Terjemahan makna Alquran Alkarim

Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad

Scan the qr code to link to this page

سورة الأحقاف - సూరహ్ అల్-అహ్ఖాఫ్

Nomor Halaman

Ayah

Tampilkan teks ayat
Tampilkan catatan kaki

Ayah : 1
حمٓ
హా - మీమ్.(a)
(a) ఈ అక్షరాలు ముఖ'త్త'ఆత్, అనబడతాయి. వీటి నిజ అర్థం కేవలం అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే తెలుసు.
Ayah : 2
تَنزِيلُ ٱلۡكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ
ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.
Ayah : 3
مَا خَلَقۡنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَآ إِلَّا بِٱلۡحَقِّ وَأَجَلٖ مُّسَمّٗىۚ وَٱلَّذِينَ كَفَرُواْ عَمَّآ أُنذِرُواْ مُعۡرِضُونَ
మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాము.(a) మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవు తున్నారు.
(a) చూడండి, 14:48.
Ayah : 4
قُلۡ أَرَءَيۡتُم مَّا تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ أَرُونِي مَاذَا خَلَقُواْ مِنَ ٱلۡأَرۡضِ أَمۡ لَهُمۡ شِرۡكٞ فِي ٱلسَّمَٰوَٰتِۖ ٱئۡتُونِي بِكِتَٰبٖ مِّن قَبۡلِ هَٰذَآ أَوۡ أَثَٰرَةٖ مِّنۡ عِلۡمٍ إِن كُنتُمۡ صَٰدِقِينَ
వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి.(a) వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్ఆన్ కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి."(b)
(a) రఅ"య్ తుమ్: అంటే చెప్పండి, చూపండి, లేక ఆలోచించారా. (b) అసా'రతిమ్ మిన్ 'ఇల్మిన్: అంటే తెలివితేటలు, బఖియ్యతిమ్-మిన్-'ఇల్మిన్: అంటే పూర్వప్రవక్తల మీద అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం వహీ నుండి మిగిలి ఉన్న నిజ దివ్యజ్ఞానం.
Ayah : 5
وَمَنۡ أَضَلُّ مِمَّن يَدۡعُواْ مِن دُونِ ٱللَّهِ مَن لَّا يَسۡتَجِيبُ لَهُۥٓ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ وَهُمۡ عَن دُعَآئِهِمۡ غَٰفِلُونَ
మరియు అల్లాహ్ ను వదలి పునరుత్థాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారి కంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు (తమను ప్రార్థించే) వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు.

Ayah : 6
وَإِذَا حُشِرَ ٱلنَّاسُ كَانُواْ لَهُمۡ أَعۡدَآءٗ وَكَانُواْ بِعِبَادَتِهِمۡ كَٰفِرِينَ
మరియు మానవులను (పునరుత్థాన దినమున) సమావేశ పరచిబడినపుడు, (ఆరాధించబడిన) వారు! (తమను ఆరాధించిన) వారికి విరోధులై ఉంటారు. మరియు వారి ఆరాధనను తిరస్కరిస్తారు. (a)
(a) ఈవిధమైన ఆయత్ లు ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చాయి. చూడండి, 10:29, 19:81-82, 29:25, 18:52, 16:86 మొదలైనవి అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించి ఆరాధించే దైవాలు రెండు రకాలు. 1) నిర్జీవులు: అవి విగ్రహాలు, చెట్లుచేమలూ, సూర్యచంద్రులూ, అగ్ని మొదలైనవి. పునరుత్థానదినమున అల్లాహ్ (సు.తా.) వీటికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అవి, వారి ఆరాధనను తిరస్కరిస్తాయి. 2) రెండవరకానికి చెందిన వారు ప్రవక్తలు, ఉదాహరణ ఈ'సా, 'ఉజైర్, దైవదూతలు ('అలైహిమ్ స.) మరియు సద్పురుషులు వీరి సమాధానం అల్లాహ్ (సు.తా.) సమక్షంలో - ఖుర్ఆన్ లో పేర్కొనబడిన - 'ఈసా ('అ.స.) సమాధానంలాగానే ఉంటుంది. ఇంతేకాక షై'తానులు కూడా వీరి ఆరాధనను నిరాకరిస్తారు. ఉదారహరణకు చూ. ' 28:63 .
