అహ్ నమాజ్' తరువాత వెళ్ళి దైవప్రవక్త ('స'అస)కు ఈ విషయం తెలిపాను. అప్పుడు ఈ ఆయత్ అవతరింప జేయబడింది. ('స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ ఇమారహ్, బాబ్ ఫజ్ల్ అష్షహాదహ్ ఫీ సబీలిల్లాహ్). అల్లాహ్ (సు.తా.)ను అంతిమదినాన్ని విశ్వసించిన తరువాతనే అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ స్వీకరించబడుతుంది. ఈమాన్ లేనిదే ఎంత గొప్ప కార్యం చేసినా దాని ఫలితం శూన్యమే. విశ్వాసుని జిహద్ సర్వకార్యాలలో గొప్పది. ఈ విషయం దీని తరువాత ఉన్న ఆయత్ లో స్పష్టంగా ఉంది.
節 : 20
ٱلَّذِينَ ءَامَنُواْ وَهَاجَرُواْ وَجَٰهَدُواْ فِي سَبِيلِ ٱللَّهِ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡ أَعۡظَمُ دَرَجَةً عِندَ ٱللَّهِۚ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَآئِزُونَ
విశ్వసించి, అల్లాహ్ మార్గంలో వలస పోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను, ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికీ, అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు.(a)
(a) చూడండి, 'స. బు'ఖారీ, పు - 4, 'హ. 48, 54.

節 : 21
يُبَشِّرُهُمۡ رَبُّهُم بِرَحۡمَةٖ مِّنۡهُ وَرِضۡوَٰنٖ وَجَنَّٰتٖ لَّهُمۡ فِيهَا نَعِيمٞ مُّقِيمٌ
వారి ప్రభువు వారికి, తన తరఫు నుండి కారుణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలు గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు.
節 : 22
خَٰلِدِينَ فِيهَآ أَبَدًاۚ إِنَّ ٱللَّهَ عِندَهُۥٓ أَجۡرٌ عَظِيمٞ
వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దగ్గర గొప్ప ప్రతిఫలముంది.
節 : 23
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُوٓاْ ءَابَآءَكُمۡ وَإِخۡوَٰنَكُمۡ أَوۡلِيَآءَ إِنِ ٱسۡتَحَبُّواْ ٱلۡكُفۡرَ عَلَى ٱلۡإِيمَٰنِۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمۡ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ
ఓ విశ్వాసులారా! మీ తండ్రితాతలు మరియు మీ సోదరులు సత్యతిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీలో వారి వైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితులుగా చేసుకునే వారే) దుర్మార్గులు.(a)
(a) హిజ్ రత్ నుండి జిహాద్ విషయంలో మీరు, మీ సోదరుల మరియు తండ్రుల ప్రేమను రానివ్వకండి. వారు మీ స్నేహితులు కాలేరు. వారు మీతో మంచిగా వ్యవహరిస్తే, మిమ్మల్ని మీ ఇస్లాం ధర్మాన్ని పాటించటం నుండి ఆపకుంటే, వారితో మంచిగా వ్యవహరించండి. కాని వారు మిమ్మల్ని ఇస్లాం కొరకే బాధిస్తే, వారిని మీ స్నేహితులుగా భావించకండి. (చూ. 3:28, 60:89).
節 : 24
قُلۡ إِن كَانَ ءَابَآؤُكُمۡ وَأَبۡنَآؤُكُمۡ وَإِخۡوَٰنُكُمۡ وَأَزۡوَٰجُكُمۡ وَعَشِيرَتُكُمۡ وَأَمۡوَٰلٌ ٱقۡتَرَفۡتُمُوهَا وَتِجَٰرَةٞ تَخۡشَوۡنَ كَسَادَهَا وَمَسَٰكِنُ تَرۡضَوۡنَهَآ أَحَبَّ إِلَيۡكُم مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ وَجِهَادٖ فِي سَبِيلِهِۦ فَتَرَبَّصُواْ حَتَّىٰ يَأۡتِيَ ٱللَّهُ بِأَمۡرِهِۦۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ
వారితో ఇలా అను: "మీ తండ్రితాతలు మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అజ్వాజ్), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు - అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే - మీకు ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు."(a)
(a) దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఎవరిచేతిలోనైతే నా ప్రాణాలున్నాయో ఆ అల్లాహ్ (సు.తా.) తోడు. మీలో ఏ ఒక్కడు కూడా ముఅ'మిన్ కాజాలడు, ఎంతవరకైతే అతడు తన తండ్రి, తన సంతానం మరియు ఇతరులందరికంటే, నన్ను ('స'అస) ఎక్కువగా ప్రేమించడో!" ('స'హీ'హ్ బుఖా'రీ, కితాబ్ అల్ - ఈమాన్, బాబ్ 'హుబ్బె రసూల్ ('స'అస) మినల్ ఈమాన్; 'స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ - ఈమాన్).
節 : 25
لَقَدۡ نَصَرَكُمُ ٱللَّهُ فِي مَوَاطِنَ كَثِيرَةٖ وَيَوۡمَ حُنَيۡنٍ إِذۡ أَعۡجَبَتۡكُمۡ كَثۡرَتُكُمۡ فَلَمۡ تُغۡنِ عَنكُمۡ شَيۡـٔٗا وَضَاقَتۡ عَلَيۡكُمُ ٱلۡأَرۡضُ بِمَا رَحُبَتۡ ثُمَّ وَلَّيۡتُم مُّدۡبِرِينَ
వాస్తవానికి ఇది వరకు చాలా యుద్ధరంగాలలో (మీరు కొద్దిమంది ఉన్నా) అల్లాహ్ మీకు విజయం చేకూర్చాడు. మరియు హునైన్ (యుద్ధం) రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వకారణమయింది. కాని, అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకై పోయింది. తరువాత మీరు వెన్ను చూపి పారిపోయారు.(a)
(a) 'హునైన్, మక్కా మరియు 'తాయిప్ ల మధ్య పర్వతాలలో ఉన్న ఒక లోయ (వాది). అక్కడ హవా'జిన్ మరియు స'ఖీఫ్ అనే రెండు తెగలవారు ఉండేవారు. వారు విలువిద్యలో నిపుణులు. వారు ముస్లింలకు విరుద్ధంగా పోరాడటానికి, యుద్ధ తయారీలు చేస్తున్నారని తెలుసుకొని దైవప్రవక్త ('స'అస), 12,000 సైనికులతో, మక్కా విజయపు 18-19 దినాల తరువాత 8వ హిజ్రీ, షవ్వాల్ నెలలో వారిపై దాడి చేయడానికి వెళ్తారు. ముస్లింలకు తమ సంఖ్యాబలం కొంత వరకు గర్వానికి కారణమవుతుంది. ఇది అల్లాహ్ (సు.తా.)కు నచ్చదు. శత్రువులు దాదాపు 4,000 మంది ఉంటారు. శత్రువుల బాణాల దెబ్బలకు తాళుకోలేక ముస్లిం సైనికులు వెనుదిరిగి పారిపోసాగుతారు. కేవలం దైవప్రవక్త ('స'అస), కొందరు ముస్లింలతో బాటు మిగిలిపోతారు. దైవప్రవక్త ('స'అస), పారిపోయేవారిని ఆపటానికి కేకలు వేస్తారు. తరువాత అతను ('స'అస), 'అబ్బాస్ (ర.'ది.'అ)తో వారిని పిలవమని అంటారు. అతను పెద్ద పెద్ద కేకలు వేయటం వల్ల, సిగ్గుపడి కొందరు తిరిగి వస్తారు. ఆ ఉన్నవారే ధైర్యస్థైర్యాలతో యుద్ధం చేసి అల్లాహ్ (సు.తా.) అనుగ్రహంతో విజయం పొందుతారు. శత్రువులు తమ ఆస్తిపాస్తులన్నీ విడిచి పారిపోతారు.
節 : 26
ثُمَّ أَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَىٰ رَسُولِهِۦ وَعَلَى ٱلۡمُؤۡمِنِينَ وَأَنزَلَ جُنُودٗا لَّمۡ تَرَوۡهَا وَعَذَّبَ ٱلَّذِينَ كَفَرُواْۚ وَذَٰلِكَ جَزَآءُ ٱلۡكَٰفِرِينَ
తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు.(a) మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం.
(a) కనిపించని దళాలను అంటే దైవదూతలను, అల్లాహ్ (సు.తా.) పంపాడు. ఏ విధంగానైతే ఉ'హుద్ యుద్ధంలో (చూడండి, 3:124-125) మరియు బద్ర్ యుద్ధంలో (చూడండి, 8:9) పంపాడో!

節 : 27
ثُمَّ يَتُوبُ ٱللَّهُ مِنۢ بَعۡدِ ذَٰلِكَ عَلَىٰ مَن يَشَآءُۗ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ
ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
節 : 28
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّمَا ٱلۡمُشۡرِكُونَ نَجَسٞ فَلَا يَقۡرَبُواْ ٱلۡمَسۡجِدَ ٱلۡحَرَامَ بَعۡدَ عَامِهِمۡ هَٰذَاۚ وَإِنۡ خِفۡتُمۡ عَيۡلَةٗ فَسَوۡفَ يُغۡنِيكُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦٓ إِن شَآءَۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ حَكِيمٞ
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవారాధకులు (ముష్రికీన్) అపరిశుద్ధులు (నజ్స్)(a). కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్ అల్ హరామ్ సమీపానికి రాకూడదు.(b) మరియు ఒకవేళ మీరు లేమికి భయపడితే! అల్లాహ్ కోరితే, తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపన్నులుగా చేయగలడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
(a) నజసున్: అంటే అవిశ్వాసులు, అశుచులు, అశుభ్రులు, అపరిశుద్ధులు, మురికివారు, మాలిన్యులు, కల్మాషులు అనే అర్థాలున్నాయి. ఈ అపరిశుద్ధత శారీరకంగా గానీ, లేక మానసికంగా గానీ, లేక రెండూ గానీ కావచ్చు. శారీరకంగా ఎందుకంటే వారు లైంగిక లేక కాలకృత్యాల అపరిశుద్ధత తరువాత విధిగా పరిశుద్ధత అవలంబించక పోవడం. మానసికంగా, ఎందుకంటే వారు ఏకైక ఆరాధ్యుడు, సర్వసృష్టికర్త, సర్వపోషకుడు అయిన అల్లాహ్ (సు.తా.)ను వదలి ఇతరులను ఏమీ చేయలేని వారిని అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించడం. ఈ శబ్దం ఖురఆన్ లో ఈ ఆయత్ లోనే ఒకేసారి వచ్చింది. (b) ముస్లిమేతరులు 'హరమ్ సరిహద్దులలోకి రాకూడదు. ఈ ఆజ్ఞ 9వ హిజ్రీలో వచ్చింది. కాని వారు ఇతర మస్జిదులలో ప్రవేశించవచ్చు. ఉదాహరణకు దైవప్రవక్త ('స'అస) స'మామ బిన్ - ఆసాల్ (ర'ది.'అ.)ను అతడు ఇస్లాం స్వీకరించక ముందు మస్జిద్ అన్ నబవీలో ఒక స్థంభానికి ఖైదీగా కట్టి ఉంచారు.
節 : 29
قَٰتِلُواْ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَلَا بِٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ ٱللَّهُ وَرَسُولُهُۥ وَلَا يَدِينُونَ دِينَ ٱلۡحَقِّ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ حَتَّىٰ يُعۡطُواْ ٱلۡجِزۡيَةَ عَن يَدٖ وَهُمۡ صَٰغِرُونَ
అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని; అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి, నిషిద్ధమని భావించని; సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని గ్రంథ ప్రజలతో - వారు స్వయంగా తమ చేతులతో జిజ్ యా(a) ఇచ్చి లోబడి ఉండే వరకూ - పోరాడండి.(b)
(a) జి'జ్ యతున్: ఖుర్ఆన్ లో ఇచ్చట ఒకేసారి వచ్చింది. జి'జ్ యా అంటే, ముస్లిమేతరులతో ఇస్లామీయ ప్రభుత్వం వసూలు చేసే పన్ను. దీనికి కారణాలు: 1) వారు విధిగా 'జకాత్ చెల్లించరు, 2) వారికి ఇస్లామీయ ప్రభుత్వంలో జిహాద్, అంటే ఇస్లాం ధర్మ రక్షణ కొరకు పోరాడటం విధికాదు, 3) వారి ఆత్మరక్షణ ఖర్చు కొరకు. ఈ క్రింద పేర్కొన్న వారికి జి'జ్ యా లేదు. 1) స్త్రీలు, 2) యుక్తవయస్సుకు రాని పురుషులు, 3) వృద్ధులు, 4) వ్యాధిగ్రస్తులు మరియు వికలాంగులు, 5) ధర్మవేత్తలు, గురువులు, మునులు, 6) ఎవరైతే జిహాద్ (మిలటరీ డ్యూటీ) కొరకు సిద్ధపడతారో వారు. (b) జిహాద్ ను ఈ విధంగా కూడా వివరించారు : అల్లాహ్ (సు.తా.) మార్గంలో పోరాడటం, అంటే సత్యాన్ని మరియు దానిని అనుసరించే వారిని (ముస్లింలను) రక్షించటానికి చేసే ధర్మ యుద్ధం. ఇది ప్రతి ముస్లిం యొక్క విధి. (చూడండి, 2:190-194).
節 : 30
وَقَالَتِ ٱلۡيَهُودُ عُزَيۡرٌ ٱبۡنُ ٱللَّهِ وَقَالَتِ ٱلنَّصَٰرَى ٱلۡمَسِيحُ ٱبۡنُ ٱللَّهِۖ ذَٰلِكَ قَوۡلُهُم بِأَفۡوَٰهِهِمۡۖ يُضَٰهِـُٔونَ قَوۡلَ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَبۡلُۚ قَٰتَلَهُمُ ٱللَّهُۖ أَنَّىٰ يُؤۡفَكُونَ
మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు.(a) మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక! వారెంత మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)!
(a) బాబిలోనియన్ లు (Babylonians) యూదులను, వెడలగొట్టిన తరువాత వారు (యూదులు) తౌరాత్ ను కోల్పోయారు. అది ఈ రోజు న్న స్థితిలోకి, దానిని తిరిగి తెచ్చినవారు 'ఉ'జైర్ 'అ.స. (Ezra). అతనే ఈ రోజు ఆచారంలో ఉన్న యూదమతాన్ని స్థాపించారు. (Encyclopedia Brittanica, 1963, vol-9, p.15). అతనినే యూదులు అల్లాహుతా'ఆలా కుమారుడంటారు.
節 : 31
ٱتَّخَذُوٓاْ أَحۡبَارَهُمۡ وَرُهۡبَٰنَهُمۡ أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِ وَٱلۡمَسِيحَ ٱبۡنَ مَرۡيَمَ وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُوٓاْ إِلَٰهٗا وَٰحِدٗاۖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَۚ سُبۡحَٰنَهُۥ عَمَّا يُشۡرِكُونَ
వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదలి తమ యూద మతాచారులు (అహ్ బార్) లను మరియు (క్రైస్తవ) సన్యాసులను (రుహ్ బాన్ లను) మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ ను (క్రీస్తును) తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు.(a) వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు.
(a) చూడండి, 3:64.

