クルアーンの対訳

テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

Scan the qr code to link to this page

سورة الزخرف - సూరహ్ అజ్-జుఖ్రుఫ్

ページ番号

節(アーヤ)を表示
脚注を表示

節 : 1
حمٓ
హా - మీమ్.
節 : 2
وَٱلۡكِتَٰبِ ٱلۡمُبِينِ
స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా! (a)
(a) చూడండి, 12:1.
節 : 3
إِنَّا جَعَلۡنَٰهُ قُرۡءَٰنًا عَرَبِيّٗا لَّعَلَّكُمۡ تَعۡقِلُونَ
నిశ్చయంగా, మీరు అర్థం చేసుకోగలగటానికి, మేము దీనిని అరబ్బీ భాషలో ఖుర్ఆన్ (a) గా అవతరింపజేశాము.
(a) ఖుర్ఆనున్ / ఖుర్ఆనన్ : దీని పదార్థాలు సంభాషణ, ప్రసంగం, ఉపన్యాసం, పఠనగ్రంథం, Recitation, Talk, Lecture, Discourse, Sermon, అని ఉన్నాయి. అల్-ఖుర్ఆను అంటే ఈ ఖుర్ఆన్ గ్రంథం. అల్ ఖుర్ఆనుల్-కరీమ్ అంటే The Glorious Quran, ఈ దివ్యఖుర్ఆన్.
節 : 4
وَإِنَّهُۥ فِيٓ أُمِّ ٱلۡكِتَٰبِ لَدَيۡنَا لَعَلِيٌّ حَكِيمٌ
మరియు నిశ్చయంగా, ఇది మా వద్ద నున్న మాతృ గ్రంథంలోనిదే! (a) అది మహోన్నతమైనది, వివేకంతో నిండి ఉన్నది.
(a) ఉమ్ముల్ కితాబ్ : చూడండి, 13:39, 85:22 అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్. మాతృగ్రంథం, సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యథాస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.
節 : 5
أَفَنَضۡرِبُ عَنكُمُ ٱلذِّكۡرَ صَفۡحًا أَن كُنتُمۡ قَوۡمٗا مُّسۡرِفِينَ
ఏమిటి? మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, మేము ఈ హితోపదేశాన్ని (ఖుర్ఆన్ ను) మీ నుండి తొలగించాలా? (a)
(a) మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని మేము మీకు హితబోధ చేయటం మానుకుంటామని భావిస్తున్నారా? (ఇబ్నె-కసీ'ర్).
節 : 6
وَكَمۡ أَرۡسَلۡنَا مِن نَّبِيّٖ فِي ٱلۡأَوَّلِينَ
మరియు మేము పూర్వం గతించిన వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము.
節 : 7
وَمَا يَأۡتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ
మరియు వారు, తమ వద్దకు వచ్చిన ప్రవక్తలలో ఏ ఒక్కరిని కూడా ఎగతాళి చేయకుండా వదల లేదు.
節 : 8
فَأَهۡلَكۡنَآ أَشَدَّ مِنۡهُم بَطۡشٗا وَمَضَىٰ مَثَلُ ٱلۡأَوَّلِينَ
కావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. (a) మరియు పూర్వ జాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి.
(a) అంటే వారు మక్కా ముష్రికుల కంటే ఎక్కువ బలవంతులు. ఇంకా చూడండి, 40:82.
節 : 9
وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ ٱلۡعَزِيزُ ٱلۡعَلِيمُ
ఒకవేళ, నీవు వారితో: "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: "వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు." అని అంటారు.
節 : 10
ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ مَهۡدٗا وَجَعَلَ لَكُمۡ فِيهَا سُبُلٗا لَّعَلَّكُمۡ تَهۡتَدُونَ
ఆయనే మీ కొరకు ఈ భూమిని పరుపుగా చేశాడు; మరియు మీరు మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి, అందులో మీ కొరకు త్రోవలు ఏర్పరచాడు. (a)
(a) చూడండి, 20:53.

節 : 11
وَٱلَّذِي نَزَّلَ مِنَ ٱلسَّمَآءِ مَآءَۢ بِقَدَرٖ فَأَنشَرۡنَا بِهِۦ بَلۡدَةٗ مَّيۡتٗاۚ كَذَٰلِكَ تُخۡرَجُونَ
మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు.
節 : 12
وَٱلَّذِي خَلَقَ ٱلۡأَزۡوَٰجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ ٱلۡفُلۡكِ وَٱلۡأَنۡعَٰمِ مَا تَرۡكَبُونَ
మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు;
節 : 13
لِتَسۡتَوُۥاْ عَلَىٰ ظُهُورِهِۦ ثُمَّ تَذۡكُرُواْ نِعۡمَةَ رَبِّكُمۡ إِذَا ٱسۡتَوَيۡتُمۡ عَلَيۡهِ وَتَقُولُواْ سُبۡحَٰنَ ٱلَّذِي سَخَّرَ لَنَا هَٰذَا وَمَا كُنَّا لَهُۥ مُقۡرِنِينَ
మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించటానికి: "ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు.