Ayah : 7
وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ قَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلۡحَقِّ لَمَّا جَآءَهُمۡ هَٰذَا سِحۡرٞ مُّبِينٌ
మరియు వారికి మా స్పష్టమైన సూచనలు (ఆయాత్) వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారులు - సత్యం (ఈ ఖుర్ఆన్) వారి ముందుకు వచ్చినప్పుడు - ఇలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలమే!"(a)
(a) అవతరణా క్రమంలో, 74:24లో సి'హ్ రున్ అనే పదం మొదటిసారి వచ్చింది.
Ayah : 8
أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰهُۖ قُلۡ إِنِ ٱفۡتَرَيۡتُهُۥ فَلَا تَمۡلِكُونَ لِي مِنَ ٱللَّهِ شَيۡـًٔاۖ هُوَ أَعۡلَمُ بِمَا تُفِيضُونَ فِيهِۚ كَفَىٰ بِهِۦ شَهِيدَۢا بَيۡنِي وَبَيۡنَكُمۡۖ وَهُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ
లేదా ఇలా అంటారు: "ఇతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." వారితో ఇలా అను: "ఒకవేళ నేను దీనిని కల్పించి ఉండినట్లయితే, మీరు నన్ను అల్లాహ్ (శిక్ష) నుండి ఏ మాత్రం కాపాడలేరు. మీరు కల్పించే మాటలు ఆయనకు బాగా తెలుసు. నాకూ మీకూ మధ్య ఆయన (అల్లాహ్) సాక్ష్యమే చాలు! మరియు ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
Ayah : 9
قُلۡ مَا كُنتُ بِدۡعٗا مِّنَ ٱلرُّسُلِ وَمَآ أَدۡرِي مَا يُفۡعَلُ بِي وَلَا بِكُمۡۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّ وَمَآ أَنَا۠ إِلَّا نَذِيرٞ مُّبِينٞ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకూ మరియు మీకూ ఏమి కానున్నదో నాకు తెలియదు.(a) నేను అనుసరించేది, నాపై అవతరింపజేయ బడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే."
(a) "అల్లాహ్ (సు.తా.) సాక్షిగా నేను ('స'అస) దైవప్రవక్తను అయినప్పటికీ, మీకూ మరియు నాకూ పునరుత్థానదినమున ఏమి సంభవించనున్నదో నాకు తెలియదు." ('స'బుఖారీ).
Ayah : 10
قُلۡ أَرَءَيۡتُمۡ إِن كَانَ مِنۡ عِندِ ٱللَّهِ وَكَفَرۡتُم بِهِۦ وَشَهِدَ شَاهِدٞ مِّنۢ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ عَلَىٰ مِثۡلِهِۦ فَـَٔامَنَ وَٱسۡتَكۡبَرۡتُمۡۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ
వారిలో ఇలా అను: "ఇది (ఈ ఖుర్ఆన్) ఒకవేళ అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి, మీరు దీనిని తిరస్కరిస్తూ ఉండినట్లయితే (మీ గతి ఏమవుతుందో) మీరు ఆలోచించరా? ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక సాక్షి ఇది (ఈ ఖుర్ఆన్) దాని (తౌరాత్) లాంటి గ్రంథమేనని, సాక్ష్యం ఇచ్చాడు మరియు విశ్వసించాడు కూడా.(a) కాని మీరేమో అహంభావానికి గురి అయ్యారు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు."
(a) ఈ సాక్షి 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్ ('ర'ది.'అ.) తౌరాత్ లో దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) రాబోతున్నాడని పేర్కొనబడిన వాక్యాలకు చూడండి, 2:42.
Ayah : 11
وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُواْ لَوۡ كَانَ خَيۡرٗا مَّا سَبَقُونَآ إِلَيۡهِۚ وَإِذۡ لَمۡ يَهۡتَدُواْ بِهِۦ فَسَيَقُولُونَ هَٰذَآ إِفۡكٞ قَدِيمٞ
సత్యతిరస్కారులు, విశ్వాసులను గురించి ఇలా అంటారు: "ఒకవేళ ఇందులో (ఇస్లాంలో) మేలే ఉంటే?, వీరు మా కంటే ముందుగా దాని వైపునకు పోయి ఉండేవారు కాదు!"(a) మరియు వారు దాని (ఖుర్ఆన్) నుండి మార్గదర్శకత్వం పొందలేదు! కాబట్టి వారు: "ఇదొక ప్రాచీన బూటక కల్పనయే!" అని అంటారు.