節 : 32
يُرِيدُونَ أَن يُطۡفِـُٔواْ نُورَ ٱللَّهِ بِأَفۡوَٰهِهِمۡ وَيَأۡبَى ٱللَّهُ إِلَّآ أَن يُتِمَّ نُورَهُۥ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ
వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో (ఊది) ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు; సత్యతిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా, ఆయన తన జ్యోతిని పూర్తిచేసి (ప్రసరింపజేసి) తీరుతాడు.
節 : 33
هُوَ ٱلَّذِيٓ أَرۡسَلَ رَسُولَهُۥ بِٱلۡهُدَىٰ وَدِينِ ٱلۡحَقِّ لِيُظۡهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡمُشۡرِكُونَ
బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే!(a)
(a) చూడండి, 3:19 మరియు 61:8-9.
節 : 34
۞ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّ كَثِيرٗا مِّنَ ٱلۡأَحۡبَارِ وَٱلرُّهۡبَانِ لَيَأۡكُلُونَ أَمۡوَٰلَ ٱلنَّاسِ بِٱلۡبَٰطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِۗ وَٱلَّذِينَ يَكۡنِزُونَ ٱلذَّهَبَ وَٱلۡفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ ٱللَّهِ فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٖ
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, చాలా మంది యూద మతాచారులు (అహ్ బార్) మరియు క్రైస్తవ సన్యాసులు (రుహ్ బాన్) ప్రజల సొత్తును అక్రమ పద్ధతుల ద్వారా తిని వేస్తున్నారు మరియు వారిని అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తున్నారు. మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు.
節 : 35
يَوۡمَ يُحۡمَىٰ عَلَيۡهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكۡوَىٰ بِهَا جِبَاهُهُمۡ وَجُنُوبُهُمۡ وَظُهُورُهُمۡۖ هَٰذَا مَا كَنَزۡتُمۡ لِأَنفُسِكُمۡ فَذُوقُواْ مَا كُنتُمۡ تَكۡنِزُونَ
ఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి.(a) (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున మీరు కూడ బెట్టుకున్న దానిని చవి చూడండి."
(a) చూడండి, 3:180 ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నెం. 486.
節 : 36
إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثۡنَا عَشَرَ شَهۡرٗا فِي كِتَٰبِ ٱللَّهِ يَوۡمَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ مِنۡهَآ أَرۡبَعَةٌ حُرُمٞۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلۡقَيِّمُۚ فَلَا تَظۡلِمُواْ فِيهِنَّ أَنفُسَكُمۡۚ وَقَٰتِلُواْ ٱلۡمُشۡرِكِينَ كَآفَّةٗ كَمَا يُقَٰتِلُونَكُمۡ كَآفَّةٗۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ
నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్ధ (మాసాలు).(a) ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగ హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి.(b) బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి.(c)
(a) నిషిద్ధమాసాలు హిజ్రీ శకపు రజబ్, జు'ల్-ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ (7, 11, 12 మరియు 1వ నెలలు). (b) హిజ్రీ నెలల లెక్క చంద్రుని నెలప్రకారం ఉంది.అంటే హిజ్రీ సంవత్సరం చాంద్రమాన సంవత్సరం. ఇది ప్రకృతి సిద్ధమైన నెలలు మరియు సంవత్సరాలు. వీటిని అనుసరించటానికి లెక్కలు పెట్టే అవసరం లేదు. దీని వల్ల రమ'దాన్ ఉపవాసాలు మరియు 'హజ్ వేరువేరు ఋతువులలో వస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రజలు ప్రతి ఋతువులో ఉపవాసాలు, పండుగలు చేసుకుంటారు. చాంద్రనెల 29.5 రోజులది మరియు చాంద్ర సంవత్సరం 354 రోజులది. సూర్యమాన సంవత్సరంలో ఇది 11.25 రోజులు తక్కువ. దీని వల్ల ప్రతి 34 చాంద్రమాన సంవత్సరాలకు అంటే 12,036 దినాలకు ఒకసారి 'హజ్ అదే దినమున మళ్ళీ వస్తుంది. ముష్రిక్ అరబ్బులు, చాంద్రమాన సంవత్సరాన్ని సూర్యమాన సంవత్సరంతో సరిపెట్టటానికి అధికమాసాన్ని చేర్చేవారు. ఈ ఆయత్ తరువాత ఇస్లాం షరీయత్ లో సూర్యమాన సంవత్సరం మరియు అలా సరిపెట్టటం రద్దు చేయబడ్డాయి. (c) చూడండి, 2:193, 8:73.

節 : 37
إِنَّمَا ٱلنَّسِيٓءُ زِيَادَةٞ فِي ٱلۡكُفۡرِۖ يُضَلُّ بِهِ ٱلَّذِينَ كَفَرُواْ يُحِلُّونَهُۥ عَامٗا وَيُحَرِّمُونَهُۥ عَامٗا لِّيُوَاطِـُٔواْ عِدَّةَ مَا حَرَّمَ ٱللَّهُ فَيُحِلُّواْ مَا حَرَّمَ ٱللَّهُۚ زُيِّنَ لَهُمۡ سُوٓءُ أَعۡمَٰلِهِمۡۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ
నిశ్చయంగా, నెలలను వెనుక ముందు చేయటం (నసీఉ) సత్యతిరస్కారంలో అదనపు చేష్టయే! దాని వల్ల సత్యతిరస్కారులు మార్గభ్రష్టత్వానికి గురి చేయబడుతున్నారు. వారు దానిని ఒక సంవత్సరం ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం నిషేధించుకుంటారు. ఈ విధంగా వారు అల్లాహ్ నిషేధించిన (నెలల) సంఖ్యను తమకు అనుగుణంగా మార్చుకొని అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకుంటున్నారు. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా కనిపిస్తున్నాయి. మరియు అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.
節 : 38
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ مَا لَكُمۡ إِذَا قِيلَ لَكُمُ ٱنفِرُواْ فِي سَبِيلِ ٱللَّهِ ٱثَّاقَلۡتُمۡ إِلَى ٱلۡأَرۡضِۚ أَرَضِيتُم بِٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا مِنَ ٱلۡأٓخِرَةِۚ فَمَا مَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فِي ٱلۡأٓخِرَةِ إِلَّا قَلِيلٌ
ఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: "అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నారేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది!(a)
(a) చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నెం. 53.
節 : 39
إِلَّا تَنفِرُواْ يُعَذِّبۡكُمۡ عَذَابًا أَلِيمٗا وَيَسۡتَبۡدِلۡ قَوۡمًا غَيۡرَكُمۡ وَلَا تَضُرُّوهُ شَيۡـٔٗاۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ
మీరు బయలు దేరకపోతే, ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు. మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు.(a) మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
(a) ఇక్కడ 9వ హిజ్రీ షవ్వాల్ నెలలో జరిగిన తబూక్ దండ్రయాత్ర ప్రస్తావన ఉంది. బైజాంటైన్ (Byzantine) చక్రవర్తి, క్రైస్తవుడైన, హెరాక్లియస్, ముస్లింలకు విరుద్ధంగా యుద్ధసన్నాహాలు మొదలు పెడ్తాడు. కావున ము'హమ్మద్ ('స'అస) కూడా యుద్ధసన్నాహాలు మొదలు పెడ్తారు. అది కపట విశ్వాసులకు ఎంతో బాధాకరంగా ఉంటుంది. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) ముస్లింలతో, క్రైస్తవులను ఎదుర్కోవటానికి తబూక్ వెళ్ళి, అక్కడ 20 రోజులుండి, క్రైస్తవులు యుద్ధానికి రానందుకు తిరిగి వచ్చేస్తారు.
節 : 40
إِلَّا تَنصُرُوهُ فَقَدۡ نَصَرَهُ ٱللَّهُ إِذۡ أَخۡرَجَهُ ٱلَّذِينَ كَفَرُواْ ثَانِيَ ٱثۡنَيۡنِ إِذۡ هُمَا فِي ٱلۡغَارِ إِذۡ يَقُولُ لِصَٰحِبِهِۦ لَا تَحۡزَنۡ إِنَّ ٱللَّهَ مَعَنَاۖ فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَيۡهِ وَأَيَّدَهُۥ بِجُنُودٖ لَّمۡ تَرَوۡهَا وَجَعَلَ كَلِمَةَ ٱلَّذِينَ كَفَرُواْ ٱلسُّفۡلَىٰۗ وَكَلِمَةُ ٱللَّهِ هِيَ ٱلۡعُلۡيَاۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٌ
ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్యతిరస్కారులు అతనిని పారద్రోలి నపుడు, అల్లాహ్ అతనికి సహాయం చేశాడో! అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా (సౌర్) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో (అబూ బక్ర్ తో): "నీవు దుఃఖ పడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు!" అని అన్నాడు.(a) అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవదూతల) దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహో వివేచనాపరుడు.
(a) క్రీ.శకం 622, (ప్రవక్త పదవి ప్రసాదించబడిన దాదాపు 13వ సంవత్సరం)లో, ము'హమ్మద్ ('స'అస) ను చంపటానికి, మక్కా ముష్రికులు అతని ఇంటి మీదికి, రాత్రివేళ ప్రతి తెగ నుండి ఒక యువకుణ్ణి తయారుచేసి పంపుతారు. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో, దైవప్రవక్త ('స'అస) వారి మీద దుమ్ము విసరగా, వారికి కునుకు వస్తుంది. ఆ తరువాత అతను ('స'అస), అబూ బక్ర్ (ర'ది.'అ.)తో సహా బయలుదేరి, సౌ'ర్ కొండ గుహలో మూడు రోజులు దాగుతారు. ముష్రికులు వారిని వెతుక్కుంటూ గుహపై వరకు చేరుతారు. కాని ముష్రికులు వారిద్దరిని కనుగొనలేక పోతారు. అది వారిద్దరు గమనిస్తారు. ఆ సందర్భంలో దైవప్రవక్త ('స'అస) అబూ బక్ర్ (ర'ది.'అ)తో ఈ మాటలు అంటారు. ('స'హీ'హ్ బు'ఖారీ).