節 : 14
وَإِنَّآ إِلَىٰ رَبِّنَا لَمُنقَلِبُونَ
మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది!" (a)
(a) దైవప్రవక్త ('స'అస) తమ వాహనం ఎక్కినప్పుడు: మూడుసార్లు అల్లాహు అక్బర్ తరువాత "సు'హానల్లజీ' స'ఖ్ఖరలనా హాజా' వమా కున్నా లహూ ముఖ్ రినీన్. వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్!" వరకు ఆ ఆయత్ లు (43:13-14) చదివే వారు. ('స. ముస్లిం).
節 : 15
وَجَعَلُواْ لَهُۥ مِنۡ عِبَادِهِۦ جُزۡءًاۚ إِنَّ ٱلۡإِنسَٰنَ لَكَفُورٞ مُّبِينٌ
మరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా (భాగస్వాములుగా / సంతానంగా) చేశారు. (a) నిశ్చయంగా, మానవుడు పరమ కృతఘ్నుడు!
(a) చూవారు (ముష్రికులు) దైవదూత ('అలైహిమ్ స.) లను అల్లాహ్ (సు.తా.) కుమార్తెలుగా భావించే వారు. ఇక్కడ 'ఇబాదున్ - దాసులు, అంటే దైవదూతలు మరియు జు'జ్ అన్ - అంటే కుమార్తెలు. ఇంకా చూడండి, 6:100.
節 : 16
أَمِ ٱتَّخَذَ مِمَّا يَخۡلُقُ بَنَاتٖ وَأَصۡفَىٰكُم بِٱلۡبَنِينَ
ఏమిటి? ఆయన తాను సృష్టించిన వాటిలో నుండి తన కొరకు కుమార్తెలను తీసుకొని మీ కొరకు ప్రత్యేకంగా కుమారులను ఉంచాడా? (a)
(a) చూడండి, 16:57-59.
節 : 17
وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحۡمَٰنِ مَثَلٗا ظَلَّ وَجۡهُهُۥ مُسۡوَدّٗا وَهُوَ كَظِيمٌ
మరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడ సంతానమే గనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అంద జేయబడి నప్పుడు, అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగి పోతాడు!
節 : 18
أَوَمَن يُنَشَّؤُاْ فِي ٱلۡحِلۡيَةِ وَهُوَ فِي ٱلۡخِصَامِ غَيۡرُ مُبِينٖ
ఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని అల్లాహ్ కు అంటగట్టుతున్నారా)?
節 : 19
وَجَعَلُواْ ٱلۡمَلَٰٓئِكَةَ ٱلَّذِينَ هُمۡ عِبَٰدُ ٱلرَّحۡمَٰنِ إِنَٰثًاۚ أَشَهِدُواْ خَلۡقَهُمۡۚ سَتُكۡتَبُ شَهَٰدَتُهُمۡ وَيُسۡـَٔلُونَ
మరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా? వీరు! వారు (దేవదూతలు) సృష్టించబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి వుంచబడతాయి. మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు.
節 : 20
وَقَالُواْ لَوۡ شَآءَ ٱلرَّحۡمَٰنُ مَا عَبَدۡنَٰهُمۗ مَّا لَهُم بِذَٰلِكَ مِنۡ عِلۡمٍۖ إِنۡ هُمۡ إِلَّا يَخۡرُصُونَ
మరియు వారు ఇలా అంటారు: "ఒకవేళ ఆ కరుణామయుడు తలచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు." దాని వాస్తవ జ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు!
節 : 21
أَمۡ ءَاتَيۡنَٰهُمۡ كِتَٰبٗا مِّن قَبۡلِهِۦ فَهُم بِهِۦ مُسۡتَمۡسِكُونَ
మేము వారికి ఇంతకు ముందు ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా ఏమిటి? వారు దానిని ఖచ్చితంగా అనుసరించటానికి?
節 : 22
بَلۡ قَالُوٓاْ إِنَّا وَجَدۡنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٖ وَإِنَّا عَلَىٰٓ ءَاثَٰرِهِم مُّهۡتَدُونَ
అలా కాదు! వారిలా అంటారు: "వాస్తవానికి మేము, మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా చూశాము. మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము."

節 : 23
وَكَذَٰلِكَ مَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ فِي قَرۡيَةٖ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتۡرَفُوهَآ إِنَّا وَجَدۡنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٖ وَإِنَّا عَلَىٰٓ ءَاثَٰرِهِم مُّقۡتَدُونَ
మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: (a) "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము."
(a) చూడండి, 11:116.
節 : 24
۞ قَٰلَ أَوَلَوۡ جِئۡتُكُم بِأَهۡدَىٰ مِمَّا وَجَدتُّمۡ عَلَيۡهِ ءَابَآءَكُمۡۖ قَالُوٓاْ إِنَّا بِمَآ أُرۡسِلۡتُم بِهِۦ كَٰفِرُونَ
(వారి ప్రవక్త) ఇలా అనేవాడు: "ఒకవేళ నేను మీ తండ్రితాతలు అనుసరిస్తూ వచ్చిన దాని కంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీ కోసం తెచ్చినా (మీరు వారినే అనుసరిస్తారా)?" వారిలా జవాబిచ్చే వారు: "నిశ్చయంగా, మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము."
