آیه :
16
إِذۡ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوًى
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,
آیه :
17
ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ
(ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు.
آیه :
18
فَقُلۡ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ
"ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా?
آیه :
19
وَأَهۡدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخۡشَىٰ
మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా?'"
آیه :
20
فَأَرَىٰهُ ٱلۡأٓيَةَ ٱلۡكُبۡرَىٰ
తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు.
آیه :
21
فَكَذَّبَ وَعَصَىٰ
కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు.
آیه :
22
ثُمَّ أَدۡبَرَ يَسۡعَىٰ
ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు.
آیه :
23
فَحَشَرَ فَنَادَىٰ
పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ;
آیه :
24
فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلۡأَعۡلَىٰ
ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"(a)
آیه :
25
فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلۡأٓخِرَةِ وَٱلۡأُولَىٰٓ
కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.(a)
آیه :
26
إِنَّ فِي ذَٰلِكَ لَعِبۡرَةٗ لِّمَن يَخۡشَىٰٓ
నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది.
آیه :
27
ءَأَنتُمۡ أَشَدُّ خَلۡقًا أَمِ ٱلسَّمَآءُۚ بَنَىٰهَا
ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది!(a)
آیه :
28
رَفَعَ سَمۡكَهَا فَسَوَّىٰهَا
ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;
آیه :
29
وَأَغۡطَشَ لَيۡلَهَا وَأَخۡرَجَ ضُحَىٰهَا
మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.
آیه :
30
وَٱلۡأَرۡضَ بَعۡدَ ذَٰلِكَ دَحَىٰهَآ
మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు(a).
آیه :
31
أَخۡرَجَ مِنۡهَا مَآءَهَا وَمَرۡعَىٰهَا
దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;
آیه :
32
وَٱلۡجِبَالَ أَرۡسَىٰهَا
మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు;
آیه :
33
مَتَٰعٗا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ
మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా(a)!
آیه :
34
فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلۡكُبۡرَىٰ
ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు;
آیه :
35
يَوۡمَ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ مَا سَعَىٰ
ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు;
آیه :
36
وَبُرِّزَتِ ٱلۡجَحِيمُ لِمَن يَرَىٰ
మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. (a)
آیه :
37
فَأَمَّا مَن طَغَىٰ
ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి;
آیه :
38
وَءَاثَرَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا
మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి;
آیه :
39
فَإِنَّ ٱلۡجَحِيمَ هِيَ ٱلۡمَأۡوَىٰ
నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది!
آیه :
40
وَأَمَّا مَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفۡسَ عَنِ ٱلۡهَوَىٰ
మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి;
آیه :
41
فَإِنَّ ٱلۡجَنَّةَ هِيَ ٱلۡمَأۡوَىٰ
నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది!
آیه :
42
يَسۡـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرۡسَىٰهَا
(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు.
آیه :
43
فِيمَ أَنتَ مِن ذِكۡرَىٰهَآ
దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం?
آیه :
44
إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ
దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది!
آیه :
45
إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخۡشَىٰهَا
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే!
آیه :
46
كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَهَا لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا عَشِيَّةً أَوۡ ضُحَىٰهَا
వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు(a).