آیه :
11
قُلۡ إِنِّيٓ أُمِرۡتُ أَنۡ أَعۡبُدَ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ
(ఓ ముహమ్మద్! ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, నా భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాను.
آیه :
12
وَأُمِرۡتُ لِأَنۡ أَكُونَ أَوَّلَ ٱلۡمُسۡلِمِينَ
మరియు నేను అందరి కంటే ముందు (అల్లాహ్ కు) విధేయుడను (ముస్లిం) అయి ఉండాలి" అని కూడా ఆజ్ఞాపించబడ్డాను.
آیه :
13
قُلۡ إِنِّيٓ أَخَافُ إِنۡ عَصَيۡتُ رَبِّي عَذَابَ يَوۡمٍ عَظِيمٖ
(ఇంకా) ఇలా అను: "ఒకవేళ నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే ఆ మహా దినవు శిక్షకు గురి అవుతానని భయపడుతున్నాను."
آیه :
14
قُلِ ٱللَّهَ أَعۡبُدُ مُخۡلِصٗا لَّهُۥ دِينِي
(ఇంకా) ఇలా అను: "నేను కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తూ నా భక్తిని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను;
آیه :
15
فَٱعۡبُدُواْ مَا شِئۡتُم مِّن دُونِهِۦۗ قُلۡ إِنَّ ٱلۡخَٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَأَهۡلِيهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ أَلَا ذَٰلِكَ هُوَ ٱلۡخُسۡرَانُ ٱلۡمُبِينُ
కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: "పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం!"
آیه :
16
لَهُم مِّن فَوۡقِهِمۡ ظُلَلٞ مِّنَ ٱلنَّارِ وَمِن تَحۡتِهِمۡ ظُلَلٞۚ ذَٰلِكَ يُخَوِّفُ ٱللَّهُ بِهِۦ عِبَادَهُۥۚ يَٰعِبَادِ فَٱتَّقُونِ
వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు (a): "ఓ నా దాసులారా! నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి."
آیه :
17
وَٱلَّذِينَ ٱجۡتَنَبُواْ ٱلطَّٰغُوتَ أَن يَعۡبُدُوهَا وَأَنَابُوٓاْ إِلَى ٱللَّهِ لَهُمُ ٱلۡبُشۡرَىٰۚ فَبَشِّرۡ عِبَادِ
మరియు ఎవరైతే కల్పిత దైవాలను (తాగూత్ లను) త్యజించి, వాటిని ఆరాధించకుండా, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలుతారో! వారికి శుభవార్త ఉంది. (a) కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు.
آیه :
18
ٱلَّذِينَ يَسۡتَمِعُونَ ٱلۡقَوۡلَ فَيَتَّبِعُونَ أَحۡسَنَهُۥٓۚ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَىٰهُمُ ٱللَّهُۖ وَأُوْلَٰٓئِكَ هُمۡ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ
ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటి వారే, అల్లాహ్ మార్గదర్శకత్వం పొందిన వారు మరియు అలాంటి వారే బుద్ధిమంతులు.
آیه :
19
أَفَمَنۡ حَقَّ عَلَيۡهِ كَلِمَةُ ٱلۡعَذَابِ أَفَأَنتَ تُنقِذُ مَن فِي ٱلنَّارِ
ఏమీ? ఎవడిని గురించి అయితే ఆయన (అల్లాహ్ తరఫు నుండి) శిక్ష నిర్ణయించబడి ఉందో, వానిని నీవు నరకాగ్నిలో నుండి బయటికి తీయగలవా?
آیه :
20
لَٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ لَهُمۡ غُرَفٞ مِّن فَوۡقِهَا غُرَفٞ مَّبۡنِيَّةٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ وَعۡدَ ٱللَّهِ لَا يُخۡلِفُ ٱللَّهُ ٱلۡمِيعَادَ
కాని ఎవరైతే తమ ప్రభువు యెడల భయభక్తులు కలిగి ఉన్నారో! వారి కొరకు అంతస్తుపై అంతస్తుగా, కట్టబడిన ఎత్తైన భవనాలు ఉంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగపరచడు.
آیه :
21
أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَسَلَكَهُۥ يَنَٰبِيعَ فِي ٱلۡأَرۡضِ ثُمَّ يُخۡرِجُ بِهِۦ زَرۡعٗا مُّخۡتَلِفًا أَلۡوَٰنُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصۡفَرّٗا ثُمَّ يَجۡعَلُهُۥ حُطَٰمًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكۡرَىٰ لِأُوْلِي ٱلۡأَلۡبَٰبِ
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింప జేస్తున్నాడని? ఆ తరువాత దాని వల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తి చేస్తాడు. ఆ తరువాత అది ఎండిపోయి నపుడు, నీవు దానిని పసుపు రంగుగా మారిపోవటాన్ని చూస్తావు. చివరకు ఆయన దానిని పొట్టుగా మార్చి వేస్తాడు. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు హితబోధ ఉంది.