(a) అంటే మొట్టమొదట ఇస్లాం స్వీకరించిన వారిలోని పేదవారూ మరియు బలహీనవర్గాలకు చెందిన వారూ అయిన బిలాల్, 'అమ్మార్, 'సుహైబ్ మరియు 'ఖబ్బాబ్ మొదలైన వారిని (ర'ది.'అన్హుమ్ లను) గురించి, మక్కా ముష్రిక్ నాయకులు చెప్పిన మాటలివి.
Ayah : 12
وَمِن قَبۡلِهِۦ كِتَٰبُ مُوسَىٰٓ إِمَامٗا وَرَحۡمَةٗۚ وَهَٰذَا كِتَٰبٞ مُّصَدِّقٞ لِّسَانًا عَرَبِيّٗا لِّيُنذِرَ ٱلَّذِينَ ظَلَمُواْ وَبُشۡرَىٰ لِلۡمُحۡسِنِينَ
మరియు దీనికి (ఈ గ్రంథానికి) పూర్వం, మూసా గ్రంథం మార్గదర్శినిగా మరియు కారుణ్యంగా వచ్చింది. మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) దానిని ధృవీకరిస్తూ, అరబ్బీ భాషలో, దుర్మార్గులను హెచ్చరించటానికి మరియు సజ్జనులకు శుభవార్తలు ఇవ్వటానికి వచ్చింది.
Ayah : 13
إِنَّ ٱلَّذِينَ قَالُواْ رَبُّنَا ٱللَّهُ ثُمَّ ٱسۡتَقَٰمُواْ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ
నిశ్చయంగా, ఎవరైతే: "మా ప్రభువు అల్లాహ్ యే!" అని, తరువాత దానిపై స్థిరంగా ఉంటారో! అలాంటి వారికి ఎలాంటి భయమూ వుండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
Ayah : 14
أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡجَنَّةِ خَٰلِدِينَ فِيهَا جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ
అలాంటి వారే స్వర్గవాసులవుతారు. తాము చేస్తూ ఉండిన (మంచి) కర్మల ఫలితంగా వారు అందులో శాశ్వతంగా ఉంటారు.

Ayah : 15
وَوَصَّيۡنَا ٱلۡإِنسَٰنَ بِوَٰلِدَيۡهِ إِحۡسَٰنًاۖ حَمَلَتۡهُ أُمُّهُۥ كُرۡهٗا وَوَضَعَتۡهُ كُرۡهٗاۖ وَحَمۡلُهُۥ وَفِصَٰلُهُۥ ثَلَٰثُونَ شَهۡرًاۚ حَتَّىٰٓ إِذَا بَلَغَ أَشُدَّهُۥ وَبَلَغَ أَرۡبَعِينَ سَنَةٗ قَالَ رَبِّ أَوۡزِعۡنِيٓ أَنۡ أَشۡكُرَ نِعۡمَتَكَ ٱلَّتِيٓ أَنۡعَمۡتَ عَلَيَّ وَعَلَىٰ وَٰلِدَيَّ وَأَنۡ أَعۡمَلَ صَٰلِحٗا تَرۡضَىٰهُ وَأَصۡلِحۡ لِي فِي ذُرِّيَّتِيٓۖ إِنِّي تُبۡتُ إِلَيۡكَ وَإِنِّي مِنَ ٱلۡمُسۡلِمِينَ
మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాము.(a) అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి, అతనిని పాలు విడిపించే వరకు ముప్ఫై నెలలు అవుతాయి.(b) చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు నలభై సంవత్సరాల(c) వయస్సుకు చేరి ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నీవు, నాకూ మరియు నా తల్లిదండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయటానికి నాకు సద్భుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి. నిశ్చయంగా, నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలు తున్నాను. మరియు నిశ్చయంగా, నేను నీకు విధేయులైన (ముస్లింలైన) వారిలో ఒకడిని."(d)