節 : 25
فَٱنتَقَمۡنَا مِنۡهُمۡۖ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُكَذِّبِينَ
కావున మేము వారిపై మా ప్రతీకారాన్ని (శిక్షను) పంపాము. చూశారా! సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో!
節 : 26
وَإِذۡ قَالَ إِبۡرَٰهِيمُ لِأَبِيهِ وَقَوۡمِهِۦٓ إِنَّنِي بَرَآءٞ مِّمَّا تَعۡبُدُونَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. (a)
(a) ఇబ్రాహీమ్ ('అ.స.) గాథకు చూడండి, 6:74 మరియు 21:51.
節 : 27
إِلَّا ٱلَّذِي فَطَرَنِي فَإِنَّهُۥ سَيَهۡدِينِ
(నేనైతే) నన్ను సృజించిన ఆయన (అల్లాహ్ నే ఆరాధిస్తాను). ఎందుకంటే! నిశ్చయంగా, ఆయనే నాకు మార్గదర్శకత్వం చేయగలడు."
節 : 28
وَجَعَلَهَا كَلِمَةَۢ بَاقِيَةٗ فِي عَقِبِهِۦ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ
మరియు అతను (ఇబ్రాహీమ్) ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు. (a) వారు దాని వైపుకు మరలుతారని!
(a) చూడండి, 2:132.
節 : 29
بَلۡ مَتَّعۡتُ هَٰٓؤُلَآءِ وَءَابَآءَهُمۡ حَتَّىٰ جَآءَهُمُ ٱلۡحَقُّ وَرَسُولٞ مُّبِينٞ
వాస్తవానికి, నేను వారికి మరియు వారి తండ్రితాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం మరియు (దానిని) స్పష్టంగా వివరించే దైవప్రవక్త కూడా వచ్చాడు. (a)
(a) చూడండి, 21:44.
節 : 30
وَلَمَّا جَآءَهُمُ ٱلۡحَقُّ قَالُواْ هَٰذَا سِحۡرٞ وَإِنَّا بِهِۦ كَٰفِرُونَ
కాని వారి వద్దకు సత్యం (ఈ ఖుర్ఆన్) వచ్చినప్పుడు వారన్నారు: "ఇది కేవలం మంత్రజాలమే. (a) మరియు నిశ్చయంగా, మేము దీనిని తిరస్కరిస్తున్నాము."
(a) చూడండి, 74:24.
節 : 31
وَقَالُواْ لَوۡلَا نُزِّلَ هَٰذَا ٱلۡقُرۡءَانُ عَلَىٰ رَجُلٖ مِّنَ ٱلۡقَرۡيَتَيۡنِ عَظِيمٍ
వారు ఇంకా ఇలా అన్నారు: "ఈ ఖుర్ఆన్ ఈ రెండు నగరాలలోని ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింప జేయబడలేదు?"(a)
(a) ఈ రెండు నగరవాసులలో పేరు ప్రఖ్యాతులున్న మక్కాకు చెందిన వలీద్ బిన్ ముగైరా మరియు తాయఫ్ కు చెందిన ఉర్ వా బిన్ మసవూద్ సఖఫీ కావచ్చని వ్యాక్యాతలంటారు.
節 : 32
أَهُمۡ يَقۡسِمُونَ رَحۡمَتَ رَبِّكَۚ نَحۡنُ قَسَمۡنَا بَيۡنَهُم مَّعِيشَتَهُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَرَفَعۡنَا بَعۡضَهُمۡ فَوۡقَ بَعۡضٖ دَرَجَٰتٖ لِّيَتَّخِذَ بَعۡضُهُم بَعۡضٗا سُخۡرِيّٗاۗ وَرَحۡمَتُ رَبِّكَ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ
నీ ప్రభువు కారుణ్యాన్ని పంచి పెట్టే వారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచి పెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి,(a) వారిలో కొందరికి మరి కొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని (సంపద) కంటే నీ ప్రభువు కారుణ్యమే (b) ఎంతో ఉత్తమమైనది.
(a) అల్లాహ్ (సు.తా.) వ్యవహారాలను సరళంగా నడపటానికి, ప్రజలలో ధనసంపత్తులను, తెలివి జ్ఞానాలను, ఎక్కువ తక్కువగా పంచాడు. దీని వల్ల ప్రతి మానవుడు మరొకని సహాయం మీద ఆధారపడి ఉన్నాడు. ధనవంతుడు పేదవాని మీద, పేదవాడు ధనవంతుని మీద. (b) ఈ కారుణ్యం అంటే పరలోక జీవిత సుఖం.
節 : 33
وَلَوۡلَآ أَن يَكُونَ ٱلنَّاسُ أُمَّةٗ وَٰحِدَةٗ لَّجَعَلۡنَا لِمَن يَكۡفُرُ بِٱلرَّحۡمَٰنِ لِبُيُوتِهِمۡ سُقُفٗا مِّن فِضَّةٖ وَمَعَارِجَ عَلَيۡهَا يَظۡهَرُونَ
మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటి పైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము.