節 : 41
ٱنفِرُواْ خِفَافٗا وَثِقَالٗا وَجَٰهِدُواْ بِأَمۡوَٰلِكُمۡ وَأَنفُسِكُمۡ فِي سَبِيلِ ٱللَّهِۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ
తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది.
節 : 42
لَوۡ كَانَ عَرَضٗا قَرِيبٗا وَسَفَرٗا قَاصِدٗا لَّٱتَّبَعُوكَ وَلَٰكِنۢ بَعُدَتۡ عَلَيۡهِمُ ٱلشُّقَّةُۚ وَسَيَحۡلِفُونَ بِٱللَّهِ لَوِ ٱسۡتَطَعۡنَا لَخَرَجۡنَا مَعَكُمۡ يُهۡلِكُونَ أَنفُسَهُمۡ وَٱللَّهُ يَعۡلَمُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ
అది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణం అయితే వారు తప్పక నీ వెంట వెళ్ళేవారు. కాని వారికది (తబూక్ ప్రయాణం) చాలా కష్టమైనదిగా (దూరమైనదిగా) అనిపించింది. కావున వారు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ అంటున్నారు: "మేము రాగల స్థితిలో ఉంటే తప్పక మీ వెంట వచ్చి ఉండేవారము." (ఈ విధంగా అబద్ధమాడి) వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. మరియు వారు అబద్ధమాడుతున్నారని అల్లాహ్ కు బాగా తెలుసు.(a)
(a) ఎండకాలం, ఖర్జూర పంటకాలం, చాలా దూరపు ప్రయాణం కావటం వల్ల కపటవిశ్వాసులు, బలహీన విశ్వాసం గలవారు, మరికొందరు ఎడారి వాసు(బద్ధూ)లు, ఎన్నో బూటక సాకులు చెప్పి దైవప్రవక్త ('స'అస) ను వెనుక ఉండి పోవటానికి అనుమతి అడుగుతారు. దైవప్రవక్త ('స'అస) అనుమతి కూడా ఇస్తారు. ఆ సందర్భంలో ఇది మరియు దీని తరువాత ఆయతులు అవతరింపజేయబడ్డాయి.
節 : 43
عَفَا ٱللَّهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمۡ حَتَّىٰ يَتَبَيَّنَ لَكَ ٱلَّذِينَ صَدَقُواْ وَتَعۡلَمَ ٱلۡكَٰذِبِينَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నిన్ను మన్నించు గాక! సత్యవంతులెవరో నీకు స్పష్టం కాకముందే మరియు అబద్ధమాడే వారెవరో నీకు తెలియక ముందే, వారిని (వెనుక ఉండటానికి) ఎందుకు అనుమతి నిచ్చావు?(a)
(a) చూడండి, 24:62.
節 : 44
لَا يَسۡتَـٔۡذِنُكَ ٱلَّذِينَ يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ أَن يُجَٰهِدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡۗ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلۡمُتَّقِينَ
అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు, తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి (అల్లాహ్ మార్గంలో) పోరాడటం నుండి తప్పించుకోవటానికి ఎన్నడూ అనుమతి అడగరు. మరియు దైవభీతి గలవారు ఎవరో అల్లాహ్ కు బాగా తెలుసు.
節 : 45
إِنَّمَا يَسۡتَـٔۡذِنُكَ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَٱرۡتَابَتۡ قُلُوبُهُمۡ فَهُمۡ فِي رَيۡبِهِمۡ يَتَرَدَّدُونَ
నిస్సందేహంగా, అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని వారే, వెనుక ఉండటానికి అనుమతి అడుగుతారు. మరియు వారి హృదయాలు సందేహంలో మునిగి ఉన్నాయి. కావున వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడుతున్నారు.(a)
(a) ఈ జిహాద్ లో పాల్గొనే విషయంలో ముస్లింల నాలుగు వర్గాలు ఏర్పడ్డాయి: 1) సహృదయంతో వెంటనే జిహాద్ కు సిద్ధపడ్డ వారు; 2) మొదట సంకోచించి వెంటనే సిద్ధపడ్డవారు; 3) వృద్ధులు, రోగులు, మరియు ప్రయాణ ఖర్చులు లేనివారు - వీరిని అల్లాహ్ (సు.తా.) క్షమించాడు - చూడండి 9:91-92; 4) కేవలం సోమరితనం వల్ల పాల్గొననివారు. వీరు పశ్చాత్తాపపడి క్షమాపణ కోరగా వారి క్షమాపణ తరువాత అంగీకరించబడుతుంది. వీరు గాక బూటక సాకులు చెప్పి వెనుక ఉండి పోయిన కపట విశ్వాసులు కూడా ఉన్నారు.
節 : 46
۞ وَلَوۡ أَرَادُواْ ٱلۡخُرُوجَ لَأَعَدُّواْ لَهُۥ عُدَّةٗ وَلَٰكِن كَرِهَ ٱللَّهُ ٱنۢبِعَاثَهُمۡ فَثَبَّطَهُمۡ وَقِيلَ ٱقۡعُدُواْ مَعَ ٱلۡقَٰعِدِينَ
మరియు ఒకవేళ వారు బయలుదేరాలని కోరి ఉంటే తప్పక దానికై వారు యుద్ధ సామగ్రి సిద్ధ పరచుకొని ఉండేవారు, కాని వారు బయలు దేరటం అల్లాహ్ కు ఇష్టం లేదు, కావున వారిని నిలిపివేశాడు. మరియు వారితో: "కూర్చొని ఉన్న వారితో మీరు కూడా కూర్చొని ఉండండి!" అని చెప్పబడింది.
節 : 47
لَوۡ خَرَجُواْ فِيكُم مَّا زَادُوكُمۡ إِلَّا خَبَالٗا وَلَأَوۡضَعُواْ خِلَٰلَكُمۡ يَبۡغُونَكُمُ ٱلۡفِتۡنَةَ وَفِيكُمۡ سَمَّٰعُونَ لَهُمۡۗ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّٰلِمِينَ
ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం (ఫిత్న) రేకెత్తించటానికి తీవ్రప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు (కపట విశ్వాసుల కొరకు) మాటలు వినేవారు (వారి గూఢాచారులు) ఉన్నారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు.

節 : 48
لَقَدِ ٱبۡتَغَوُاْ ٱلۡفِتۡنَةَ مِن قَبۡلُ وَقَلَّبُواْ لَكَ ٱلۡأُمُورَ حَتَّىٰ جَآءَ ٱلۡحَقُّ وَظَهَرَ أَمۡرُ ٱللَّهِ وَهُمۡ كَٰرِهُونَ
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి, వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను తలక్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమయింది మరియు అల్లాహ్ నిర్ణయం స్పష్టమయ్యింది. మరియు వారు దీన్ని అసహ్యించుకున్నారు!
節 : 49
وَمِنۡهُم مَّن يَقُولُ ٱئۡذَن لِّي وَلَا تَفۡتِنِّيٓۚ أَلَا فِي ٱلۡفِتۡنَةِ سَقَطُواْۗ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةُۢ بِٱلۡكَٰفِرِينَ
మరియు వారిలో: "నాకు (వెనుక ఉండటానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!" అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి, వారు (ఇలా అనుమతి కోరి) పరీక్షకు గురి అయ్యారు! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది.
節 : 50
إِن تُصِبۡكَ حَسَنَةٞ تَسُؤۡهُمۡۖ وَإِن تُصِبۡكَ مُصِيبَةٞ يَقُولُواْ قَدۡ أَخَذۡنَآ أَمۡرَنَا مِن قَبۡلُ وَيَتَوَلَّواْ وَّهُمۡ فَرِحُونَ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే వారు: "మేము ముందుగానే జాగ్రత్త పడ్డాము!" అని అంటూ సంతోషపడుతూ మరలిపోతారు.
節 : 51
قُل لَّن يُصِيبَنَآ إِلَّا مَا كَتَبَ ٱللَّهُ لَنَا هُوَ مَوۡلَىٰنَاۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ
వారితో ఇలా అను: "అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి!"
節 : 52
قُلۡ هَلۡ تَرَبَّصُونَ بِنَآ إِلَّآ إِحۡدَى ٱلۡحُسۡنَيَيۡنِۖ وَنَحۡنُ نَتَرَبَّصُ بِكُمۡ أَن يُصِيبَكُمُ ٱللَّهُ بِعَذَابٖ مِّنۡ عِندِهِۦٓ أَوۡ بِأَيۡدِينَاۖ فَتَرَبَّصُوٓاْ إِنَّا مَعَكُم مُّتَرَبِّصُونَ
ఇలా అను: "మీరు మా విషయంలో నిరీక్షిస్తున్నది రెండు మేలైన వాటిలో ఒకటి. అల్లాహ్ స్వయంగా మీకు శిక్ష విధిస్తాడా, లేదా మా చేతుల ద్వారానా? అని మేము నిరీక్షిస్తున్నాము. కావున మీరూ నిరీక్షించండి, నిశ్చయంగా మేము కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాము!"
節 : 53
قُلۡ أَنفِقُواْ طَوۡعًا أَوۡ كَرۡهٗا لَّن يُتَقَبَّلَ مِنكُمۡ إِنَّكُمۡ كُنتُمۡ قَوۡمٗا فَٰسِقِينَ
ఇలా అను: "మీరు మీ (సంపదను) ఇష్టపూర్వకంగా ఖర్చు చేసినా, లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అది మీ నుండి స్వీకరించబడదు.(a) నిశ్చయంగా, మీరు అవిధేయులు (ఫాసిఖూన్)."
(a) చూడండి, 2:264, 4:38.
節 : 54
وَمَا مَنَعَهُمۡ أَن تُقۡبَلَ مِنۡهُمۡ نَفَقَٰتُهُمۡ إِلَّآ أَنَّهُمۡ كَفَرُواْ بِٱللَّهِ وَبِرَسُولِهِۦ وَلَا يَأۡتُونَ ٱلصَّلَوٰةَ إِلَّا وَهُمۡ كُسَالَىٰ وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمۡ كَٰرِهُونَ
మరియు వారి విరాళం (చందా) స్వీకరించబడకుండా పోవటానికి కారణం, వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి తిరస్కరించడం మరియు నమాజ్ కొరకు ఎంతో సోమరితనంతో తప్ప రాకపోవడం మరియు అయిష్టంతో (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టడమే!"(a)
(a) చూడండి, 'స. బు'ఖారీ, పు-1, 'హ. 626.

