آیه :
1
إِنَّآ أَنزَلۡنَٰهُ فِي لَيۡلَةِ ٱلۡقَدۡرِ
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో(a) అవతరింపజేశాము.(b)
آیه :
2
وَمَآ أَدۡرَىٰكَ مَا لَيۡلَةُ ٱلۡقَدۡرِ
మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?
آیه :
3
لَيۡلَةُ ٱلۡقَدۡرِ خَيۡرٞ مِّنۡ أَلۡفِ شَهۡرٖ
ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.(a)
آیه :
4
تَنَزَّلُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذۡنِ رَبِّهِم مِّن كُلِّ أَمۡرٖ
ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)(a), తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు.
آیه :
5
سَلَٰمٌ هِيَ حَتَّىٰ مَطۡلَعِ ٱلۡفَجۡرِ
ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.