節 : 34
وَلِبُيُوتِهِمۡ أَبۡوَٰبٗا وَسُرُرًا عَلَيۡهَا يَتَّكِـُٔونَ
మరియు వారి ఇండ్ల తలుపులను మరియు వారు ఆనుకొని కూర్చునే పీఠాలను కూడా;
節 : 35
وَزُخۡرُفٗاۚ وَإِن كُلُّ ذَٰلِكَ لَمَّا مَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَٱلۡأٓخِرَةُ عِندَ رَبِّكَ لِلۡمُتَّقِينَ
మరియు బంగారంతో కూడా!(a) మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత (సుఖం) ఉంటుంది.
(a) 'జు'ఖ్ రుఫున్: బంగారం. దీని అర్థం ఆభరణాలు లేక అలంకరణ కూడా అవుతుంది. చూడండి, 10:24. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అల్లాహ్ (సు.తా.) దగ్గర ఈ ప్రపంచపు విలువ దోమ రెక్కకు సమానంగా ఉండి ఉన్నా, అల్లాహ్ (సు.తా.) ఏ సత్యతిరస్కారిని గుటికెడు నీళ్ళు కూడా త్రాగనిచ్చేవాడు కాదు." (తిర్మిజీ', ఇబ్నె-మాజహ్).
節 : 36
وَمَن يَعۡشُ عَن ذِكۡرِ ٱلرَّحۡمَٰنِ نُقَيِّضۡ لَهُۥ شَيۡطَٰنٗا فَهُوَ لَهُۥ قَرِينٞ
మరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షైతాన్ ను నియమిస్తాము. ఇక వాడు (ఆ షైతాన్) వాని సహచరుడు (ఖరీనున్) అవుతాడు.(a)
(a) చూచూడండి, 41:25.
節 : 37
وَإِنَّهُمۡ لَيَصُدُّونَهُمۡ عَنِ ٱلسَّبِيلِ وَيَحۡسَبُونَ أَنَّهُم مُّهۡتَدُونَ
మరియు నిశ్చయంగా, వారు (షైతాన్ లు) వారిని (అల్లాహ్) మార్గం నుండి ఆటంక పరుస్తారు. మరియు వారేమో నిశ్చయంగా, తాము సరైన మార్గదర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు!
節 : 38
حَتَّىٰٓ إِذَا جَآءَنَا قَالَ يَٰلَيۡتَ بَيۡنِي وَبَيۡنَكَ بُعۡدَ ٱلۡمَشۡرِقَيۡنِ فَبِئۡسَ ٱلۡقَرِينُ
చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నీకూ నాకూ మధ్య తూర్పుపడమరల(a) మధ్య ఉన్నంత దూరం ఉండి వుంటే ఎంత బాగుండేది! ఎందుకంటే నీవు అతి చెడ్డ సహచరుడివి!"
(a) అల్-మష్ రిఖైన్: ప్రాచీన అరబ్బీ భాషా సంప్రదాయం ప్రకారం కొన్నిసార్లు ఒక శబ్దానికి ద్వివచనం ఇవ్వటం వల్ల దాని అర్థం రెండు విభిన్న వస్తువులను సూచిస్తుంది. ఉదా: ఇక్కడ వ్రాసినట్లు అల్-మష్ రిఖైన్, అంటే తూర్పుపడమరలు; ఖమరైన్, అంటే సూర్యచంద్రులు.
節 : 39
وَلَن يَنفَعَكُمُ ٱلۡيَوۡمَ إِذ ظَّلَمۡتُمۡ أَنَّكُمۡ فِي ٱلۡعَذَابِ مُشۡتَرِكُونَ
మరియు మీరు దుర్మార్గం చేశారు! కావున, ఈరోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు.(a)
(a) ఈ ఆయత్ కు ఈ విధంగా కూడా తాత్పర్యం ఇవ్వబడింది: 'మరియు మీరు దుర్మార్గం చేశారు, అది ఈ రోజు మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు; నిశ్చయంగా, మీరందరు ఈ శిక్షను పంచుకుంటారు.' ఇంకా చూడండి, 14:49.
節 : 40
أَفَأَنتَ تُسۡمِعُ ٱلصُّمَّ أَوۡ تَهۡدِي ٱلۡعُمۡيَ وَمَن كَانَ فِي ضَلَٰلٖ مُّبِينٖ
(ఓ ముహమ్మద్!) నీవు చెవిటి వాడికి వినిపింప జేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించ గలవా? లేక, స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి (మార్గదర్శకత్వం చేయగలవా)?(a)
(a) చూడండి, 35:22.
節 : 41
فَإِمَّا نَذۡهَبَنَّ بِكَ فَإِنَّا مِنۡهُم مُّنتَقِمُونَ
ఒకవేళ వాస్తవానికి, మేము నిన్ను తీసుకొని పోయినా, వారికి మాత్రం తప్పకుండా ప్రతీకారం చేస్తాము.