節 : 55
فَلَا تُعۡجِبۡكَ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُمۡۚ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ لِيُعَذِّبَهُم بِهَا فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَتَزۡهَقَ أَنفُسُهُمۡ وَهُمۡ كَٰفِرُونَ
కావున వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ, నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వకూడదు!(a) నిశ్చయంగా, అల్లాహ్ వాటి వలన వారిని, ఇహలోక జీవితంలో శిక్షించగోరుతున్నాడు. మరియు వారు సత్యతిరస్కార స్థితిలోనే తమ ప్రాణాలను కోల్పోతారు.
(a) చూడండి, 20:131 మరియు 23:55-56. ఇంకా చూడండి, 3:178 మరియు 8:28.
節 : 56
وَيَحۡلِفُونَ بِٱللَّهِ إِنَّهُمۡ لَمِنكُمۡ وَمَا هُم مِّنكُمۡ وَلَٰكِنَّهُمۡ قَوۡمٞ يَفۡرَقُونَ
మరియు వారు నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నామని అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు. కాని వారు మీతో లేరు. వాస్తవానికి వారు మీకు భయపడుతున్నారు.
節 : 57
لَوۡ يَجِدُونَ مَلۡجَـًٔا أَوۡ مَغَٰرَٰتٍ أَوۡ مُدَّخَلٗا لَّوَلَّوۡاْ إِلَيۡهِ وَهُمۡ يَجۡمَحُونَ
ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహగానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గానీ దొరికితే, వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు.(a)
(a) ఈ ఆయత్ కపట విశ్వాసులను గురించి ఉంది. వారిని గురించి ఇంకా చూడండి, 4:142, 9:67 మరియు 29:11. (ఖుర్ఆన్ అవతరణాక్రమంలో ఇది బహుశా కపట విశ్వాసులను గురించి వచ్చిన మొట్టమొదటి ఆయత్).
節 : 58
وَمِنۡهُم مَّن يَلۡمِزُكَ فِي ٱلصَّدَقَٰتِ فَإِنۡ أُعۡطُواْ مِنۡهَا رَضُواْ وَإِن لَّمۡ يُعۡطَوۡاْ مِنۡهَآ إِذَا هُمۡ يَسۡخَطُونَ
మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (సదఖాత్) పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు.(a) దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు. కాని దాని నుండి వారికి ఇవ్వబడక పోతే కోపగించుకుంటారు!
(a) చూడండి, 2:263-264.
節 : 59
وَلَوۡ أَنَّهُمۡ رَضُواْ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ وَقَالُواْ حَسۡبُنَا ٱللَّهُ سَيُؤۡتِينَا ٱللَّهُ مِن فَضۡلِهِۦ وَرَسُولُهُۥٓ إِنَّآ إِلَى ٱللَّهِ رَٰغِبُونَ
మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడి: "అల్లాహ్ యే మాకు చాలు! అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా (ఇస్తాడు). నిశ్చయంగా, మేము అల్లాహ్ నే వేడుకుంటాము!" అని పలికి ఉంటే (అది వారికే బాగుండేది!)
節 : 60
۞ إِنَّمَا ٱلصَّدَقَٰتُ لِلۡفُقَرَآءِ وَٱلۡمَسَٰكِينِ وَٱلۡعَٰمِلِينَ عَلَيۡهَا وَٱلۡمُؤَلَّفَةِ قُلُوبُهُمۡ وَفِي ٱلرِّقَابِ وَٱلۡغَٰرِمِينَ وَفِي سَبِيلِ ٱللَّهِ وَٱبۡنِ ٱلسَّبِيلِۖ فَرِيضَةٗ مِّنَ ٱللَّهِۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ
నిశ్చయంగా దానాలు (సదఖాత్)(a) కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి(b), (జకాత్) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో (పోయేవారి) కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
(a) ఇక్కడ 'సదఖాత్ అంటే 'జకాత్ అని అర్థం. ఎనిమిది (8) రకాల వారు వీటికి హక్కుదారులు: 1) ఫుఖరాకు; 2)మసాకీన్ లకు; 3)'జకాత్ ప్రోగుచేయటానికి నియుక్తులైన వారికి; 4) ఎవరి హృదయాలను ఇస్లాం వైపునకు ఆకర్షించవలసి ఉందో వారికి; 5) ముస్లిం బానిసల విముక్తికి; 6)ఋణగ్రస్తులైన వారికి; 7) అల్లాహ్ మార్గంలో మరియు 8) బాటసారులకు - వారు పేదవారు కాకున్నా - ప్రయాణంలో ఉన్నప్పుడు లేమికి గురి అయితే వారికి ఇవ్వాలి. (b) ఫఖీరున్: అంటే ఏమీ ఆదాయం లేనందుకు తన నిత్యావసరాలకు ఇతరులపై ఆధారపడి ఉండేవాడు. ఇట్టివారు విధిలేక యాచించవచ్చు . మిస్కీనున్: కొంత ఆదాయం గలవాడు కాని అది అతన నిత్యావసరాలకు సరిపోదు. అతడు ఇతరులతో యాచించుటకు వెనుకంజవేస్తాడు. తన స్వాభిమానంలో ఉంటాడు. ఇట్టివాడికి వాడి లక్షణాలు చూసి ఇవ్వాలి. ('స'హీ'హ్ బు.'ఖారీ, 'స'హీ'హ్. ముస్లిం).
節 : 61
وَمِنۡهُمُ ٱلَّذِينَ يُؤۡذُونَ ٱلنَّبِيَّ وَيَقُولُونَ هُوَ أُذُنٞۚ قُلۡ أُذُنُ خَيۡرٖ لَّكُمۡ يُؤۡمِنُ بِٱللَّهِ وَيُؤۡمِنُ لِلۡمُؤۡمِنِينَ وَرَحۡمَةٞ لِّلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡۚ وَٱلَّذِينَ يُؤۡذُونَ رَسُولَ ٱللَّهِ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ
మరియు వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో బాధ కలిగించే వారున్నారు. వారంటారు: "ఇతను (చెప్పుడు మాటలు) వినేవాడు(a)." ఇలా అను: "అతను వినేది మీ మేలుకే! అతను అల్లాహ్ ను విశ్వసిస్తాడు మరియు విశ్వాసులను నమ్ముతాడు మరియు మీలో విశ్వసించిన వారికి అతను కారుణ్యమూర్తి." మరియు అల్లాహ్ సందేశహరునికి బాధ కలిగించే వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
(a) చూడండి, 9:74.

節 : 62
يَحۡلِفُونَ بِٱللَّهِ لَكُمۡ لِيُرۡضُوكُمۡ وَٱللَّهُ وَرَسُولُهُۥٓ أَحَقُّ أَن يُرۡضُوهُ إِن كَانُواْ مُؤۡمِنِينَ
(ఓ విశ్వాసులారా!) మిమ్మల్ని సంతోషపెట్టటానికి వారు మీ ముందు అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను సంతోషపెట్టటమే వారి బాధ్యత.(a)
(a) చూడండి, 4:80 మరియు 3:31
節 : 63
أَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّهُۥ مَن يُحَادِدِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَأَنَّ لَهُۥ نَارَ جَهَنَّمَ خَٰلِدٗا فِيهَاۚ ذَٰلِكَ ٱلۡخِزۡيُ ٱلۡعَظِيمُ
ఏమీ? అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి విరోధించేవానికి, నిశ్చయంగా! భగభగమండే నరకాగ్ని శిక్ష ఉందనీ, అదే అతని శాశ్వత నివాసమనీ, వారికి తెలియదా? ఇది ఎంత గొప్ప అవమానం!
節 : 64
يَحۡذَرُ ٱلۡمُنَٰفِقُونَ أَن تُنَزَّلَ عَلَيۡهِمۡ سُورَةٞ تُنَبِّئُهُم بِمَا فِي قُلُوبِهِمۡۚ قُلِ ٱسۡتَهۡزِءُوٓاْ إِنَّ ٱللَّهَ مُخۡرِجٞ مَّا تَحۡذَرُونَ
తమ హృదయాలలో ఉన్న (రహస్యాలను) స్పష్టంగా తెలియజేసేటటు వంటి సూరహ్ వారికి విరుద్ధంగా అవతరింప జేయబడుతుందేమోనని, ఈ కపట విశ్వాసులు భయపడుతున్నారు. వారితో అను: "మీరు ఎగతాళి చెయ్యండి, మీరు (బయట పడుతుందని) భయపడుతున్న విషయాన్ని, అల్లాహ్ తప్పక బయటపెడ్తాడు."
節 : 65
وَلَئِن سَأَلۡتَهُمۡ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلۡعَبُۚ قُلۡ أَبِٱللَّهِ وَءَايَٰتِهِۦ وَرَسُولِهِۦ كُنتُمۡ تَسۡتَهۡزِءُونَ
నీవు వారిని అడిగితే వారు తప్పక: "మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడు తున్నాము." అని సమాధానమిస్తారు. వారితో అను: "ఏమీ? మీరు అల్లాహ్ తో మరియు ఆయన సూచనలతో (ఆయాత్ లతో) మరియు ఆయన ప్రవక్తతో వేళాకోళం చేస్తున్నారా?
節 : 66
لَا تَعۡتَذِرُواْ قَدۡ كَفَرۡتُم بَعۡدَ إِيمَٰنِكُمۡۚ إِن نَّعۡفُ عَن طَآئِفَةٖ مِّنكُمۡ نُعَذِّبۡ طَآئِفَةَۢ بِأَنَّهُمۡ كَانُواْ مُجۡرِمِينَ
ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు.(a)
(a) చూడండి, 4:98
節 : 67
ٱلۡمُنَٰفِقُونَ وَٱلۡمُنَٰفِقَٰتُ بَعۡضُهُم مِّنۢ بَعۡضٖۚ يَأۡمُرُونَ بِٱلۡمُنكَرِ وَيَنۡهَوۡنَ عَنِ ٱلۡمَعۡرُوفِ وَيَقۡبِضُونَ أَيۡدِيَهُمۡۚ نَسُواْ ٱللَّهَ فَنَسِيَهُمۡۚ إِنَّ ٱلۡمُنَٰفِقِينَ هُمُ ٱلۡفَٰسِقُونَ
కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు! వారు అధర్మాన్ని ఆదేశిస్తారు. మరియు ధర్మాన్ని నిషేధిస్తారు.(a) మరియు తమ చేతులను (మేలు నుండి) ఆపుకుంటారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు,(b) కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులే అవిధేయులు (ఫాసిఖూన్).
(a) చూడండి, 3:104, 110, 114; 9:71, 112 మరియు 22:41 '(b) చూడండి, 45:34
節 : 68
وَعَدَ ٱللَّهُ ٱلۡمُنَٰفِقِينَ وَٱلۡمُنَٰفِقَٰتِ وَٱلۡكُفَّارَ نَارَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۚ هِيَ حَسۡبُهُمۡۚ وَلَعَنَهُمُ ٱللَّهُۖ وَلَهُمۡ عَذَابٞ مُّقِيمٞ
మరియు కపట విశ్వాసులైన పురుషులకు మరియు కపట విశ్వాసులైన స్త్రీలకు మరియు సత్యతిరస్కారులకు, అల్లాహ్ నరకాగ్ని వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే వారికి తగినది. మరియు అల్లాహ్ వారిని శపించాడు (బహష్కరించాడు). మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది.

