クルアーンの対訳

テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

Scan the qr code to link to this page

سورة التحريم - సూరహ్ అత్-తహ్రీమ్

ページ番号

節(アーヤ)を表示
脚注を表示

節 : 1
يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ لِمَ تُحَرِّمُ مَآ أَحَلَّ ٱللَّهُ لَكَۖ تَبۡتَغِي مَرۡضَاتَ أَزۡوَٰجِكَۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ
ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు?(a) నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
(a) ఈ ఆయత్ ద్వారా విశదయ్యేదేమిటంటే దైవప్రవక్త ('స'అస) కు కూడా అల్లాహ్ (సు.తా.) 'హలాల్ చేసిన దానిని 'హరాం చేసే అధికారం లేదు.
節 : 2
قَدۡ فَرَضَ ٱللَّهُ لَكُمۡ تَحِلَّةَ أَيۡمَٰنِكُمۡۚ وَٱللَّهُ مَوۡلَىٰكُمۡۖ وَهُوَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ
వాస్తవానికి అల్లాహ్ మీ ప్రమాణాల పరిహార పద్ధతి మీకు నిర్దేశించాడు(a). మరియు అల్లాహ్ యే మీ యజమాని. మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
(a) ప్రమాణాలకు పరిహారం ఇచ్చే విధానానికై చూడండి, 5:89. దైవప్రవక్త ('స'అస) కూడా పై ఆయత్ అవతరింపజేయబడిన తరువాత అదే విధంగా పరిహారం ఇచ్చారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్) ఇంకా చూడండి, 2:224.
節 : 3
وَإِذۡ أَسَرَّ ٱلنَّبِيُّ إِلَىٰ بَعۡضِ أَزۡوَٰجِهِۦ حَدِيثٗا فَلَمَّا نَبَّأَتۡ بِهِۦ وَأَظۡهَرَهُ ٱللَّهُ عَلَيۡهِ عَرَّفَ بَعۡضَهُۥ وَأَعۡرَضَ عَنۢ بَعۡضٖۖ فَلَمَّا نَبَّأَهَا بِهِۦ قَالَتۡ مَنۡ أَنۢبَأَكَ هَٰذَاۖ قَالَ نَبَّأَنِيَ ٱلۡعَلِيمُ ٱلۡخَبِيرُ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు(a) రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు(b) చెప్పింది. మరియు అల్లాహ్ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి, మరికొంత తెలుపలేదు. ఇక అతను (ప్రవక్త, మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయట పడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలా అడిగింది: "ఇది నీకు ఎవరు తెలిపారు?" అతను జవాబిచ్చాడు: "నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు(c)."
(a) హఫ్స (b) 'ఆయి'షహ్ (c) ఖుర్ఆన్ మాత్రమే కాక ఇతర విషయాలు కూడా దైవప్రవక్త ('స'అస) కు దివ్యజ్ఞానం ద్వారా తెలియజేయబడేవి.
節 : 4
إِن تَتُوبَآ إِلَى ٱللَّهِ فَقَدۡ صَغَتۡ قُلُوبُكُمَاۖ وَإِن تَظَٰهَرَا عَلَيۡهِ فَإِنَّ ٱللَّهَ هُوَ مَوۡلَىٰهُ وَجِبۡرِيلُ وَصَٰلِحُ ٱلۡمُؤۡمِنِينَۖ وَٱلۡمَلَٰٓئِكَةُ بَعۡدَ ذَٰلِكَ ظَهِيرٌ
(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): "ఒకవేళ మీరిద్దరూ అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే) వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగిపోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగా పోతే! నిశ్చయంగా, అల్లాహ్ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి)."
節 : 5
عَسَىٰ رَبُّهُۥٓ إِن طَلَّقَكُنَّ أَن يُبۡدِلَهُۥٓ أَزۡوَٰجًا خَيۡرٗا مِّنكُنَّ مُسۡلِمَٰتٖ مُّؤۡمِنَٰتٖ قَٰنِتَٰتٖ تَٰٓئِبَٰتٍ عَٰبِدَٰتٖ سَٰٓئِحَٰتٖ ثَيِّبَٰتٖ وَأَبۡكَارٗا
ఒకవేళ అతను (ముహమ్మద్!) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్, మీకు బదులుగా, మీకంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించగలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తిపరులు, పశ్చాత్తాప పడేవారు, (అల్లాహ్ ను) ఆరాధించేవారు, వలస పోయే (ఉపవాసాలు చేసే)(a) వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు!(b)
(a) సాఇ''హాత్ కై చూడండి, 9:112. (b) దైవప్రవక్త ('స'అస) భార్య (ర.'అన్హుమ్)లలో కేవలం 'ఆయి'షహ్ (ర.'అన్హా) మాత్రమే కన్య, 'జైనబ్ బిన్తె జహష్ (ర.'అన్హా) విడాకురాలు మరియు మిగతా భార్యలందరూ విధవలు. అతను ఏ భార్యకు కూడా విడాకులివ్వలేదు.
節 : 6
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ قُوٓاْ أَنفُسَكُمۡ وَأَهۡلِيكُمۡ نَارٗا وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُ عَلَيۡهَا مَلَٰٓئِكَةٌ غِلَاظٞ شِدَادٞ لَّا يَعۡصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمۡ وَيَفۡعَلُونَ مَا يُؤۡمَرُونَ
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి(a)! దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దేవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.
(a) ఇక్కడ విశ్వాసులతో: 'మీరు మీ ఇంటి వారికి ఇస్లాం బోధించండి మరియు సద్వర్తనులుగా ఉండటానికి తగిన శిక్షణ ఇవ్వండి. బిడ్డ ఏడు సంవత్సరాల వాడు అయినప్పుడు నమా'జ్ చేయటానికి ప్రోత్సహించండి. పదిసంవత్సరాల వయస్సులో న'మాజ్ చేయకుంటే శిక్షించండి.' (అబూ దావుద్, తిర్మి'జీ). ఇదే విధంగా ఉపవాసాల కోసం మరియు మంచి పనుల కోసం ప్రోత్సహించండి.నరకానికై చూడండి, 74:27.
節 : 7
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ كَفَرُواْ لَا تَعۡتَذِرُواْ ٱلۡيَوۡمَۖ إِنَّمَا تُجۡزَوۡنَ مَا كُنتُمۡ تَعۡمَلُونَ
ఓ సత్యతిరస్కారులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. నిశ్చయంగా, మీరు చేస్తూ ఉండిన కర్మలకు, తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది.