節 : 42
أَوۡ نُرِيَنَّكَ ٱلَّذِي وَعَدۡنَٰهُمۡ فَإِنَّا عَلَيۡهِم مُّقۡتَدِرُونَ
లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది.
節 : 43
فَٱسۡتَمۡسِكۡ بِٱلَّذِيٓ أُوحِيَ إِلَيۡكَۖ إِنَّكَ عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ
కావున నీవు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా, నీవు ఋజుమార్గం మీద ఉన్నావు.
節 : 44
وَإِنَّهُۥ لَذِكۡرٞ لَّكَ وَلِقَوۡمِكَۖ وَسَوۡفَ تُسۡـَٔلُونَ
మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నీకు మరియు నీ జాతి వారికి ఒక హితబోధ. మరియు (దీనిని గురించి) మీరు ప్రశ్నింప బడగలరు.(a)
(a) ప్రవక్త 'అలైహిమ్ స.) లందరూ ప్రశ్నింపబడతారు. చూడండి, 5:109.
節 : 45
وَسۡـَٔلۡ مَنۡ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رُّسُلِنَآ أَجَعَلۡنَا مِن دُونِ ٱلرَّحۡمَٰنِ ءَالِهَةٗ يُعۡبَدُونَ
మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: "మేము, ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో?"
節 : 46
وَلَقَدۡ أَرۡسَلۡنَا مُوسَىٰ بِـَٔايَٰتِنَآ إِلَىٰ فِرۡعَوۡنَ وَمَلَإِيْهِۦ فَقَالَ إِنِّي رَسُولُ رَبِّ ٱلۡعَٰلَمِينَ
మరియు వాస్తవంగా, మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. అతను వారితో ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుణ్ణి."
節 : 47
فَلَمَّا جَآءَهُم بِـَٔايَٰتِنَآ إِذَا هُم مِّنۡهَا يَضۡحَكُونَ
కాని, అతను వారి వద్దకు మా సూచన (ఆయాత్) లను తీసుకొని వచ్చినప్పుడు, వారు వాటిని గురించి పరిహాసాలాడేవారు.(a)
(a) చూడండి, 6:109.

節 : 48
وَمَا نُرِيهِم مِّنۡ ءَايَةٍ إِلَّا هِيَ أَكۡبَرُ مِنۡ أُخۡتِهَاۖ وَأَخَذۡنَٰهُم بِٱلۡعَذَابِ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ
మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని (అద్భుత సూచన) కంటే మించినదిగా ఉండేది.(a) మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని!(b)
(a) చూడండి, 15:23. (a) అద్భుత సూచనల కోసం చూడండి, 7:133-135. (b) అల్లాహ్ (సు.తా.) వైపునకు మరలటం మానవుడు అల్లాహ్ (సు.తా.) ఉనికిని గ్రహించే స్వాభావిక లక్షణం. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) నుండి మరలిపోవటం అతని మానసిక పతనం, ఆధ్యాత్మిక భ్రష్టత్వం. చూడండి, 7:172-173.
節 : 49
وَقَالُواْ يَٰٓأَيُّهَ ٱلسَّاحِرُ ٱدۡعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ إِنَّنَا لَمُهۡتَدُونَ
మరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: "ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గులమవుతాము."
節 : 50
فَلَمَّا كَشَفۡنَا عَنۡهُمُ ٱلۡعَذَابَ إِذَا هُمۡ يَنكُثُونَ
కాని మేము వారి పై నుండి ఆ శిక్షను తొలగించిన వెంటనే వారు తమ వాగ్దానాన్ని భంగపరచే వారు.
節 : 51
وَنَادَىٰ فِرۡعَوۡنُ فِي قَوۡمِهِۦ قَالَ يَٰقَوۡمِ أَلَيۡسَ لِي مُلۡكُ مِصۡرَ وَهَٰذِهِ ٱلۡأَنۡهَٰرُ تَجۡرِي مِن تَحۡتِيٓۚ أَفَلَا تُبۡصِرُونَ
మరియు, ఫిర్ఔన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈజిప్టు (మిస్ర్) యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్ళు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటం లేదా?
節 : 52
أَمۡ أَنَا۠ خَيۡرٞ مِّنۡ هَٰذَا ٱلَّذِي هُوَ مَهِينٞ وَلَا يَكَادُ يُبِينُ
ఈ తుచ్ఛమైన వాడు మరియు (తన మాటను) స్పష్టంగా వివరించలేని వాడి (మూసా) కంటే నేను శ్రేష్ఠుడిని కానా?(a)
(a) మూసా('అ.స.) సరిగ్గా మాట్లాడలేక పోయేవారు. నత్తినత్తిగా మాట్లాడే వారు (Stammer). దానికి చూడండి, 20:27-28.