節 : 69
كَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ كَانُوٓاْ أَشَدَّ مِنكُمۡ قُوَّةٗ وَأَكۡثَرَ أَمۡوَٰلٗا وَأَوۡلَٰدٗا فَٱسۡتَمۡتَعُواْ بِخَلَٰقِهِمۡ فَٱسۡتَمۡتَعۡتُم بِخَلَٰقِكُمۡ كَمَا ٱسۡتَمۡتَعَ ٱلَّذِينَ مِن قَبۡلِكُم بِخَلَٰقِهِمۡ وَخُضۡتُمۡ كَٱلَّذِي خَاضُوٓاْۚ أُوْلَٰٓئِكَ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ
(మీరు కూడా) గతించిన మీ పూర్వీకుల వంటివారు. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ధనవంతులు మరియు అధిక సంతానం గలవారు. వారు తమ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. మీరు కూడా మీ పూర్వీకులు అనుభవించినట్లు మీ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. వారు పడి నటువంటి వ్యర్థ వాదోపవాదాలలో మీరు కూడా పడ్డారు. ఇలాంటి వారి కర్మలు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వ్యర్థమవుతాయి. మరియు ఇలాంటి వారు! వీరే నష్టానికి గురి అయ్యేవారు.
節 : 70
أَلَمۡ يَأۡتِهِمۡ نَبَأُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ قَوۡمِ نُوحٖ وَعَادٖ وَثَمُودَ وَقَوۡمِ إِبۡرَٰهِيمَ وَأَصۡحَٰبِ مَدۡيَنَ وَٱلۡمُؤۡتَفِكَٰتِۚ أَتَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظۡلِمَهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ
ఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూహ్ జాతి వారి, ఆద్, సమూద్,(a) ఇబ్రాహీమ్ జాతి వారి,(b) మద్ యన్ (షుఐబ్) ప్రజల(c) మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల (లూత్) వారి (గాథలు అందలేదా)?(d) వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయదలచు కోలేదు కాని వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు.
(a) నూ'హ్, హూద్ మరియు 'సాలి'హ్ ('అలైహిమ్ స.) గాథల కొరకు చూడండి, 7:59-79. (b) ఇబ్రాహీమ్ ('అ.స.) జాతివారు, బాబిలోనియనులు. 1100 సంవత్సరాలు క్రీస్తు శకానికి ముందు వారు అస్సీరియన్ ల ద్వారా అపజయం పొంది నాశనం చేయబడ్డారు. (c) మద్ యన్ ప్రజల గాథలకు చూడండి, 7:85-93. (d) సోడోమ్ మరియు గొమోర్రాహ్ లు, లూ'త్ ('అ.స.) ప్రజల నగరాలు. చూడండి, 7:80-84, 11:69-83.
節 : 71
وَٱلۡمُؤۡمِنُونَ وَٱلۡمُؤۡمِنَٰتُ بَعۡضُهُمۡ أَوۡلِيَآءُ بَعۡضٖۚ يَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَيَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَيُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَيُطِيعُونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓۚ أُوْلَٰٓئِكَ سَيَرۡحَمُهُمُ ٱللَّهُۗ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ
మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మం నుండి నిషేధిస్తారు (వారిస్తారు) మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారినే అల్లాహ్ కరుణిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.
節 : 72
وَعَدَ ٱللَّهُ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَمَسَٰكِنَ طَيِّبَةٗ فِي جَنَّٰتِ عَدۡنٖۚ وَرِضۡوَٰنٞ مِّنَ ٱللَّهِ أَكۡبَرُۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ
మరియు అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల వాగ్దానం చేశాడు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. మరియు శాశ్వతమైన సుఖాలున్న ఆ స్వర్గవనాలలో, వారి కొరకు పరిశుద్ధ నివాసాలు ఉంటాయి.(a) వాటన్నిటి కంటే మించింది వారికి లభించే అల్లాహ్ ప్రసన్నత. అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).
(a) చూడండి, 38:50. 'అద్న్: అవతరణ ప్రకారం ఈ శబ్దం మొట్టమొదట పై ఆయత్ లో వచ్చింది. 'అద్న్, అంటే శాశ్వతమైన అని అర్థం.

節 : 73
يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ جَٰهِدِ ٱلۡكُفَّارَ وَٱلۡمُنَٰفِقِينَ وَٱغۡلُظۡ عَلَيۡهِمۡۚ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ
ఓ ప్రవక్తా! సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో పోరాడు మరియు వారి పట్ల కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం.
節 : 74
يَحۡلِفُونَ بِٱللَّهِ مَا قَالُواْ وَلَقَدۡ قَالُواْ كَلِمَةَ ٱلۡكُفۡرِ وَكَفَرُواْ بَعۡدَ إِسۡلَٰمِهِمۡ وَهَمُّواْ بِمَا لَمۡ يَنَالُواْۚ وَمَا نَقَمُوٓاْ إِلَّآ أَنۡ أَغۡنَىٰهُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ مِن فَضۡلِهِۦۚ فَإِن يَتُوبُواْ يَكُ خَيۡرٗا لَّهُمۡۖ وَإِن يَتَوَلَّوۡاْ يُعَذِّبۡهُمُ ٱللَّهُ عَذَابًا أَلِيمٗا فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۚ وَمَا لَهُمۡ فِي ٱلۡأَرۡضِ مِن وَلِيّٖ وَلَا نَصِيرٖ
"మేము ఏమీ (చెడు మాట) అనలేదు!" అని వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి అంటున్నారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారపు మాట అన్నారు. మరియు ఇస్లాంను స్వీకరించిన తరువాత దానిని తిరస్కరించారు. మరియు వారికి అసాధ్యమైన దానిని చేయదలచుకున్నారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త, (అల్లాహ్) అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా! వారు ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారు. ఇప్పుడైనా వారు పశ్చాత్తాప పడితే అది వారికే మేలు. మరియు వారు మరలిపోతే, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ, బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మరియు భూమిలో వారికి ఏ రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఉండడు.
節 : 75
۞ وَمِنۡهُم مَّنۡ عَٰهَدَ ٱللَّهَ لَئِنۡ ءَاتَىٰنَا مِن فَضۡلِهِۦ لَنَصَّدَّقَنَّ وَلَنَكُونَنَّ مِنَ ٱلصَّٰلِحِينَ
మరియు వారిలో (కొందరు) ఈ విధంగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు: "ఆయన (అల్లాహ్) తన అనుగ్రహంతో మాకేమీ ప్రసాదించినా మేము తప్పక దానం చేస్తాము మరియు సద్వర్తనులమై ఉంటాము."
節 : 76
فَلَمَّآ ءَاتَىٰهُم مِّن فَضۡلِهِۦ بَخِلُواْ بِهِۦ وَتَوَلَّواْ وَّهُم مُّعۡرِضُونَ
కాని అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారికి (ధనం) ప్రసాదించినప్పుడు, వారు పిసినారితనం ప్రదర్శించి, తమ (వాగ్దానం) నుండి విముఖులై మరలిపోతారు.
節 : 77
فَأَعۡقَبَهُمۡ نِفَاقٗا فِي قُلُوبِهِمۡ إِلَىٰ يَوۡمِ يَلۡقَوۡنَهُۥ بِمَآ أَخۡلَفُواْ ٱللَّهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُواْ يَكۡذِبُونَ
ఆ పిదప వారు అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను కలుసుకునే (పునరుత్థాన) దినం వరకు, ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు.
節 : 78
أَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ سِرَّهُمۡ وَنَجۡوَىٰهُمۡ وَأَنَّ ٱللَّهَ عَلَّٰمُ ٱلۡغُيُوبِ
ఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా, అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి వున్నవాడు.
節 : 79
ٱلَّذِينَ يَلۡمِزُونَ ٱلۡمُطَّوِّعِينَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ فِي ٱلصَّدَقَٰتِ وَٱلَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهۡدَهُمۡ فَيَسۡخَرُونَ مِنۡهُمۡ سَخِرَ ٱللَّهُ مِنۡهُمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٌ
మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

節 : 80
ٱسۡتَغۡفِرۡ لَهُمۡ أَوۡ لَا تَسۡتَغۡفِرۡ لَهُمۡ إِن تَسۡتَغۡفِرۡ لَهُمۡ سَبۡعِينَ مَرَّةٗ فَلَن يَغۡفِرَ ٱللَّهُ لَهُمۡۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَفَرُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ
(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే - ఇంకా నీవు డెబ్బైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా - అల్లాహ్ వారిని క్షమించడు.(a) ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు.(b)
(a) దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) తన శత్రువులను క్షమించమని అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థించినట్లు బు'ఖారీ, ముస్లిం మరియు ఇతరుల 'స'హీ'హ్ 'హదీస్'ల ద్వారా తెలుస్తుంది. (b) చూడండి, 76:3.
節 : 81
فَرِحَ ٱلۡمُخَلَّفُونَ بِمَقۡعَدِهِمۡ خِلَٰفَ رَسُولِ ٱللَّهِ وَكَرِهُوٓاْ أَن يُجَٰهِدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡ فِي سَبِيلِ ٱللَّهِ وَقَالُواْ لَا تَنفِرُواْ فِي ٱلۡحَرِّۗ قُلۡ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرّٗاۚ لَّوۡ كَانُواْ يَفۡقَهُونَ
(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: "ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!" అని అన్నారు. వారితో అను: "భగభగ మండే నరకాగ్ని దీని కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది." అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది!
節 : 82
فَلۡيَضۡحَكُواْ قَلِيلٗا وَلۡيَبۡكُواْ كَثِيرٗا جَزَآءَۢ بِمَا كَانُواْ يَكۡسِبُونَ
కావున ఇప్పుడు వారిని కొంత నవ్వనివ్వు మరియు వారి కర్మలకు ప్రతిఫలంగా (మున్ముందు) వారికి ఎంతో ఏడ్వవలసి ఉంది.
節 : 83
فَإِن رَّجَعَكَ ٱللَّهُ إِلَىٰ طَآئِفَةٖ مِّنۡهُمۡ فَٱسۡتَـٔۡذَنُوكَ لِلۡخُرُوجِ فَقُل لَّن تَخۡرُجُواْ مَعِيَ أَبَدٗا وَلَن تُقَٰتِلُواْ مَعِيَ عَدُوًّاۖ إِنَّكُمۡ رَضِيتُم بِٱلۡقُعُودِ أَوَّلَ مَرَّةٖ فَٱقۡعُدُواْ مَعَ ٱلۡخَٰلِفِينَ
కావున (ఓ ప్రవక్తా!) ఒకవేళ అల్లాహ్ నిన్ను తిరిగి వారిలో (కపట విశ్వాసులలో) ఒక వర్గం వారి వద్దకు తీసుకొని పోతే! మరియు వారు నిన్ను (మరొక దండయాత్రకు) పోవటానికి అనుమతి అడిగితే! వారితో అను! "మీరు నాతో ఏ మాత్రం బయలుదేర వద్దు! మరియు నా పక్షమున శత్రువులతో పోరాడనూ వద్దు! వాస్తవానికి మీరు మొదట కూర్చొని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు వెనుక ఉండి పోయిన వారితో (ఇండ్లలోనే) కూర్చొని ఉండండి."
節 : 84
وَلَا تُصَلِّ عَلَىٰٓ أَحَدٖ مِّنۡهُم مَّاتَ أَبَدٗا وَلَا تَقُمۡ عَلَىٰ قَبۡرِهِۦٓۖ إِنَّهُمۡ كَفَرُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَمَاتُواْ وَهُمۡ فَٰسِقُونَ
మరియు వారిలో (కపట విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏ మాత్రం చేయకు మరియు అతని గోరీ వద్ద కూడా నిలబడకు,(a) నిశ్చయంగా వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారు అవిధేయులు (ఫాసిఖూన్)గా ఉన్న స్థితిలోనే మరణించారు.
(a) ఈ ఆయత్ కపట విశ్వాసుల నాయకుడు 'అబ్దుల్లాహ్ బిన్ ఉబైను గురించి అవతరింపజేయబడింది. కాని ఈ ఆజ్ఞ కపట విశ్వాసులందరికీ వర్తిస్తుంది. 'అబ్దుల్లాహ్ బిన్ ఉబై మరణించినప్పుడు అతని కుమారుడు 'అబ్దుల్లాహ్ (ర.'ది.అ) దైవప్రవక్త ('స'అస) దగ్గరికి వచ్చి, అతని ('స'అస) అంగీని, తన తండ్రికి కఫన్ గా తొడిగించటానికి అడుగుతారు మరియు అతని ('స'అస)తో , తన తండ్రి నమా'జే జనా'జహ్ చేయమని కూడా కోరుతారు. దైవప్రవక్త ('స'అస) తన అంగీని, ఇస్తారు. 'ఉమర్ (ర.'ది.'అ.) ఆపినా, వినకుండా నమా'జే జనా'జహ్ కూడా చేస్తారు. ఆ తరువాత ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ('స'హీ'హ్ బు'ఖారీ, తఫ్సీర్ సూరహ్ అత్-తౌబహ్ మరియు 'స'హీ'హ్ ముస్లిం, కితాబ్ సిఫాత్ అల్-మునాఫిఖీన్ వ అ'హ్ కామహుమ్). ఇక్కడ మరొక విషయం విశదమయ్యే దేమిటంటే: ఎవడైతే నిజమైన విశ్వాసుడు కాడో అతని మోక్షం కొరకు ఎంత పెద్దవారు ప్రార్థన చేసినా అది అంగీకరించబడదు.
節 : 85
وَلَا تُعۡجِبۡكَ أَمۡوَٰلُهُمۡ وَأَوۡلَٰدُهُمۡۚ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ أَن يُعَذِّبَهُم بِهَا فِي ٱلدُّنۡيَا وَتَزۡهَقَ أَنفُسُهُمۡ وَهُمۡ كَٰفِرُونَ
మరియు వారి సిరిసంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురి చేయనివ్వకూడదు. నిశ్చయంగా, అల్లాహ్! వాటితో ఈ ప్రపంచంలో వారిని శిక్షించాలనీ మరియు వారు సత్యతిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారి ప్రాణాలను కోల్పోవాలనీ సంకల్పించాడు.(a)
(a) చూడండి, 9:55, 3:178 మరియు 8:28; ఈ ఆయత్ దాదాపు 9:55 మాదిరిగానే ఉంది.
節 : 86
وَإِذَآ أُنزِلَتۡ سُورَةٌ أَنۡ ءَامِنُواْ بِٱللَّهِ وَجَٰهِدُواْ مَعَ رَسُولِهِ ٱسۡتَـٔۡذَنَكَ أُوْلُواْ ٱلطَّوۡلِ مِنۡهُمۡ وَقَالُواْ ذَرۡنَا نَكُن مَّعَ ٱلۡقَٰعِدِينَ
మరియు: "అల్లాహ్ ను విశ్వసించండి. మరియు ఆయన ప్రవక్తతో కలసి (అల్లాహ్ మార్గంలో) పోరాడండి!" అని సూరహ్ అవతరింప జేయబడి నపుడు,(a) వారిలోని ధనవంతులు నీతో: "వెనుక ఉండే వారితో కూర్చోవటానికి మమ్మల్ని విడిచి పెట్టు." అని అనుమతి కోరారు.
(a) చూడండి, 47:20.