(a) చూడండి, 29:8 మరియు 31:14 ఒక 'స'హాబి దైవప్రవక్త ('స'అస)తో ఇలా ప్రశ్నిస్తాడు: 'నా సద్వర్తనకు అందరికంటే ఎక్కువ హక్కుదారులు ఎవరు?' దానికి అతను ('స'అస) ఇలా సమాధానమిస్తారు: 'నీ తల్లి!' అతడు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు. దైవప్రవక్త ('స'అస) అంటారు: 'నీ తల్లి!' అతడు మూడోసారి అదేప్రశ్న అడుగుతాడు. అప్పుడు కూడా: 'నీ తల్లి!' అని అంటారు. అతడు నాలుగవసారి అదే ప్రశ్న అడుగగా దైవప్రవక్త ('స'అస) అంటారు: 'నీ తండ్రి!' దీనితో మానవజీవితంలో తల్లి అందరికంటే - తండ్రి కంటే కూడా మూడు రెట్లు - అధికంగా ఆదరణకు, సద్వర్తనకు అర్హతగలది, అని తెలుస్తోంది! ('స.ముస్లిం) (b) పాలిచ్చే గడువు 2:233 మరియు 31:14 లలో రెండు సంవత్సరాలు, అని ఉంది. దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే - సజీవ శిశువుకు జన్మం ఇవ్వటానికి కనీస గడువు 6 మాసాలు. ఈ విధంగా పాలు విడిపించే మొత్తం కాలం ముఫ్ఫై నెలలు. (c) నలభై సంవత్సరాల వయస్సుకు చేరిన తరువాతనే మానవుడు సంపూర్ణ మానసిక వికాసం పొందుతాడు. (d) అవ్'జి'అనీ: అంటే నాకు దైవభీతి మరియు భయభక్తులను ప్రసాదించు. ఒక వయస్సు గడిచిన తరువాత ఈ దు'ఆ (రబ్బి అవ్'జి'అనీ ... (నుండి) ... మినల్ ముస్లిమీన్.), అంటే ఆయత్ చివరి వరకు అత్యధికంగా చేయాలి అని ధర్మవేత్తల అభిప్రాయం.
Ayah : 16
أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ نَتَقَبَّلُ عَنۡهُمۡ أَحۡسَنَ مَا عَمِلُواْ وَنَتَجَاوَزُ عَن سَيِّـَٔاتِهِمۡ فِيٓ أَصۡحَٰبِ ٱلۡجَنَّةِۖ وَعۡدَ ٱلصِّدۡقِ ٱلَّذِي كَانُواْ يُوعَدُونَ
ఇలాంటి వారి నుండి మేము వారి మంచి కర్మలను స్వీకరిస్తాము.(a) మరియు వారి చెడు కర్మలను ఉపేక్షిస్తాము; వారు స్వర్గవాసులలో చేరుతారు. ఇది వారికి చేయబడిన వాగ్దానం, ఒక సత్యవాగ్దానం.
(a) చూడండి, 29:7.
Ayah : 17
وَٱلَّذِي قَالَ لِوَٰلِدَيۡهِ أُفّٖ لَّكُمَآ أَتَعِدَانِنِيٓ أَنۡ أُخۡرَجَ وَقَدۡ خَلَتِ ٱلۡقُرُونُ مِن قَبۡلِي وَهُمَا يَسۡتَغِيثَانِ ٱللَّهَ وَيۡلَكَ ءَامِنۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ فَيَقُولُ مَا هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ
మరియు ఎవడైనా తన తల్లిదండ్రులతో ఇలా అంటే: "ఛీ పొండి (ఉఫ్)!(a) నేను (గోరీ నుండి సజీవిగా) లేపబడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా? మరియు వాస్తవానికి, నాకు ముందు ఎన్నో తరాలు గతించాయి. (కాని తిరిగి లేపబడలేదు కదా)?" మరియు వారిద్దరూ అల్లాహ్ సహాయం కోరుతూ ఇలా అంటారు: "ఓ దౌర్భాగ్యుడా! విశ్వసించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం!" అప్పుడు వాడు ఇలా అంటాడు: "ఇవన్నీ కేవలం పాతకాలపు కట్టుకథలు తప్ప మరేమీ కావు."
