آیه :
1
أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ
(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;(a)
آیه :
2
حَتَّىٰ زُرۡتُمُ ٱلۡمَقَابِرَ
మీరు గోరీలలోకి చేరే వరకు.(a)
آیه :
3
كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ
అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.
آیه :
4
ثُمَّ كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ
మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.(a)
آیه :
5
كَلَّا لَوۡ تَعۡلَمُونَ عِلۡمَ ٱلۡيَقِينِ
ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).
آیه :
6
لَتَرَوُنَّ ٱلۡجَحِيمَ
నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు!
آیه :
7
ثُمَّ لَتَرَوُنَّهَا عَيۡنَ ٱلۡيَقِينِ
మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!
آیه :
8
ثُمَّ لَتُسۡـَٔلُنَّ يَوۡمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ
అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!(a)