節 : 53
فَلَوۡلَآ أُلۡقِيَ عَلَيۡهِ أَسۡوِرَةٞ مِّن ذَهَبٍ أَوۡ جَآءَ مَعَهُ ٱلۡمَلَٰٓئِكَةُ مُقۡتَرِنِينَ
అయితే ఇతనికి బంగారు కంకణాలు ఎందుకు వేయబడలేదు? లేదా, ఇతనికి తోడుగా ఇతనితో పాటు దేవదూతలు ఎందుకు రాలేదు?"(a)
(a) ప్రాచీన కాలంలో ఈజిప్టులో బంగారు కంకణాలు, మెడలో బంగారు ఆభరణాలు పెద్దరికాన్ని సూచించేవి. (ఆదికాండము-Genesis, 12:42) అంటే మూ'సా ('అ.స.) అల్లాహ్ (సు.తా.) సందేశహరుడైతే అల్లాహ్ (సు.తా.), అతనికి, అతని గొప్పతనానికి తగినట్లు బంగారు ఆభరణాలు, కంకణాలు, ఎందుకు ప్రసాదించలేదు? ఇదే విధమైన ప్రశ్నలు ముష్రిక్ ఖురైషులు దైవప్రవక్త ('స'అస) ను కూడా అడిగారు.
節 : 54
فَٱسۡتَخَفَّ قَوۡمَهُۥ فَأَطَاعُوهُۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمٗا فَٰسِقِينَ
ఈ విధంగా, అతడు (ఫిర్ఔన్) తన జాతి వారిని ప్రేరేపింప జేయటం వలన వారు అతనిని అనుసరించారు. నిశ్చయంగా వారు దుర్జనులు (ఫాసిఖీన్).
節 : 55
فَلَمَّآ ءَاسَفُونَا ٱنتَقَمۡنَا مِنۡهُمۡ فَأَغۡرَقۡنَٰهُمۡ أَجۡمَعِينَ
ఈ విధంగా, వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము. మరియు వారందరినీ ముంచి వేశాము.
節 : 56
فَجَعَلۡنَٰهُمۡ سَلَفٗا وَمَثَلٗا لِّلۡأٓخِرِينَ
ఇక మేము, వారిని తర్వాత వచ్చే వారి కొరకు ఒక గడిచిన నిదర్శనంగా మరియు ఒక ఉదాహరణగా చేశాము.
節 : 57
۞ وَلَمَّا ضُرِبَ ٱبۡنُ مَرۡيَمَ مَثَلًا إِذَا قَوۡمُكَ مِنۡهُ يَصِدُّونَ
మరియు మర్యమ్ కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొనబడినప్పుడు (ఓ ముహమ్మద్!) నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలు వేస్తారు.
節 : 58
وَقَالُوٓاْ ءَأَٰلِهَتُنَا خَيۡرٌ أَمۡ هُوَۚ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلَۢاۚ بَلۡ هُمۡ قَوۡمٌ خَصِمُونَ
మరియు అంటారు: "మా దేవుళ్ళు మంచివా లేక అతడా (ఈసానా)?" వారు ఈ విషయం నీ ముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహ ప్రియులైన జనులు.
節 : 59
إِنۡ هُوَ إِلَّا عَبۡدٌ أَنۡعَمۡنَا عَلَيۡهِ وَجَعَلۡنَٰهُ مَثَلٗا لِّبَنِيٓ إِسۡرَٰٓءِيلَ
అతను (ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహిచాము. మరియు మేము అతనిని ఇస్రాయీల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము.
節 : 60
وَلَوۡ نَشَآءُ لَجَعَلۡنَا مِنكُم مَّلَٰٓئِكَةٗ فِي ٱلۡأَرۡضِ يَخۡلُفُونَ
మరియు మేము కోరితే మీకు బదులుగా, దేవదూతలను భూమిపై ఉత్తరాధికారులుగా చేసే వారము.

節 : 61
وَإِنَّهُۥ لَعِلۡمٞ لِّلسَّاعَةِ فَلَا تَمۡتَرُنَّ بِهَا وَٱتَّبِعُونِۚ هَٰذَا صِرَٰطٞ مُّسۡتَقِيمٞ
మరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన.(a) కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం.
(a) చాలామంది వ్యఖ్యాతల ప్రకారం 'ఈసా ('అ.స.) మరల వచ్చారంటే, పునరుత్థానదినం దగ్గరున్నట్లే! ఇది ఎన్నో 'స'హీ'హ్ 'హదీస్'లలో పేర్కొనబడింది.
節 : 62
وَلَا يَصُدَّنَّكُمُ ٱلشَّيۡطَٰنُۖ إِنَّهُۥ لَكُمۡ عَدُوّٞ مُّبِينٞ
మరియు షైతాన్ ను, మిమ్మల్ని ఆటంక పరచనివ్వకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు.
節 : 63
وَلَمَّا جَآءَ عِيسَىٰ بِٱلۡبَيِّنَٰتِ قَالَ قَدۡ جِئۡتُكُم بِٱلۡحِكۡمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعۡضَ ٱلَّذِي تَخۡتَلِفُونَ فِيهِۖ فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ
మరియు ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: "వాస్తవంగా, నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకొని వచ్చాను;(a) మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి.
(a) వివేకం, అంటే దివ్యజ్ఞానం (వ'హీ).
節 : 64
إِنَّ ٱللَّهَ هُوَ رَبِّي وَرَبُّكُمۡ فَٱعۡبُدُوهُۚ هَٰذَا صِرَٰطٞ مُّسۡتَقِيمٞ
నిశ్చయంగా, అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం."