(a) 'ఉఫిన్': ఛీ పొండి! ఇది అయిష్టతను, ఏవగింపును తెలిపే పదం.
Ayah : 18
أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ حَقَّ عَلَيۡهِمُ ٱلۡقَوۡلُ فِيٓ أُمَمٖ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهِم مِّنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِۖ إِنَّهُمۡ كَانُواْ خَٰسِرِينَ
వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవ సమాజాలలో, ఇలాంటి వారి మీదనే (అల్లాహ్) వాక్కు (శిక్ష) సత్యమయింది. నిశ్చయంగా, వారే నష్టపడిన వారయ్యారు.(a)
(a) అల్లాహ్ (సు.తా.) వాక్కుకు చూడండి, 38:85.
Ayah : 19
وَلِكُلّٖ دَرَجَٰتٞ مِّمَّا عَمِلُواْۖ وَلِيُوَفِّيَهُمۡ أَعۡمَٰلَهُمۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ
ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలకు తగిన స్థానాలుంటాయి. మరియు ఇది వారి కర్మలకు తగినట్లుగా పూర్తి ప్రతిఫలమివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు.
Ayah : 20
وَيَوۡمَ يُعۡرَضُ ٱلَّذِينَ كَفَرُواْ عَلَى ٱلنَّارِ أَذۡهَبۡتُمۡ طَيِّبَٰتِكُمۡ فِي حَيَاتِكُمُ ٱلدُّنۡيَا وَٱسۡتَمۡتَعۡتُم بِهَا فَٱلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ ٱلۡهُونِ بِمَا كُنتُمۡ تَسۡتَكۡبِرُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَبِمَا كُنتُمۡ تَفۡسُقُونَ
మరియు ఆ రోజు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందుకు తెచ్చి, వారితో (ఇలా అనబడుతుంది): "మీరు, మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించుకున్నారు మరియు వాటిని బాగా అనుభవించారు; కావున మీరు ఏ హక్కూ లేకుండా భూమిలో ప్రదర్శించిన అహంకారానికి మరియు మీరు చేసిన అవిధేయతకు ప్రతిఫలంగా, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది."

Ayah : 21
۞ وَٱذۡكُرۡ أَخَا عَادٍ إِذۡ أَنذَرَ قَوۡمَهُۥ بِٱلۡأَحۡقَافِ وَقَدۡ خَلَتِ ٱلنُّذُرُ مِنۢ بَيۡنِ يَدَيۡهِ وَمِنۡ خَلۡفِهِۦٓ أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّا ٱللَّهَ إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيمٖ
మరియు జ్ఞాపకం చేసుకోండి, ఆద్ జాతి సోదరుడు (హూద్) ఇసుక దిబ్బలలో(a) ఉన్న తన జాతి వారిని హెచ్చరించింది మరియు అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు మరియు అతని తరువాత కూడా వచ్చారు. (అతను ఇలా అన్నాడు): "మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించకండి. (అలా చేస్తే) నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై పడబోయే, ఆ శిక్షను గురించి నేను భయపడుతున్నాను."
(a) అల్-అ'హ్ ఖాఫు, 'హిఖ్ ఫున్ దీని ఏకవచనం: అంటే పొడువుగా పోయే ఇసుక దిబ్బలు. ఇది హూద్ ('అస) జాతి వారైన 'ఆద్ లు నివసించే ప్రాంతం పేరు. ఇది 'హ'దరమౌత్ (యమన్) ప్రాంతంలో ఉంది. వారు కూడా హద్దు మీరి ప్రవర్తించారు.
Ayah : 22
قَالُوٓاْ أَجِئۡتَنَا لِتَأۡفِكَنَا عَنۡ ءَالِهَتِنَا فَأۡتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ
వారిలా అన్నారు: "మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా నీవు వచ్చింది? నీవు సత్యవంతుడవే అయితే నీవు బెదిరించే (ఆ శిక్షను) తీసుకురా!"