節 : 8
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ تُوبُوٓاْ إِلَى ٱللَّهِ تَوۡبَةٗ نَّصُوحًا عَسَىٰ رَبُّكُمۡ أَن يُكَفِّرَ عَنكُمۡ سَيِّـَٔاتِكُمۡ وَيُدۡخِلَكُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ يَوۡمَ لَا يُخۡزِي ٱللَّهُ ٱلنَّبِيَّ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥۖ نُورُهُمۡ يَسۡعَىٰ بَيۡنَ أَيۡدِيهِمۡ وَبِأَيۡمَٰنِهِمۡ يَقُولُونَ رَبَّنَآ أَتۡمِمۡ لَنَا نُورَنَا وَٱغۡفِرۡ لَنَآۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ వైపునకు మనః పూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే(a)! మీ ప్రభువు మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు; ఆ రోజు అల్లాహ్ తన ప్రవక్తను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని అవమానం పాలు చేయడు. వారి కాంతి, వారి ముందు మరియు వారి కుడి వైపు నుండి ప్రసరిస్తూ ఉంటుంది.(b) వారి ఇలా ప్రార్థిస్తారు: "ఓ మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చేయి మరియు మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా, నీవే ప్రతిదీ చేయగల సమర్ధుడవు!"
(a) మనఃపూర్వక పశ్చాత్తాపం అంటే : 1) తాము చేసిన పాపాన్ని వదులుకోవాలి. 2) అల్లాహ్ (సు.తా.) ముందు వినమ్రులై పశ్తాత్తాప పడాలి. 3) మరల దానిని చేయకుండా ఉండాలి. 4) ఒకవేళ దాని సంబంధం మానవులతో ఉంటే, ఎవరి హక్కుకు హాని కలిగిందో, అతనితో క్షమాపణ కోరుకోవాలి. కేవలం నోటితో పశ్చాత్తాప పడితే సరిపోదు. (b) చూడండి, 57:1-123.
節 : 9
يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ جَٰهِدِ ٱلۡكُفَّارَ وَٱلۡمُنَٰفِقِينَ وَٱغۡلُظۡ عَلَيۡهِمۡۚ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ
ఓ ప్రవక్తా! నీవు సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో ధర్మయుద్ధం చెయ్యి మరియు వారి విషయంలో కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే! అది అతి చెడ్డ గమ్యస్థానం(a)!
(a) చూడండి, 9:73. సత్యతిరస్కారుల మరియు కపటవిశ్వాసుల గమ్యస్థానం నరకమే!
節 : 10
ضَرَبَ ٱللَّهُ مَثَلٗا لِّلَّذِينَ كَفَرُواْ ٱمۡرَأَتَ نُوحٖ وَٱمۡرَأَتَ لُوطٖۖ كَانَتَا تَحۡتَ عَبۡدَيۡنِ مِنۡ عِبَادِنَا صَٰلِحَيۡنِ فَخَانَتَاهُمَا فَلَمۡ يُغۡنِيَا عَنۡهُمَا مِنَ ٱللَّهِ شَيۡـٔٗا وَقِيلَ ٱدۡخُلَا ٱلنَّارَ مَعَ ٱلدَّٰخِلِينَ