節 : 65
فَٱخۡتَلَفَ ٱلۡأَحۡزَابُ مِنۢ بَيۡنِهِمۡۖ فَوَيۡلٞ لِّلَّذِينَ ظَلَمُواْ مِنۡ عَذَابِ يَوۡمٍ أَلِيمٍ
అయినా, తరువాత వచ్చిన వర్గాల వారు పరస్పర వర్గ భేదాలకు లోనయ్యారు. కావున దుర్మర్గానికి పాల్పడిన వారికి బాధాకరమైన ఆ దినమున శిక్ష పడుతుంది!
節 : 66
هَلۡ يَنظُرُونَ إِلَّا ٱلسَّاعَةَ أَن تَأۡتِيَهُم بَغۡتَةٗ وَهُمۡ لَا يَشۡعُرُونَ
వారు కేవలం ఆ అంతిమ ఘడియ అకస్మాత్తుగా - తమకు తెలియకుండానే - తమపై వచ్చి పడాలని నిరీక్షిస్తున్నారా ఏమిటి?
節 : 67
ٱلۡأَخِلَّآءُ يَوۡمَئِذِۭ بَعۡضُهُمۡ لِبَعۡضٍ عَدُوٌّ إِلَّا ٱلۡمُتَّقِينَ
ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరి కొకరు శత్రువులవుతారు.
節 : 68
يَٰعِبَادِ لَا خَوۡفٌ عَلَيۡكُمُ ٱلۡيَوۡمَ وَلَآ أَنتُمۡ تَحۡزَنُونَ
(విశ్వాసులతో ఇలా అనబడుతుంది): "ఓ నా దాసులారా! ఈనాడు మీకు ఏ భయమూ లేదు మరియు మీరు దుఃఖ పడరు కూడా!
節 : 69
ٱلَّذِينَ ءَامَنُواْ بِـَٔايَٰتِنَا وَكَانُواْ مُسۡلِمِينَ
అలాంటి వారు, ఎవరైతే మా సూచనలను విశ్వసించారో మరియు ముస్లింలు అయి ఉన్నారో!
節 : 70
ٱدۡخُلُواْ ٱلۡجَنَّةَ أَنتُمۡ وَأَزۡوَٰجُكُمۡ تُحۡبَرُونَ
మీరు మరియు మీ సహవాసులు (అజ్వాజ్) సంతోషంగా స్వర్గంలో ప్రవేశించండి."
節 : 71
يُطَافُ عَلَيۡهِم بِصِحَافٖ مِّن ذَهَبٖ وَأَكۡوَابٖۖ وَفِيهَا مَا تَشۡتَهِيهِ ٱلۡأَنفُسُ وَتَلَذُّ ٱلۡأَعۡيُنُۖ وَأَنتُمۡ فِيهَا خَٰلِدُونَ
వారి మధ్య, బంగారు పళ్ళాలు(a) మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు కళ్ళకు ఇంపుగా ఉండేవి, అన్నీ ఉంటాయి. మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు.
(a) 'సి'హాఫున్, 'స'హ్ ఫతున్ (ఏ.వ.): Plate, అన్నం తినే పళ్ళెం. అన్నింటి కంటే పెద్ద పళ్ళాన్ని జఫ్ నతున్ అంటారు. దాని తరువాత ఖ'స్'అతున్ దీనిలో పది మంది తినగలుగుతారు. దానిలో సగం ఉండేది 'సహ్ ఫతున్, దాని కంటే చిన్నది మికీలతున్. (ఫ త్హ్'అల్-ఖదీర్).
節 : 72
وَتِلۡكَ ٱلۡجَنَّةُ ٱلَّتِيٓ أُورِثۡتُمُوهَا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
మరియు మీరు చేస్తూ వున్న కర్మల ఫలితానికి బదులుగా, మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు.
節 : 73
لَكُمۡ فِيهَا فَٰكِهَةٞ كَثِيرَةٞ مِّنۡهَا تَأۡكُلُونَ
మీకు అందులో పండ్లూ ఫలాలు పుష్కలంగా ఉంటాయి, వాటిని మీరు తింటారు.

節 : 74
إِنَّ ٱلۡمُجۡرِمِينَ فِي عَذَابِ جَهَنَّمَ خَٰلِدُونَ
నిశ్చయంగా, అపరాధులు నరకశిక్షలో శాశ్వతంగా ఉంటారు.(a)
(a) చూడండి, 6:128 చివరి వాక్యం మరియు 40:12/3 వ్యాఖ్యానంలో సూచించిన 'హదీస్'.
節 : 75
لَا يُفَتَّرُ عَنۡهُمۡ وَهُمۡ فِيهِ مُبۡلِسُونَ
వారి (శిక్ష) ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారందులో హతాశులై పడి ఉంటారు.