Ayah : 23
قَالَ إِنَّمَا ٱلۡعِلۡمُ عِندَ ٱللَّهِ وَأُبَلِّغُكُم مَّآ أُرۡسِلۡتُ بِهِۦ وَلَٰكِنِّيٓ أَرَىٰكُمۡ قَوۡمٗا تَجۡهَلُونَ
(హూద్) అన్నాడు: "నిశ్చయంగా, దాని (ఆ శిక్ష) జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది. మరియు నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. కాని, నేను మిమ్మల్ని మూఢత్వంలో పడిపోయిన వారిగా చూస్తున్నాను."
Ayah : 24
فَلَمَّا رَأَوۡهُ عَارِضٗا مُّسۡتَقۡبِلَ أَوۡدِيَتِهِمۡ قَالُواْ هَٰذَا عَارِضٞ مُّمۡطِرُنَاۚ بَلۡ هُوَ مَا ٱسۡتَعۡجَلۡتُم بِهِۦۖ رِيحٞ فِيهَا عَذَابٌ أَلِيمٞ
ఆ తరువాత వారు ఒక దట్టమైన మేఘాన్ని వారి లోయల వైపునకు రావటం చూసి ఇలా అన్నారు: "ఈ మేఘం మాకు వర్షం ఇస్తుంది!"(a) (హూద్ అన్నాడు): "కాదు, కాదు! మీరు దేనికి తొందరపెడుతున్నారో అది (ఆ శిక్ష) ఇదే! ఒక తుఫాను గాలి, అందులో బాధాకరమైన శిక్ష ఉంది;
(a) 'ఆయి'షహ్ (ర.'అన్హా), దైవప్రవక్త ('స'అస) తో అన్నారు: "ప్రజలు మేఘాలను చూసి సంతోషపడతారు. కానీ మేఘాలను చూసినప్పుడు మీరు ('స'అస) ఆందోళన పడుతారెందుకు?" దానికి అతను ('స'అస) జవాబిచ్చారు: " 'ఆయి'షహ్ (ర.'అన్హా) ఈ మేఘాలలో అల్లాహ్ (సు.తా.) శిక్ష లేదనే హామీ ఏమీ లేదు కదా! ఒక జాతి గాలి శిక్షతో నాశనం చేయబడింది కదా! వారు కూడా మేఘాలను చూసి అన్నారు: 'ఈ మేఘాలు మాపై వర్షం కురిపిస్తాయి.' " ('స.బు'ఖారీ, 'స. ముస్లిం) మేఘాలను చూసినప్పుడు దైవప్రవక్త ('స'అస) దు'ఆ చేసేవారు. దీనికి చూడండి, 69:6-8, 7:72, 11:53-56.
Ayah : 25
تُدَمِّرُ كُلَّ شَيۡءِۭ بِأَمۡرِ رَبِّهَا فَأَصۡبَحُواْ لَا يُرَىٰٓ إِلَّا مَسَٰكِنُهُمۡۚ كَذَٰلِكَ نَجۡزِي ٱلۡقَوۡمَ ٱلۡمُجۡرِمِينَ
అది తన ప్రభువు ఆజ్ఞతో ప్రతి దానిని నాశనం చేస్తుంది." చివరకు వారి నివాస స్థలాలు తప్ప, అక్కడ ఏమీ కనిపించకుండా పోయాయి. ఈ విధంగా మేము నేరస్థులకు ప్రతీకారం చేస్తాము.
Ayah : 26
وَلَقَدۡ مَكَّنَّٰهُمۡ فِيمَآ إِن مَّكَّنَّٰكُمۡ فِيهِ وَجَعَلۡنَا لَهُمۡ سَمۡعٗا وَأَبۡصَٰرٗا وَأَفۡـِٔدَةٗ فَمَآ أَغۡنَىٰ عَنۡهُمۡ سَمۡعُهُمۡ وَلَآ أَبۡصَٰرُهُمۡ وَلَآ أَفۡـِٔدَتُهُم مِّن شَيۡءٍ إِذۡ كَانُواْ يَجۡحَدُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ
మరియు వాస్తవానికి మేము వారిని దృఢంగా స్థిరపరచి ఉన్నాము; ఆ విధంగా మేము (ఓ ఖురైషులారా) మిమ్మల్ని కూడా స్థిరపరచలేదు. మేము వారికి చెవులను, కన్నులను మరియు హృదయాలను ఇచ్చాము. కాని వారి చెవులూ, కళ్ళూ మరియు హృదయాలు వారికి ఉపయోగపడలేదు; ఎందుకంటే వారు అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తూ ఉండేవారు మరియు వారు దేనిని గురించి పరిహాసం చేస్తూ ఉండేవారో అదే వారిని చుట్టుకున్నది.