節 : 87
رَضُواْ بِأَن يَكُونُواْ مَعَ ٱلۡخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمۡ فَهُمۡ لَا يَفۡقَهُونَ
వారు, వెనుక ఉండిపోయే వారితో ఉండటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాల మీద ముద్ర వేయబడి వుంది, కావున వారు అర్థం చేసుకోలేరు.(a)
(a) చూడండి 7:100-101.
節 : 88
لَٰكِنِ ٱلرَّسُولُ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ جَٰهَدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡۚ وَأُوْلَٰٓئِكَ لَهُمُ ٱلۡخَيۡرَٰتُۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ
కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.
節 : 89
أَعَدَّ ٱللَّهُ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ
అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు సిద్ధం చేసి ఉంచాడు, వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం.
節 : 90
وَجَآءَ ٱلۡمُعَذِّرُونَ مِنَ ٱلۡأَعۡرَابِ لِيُؤۡذَنَ لَهُمۡ وَقَعَدَ ٱلَّذِينَ كَذَبُواْ ٱللَّهَ وَرَسُولَهُۥۚ سَيُصِيبُ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ عَذَابٌ أَلِيمٞ
మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు)(a) కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు.
(a) అల్-అ'అరాబు అంటే, ఎడారి వాసు(బద్దూ)లు. ఈ పదానికి ఇంకా చూడండి, 9:97, 98, 99, 101, 120, 33:20, 48:11, 16 మరియు 49:14.
節 : 91
لَّيۡسَ عَلَى ٱلضُّعَفَآءِ وَلَا عَلَى ٱلۡمَرۡضَىٰ وَلَا عَلَى ٱلَّذِينَ لَا يَجِدُونَ مَا يُنفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُواْ لِلَّهِ وَرَسُولِهِۦۚ مَا عَلَى ٱلۡمُحۡسِنِينَ مِن سَبِيلٖۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ
బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
節 : 92
وَلَا عَلَى ٱلَّذِينَ إِذَا مَآ أَتَوۡكَ لِتَحۡمِلَهُمۡ قُلۡتَ لَآ أَجِدُ مَآ أَحۡمِلُكُمۡ عَلَيۡهِ تَوَلَّواْ وَّأَعۡيُنُهُمۡ تَفِيضُ مِنَ ٱلدَّمۡعِ حَزَنًا أَلَّا يَجِدُواْ مَا يُنفِقُونَ
మరియు ఎవరైతే నీ వద్దకు వచ్చి వాహనాలు కోరినప్పుడు నీవు వారితో: "నా దగ్గర మీకివ్వటానికి ఏ వాహనం లేదు." అని పలికినప్పుడు, ఖర్చు చేయటానికి తమ దగ్గర ఏమీ లేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగి పోయారో, అలాంటి వారిపై కూడా ఎలాంటి నింద లేదు.
節 : 93
۞ إِنَّمَا ٱلسَّبِيلُ عَلَى ٱلَّذِينَ يَسۡتَـٔۡذِنُونَكَ وَهُمۡ أَغۡنِيَآءُۚ رَضُواْ بِأَن يَكُونُواْ مَعَ ٱلۡخَوَالِفِ وَطَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ فَهُمۡ لَا يَعۡلَمُونَ
కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకునేదేమిటో) వారికి తెలియదు.(a)
(a) వీరు ఆయత్ 86, 87లలో పేర్కొనబడ్డ కపటవిశ్వాసులు.

節 : 94
يَعۡتَذِرُونَ إِلَيۡكُمۡ إِذَا رَجَعۡتُمۡ إِلَيۡهِمۡۚ قُل لَّا تَعۡتَذِرُواْ لَن نُّؤۡمِنَ لَكُمۡ قَدۡ نَبَّأَنَا ٱللَّهُ مِنۡ أَخۡبَارِكُمۡۚ وَسَيَرَى ٱللَّهُ عَمَلَكُمۡ وَرَسُولُهُۥ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
మీరు (తబూక్ దండయాత్ర నుండి) మరలి వారి వద్దకు వచ్చిన తరువాత కూడా వారు (కపటవిశ్వాసులు) మీతో తమ సాకులు చెబుతున్నారు. వారితో అను: "మీరు సాకులు చెప్పకండి, మేము మీ మాటలను నమ్మము. అల్లాహ్ మాకు మీ వృత్తాంతం తెలిపి వున్నాడు. మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీ ప్రవర్తనను కనిపెట్టగలరు, తరువాత మీరు అగోచర మరియు గోచర విషయాలు ఎరుగునట్టి ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న వాటిని గురించి మీకు తెలుపుతాడు."
節 : 95
سَيَحۡلِفُونَ بِٱللَّهِ لَكُمۡ إِذَا ٱنقَلَبۡتُمۡ إِلَيۡهِمۡ لِتُعۡرِضُواْ عَنۡهُمۡۖ فَأَعۡرِضُواْ عَنۡهُمۡۖ إِنَّهُمۡ رِجۡسٞۖ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُ جَزَآءَۢ بِمَا كَانُواْ يَكۡسِبُونَ
(ఓ విశ్వాసులారా!) మీరు వారి వద్దకు మరలి వచ్చిన తరువాత వారిని వదలి పెట్టాలని (మీరు వారిపై చర్య తీసుకో గూడదని), వారు మీ ముందు అల్లాహ్ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా, వారు అశుచులు (మాలిన్యం వంటివారు). వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం.
節 : 96
يَحۡلِفُونَ لَكُمۡ لِتَرۡضَوۡاْ عَنۡهُمۡۖ فَإِن تَرۡضَوۡاْ عَنۡهُمۡ فَإِنَّ ٱللَّهَ لَا يَرۡضَىٰ عَنِ ٱلۡقَوۡمِ ٱلۡفَٰسِقِينَ
మీరు వారితో రాజీ పడాలని, వారు (కపట విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీ పడినా, నిశ్చయంగా, అల్లాహ్ అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలతో రాజీ పడడు.(a)
(a) దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత, వారంతా క్షేమంగా తిరిగి వచ్చింది చూసి కపట విశ్వాసులు, తాము నమ్మకస్తులమని నిరూపించగోరారు. ఆ సమయంలో పై మూడు ఆయతులు (94-96) అవతరింపజేయబడ్డాయి.
節 : 97
ٱلۡأَعۡرَابُ أَشَدُّ كُفۡرٗا وَنِفَاقٗا وَأَجۡدَرُ أَلَّا يَعۡلَمُواْ حُدُودَ مَآ أَنزَلَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ
ఎడారివాసులు (బద్దూలు) సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన (ధర్మ) నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు.(a) మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
(a) ఎందుకంటే వారు నగరాల నుండి దూరప్రాంతాలలో ఉండటం వలన అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన (సు.తా.), ప్రవక్త ('స'అస) మాటలు వినలేరు.
節 : 98
وَمِنَ ٱلۡأَعۡرَابِ مَن يَتَّخِذُ مَا يُنفِقُ مَغۡرَمٗا وَيَتَرَبَّصُ بِكُمُ ٱلدَّوَآئِرَۚ عَلَيۡهِمۡ دَآئِرَةُ ٱلسَّوۡءِۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٞ
మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసిన దానిని దండుగగా భావించే వారున్నారు. (ఓ విశ్వాసులారా!) మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. (కాని) వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.(a)
(a) వీరు మొదటి రకానికి చెందిన బుద్ధూలు.
節 : 99
وَمِنَ ٱلۡأَعۡرَابِ مَن يُؤۡمِنُ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَيَتَّخِذُ مَا يُنفِقُ قُرُبَٰتٍ عِندَ ٱللَّهِ وَصَلَوَٰتِ ٱلرَّسُولِۚ أَلَآ إِنَّهَا قُرۡبَةٞ لَّهُمۡۚ سَيُدۡخِلُهُمُ ٱللَّهُ فِي رَحۡمَتِهِۦٓۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ
మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు.(a) వారు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేది, తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
(a) వీరు రెండో రకానికి చెందిన మంచి విశ్వాసులు.

節 : 100
وَٱلسَّٰبِقُونَ ٱلۡأَوَّلُونَ مِنَ ٱلۡمُهَٰجِرِينَ وَٱلۡأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحۡسَٰنٖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُ وَأَعَدَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي تَحۡتَهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ
మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం).
節 : 101
وَمِمَّنۡ حَوۡلَكُم مِّنَ ٱلۡأَعۡرَابِ مُنَٰفِقُونَۖ وَمِنۡ أَهۡلِ ٱلۡمَدِينَةِ مَرَدُواْ عَلَى ٱلنِّفَاقِ لَا تَعۡلَمُهُمۡۖ نَحۡنُ نَعۡلَمُهُمۡۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيۡنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٖ
మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనా మునవ్వరా)లో కూడా (కపటవిశ్వాసులు) ఉన్నారు.(a) వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు.(b) మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు.
(a) మదీనా మునవ్వరా మొదటి పేరు యస్'రిబ్. 622 క్రీస్తుశకంలో ము'హమ్మద్ ('స'అస) వలస వచ్చిన తరువాత అది మదీనతున్నబీ - ప్రవక్త నగరంగా, ఆ తరువాత మదీనా మునవ్వరగా కూడా పిలువబడుతోంది. (b) ఇక్కడ స్పష్టమైన శబ్దాలతో దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)కు అగోచర జ్ఞానం లేదని విశదపరచబడింది.
節 : 102
وَءَاخَرُونَ ٱعۡتَرَفُواْ بِذُنُوبِهِمۡ خَلَطُواْ عَمَلٗا صَٰلِحٗا وَءَاخَرَ سَيِّئًا عَسَى ٱللَّهُ أَن يَتُوبَ عَلَيۡهِمۡۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ
మరియు ఇతరులు, తమ పాపాలను ఒప్పుకున్న వారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు.(a) అల్లాహ్ వారిని తప్పక(b) క్షమిస్తాడు! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
(a) వీరు ఉచితమైన కారణం లేకుండానే వెనుక ఉండి పోయిన విశ్వాసులు. వీరు పోనందుకు తమ వల్ల జరిగిన పాపాన్ని ఒప్పుకున్నారు. వీరి సత్కార్యాలంటే ఇంతకు ముందు జరిగిన యుద్ధాలలో పాల్గొనటం. వీరి పాపకార్యం అంటే తబూక్ యుద్ధానికి పోకుండా ఉండటం. ఇంకా చూడండి 'స'హీ'హ్ బు'ఖారీ, పు.6, 'హ. 196. (b) 'అసా : అన్న పదం అల్లాహ్ (సు.తా.) కు సంబంధించి వస్తే, Be hopeful with Allah, నమ్ము, ఆశించు అనే భావం ఇస్తుంది. ఒకవేళ మానవునికి సంబంధించి ఉంటే Be conscious or Be afraid, జాగ్రత్త, ఏమో, బహుశా అనే భావం ఇస్తుంది.
節 : 103
خُذۡ مِنۡ أَمۡوَٰلِهِمۡ صَدَقَةٗ تُطَهِّرُهُمۡ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيۡهِمۡۖ إِنَّ صَلَوٰتَكَ سَكَنٞ لَّهُمۡۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ
(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
節 : 104
أَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ هُوَ يَقۡبَلُ ٱلتَّوۡبَةَ عَنۡ عِبَادِهِۦ وَيَأۡخُذُ ٱلصَّدَقَٰتِ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ
ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
節 : 105
وَقُلِ ٱعۡمَلُواْ فَسَيَرَى ٱللَّهُ عَمَلَكُمۡ وَرَسُولُهُۥ وَٱلۡمُؤۡمِنُونَۖ وَسَتُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
మరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: "మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన (అల్లాహ్) వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ వున్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు."
節 : 106
وَءَاخَرُونَ مُرۡجَوۡنَ لِأَمۡرِ ٱللَّهِ إِمَّا يُعَذِّبُهُمۡ وَإِمَّا يَتُوبُ عَلَيۡهِمۡۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ
మరికొందరు అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా క్షమించనూ వచ్చు! మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

