節 :
53
۞ وَمَآ أُبَرِّئُ نَفۡسِيٓۚ إِنَّ ٱلنَّفۡسَ لَأَمَّارَةُۢ بِٱلسُّوٓءِ إِلَّا مَا رَحِمَ رَبِّيٓۚ إِنَّ رَبِّي غَفُورٞ رَّحِيمٞ
"మరియు నన్ను నేను (ఈ నింద నుండి) విముక్తి చేసుకోవడం లేదు.(a) వాస్తవానికి మానవ ఆత్మ చెడు (పాపం) చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది - నా ప్రభువు కరుణించిన వాడు తప్ప - నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
節 :
54
وَقَالَ ٱلۡمَلِكُ ٱئۡتُونِي بِهِۦٓ أَسۡتَخۡلِصۡهُ لِنَفۡسِيۖ فَلَمَّا كَلَّمَهُۥ قَالَ إِنَّكَ ٱلۡيَوۡمَ لَدَيۡنَا مَكِينٌ أَمِينٞ
మరియు రాజు(a) అన్నాడు: "అతనిని నా వద్దకు తీసుకొని రండి నేను అతనిని ప్రత్యేకంగా నా కొరకు నియమించుకుంటాను." (యూసుఫ్) అతడితో మాట్లాడినప్పుడు (రాజు) అన్నాడు: "నిశ్చయంగా, నీవు ఈ నాటి నుండి మా వద్ద ఉన్నత స్థానంలో నమ్మకం గల వ్యక్తిగా పరిగణింపబడతావు."
節 :
55
قَالَ ٱجۡعَلۡنِي عَلَىٰ خَزَآئِنِ ٱلۡأَرۡضِۖ إِنِّي حَفِيظٌ عَلِيمٞ
(యూసుఫ్) అన్నాడు: "నన్ను దేశపు కోశాగారాధికారిగా నియమించండి. నిశ్చయంగా నేను తెలివి గల మంచి రక్షకుడను."
節 :
56
وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي ٱلۡأَرۡضِ يَتَبَوَّأُ مِنۡهَا حَيۡثُ يَشَآءُۚ نُصِيبُ بِرَحۡمَتِنَا مَن نَّشَآءُۖ وَلَا نُضِيعُ أَجۡرَ ٱلۡمُحۡسِنِينَ
మరియు ఈ విధంగా మేము యూసుఫ్ కు భూమిపై అధికార మొసంగాము. దానితో అతను తన ఇష్ట ప్రకారం వ్యవహరించ గలిగాడు. మేము కోరిన వారి మీద మా కారుణ్యాన్ని ధార పోస్తాము. మరియు మేము సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయము.
節 :
57
وَلَأَجۡرُ ٱلۡأٓخِرَةِ خَيۡرٞ لِّلَّذِينَ ءَامَنُواْ وَكَانُواْ يَتَّقُونَ
మరియు విశ్వసించి భయభక్తులు గలవారికి, పరలోక ప్రతిఫలమే ఎంతో ఉత్తమమైనది.
節 :
58
وَجَآءَ إِخۡوَةُ يُوسُفَ فَدَخَلُواْ عَلَيۡهِ فَعَرَفَهُمۡ وَهُمۡ لَهُۥ مُنكِرُونَ
మరియు యూసుఫ్ (జోసెఫ్) సోదరులు వచ్చి అతని ముందు ప్రవేశించారు. అతను వారిని గుర్తించాడు కాని వారు అతనిని గుర్తించ లేక పోయారు.
節 :
59
وَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمۡ قَالَ ٱئۡتُونِي بِأَخٖ لَّكُم مِّنۡ أَبِيكُمۡۚ أَلَا تَرَوۡنَ أَنِّيٓ أُوفِي ٱلۡكَيۡلَ وَأَنَا۠ خَيۡرُ ٱلۡمُنزِلِينَ
మరియు అతను వారి సామగ్రిని సిద్ధపరచిన తరువాత వారితో అన్నాడు: "మీ నాన్న కుమారుడైన మీ సోదరుణ్ణి(a) మీరు (మళ్ళీ వచ్చేటప్పుడు) నా వద్దకు తీసుకొని రండి. ఏమీ? నేను ఏ విధంగా నిండుగా కొలిచి ఇస్తున్నానో మీరు చూడటం లేదా? నిశ్చయంగా ఆతిథ్యం చేసేవారిలో నేను ఉత్తముడను.
節 :
60
فَإِن لَّمۡ تَأۡتُونِي بِهِۦ فَلَا كَيۡلَ لَكُمۡ عِندِي وَلَا تَقۡرَبُونِ
కాని మీరు అతనిని నా వద్దకు తీసుకొని రాకపోతే నా వద్ద మీకు ఎలాంటి (ధాన్యం) దొరకదు, అలాంటప్పుడు మీరు నా దరిదాపులకు కూడా రాకండి!"
節 :
61
قَالُواْ سَنُرَٰوِدُ عَنۡهُ أَبَاهُ وَإِنَّا لَفَٰعِلُونَ
వారు ఇలా అన్నారు: "మేము అతనిని గురించి అతని తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నిస్తాము. మరియు మేము అలా తప్పకుండా చేస్తాము."
節 :
62
وَقَالَ لِفِتۡيَٰنِهِ ٱجۡعَلُواْ بِضَٰعَتَهُمۡ فِي رِحَالِهِمۡ لَعَلَّهُمۡ يَعۡرِفُونَهَآ إِذَا ٱنقَلَبُوٓاْ إِلَىٰٓ أَهۡلِهِمۡ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ
మరియు (యూసుఫ్) తన సేవకులతో: "వారు (ధాన్యాన్ని కొనటానికి) తెచ్చిన సామగ్రిని (తిరిగి) వారి సంచులలో పెట్టండి. వారు తిరిగి తమ కుటుంబం వారి వద్దకు పోయిన తరువాత అది తెలుసుకొని బహుశా తిరిగి రావచ్చు!" అని అన్నాడు.
節 :
63
فَلَمَّا رَجَعُوٓاْ إِلَىٰٓ أَبِيهِمۡ قَالُواْ يَٰٓأَبَانَا مُنِعَ مِنَّا ٱلۡكَيۡلُ فَأَرۡسِلۡ مَعَنَآ أَخَانَا نَكۡتَلۡ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ
వారు తమ తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన తరువాత అన్నారు: "నాన్నా! ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వడానికి తిరస్కరించారు, కావున ధాన్యం తేవాలంటే! నీవు మా తమ్ముణ్ణి (బెన్యామీన్ ను) మాతోపాటు పంపు మరియు నిశ్చయంగా, మేము అతనిని కాపాడుతాము."