సత్యతిరస్కారుల విషయంలో అల్లాహ్ నూహ్ భార్య మరియు లూత్ భార్యల ఉదాహరణలను ఇచ్చాడు(a). ఆ ఇద్దరు స్త్రీలు మా సత్పురుషులైన మా ఇద్దరు దాసుల (వివాహ) బంధంలో ఉండిరి. కాని ఆ ఇద్దరు స్త్రీలు వారిద్దరిని మోసగించారు. కావున వారిద్దరు, ఆ ఇద్దరు స్త్రీల విషయంలో అల్లాహ్ ముందు (పరలోకంలో) ఏ విధంగాను సహాయపడలేరు(b). మరియు (తీర్పు దినమున) వారితో: "నరకాగ్నిలో ప్రవేశించే వారితో సహా, మీరిద్దరు స్త్రీలు కూడా ప్రవేశించండి!" అని చెప్పబడుతుంది.
(a) లూ'త్ ('అ.స.) భార్య విషయానికై చూడండి 7:83 మరియు 11:81. నూ'హ్ ('అ.స.) భార్యను గురించి కేవలం ఇక్కడ మాత్రమే చెప్పబడింది. వీరిద్దరు చెడునడవడిక, చెడుచరిత్రవారు కారు, కానీ సత్యతిరస్కారులు. (b) సత్యతిరస్కారులు దగ్గరి బంధువులైనా వారితో సంబంధాలు తెంపుకోవాలి. చూడండి, 11:46.
節 : 11
وَضَرَبَ ٱللَّهُ مَثَلٗا لِّلَّذِينَ ءَامَنُواْ ٱمۡرَأَتَ فِرۡعَوۡنَ إِذۡ قَالَتۡ رَبِّ ٱبۡنِ لِي عِندَكَ بَيۡتٗا فِي ٱلۡجَنَّةِ وَنَجِّنِي مِن فِرۡعَوۡنَ وَعَمَلِهِۦ وَنَجِّنِي مِنَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ
మరియు అల్లాహ్, విశ్వసించినవారిలో ఫిర్ఔన్ భార్యను ఉదాహరణగా పేర్కొన్నాడు(a). ఆమె ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! నా కొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు! మరియు నన్ను, ఫిర్ఔన్ మరియు అతన చేష్టల నుండి కాపాడు మరియు నన్ను ఈ దుర్మార్గ జాతివారి నుండి కాపాడు."
(a) చూడండి, 28:9.
節 : 12
وَمَرۡيَمَ ٱبۡنَتَ عِمۡرَٰنَ ٱلَّتِيٓ أَحۡصَنَتۡ فَرۡجَهَا فَنَفَخۡنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتۡ بِكَلِمَٰتِ رَبِّهَا وَكُتُبِهِۦ وَكَانَتۡ مِنَ ٱلۡقَٰنِتِينَ
మరియు ఇమ్రాన్ కుమార్తె మర్యమ్(a) ను (కూడా ఉదాహరణగా పేర్కొన్నాడు) ఆమె తన శీలాన్ని కాపాడు కున్నది. మరియు మేము ఆమెలోకి మా (తరఫు నుండి) జీవం (ఆత్మ) ఊదాము(b). మరియు ఆమె తన ప్రభువు సమాచారాలను మరియు ఆయన గ్రంథాలను, సత్యాలని ధృవపరిచింది మరియు ఆమె భక్తిపరులలో చేరిపోయింది(c).
(a) చూడండి, 3:33. (b) చూడండి, 21:91. (c) స్త్రీలందరిలో 'ఖదీజా బింత్ 'ఖువైలిద్, ఫాతిమా, మర్యం మరియు ఫిర్'ఔన్ భార్య ఆసియహ్ (ర'ది.'అన్హుమ్)లు అతి ఉత్తమమైన వారు. (ముస్నద్ అ'హ్మద్) మరొక 'హదీస్' : చాలా మంది పురుషులు పరిపూర్ణతకు చేరుకున్నారు. కాని స్త్రీలలో కేవలం ఫిర్ఔన్ భార్య ఆసియహ్ మరియు 'ఇమ్రాన్ కూతురు మర్యం (ర'ది.'అన్హుమ్)లు పరిపూర్ణతకు చేరుకున్నారు. మరియు 'ఆయి'షహ్ (ర.'అన్హా) యొక్క ఔన్నత్యం ఇతర స్త్రీలపై స'రిద్ కు ఇతర ఆహారం పై ఉన్నట్లు ఉంది.('స'హీ'హ్ బు'ఖారీ).
送信されました