節 : 76
وَمَا ظَلَمۡنَٰهُمۡ وَلَٰكِن كَانُواْ هُمُ ٱلظَّٰلِمِينَ
మేము వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే దుర్మార్గులై ఉండిరి. (a)
(a) అంటే వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
節 : 77
وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ
మరియు వారిలా మొరపెట్టుకుంటారు: "ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను." అతను అంటాడు: "నిశ్చయంగా మీరిక్కడే (ఇదే విధంగా) పడి ఉంటారు."
節 : 78
لَقَدۡ جِئۡنَٰكُم بِٱلۡحَقِّ وَلَٰكِنَّ أَكۡثَرَكُمۡ لِلۡحَقِّ كَٰرِهُونَ
వాస్తవానికి మేము మీ వద్దకు సత్యాన్ని తీసుకొని వచ్చాము, కాని మీలో చాలా మంది సత్యమంటేనే అసహ్యించుకునే వారు.
節 : 79
أَمۡ أَبۡرَمُوٓاْ أَمۡرٗا فَإِنَّا مُبۡرِمُونَ
వారు ఏదైనా నిర్ణయం (పన్నాగం) చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా మేము కూడా ఒక గట్టి నిర్ణయం (పన్నాగం) చేస్తున్నాము.(a)
(a) చూడండి, 52:42.
節 : 80
أَمۡ يَحۡسَبُونَ أَنَّا لَا نَسۡمَعُ سِرَّهُمۡ وَنَجۡوَىٰهُمۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيۡهِمۡ يَكۡتُبُونَ
లేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా కాదు, (వాస్తవానికి) మా దూతలు వారి దగ్గర ఉండి, అంతా వ్రాస్తున్నారు.
節 : 81
قُلۡ إِن كَانَ لِلرَّحۡمَٰنِ وَلَدٞ فَأَنَا۠ أَوَّلُ ٱلۡعَٰبِدِينَ
వారితో ఇలా అను: "ఒకవేళ ఆ కరుణామయునికి కుమారుడే ఉంటే, అందరి కంటే ముందు నేనే అతనిని ఆరాధించేవాడిని."
節 : 82
سُبۡحَٰنَ رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ رَبِّ ٱلۡعَرۡشِ عَمَّا يَصِفُونَ
భూమ్యాకాశాలకు ప్రభువు మరియు సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు అయిన ఆయన (అల్లాహ్) వారి కల్పనలకు అతీతుడు. (a)
(a) చూడండి, 6:100.
節 : 83
فَذَرۡهُمۡ يَخُوضُواْ وَيَلۡعَبُواْ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي يُوعَدُونَ
వారికి వాగ్దానం చేయబడిన ఆ దినాన్ని వారు దర్శించే వరకు, వారిని వారి వాదోపవాదాలలో మరియు వారి క్రీడలలో మునిగి ఉండనీ!
節 : 84
وَهُوَ ٱلَّذِي فِي ٱلسَّمَآءِ إِلَٰهٞ وَفِي ٱلۡأَرۡضِ إِلَٰهٞۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡعَلِيمُ
మరియు ఆయన (అల్లాహ్) మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు. మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.(a)
(a) చూడండి, 6:3.
節 : 85
وَتَبَارَكَ ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا وَعِندَهُۥ عِلۡمُ ٱلسَّاعَةِ وَإِلَيۡهِ تُرۡجَعُونَ
మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు; మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది; మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.
節 : 86
وَلَا يَمۡلِكُ ٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِ ٱلشَّفَٰعَةَ إِلَّا مَن شَهِدَ بِٱلۡحَقِّ وَهُمۡ يَعۡلَمُونَ
మరియు వారు ఆయనను వదలి, ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారికి సిఫారసు చేసే అధికారం లేదు.(a) కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చేవారు మరియు (అల్లాహ్ ఒక్కడే! అని) తెలిసి ఉన్నవారు తప్ప!
(a) చూడండి, 10:3.
節 : 87
وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُۖ فَأَنَّىٰ يُؤۡفَكُونَ
మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?
節 : 88
وَقِيلِهِۦ يَٰرَبِّ إِنَّ هَٰٓؤُلَآءِ قَوۡمٞ لَّا يُؤۡمِنُونَ
"మరియు ఓ నా ప్రభూ! నిశ్చయంగా, ఈ ప్రజలు విశ్వసించరు!" అని పలికే (ప్రవక్త యొక్క) మాట (అల్లాహ్ కు బాగా తెలుసు).
節 : 89
فَٱصۡفَحۡ عَنۡهُمۡ وَقُلۡ سَلَٰمٞۚ فَسَوۡفَ يَعۡلَمُونَ
కావున నీవు (ఓ ముహమ్మద్!) వారిని ఉపేక్షించు. మరియు ఇలా అను: "మీకు సలాం!"(a) మున్ముందు వారు తెలుసుకుంటారు.
(a) ఇక్కడ కేవలం సలామున్ ఉంది; అస్సలాము అని లేదు. అంటే - మీదారి మీది మరియు మాదారి మాది, అని అర్థం. మీరు మున్ముందు తెలుసుకుంటారు. ఎవరు సన్మార్గం మీద ఉన్నారో! మరియు ఎవరు దుర్మార్గం మీద ఉన్నారో! ఇంకా చూడండి, 25:63, 28:55.
送信されました