ترجمهٔ معانی قرآن کریم

ترجمه ى تلوگوى - عبدالرحيم بن محمد

Scan the qr code to link to this page

سورة البروج - సూరహ్ అల్-బురూజ్

شماره صفحه

آیه

نمایش متن آیه
نمایش حاشیه

آیه : 1
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلۡبُرُوجِ
విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా!(a)
(a) చూడండి, 25:61.
آیه : 2
وَٱلۡيَوۡمِ ٱلۡمَوۡعُودِ
వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా!
آیه : 3
وَشَاهِدٖ وَمَشۡهُودٖ
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా!(a)
(a) ఈ ఆయతు వ్యాఖ్యానంలో భేదాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షౌకాని ఒక 'హదీస్' ఆధారంగా అన్నారు: షాహిదున్: అంటే జుము'అహ్ దినం. ఆరోజు విశ్వాసి చేసిన పని, పునరుత్థాన దినమున దానికి సాక్ష్యమిస్తుంది. మష్ హూదున్ : అంటే 9వ జు'ల్ 'హజ్జ్, 'అరఫాత్ దినం. ఏ రోజైతే ముస్లింలు 'హజ్ కొరకు సమావేశమవుతారో! మరొక తాత్పర్యం: "అంతా చేసే ఆయన, అల్లాహుతా'ఆలా సాక్షిగా మరియు ఆయన సాక్షిగా నిలిపేవాని సాక్షిగా!"
آیه : 4
قُتِلَ أَصۡحَٰبُ ٱلۡأُخۡدُودِ
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.(a)
(a) పైన పేర్కొన్నట్లు నజ్ రాన్ లోని సత్యతిరస్కారులు, ఆ కాలపు విశ్వాసులను ఒక అగ్ని కందకంలో త్రోసి చంపేవారు.
آیه : 5
ٱلنَّارِ ذَاتِ ٱلۡوَقُودِ
ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు.
آیه : 6
إِذۡ هُمۡ عَلَيۡهَا قُعُودٞ
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;(a)
(a) విశ్వాసులను అగ్నిలో వేసి వారు (సత్యతిరస్కారులు) చూసి ఆనందించేవారు.
آیه : 7
وَهُمۡ عَلَىٰ مَا يَفۡعَلُونَ بِٱلۡمُؤۡمِنِينَ شُهُودٞ
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు.
آیه : 8
وَمَا نَقَمُواْ مِنۡهُمۡ إِلَّآ أَن يُؤۡمِنُواْ بِٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ
మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే!
آیه : 9
ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ
ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి.
آیه : 10
إِنَّ ٱلَّذِينَ فَتَنُواْ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ ثُمَّ لَمۡ يَتُوبُواْ فَلَهُمۡ عَذَابُ جَهَنَّمَ وَلَهُمۡ عَذَابُ ٱلۡحَرِيقِ
ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది.
آیه : 11
إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡكَبِيرُ
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి(a). అదే గొప్ప విజయం.
(a) ఖుర్ఆన్ అవతరణా క్రమంలో స్వర్గవనాలను గురించి ఇక్కడ మొదటి సారి వచ్చింది.
آیه : 12
إِنَّ بَطۡشَ رَبِّكَ لَشَدِيدٌ
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది.(a)
(a) ఆయన మొదట వ్యవధినిస్తాడు. ఇక శిక్షించటానికి పట్టుకొన్నప్పుడు, ఆయన పట్టు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు మరియు ఎవ్వరూ తప్పించజాలరు కూడానూ!
آیه : 13
إِنَّهُۥ هُوَ يُبۡدِئُ وَيُعِيدُ
నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు.
آیه : 14
وَهُوَ ٱلۡغَفُورُ ٱلۡوَدُودُ
మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు.
آیه : 15
ذُو ٱلۡعَرۡشِ ٱلۡمَجِيدُ
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు,(a) మహత్త్వపూర్ణుడు.(b)
(a) సింహాసనాధీశుడు, చూడండి, 7:54. (b) చూడండి, అల్లాహుతా'ఆలాను సంబోధించిన సందర్భానికి, 11:73 అల్-మజీదు: వైభవం గలవాడు, ప్రభావం, ప్రతాపం విశిష్టత, దివ్యుడు, మహిమాన్వితుడు, మహత్త్వపూర్ణుడు. .
آیه : 16
فَعَّالٞ لِّمَا يُرِيدُ
తాను తలచింది చేయగలవాడు.
آیه : 17
هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡجُنُودِ
ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా?
آیه : 18
فِرۡعَوۡنَ وَثَمُودَ
ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల).
آیه : 19
بَلِ ٱلَّذِينَ كَفَرُواْ فِي تَكۡذِيبٖ
అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.
آیه : 20
وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطُۢ
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు.
آیه : 21
بَلۡ هُوَ قُرۡءَانٞ مَّجِيدٞ
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన(a) ఖుర్ఆన్.
(a) చూడండి, ఖుర్ఆన్ సంబోధించిన సందర్భానికి, 50:1.
آیه : 22
فِي لَوۡحٖ مَّحۡفُوظِۭ
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్)(a) లో (వ్రాయబడి) ఉన్నది.
(a) చూడండి, 13:39 మరియు 43:4. ఉమ్ముల్-కితాబ్, అంటే లౌ'హె మ'హ్ ఫూ"జ్. సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యధస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.
با موفقیت ارسال شد