節 : 107
وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مَسۡجِدٗا ضِرَارٗا وَكُفۡرٗا وَتَفۡرِيقَۢا بَيۡنَ ٱلۡمُؤۡمِنِينَ وَإِرۡصَادٗا لِّمَنۡ حَارَبَ ٱللَّهَ وَرَسُولَهُۥ مِن قَبۡلُۚ وَلَيَحۡلِفُنَّ إِنۡ أَرَدۡنَآ إِلَّا ٱلۡحُسۡنَىٰۖ وَٱللَّهُ يَشۡهَدُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ
మరియు (కపట విశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్యతిరస్కార వైఖరిని (బలపరచటానికి) మరియు విశ్వాసులను విడదీయటానికి, అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడిన వారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్ నిర్మించారు. మరియు వారు: "మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు!" అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు.(a) కాని వారు వాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు.
(a) 'ఖ'జరజ్ తెగకు చెందిన ఒక మదీనా వాసుడు అబూ'ఆమిర్ క్రైస్తవుడవుతాడు. అతడు 3వ హిజ్రీలో జరిగిన ఉహుద్ యుద్ధంలో మక్కా ఖురైషులకు సహాయపడి, ఆ యుద్ధం తరువాత సిరియాకు పారిపోతాడు. అతుడ బైజాన్ టైన్ చక్రవర్తి హిరాక్లియస్ ను మదీనా పై దండయాత్ర చేయటానికి ప్రోత్సహిస్తాడు. మదీనాపై వారు రాకూడదని దైవప్రవక్త ('స'అస) వారిని ఎధుర్కొనటానికి తబూక్ కు బయలుదేరే సమయంలో అతడి అనుచరులు వచ్చి: "మేము మదీనా-ఖుబాల మధ్య ఒక మస్జిద్ నిర్మించాము. మీరు వచ్చి అందులో నమా'జ్ చేయించండి." అని కోరుతారు. దైవప్రవక్త ('స'అస): "తబూక్ నుండి వచ్చిన తరువాత వస్తాను." అని అంటారు. ఆ సందర్భంలో తబూక్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. దైవప్రవక్త ('స'అస) తరువాత దానిని పడగొట్టిస్తారు. ఎందుకంటే ఆ మస్జిద్ నిర్మాణ లక్ష్యం విశ్వాసుల మధ్య భేదభావాలు పుట్టించడే ఉండెను.
節 : 108
لَا تَقُمۡ فِيهِ أَبَدٗاۚ لَّمَسۡجِدٌ أُسِّسَ عَلَى ٱلتَّقۡوَىٰ مِنۡ أَوَّلِ يَوۡمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِۚ فِيهِ رِجَالٞ يُحِبُّونَ أَن يَتَطَهَّرُواْۚ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُطَّهِّرِينَ
నీవెన్నడూ దానిలో (నమాజ్ కు) నిలబడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు (నమాజ్ కు) నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరేవారున్నారు. మరియు అల్లాహ్ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు.
節 : 109
أَفَمَنۡ أَسَّسَ بُنۡيَٰنَهُۥ عَلَىٰ تَقۡوَىٰ مِنَ ٱللَّهِ وَرِضۡوَٰنٍ خَيۡرٌ أَم مَّنۡ أَسَّسَ بُنۡيَٰنَهُۥ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٖ فَٱنۡهَارَ بِهِۦ فِي نَارِ جَهَنَّمَۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ
ఏమీ? ఎవడైతే అల్లాహ్ యందు గల భయభక్తులు మరియు ఆయన ప్రీతి, పునాదుల మీద తన (మస్జిద్) కట్టడాన్ని కట్టాడో, అతడు శ్రేష్ఠుడా? లేక, తన కట్టడపు పునాదులను, వరదలకు కూలిపోయి దాని క్రింది భాగం ఖాళీగా ఉన్న నది ఒడ్డున కట్టేవాడా? అది వానితో సహా నరకాగ్నిలోకి కొట్టుకొని పోతుంది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
節 : 110
لَا يَزَالُ بُنۡيَٰنُهُمُ ٱلَّذِي بَنَوۡاْ رِيبَةٗ فِي قُلُوبِهِمۡ إِلَّآ أَن تَقَطَّعَ قُلُوبُهُمۡۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ
వారి హృదయాలు ముక్కలైపోయి (వారు చనిపోయి) నంత వరకు, వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
節 : 111
۞ إِنَّ ٱللَّهَ ٱشۡتَرَىٰ مِنَ ٱلۡمُؤۡمِنِينَ أَنفُسَهُمۡ وَأَمۡوَٰلَهُم بِأَنَّ لَهُمُ ٱلۡجَنَّةَۚ يُقَٰتِلُونَ فِي سَبِيلِ ٱللَّهِ فَيَقۡتُلُونَ وَيُقۡتَلُونَۖ وَعۡدًا عَلَيۡهِ حَقّٗا فِي ٱلتَّوۡرَىٰةِ وَٱلۡإِنجِيلِ وَٱلۡقُرۡءَانِۚ وَمَنۡ أَوۡفَىٰ بِعَهۡدِهِۦ مِنَ ٱللَّهِۚ فَٱسۡتَبۡشِرُواْ بِبَيۡعِكُمُ ٱلَّذِي بَايَعۡتُم بِهِۦۚ وَذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ
నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్ లలో, ఆయన (అల్లాహ్) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ ను మించిన వాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం.(a)
(a) చూడండి, 'స. బు'ఖారీ, పు-4, 'హ. 352, పు-5, 'హ 377, మరియు పు-3, 'హ 3462.

節 : 112
ٱلتَّٰٓئِبُونَ ٱلۡعَٰبِدُونَ ٱلۡحَٰمِدُونَ ٱلسَّٰٓئِحُونَ ٱلرَّٰكِعُونَ ٱلسَّٰجِدُونَ ٱلۡأٓمِرُونَ بِٱلۡمَعۡرُوفِ وَٱلنَّاهُونَ عَنِ ٱلۡمُنكَرِ وَٱلۡحَٰفِظُونَ لِحُدُودِ ٱللَّهِۗ وَبَشِّرِ ٱلۡمُؤۡمِنِينَ
(వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు).(a) ఆయన సన్నిధిలో వంగే (రుకూఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు ఆధర్మమును నిషేధించేవారు(b) మరియు అల్లాహ్ విధించిన హద్దును పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు.
(a) చాలా మంది వ్యాఖ్యాతలు ఈ శబ్దం 'సాయి'హూన్ ను 'సాయిమూన్' గా బోధించారు. అంటే ఉపవాసాలు చేసేవారు అని. (b) ఇటువంటి వాక్యానికి చూడండి, 3:104, 110, 1114; 9:71 మరియు 22:41.
節 : 113
مَا كَانَ لِلنَّبِيِّ وَٱلَّذِينَ ءَامَنُوٓاْ أَن يَسۡتَغۡفِرُواْ لِلۡمُشۡرِكِينَ وَلَوۡ كَانُوٓاْ أُوْلِي قُرۡبَىٰ مِنۢ بَعۡدِ مَا تَبَيَّنَ لَهُمۡ أَنَّهُمۡ أَصۡحَٰبُ ٱلۡجَحِيمِ
అల్లాహ్ కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించటం తగదు.(a)
(a) చూడండి, 28:56
節 : 114
وَمَا كَانَ ٱسۡتِغۡفَارُ إِبۡرَٰهِيمَ لِأَبِيهِ إِلَّا عَن مَّوۡعِدَةٖ وَعَدَهَآ إِيَّاهُ فَلَمَّا تَبَيَّنَ لَهُۥٓ أَنَّهُۥ عَدُوّٞ لِّلَّهِ تَبَرَّأَ مِنۡهُۚ إِنَّ إِبۡرَٰهِيمَ لَأَوَّٰهٌ حَلِيمٞ
మరియు ఇబ్రాహీమ్ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను అతడి (తన తండ్రి)తో చేసిన వాగ్దానం వల్లనే.(a) కాని అతనికి, అతడు (తన తండ్రి) నిశ్చయంగా అల్లాహ్ కు శత్రువని స్పష్టమైనప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అతడిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీమ్ వినయ విధేయతలతో (అల్లాహ్ ను) అర్థించేవాడు,(b) సహనశీలుడు.
(a) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఈ వాగ్దానం కొరకు చూడండి, 19:47-48 మరియు 60:4. అతని ప్రార్థన కొరకు చూడండి, 26:86-87. ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పు-4, 'హ. 565. (b) అవ్వాహున్: మృదుహృదయుడు, వినయవిధేయతలతో (అల్లాహుతా'ఆలా ను) అర్థించేవాడు.
節 : 115
وَمَا كَانَ ٱللَّهُ لِيُضِلَّ قَوۡمَۢا بَعۡدَ إِذۡ هَدَىٰهُمۡ حَتَّىٰ يُبَيِّنَ لَهُم مَّا يَتَّقُونَۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ
మరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంత వరకు, అల్లాహ్ వారిని మార్గభ్రష్టత్వంలో పడవేయడు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.(a)
(a) చూడండి, 6:131-132. ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ పు-9, 'హ, 66.
節 : 116
إِنَّ ٱللَّهَ لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ يُحۡيِۦ وَيُمِيتُۚ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِيّٖ وَلَا نَصِيرٖ
నిశ్చయంగా, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. మరియు అల్లాహ్ తప్ప మీకు వేరే రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఎవ్వడూ లేడు.
節 : 117
لَّقَد تَّابَ ٱللَّهُ عَلَى ٱلنَّبِيِّ وَٱلۡمُهَٰجِرِينَ وَٱلۡأَنصَارِ ٱلَّذِينَ ٱتَّبَعُوهُ فِي سَاعَةِ ٱلۡعُسۡرَةِ مِنۢ بَعۡدِ مَا كَادَ يَزِيغُ قُلُوبُ فَرِيقٖ مِّنۡهُمۡ ثُمَّ تَابَ عَلَيۡهِمۡۚ إِنَّهُۥ بِهِمۡ رَءُوفٞ رَّحِيمٞ
వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని (ముహాజిర్ లను) మరియు అన్సార్ లను, ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో! అలాంటి వారినందరినీ క్షమించాడు.(a) వారిలో ఒక పక్షం వారి హృదయాలు, దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ (ప్రవక్త వెంట వెళ్ళారు), అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయన వారి పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత.
(a) తబూక్ దండయాత్ర కాలం బహు కష్టకాలంగా పేర్కొనబడింది. ఎందుకంటే అది తీవ్రమైన ఎండకాలం. ఖర్జూర ఫలాలు సిద్ధమయ్యిన కాలం. ఆ ప్రయాణం చాలా దూరప్రదేశానిది. మరియు ప్రయాణ సౌకర్యాలు కూడా చాలా తక్కువ ఉండేవి.