Ayah : 27
وَلَقَدۡ أَهۡلَكۡنَا مَا حَوۡلَكُم مِّنَ ٱلۡقُرَىٰ وَصَرَّفۡنَا ٱلۡأٓيَٰتِ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ
మరియు వాస్తవానికి, మేము మీ చుట్టుప్రక్కల ఎన్నో నగరాలను నాశనం చేశాము. మరియు బహుశా వారు (సత్యం వైపునకు మరలి వస్తారని, మా సంకేతాలను వారికి ఎన్నో విధాలుగా చూపాము.
Ayah : 28
فَلَوۡلَا نَصَرَهُمُ ٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ قُرۡبَانًا ءَالِهَةَۢۖ بَلۡ ضَلُّواْ عَنۡهُمۡۚ وَذَٰلِكَ إِفۡكُهُمۡ وَمَا كَانُواْ يَفۡتَرُونَ
అల్లాహ్ ను వదలి - తమను ఆయన సాన్నిధ్యానికి తేగలవారని - వారు భావించిన, వారి దేవతలు వారికెందుకు సహాయం చేయవు? అలా కాదు! అవి వారిని త్యజించాయి. ఎందుకంటే అది కేవలం వారి భ్రమ. మరియు వారు కల్పించుకున్న బూటక కల్పన మాత్రమే!

Ayah : 29
وَإِذۡ صَرَفۡنَآ إِلَيۡكَ نَفَرٗا مِّنَ ٱلۡجِنِّ يَسۡتَمِعُونَ ٱلۡقُرۡءَانَ فَلَمَّا حَضَرُوهُ قَالُوٓاْ أَنصِتُواْۖ فَلَمَّا قُضِيَ وَلَّوۡاْ إِلَىٰ قَوۡمِهِم مُّنذِرِينَ
మరియు (ఓ ముహమ్మద్!) జిన్నాతుల ఒక సమూహాన్ని(a) మేము - ఖుర్ఆన్ వినటానికి - నీ వైపునకు మొగ్గునట్లు చేసినపుడు, వారు అక్కడ చేరిన తరువాత పరస్పరం ఇలా మాట్లాడుకున్నారు: "నిశ్శబ్దంగా వినండి!" అది (ఆ పఠనం) ముగిసిన తరువాత, వారు హెచ్చరిక చేసేవారిగా, తమ జాతి వైపునకు మరలిపోయారు.
(a) నఫరన్: అంటే '3 నుండి 10 వరకు' ఉండే సంఖ్యల సమూహం. ఈ సంఘటన మక్కా - 'తాయఫ్ దారిలో న'ఖ్ ల లోయలో సంభవించంది. వివరాలకు చూడండి, 72:1-15. ('స.ముస్లిం, 'స.బు'ఖారీ) ఈ సంఘటన తరువాత జిన్నాతుల రాయబారులు దైవప్రవక్త ('స'అస) దగ్గరికి ఎన్నోసార్లు ఇస్లాం స్వీకరించటానికి, నేర్చుకోవటానికి వచ్చారు. (ఇబ్నె-కసీ'ర్).
Ayah : 30
قَالُواْ يَٰقَوۡمَنَآ إِنَّا سَمِعۡنَا كِتَٰبًا أُنزِلَ مِنۢ بَعۡدِ مُوسَىٰ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ يَهۡدِيٓ إِلَى ٱلۡحَقِّ وَإِلَىٰ طَرِيقٖ مُّسۡتَقِيمٖ
వారు (జిన్నాతులు) ఇలా అన్నారు: "ఓ మా జాతివారలారా! వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింప జేయబడిన ఒక గ్రంథాన్ని విన్నాము. అది దానికి పూర్వం వచ్చిన దానిని (తౌరాత్ ను) ధృవీకరిస్తుంది; సత్యం వైపునకు మరియు ఋజుమార్గం (ఇస్లాం) వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది."(a)
(a) ప్రవక్తలందరూ మానవులే! జిన్నాతులలో ప్రవక్తలు వచ్చినట్లు ఖుర్ఆన్ లో, 'స'హీ'హ్ 'హదీస్'లలో లేదు. చూడండి, 16:43, 25:20. ఈ సూరహ్ లోని ఆయత్ లలో దైవప్రవక్త ('స'అస) జిన్నాతులకు కూడా ప్రచారం చేశారని తెలుస్తోంది.
Ayah : 31
يَٰقَوۡمَنَآ أَجِيبُواْ دَاعِيَ ٱللَّهِ وَءَامِنُواْ بِهِۦ يَغۡفِرۡ لَكُم مِّن ذُنُوبِكُمۡ وَيُجِرۡكُم مِّنۡ عَذَابٍ أَلِيمٖ
"మా జాతి వారలారా! అల్లాహ్ వైపునకు పిలిచేవానిని అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్) ను విశ్వసించండి. ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడుతాడు.
Ayah : 32
وَمَن لَّا يُجِبۡ دَاعِيَ ٱللَّهِ فَلَيۡسَ بِمُعۡجِزٖ فِي ٱلۡأَرۡضِ وَلَيۡسَ لَهُۥ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءُۚ أُوْلَٰٓئِكَ فِي ضَلَٰلٖ مُّبِينٍ
మరియు అల్లాహ్ వైపునకు పిలిచే వానిని అనుసరించని వాడు భూమిలో (అల్లాహ్ నుండి) తప్పించుకోలేడు. మరియు ఆతడికి, ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు. అలాంటి వారు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే!"
Ayah : 33
أَوَلَمۡ يَرَوۡاْ أَنَّ ٱللَّهَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَلَمۡ يَعۡيَ بِخَلۡقِهِنَّ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحۡـِۧيَ ٱلۡمَوۡتَىٰۚ بَلَىٰٓۚ إِنَّهُۥ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడు అల్లాహ్ యే నని మరియు ఆయన వారిని సృష్టించటంలో అలసి పోడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించగల సామర్థ్యం గలవాడని? అలా కాదు (ఎందుకు కలిగిలేడు)! నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Ayah : 34
وَيَوۡمَ يُعۡرَضُ ٱلَّذِينَ كَفَرُواْ عَلَى ٱلنَّارِ أَلَيۡسَ هَٰذَا بِٱلۡحَقِّۖ قَالُواْ بَلَىٰ وَرَبِّنَاۚ قَالَ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ
మరియు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందు ప్రవేశపెట్టబడే రోజు వారితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది: "ఏమీ? ఇది సత్యం కాదా?" అని. వారంటారు: "ఎందుకు కాదు! మా ప్రభువు సాక్షిగా (ఇది సత్యమే!)" వారితో అనబడుతుంది: "అయితే, మీరు తిరస్కరిస్తూ వున్న దానికి గానూ ఈ శిక్షను రుచి చూడండి!"
Ayah : 35
فَٱصۡبِرۡ كَمَا صَبَرَ أُوْلُواْ ٱلۡعَزۡمِ مِنَ ٱلرُّسُلِ وَلَا تَسۡتَعۡجِل لَّهُمۡۚ كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَ مَا يُوعَدُونَ لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا سَاعَةٗ مِّن نَّهَارِۭۚ بَلَٰغٞۚ فَهَلۡ يُهۡلَكُ إِلَّا ٱلۡقَوۡمُ ٱلۡفَٰسِقُونَ
కావున నీవు (ఓ ప్రవక్తా!) సహనం వహించు! దృఢ సంకల్పం గల ప్రవక్తలు సహనం వహించినట్లు; మరియు వారి విషయంలో తొందర పడకు. నిశ్చయంగా, వారికి వాగ్దానం చేయబడిన (శిక్షను) వారు చూసిన రోజు; వారు (ఈ ప్రపంచంలో) దినంలోని ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం గడపలేదని అనుకుంటారు. (ఇదే మా) సందేశం! అలాంటప్పుడు, దుష్టులు (ఫాసిఖూన్) గాక, ఇతరులు నశింప జేయ బడతారా?
Pengiriman sukses