節 : 118
وَعَلَى ٱلثَّلَٰثَةِ ٱلَّذِينَ خُلِّفُواْ حَتَّىٰٓ إِذَا ضَاقَتۡ عَلَيۡهِمُ ٱلۡأَرۡضُ بِمَا رَحُبَتۡ وَضَاقَتۡ عَلَيۡهِمۡ أَنفُسُهُمۡ وَظَنُّوٓاْ أَن لَّا مَلۡجَأَ مِنَ ٱللَّهِ إِلَّآ إِلَيۡهِ ثُمَّ تَابَ عَلَيۡهِمۡ لِيَتُوبُوٓاْۚ إِنَّ ٱللَّهَ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ
మరియు వెనుక ఉండి పోయిన ఆ ముగ్గురిని కూడా (ఆయన క్షమించాడు).(a) చివరకు విశాలంగా ఉన్న భూమి కూడా వారికి ఇరుకై పోయింది. మరియు వారి ప్రాణాలు కూడా వారికి భారమయ్యాయి. అల్లాహ్ నుండి (తమను కాపాడుకోవటానికి) ఆయన శరణం తప్ప మరొకటి లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు - వారు పశ్చాత్తాప పడాలని. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
(a) తబూక్ దండయాత్రలో పాల్గొనని ఆ ముగ్గురు, క'అబ్ ఇబ్నె మాలిక్, మరారా ఇబ్నె రబీ మరియు హిలాల్ ఇబ్నె 'ఉమయ్యా (ర'ది.'అన్హుమ్) అనే అన్ సారులు. వీరు, పై ఆయత్ అవతరింప జేయబడేవరకు దైవప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరులతో బహిష్కరించబడి ఉండిరి. వీరి పశ్చాత్తాపం యాభై రోజుల తరువాత అంగీకరించబడింది. వీరు విధేయులైన ముస్లింలు. ఇంతకు ముందు ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు. తబూక్ దండయాత్రలో కేవలం సోమరితనం వల్లనే పాల్గొన లేక పోయారు. వారు కపటవిశ్వాసుల వలే బూటక సాకులు చెప్పలేదు. (చూడండి 'స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అల్ మ'గాజీ, బాబ్ 'గజ్ వత్ అత్ తబూక్. ముస్లిం కితాబ్ అత్-తౌబహ్, బాబ్ 'హదీస్ తౌబతు క'అబ్ బిన్ మాలిక్).
節 : 119
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَكُونُواْ مَعَ ٱلصَّٰدِقِينَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతులతో ఉండండి.(a)
(a) చూడండి, 'స. బు'ఖారీ, పు-8, 'హ. 116, 117, 118.
節 : 120
مَا كَانَ لِأَهۡلِ ٱلۡمَدِينَةِ وَمَنۡ حَوۡلَهُم مِّنَ ٱلۡأَعۡرَابِ أَن يَتَخَلَّفُواْ عَن رَّسُولِ ٱللَّهِ وَلَا يَرۡغَبُواْ بِأَنفُسِهِمۡ عَن نَّفۡسِهِۦۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ لَا يُصِيبُهُمۡ ظَمَأٞ وَلَا نَصَبٞ وَلَا مَخۡمَصَةٞ فِي سَبِيلِ ٱللَّهِ وَلَا يَطَـُٔونَ مَوۡطِئٗا يَغِيظُ ٱلۡكُفَّارَ وَلَا يَنَالُونَ مِنۡ عَدُوّٖ نَّيۡلًا إِلَّا كُتِبَ لَهُم بِهِۦ عَمَلٞ صَٰلِحٌۚ إِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجۡرَ ٱلۡمُحۡسِنِينَ
మదీనా పురవాసులకు మరియు చుట్టుప్రక్కలలో ఉండే ఎడారి వాసులకు (బద్దూలకు) అల్లాహ్ ప్రవక్తను వదలి వెనుక ఉండి పోవటం మరియు తమ ప్రాణాలకు అతని (దైవప్రవక్త) ప్రాణాలపై ఆధిక్యత నివ్వటం తగిన పని కాదు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో వారు ఆకలి దప్పులు, (శారీరక) కష్టాలు సహిస్తే, శత్రువుల భూమిలోకి దూరి సత్యతిరస్కారుల కోపాన్ని రేకెత్తిస్తే మరియు శత్రువుల నుండి ఏదైనా సాధిస్తే,(a) దానికి బదులుగా వారికి ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ఫలితాన్ని వ్యర్థ పరచడు.
(a) నైలన్: attainment, సిద్ధి లేక సాధించడం. ఇక్కడ ఈ వాక్యపు అర్థం, శత్రువుల నుండి ఏదైనా తీసుకోవటం, లేక వారికి హాని కలిగించటం అంటే వారిని సంహరించటం లేదా ఖైదీలుగా చేసుకోవటం లేదా ఓడించి విజయధనం పొందటం, లేక అమరగతి పొందటం.
節 : 121
وَلَا يُنفِقُونَ نَفَقَةٗ صَغِيرَةٗ وَلَا كَبِيرَةٗ وَلَا يَقۡطَعُونَ وَادِيًا إِلَّا كُتِبَ لَهُمۡ لِيَجۡزِيَهُمُ ٱللَّهُ أَحۡسَنَ مَا كَانُواْ يَعۡمَلُونَ
మరియు (అల్లాహ్ మార్గంలో) వారు ఖర్చు చేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు (శ్రమపడి) కొండలోయలను దాటే విషయమూ, అంతా వారి కొరకు వ్రాయబడకుండా ఉండదు - వారు చేస్తూ ఉండిన ఈ సత్కార్యాల కొరకు - అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి.
節 : 122
۞ وَمَا كَانَ ٱلۡمُؤۡمِنُونَ لِيَنفِرُواْ كَآفَّةٗۚ فَلَوۡلَا نَفَرَ مِن كُلِّ فِرۡقَةٖ مِّنۡهُمۡ طَآئِفَةٞ لِّيَتَفَقَّهُواْ فِي ٱلدِّينِ وَلِيُنذِرُواْ قَوۡمَهُمۡ إِذَا رَجَعُوٓاْ إِلَيۡهِمۡ لَعَلَّهُمۡ يَحۡذَرُونَ
మరియు విశ్వాసులందరూ (పోరాటానికి) బయలు దేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగ నుండి కొందరు ధర్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి, వారు వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమ జాతి (ప్రాంత) ప్రజలను హెచ్చరిస్తే! బహుశా వారు కూడా తమను తాము (దుర్మార్గం నుండి) కాపాడు కోగలరు.(a)
(a) తబూక్ దండయాత్ర కొరకు, ఆర్థిక మరియు భౌతిక స్తోమత గల వారంతా బయలుదేరాలని ప్రకటన చేయబడి ఉండెను. ఎందుకంటే అప్పుడు వారికి ఒక గొప్ప సామ్రాజ్యపు సేనతో యుద్ధం చేయవలసి ఉండెను. లేనిచో వారు మదీనాపై దాడి చేయటానికి యత్నాలు చేయచుండిరి. కాని అన్ని యుద్ధాలలో, అందరూ పాల్గొనే అవసరముండదు. అలాంటప్పుడు కొందరు యుద్ధానికి పోకుండా ధర్మజ్ఞానం పెంపొందించుకోవటానికి పోయి, తిరిగి వచ్చి తమ ప్రాంతంలోని ప్రజలకు ధర్మజ్ఞానం బోధించాలి. దీని వల్ల ప్రజలలో దైవభీతి పెరుగుతుంది.

節 : 123
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ قَٰتِلُواْ ٱلَّذِينَ يَلُونَكُم مِّنَ ٱلۡكُفَّارِ وَلۡيَجِدُواْ فِيكُمۡ غِلۡظَةٗۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ
ఓ విశ్వాసులారా! మీ దగ్గరున్న సత్యతిరస్కారులతో పోరాడి, వారిని మీలో నున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి.(a) మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితో ఉంటాడని తెలుసుకోండి.
(a) ఎందుకు జిహాద్ చేయాలో 2:190-194, 22:39, 60:8-9 ఆయత్ లలో వచ్చింది. ఇక్కడ: 'మీ ఇరుగు పొరుగులో ఉన్నవారు మీకు హాని చేకూర్చదలిస్తే, మిమ్మల్ని, మీ ధర్మం అనుసరించటంలో ఆటంకపరిస్తే, అట్టివారితో మీరు కఠినత్వాన్ని వ్యక్తపరుస్తూ పోరాడండి.' అని ఆదేశమివ్వబడుతోంది. ఇంకా చూడండి, 48:29 మరియు 5:54.
節 : 124
وَإِذَا مَآ أُنزِلَتۡ سُورَةٞ فَمِنۡهُم مَّن يَقُولُ أَيُّكُمۡ زَادَتۡهُ هَٰذِهِۦٓ إِيمَٰنٗاۚ فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ فَزَادَتۡهُمۡ إِيمَٰنٗا وَهُمۡ يَسۡتَبۡشِرُونَ
మరియు ఒక సూరహ్ అవతరింప జేయబడినప్పుడల్లా వారి (కపట విశ్వాసుల) లో కొందరు: "ఇది మీలో ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది?" అని అడుగుతారు. కాని వాస్తవానికి అది విశ్వసించిన వారందరి విశ్వాసాన్ని అధికం చేస్తుంది. మరియు వారు దానితో సంతోషపడతారు.(a)
(a) చూడండి, 8:2.
節 : 125
وَأَمَّا ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ فَزَادَتۡهُمۡ رِجۡسًا إِلَىٰ رِجۡسِهِمۡ وَمَاتُواْ وَهُمۡ كَٰفِرُونَ
కాని ఎవరి హృదయాలలో రోగముందో, ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికం చేస్తుంది. మరియు వారు సత్యతిరస్కారులుగానే మరణిస్తారు.(a)
(a) చూడండి, 17:82.
節 : 126
أَوَلَا يَرَوۡنَ أَنَّهُمۡ يُفۡتَنُونَ فِي كُلِّ عَامٖ مَّرَّةً أَوۡ مَرَّتَيۡنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمۡ يَذَّكَّرُونَ
ఏమీ? వారు ప్రతి సంవత్సరం ఒకసారి లేక రెండుసార్లు (బాధలతో) పరీక్షింప బడటాన్ని గమనించటం లేదా? అయినా వారు పశ్చాత్తాప పడటం లేదు మరియు గుణపాఠం కూడా నేర్చుకోవటం లేదు.
節 : 127
وَإِذَا مَآ أُنزِلَتۡ سُورَةٞ نَّظَرَ بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٍ هَلۡ يَرَىٰكُم مِّنۡ أَحَدٖ ثُمَّ ٱنصَرَفُواْۚ صَرَفَ ٱللَّهُ قُلُوبَهُم بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَفۡقَهُونَ
మరియు ఏదైనా సూరహ్ అవతరించినపుడల్లా వారు ఒకరినొకరు చూసుకుంటూ (అంటారు): "ఎవడైనా మిమ్మల్ని చూస్తున్నాడా?" ఆ తరువాత అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను (సన్మార్గం నుండి) మళ్ళించాడు. ఎందుకంటే నిశ్చయంగా, వారు అర్థం చేసుకోలేని జనులు.(a)
(a) చూడండి, 8:55.
節 : 128
لَقَدۡ جَآءَكُمۡ رَسُولٞ مِّنۡ أَنفُسِكُمۡ عَزِيزٌ عَلَيۡهِ مَا عَنِتُّمۡ حَرِيصٌ عَلَيۡكُم بِٱلۡمُؤۡمِنِينَ رَءُوفٞ رَّحِيمٞ
(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు;(a) మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు.
(a) చూడండి, 50:2.
節 : 129
فَإِن تَوَلَّوۡاْ فَقُلۡ حَسۡبِيَ ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ عَلَيۡهِ تَوَكَّلۡتُۖ وَهُوَ رَبُّ ٱلۡعَرۡشِ ٱلۡعَظِيمِ
అయినా వారు విముఖులైతే, వారితో అను: "నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు."(a)
(a) చూడండి, ఖుర్ఆన్ 7:54 మరియు 'స'హీ'హ్ బు'ఖారీ, పు-9, 'హ. 86 మరియు పు-6, 'హ. 87.
送信されました